వచ్చేసింది శ్రావణం - తాత మోహనకృష్ణ

Vachhesindi shravanam

"హమ్మయ్యా..! ఆషాడం ఖతం అయ్యింది. రేపటి నుంచి శ్రావణమాసం..నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.." అంటూ తల్లి జానకమ్మని వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంది కూతురు శ్రావ్య "మేమూ పెళ్ళైన కొత్తలో.. ఆషాడమాసం చూసి.. దాటిన వాళ్ళమే..ఎందుకో నీకు అంత సంతోషం శ్రావ్య.." అడిగింది జానకమ్మ "నిజమే అమ్మ..! కానీ మీ రోజులు వేరు, ఇప్పుడు మా రోజులు వేరు .." "క్యాలెండర్ లో శ్రావణమాసం ఎప్పుడూ ఒక్కటే.." అంది జానకమ్మ "క్యాలెండర్ లో శ్రావణం ఎప్పుడూ ఒక్కటే..కానీ ఇప్పుడు కాలం చాలా మారింది కదా అమ్మా ..! మీ రోజుల్లో..అన్నీ 'బ్లాక్ అండ్ వైట్' సినిమాలు..'యు' సర్టిఫికెట్ సినిమాలే. ఇంటర్నెట్ లేదు..మిడ్ నైట్ మసాలాలు అసలే లేవు. ఈ కాలం లో అయితే, ఎప్పుడో గాని మంచి సినిమాలు రావట్లేదు.

అప్పట్లో మీకున్నంత ఓర్పు ఇప్పుడు ఎవరికీ ఉండట్లేదు. ఉప్పు, కారం, మసాలాలు బాగా తింటున్నాము కదా..ఒక్క రోజు మొగుడు మా పక్క చూడకపోతే, ఏదోలాగా అయిపొతుంది తెలుసా..? బుర్ర కుడా పని చెయ్యదు.." "చాలు లేవే ఆపు..! నువ్వే ఇక్కడ అందరికి నీ మాటలతో 'ఎ' సర్టిఫికెట్ సినిమా చూపించే లాగ ఉన్నవే..అయితే ఇప్పుడు ఏమిటి అంటావు చెప్పు..?" "ఆషాడమని నన్ను పుట్టింట్లోనే బంధించావు నెల రోజుల నుంచి. పోనీ.. ఆ ఉప్పు కారాలు తగ్గిస్తావా అంటే, అదీ లేదు..బాగా వేస్తావు. నాకు ఎలా ఉంటుంది చెప్పు..? రాత్రి అసలు నిద్ర పట్టట్లేదు..మా ఆయనే గుర్తుకొస్తున్నారు. రెక్కలు ఉంటే, ఎగిరిపోవాలని ఉంది..ఎగిరి మా ఆయన వొళ్ళో వాలిపోవాలని ఉంది. నువ్వేమో ఇక్కడ నన్ను కట్టేసావు..అక్కడేమో మా అత్తగారు కుడా మావారిని కట్టేసారు...ఒక విధంగా మాకు మీ ఇద్దరూ అన్యాయమే చేస్తున్నారు" "ఏమిటో..మీకు జరుగుతున్న అంత అన్యాయం..?" "ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం చాలా ముఖ్యం. మా జంట ఆకలి నెల రోజుల నుంచి పెరిగిపోతూనే ఉంది. నాకు ఒంటి మీద పైట నిలవట్లేదు...ఏం చెయ్యను.." "అందుకే, మా కాలంలో ఎప్పుడూ మేము పనులతో బిజీ గా ఉండేవాళ్ళం. పైగా దైవభక్తి, నోములు, వ్రతాలని మనసుని ఎప్పుడూ నిగ్రహంగా ఉండడం అలవాటు చేసుకునేవాళ్ళం. నేటి అమ్మాయిలకి ఆ ధ్యాసే లేదు..ఎప్పుడూ ఆ సినిమాలు, వీడియోల గోలే. అలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు చూస్తూ ఉంటే, ఎలా ఉంటుంది చెప్పు..! నాకే.. అదోలాగ ఉంటోంది..మరి నీకు ఉండదా శ్రావ్య?" "అమ్మో...! మా అమ్మ కుడా మసాలా మాటలు మాట్లాడుతున్నాదే.." "చాలు లేవే సంబడం..నాకేం పెద్ద వయసైపోయింది చెప్పు..! అప్పట్లో నాకు తొందరగా పెళ్ళి అయిపోయింది అంతే..! ఇప్పటికీ మనిద్దరం బయట నడుస్తూ వెళ్తుంటే, అక్కాచెల్లి అనే అనుకుంటారు అందరూ.. ఇప్పటికీ మీ నాన్నగారు నా పక్క పడుకోకపోతే, నాకు అసలు నిద్రేపట్టదు.." అంది జానకమ్మ సిగ్గు పడుతూ "అమ్మో..! అమ్మా..! సిగ్గుపడుతూ ..నీ నోట ఇలాంటి మాటలు భలే ఉన్నాయి తెలుసా..!" "రేపు ఉదయం రెడీ గా ఉండు...మీ ఆయన దగ్గరకి దింపుతాను. ఆ తర్వాత నీ ఇష్టం..నీకు ఎలా కావాలంటే అలా ఉండు...హ్యాపీ గా.." అంటూ నవ్వుతూ అంది జానకమ్మ *****

మరిన్ని కథలు

A1 farmula
ఏ1 ఫార్ములా
- వై.కె.సంధ్యా శర్మ
Oke okkadu
ఒకే ఒక్కడు
- కందర్ప మూర్తి
Mitam
మితం
- ఆదిత్య ప్రణవ్
Bamma ki ichina mata
Bamma ki ichina mata
- Prabhavathi pusapati
Peddakodalu
పెద్దకోడలు
- మద్దూరి నరసింహమూర్తి
Parina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం
Tatayya salahalu
తాతయ్య సలహాలు
- గాయత్రి కులకర్ణి
Seshajeevitam
శేష జీవితం
- మద్దూరి నరసింహమూర్తి