అవంతి రాజ్యాన్ని గుణనిధి అనేరాజు పరిపాలిస్తుండేవాడు. అతను కొత్తగా ఎంపికైన మంత్రి సుబుధ్ధితో సమావేసమై " మంత్రి వర్య మనరాజ్యంలో ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయి. ఒకటి ఎంత ప్రయత్నించినా దొంగతనాలను అరికట్టలేక పోవడం,రెండవది నిరుద్యోగ సమస్య, మూడవది లంచం ,అవినీతి " అన్నాడు. " ప్రభు నాకు దొంగతనం , లంచం అవినీతి అరికట్టడానికి వారం రోజుల సమయం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి నెలరోజుల సమయం ఇవ్వండి ఈ మూడు సమస్యలను పరిష్కరిస్తాను " అన్నాడు. " అలాగే మన కోశాగారం నిండుగా ధనం ఉంది యధేశ్చగా మీరు వినియోగించుకోవచ్చు "అన్నాడు రాజు గారు.
వెంటనే పట్టణ, గ్రామీణ రాజ ఉద్యోగులు అందరిని సమావేశ పరచి వారికి కొన్ని సూచనలు చేసాడు మంత్రి.రెండవ రోజునుండి అవినీతి, దొంగ తనాలపై ప్రజలనుండి ఎటువంటి ఫిర్యాదులు రాకపోవడంతో ఆశ్చర్యపోయిన రాజుగారు " మంత్రివర్య ఈమూడు సమస్యలను ఎలా పరిష్కరించారు ? " అన్నాడు రాజు గారు. "
ప్రభు రౌతునుబట్టి గుర్రం నడుస్తుంది. ప్రతిమనిషికి తన ప్రాణాం పైనా, తన కుటుంబ సభ్యుల ప్రాణాలపైన భయం ఉంటుంది. అలాగే న్యాయ వ్యవస్ధ పైన ప్రజలకు నమ్మకం ఉండాలి, చట్టమంటే భయంలేనపుడు పరిపాలన అస్తవ్యస్తంగా మారుతుంది అన్నవిషయం తమరికి తెలియనిది కాదు. దొంగతనం ,అవినీతికి పాల్పడినవారి కొద్దిరోజు చెరసాల శిక్షవేసి పంపుతుంటే వారికి చట్టం పట్ల భయమెలా ఏర్పడుతుంది? అందుకే నేను దొంగతనం చేస్తు,అవినీతికి పాల్పడే వారికీ , వారి కుటుంబ సభ్యులులకూ జీవితఖైదువిధించి వారి సమస్త ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చాటింపు వేయించాను. నాటి నుండి దొంగతనాలు, అవనీతి చర్యలు ఆగిపోయాయి " అన్నాడు.
" మంత్రివర్యా దొంగతనం,అవినీతి అరికట్టడాని ఖఠినమైన నిర్ణాయాలు నాఅనుమతితో తీసుకున్నారు ,మరి నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గం ఎలా కనుగొన్నారు " అన్నాడు రాజుగారు. " ప్రభూ మన సైన్యంలో వృధ్ధులను, అనారోగ్యంతో భాధపడే వారిని తొలగించి వారికి ఆర్ధికపరమైన ఇబ్బందులు లేకండా చేసాను.మన రాజ్యంలో పట్టణ పరీధిలోని విద్యపూర్తి చేసిన ఆరోగ్యకరమైన యువకులు అందరూ తప్పనిసరిగా సైన్యంలో చేరి మూడు సంవత్సరాలు దేశసేవచేయాలి, కాదన్న వారికి మూడు సంవత్సరాలు శిక్ష విధించబడుతుంది .అనే చట్టం చేసిన సంగతి తమ తెలిసినదే. ఇహ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేయడానికి ఇష్టపడే యువతకు అంతకు మునుపు వ్యవసాయ భూమి లేకుంటే,అటువంటి వారికి ప్రభుత్వ వ్యవసాయభూమి మూడు ఎకరాలు ఉచితంగా ఇవ్వడంతో పాటు కోరిన విత్తనాలు, ఎరువులు ప్రభుత్వం అందజేయడం ,తొలిపంట చేతికి అందేదాక వారి కుటుంబ అవసరాలకు ప్రభుత్వమే ఆర్ధిక సహయం అందజేసే ఏర్పాటు చేసాను ,ఈచర్యతో పట్టణ,గ్రామీణ యువత నిరుద్యోగ సమస్య పరిష్కరించగలిగాను " అన్నాడు మంత్రి. "భళా మంత్రివర్యా తమరి ఆలోచనావిధానం అమోఘం. మీరు చెప్పినది మంచి పని,దొంగతనం,అవినీతిలో దొరికినవారికి చెరసాల శిక్షవేసి మూడు పూటల తిండి పెట్టి పంపుతుంటే వారిలో మార్పురాదు. చట్టం చాలా కఠినంగా ఉండాలి ,ఊహించుకుంటేనే భయం కలగాలి అప్పుడే అందరు తప్పుడు పనులు చేయడానికి భయపడతారు అన్న మీమాటలు యదార్ధం " అన్నాడు రాజుగారు.
" ప్రభు తమరు నాకు పూర్తి మద్దత్తు ఇవ్వడంవలన ఈ పనులు సాధ్యం అయినవి " అన్నాడు మంత్రి. సభలోనివారంతా మంత్రి మాటలకు కరతాళధ్వనులు చేసారు.