అడవిలో పిల్ల జంతువులు అన్నింటి కూర్చేపెట్టి చదువు చెపుతున్న నక్కమామ ' పిల్లలు శ్రద్దగా చదవండి. నేను చెప్పే పాఠం రాసుకొండి వాగుడు మానండి. నిన్నటి పాఠం రాసుకోచ్చారా? పిల్లలు ఈరోజు పాఠం లేదు కథ చెప్పుకుంద్దాం! ముందుగా హాజరు పలకండి. సింహారాజు కొడుకు, వచ్చానయ్యా, కోతి కూతురు,ఉన్నానండి,కుందేలు కోడుకు,ఈడనే ఉన్నా! హజరు ముగిసిన అనంతరం ఓ అడవిలో... '. ఓండ్రపెట్టాడు గాడిద కొడుకు.
' ఒరేయ్ అడ్డగాడిద కొడకా నీకు వేపకాయంత వెర్రి, వెలగ పండు అంత తిక్క ఉందని నాకు తెలుసు.నువ్వు ఇక్కడ రాసేది తక్కువ వాగేది ఎక్కువ అరచావో తోలుతీస్తా తింగరి వెధవా! పక్కవాళ్ళకి పనికిమాలిన సలహాలు ఇవ్వడం మాని కథ విను, ఆ అడవిలో అన్ని జంతువులు కలసి మెలసి స్నేహంగా ఉండేవి.అక్కడ మన అడ్డగాడిద లాంటి మరో తింగరి కొతి ఉండేవాడు.ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆ అడవికి తెచ్చి పెడుతుండేవాడు. ఒక రోజు అత్యవసరంగా సింహరాజు అడవిలోని జంతువులతో సమావేసమై ఉండగా,వచ్చిన కోతిబావ 'ఏమిటండి మీపరిపాలన తిరునాళ్ళకు వెళ్ళకూడదంటారు, నాట్యం చేయకూడ అంటారు, పాటలు పాడకూడదు,హరికథ వద్దు బుర్రకథ వద్దు అంటు నన్ను విసిగిస్తున్నారు. నాకు స్వేఛ్చ లేనేలేదు ఇదేం పరిపాలన అస్సలు బాగాలేదు' అన్నాడు కోతిబావ.
కొపంతో పళ్ళు పటపట లాడిస్తూ సింహరాజు ' కోతిబావ ఉదయాన్నే ఉమ్మెత్త కాయ తినివచ్చాడులా ఉంది.తీసుకువెళ్ళి చిన్నపాడు పడిన బావిలో వేసి పైన రాతి మూత పెట్టండి పదిరోజులు ఉంచండి.నీళ్ళు ఆహారం రోజు మార్చి రోజు ఇవ్వండి'అన్నాడు సింహరాజు. రెండు చేతులు పట్టుకుని ఎత్తి బావిలో కుదేసారు ఎలుగుబంటి రక్షకభటులు.
పది రోజుల అనంతరం కోతిబావను బావిలోనుండి తీసి వదిలిపెట్టారు.
బావిలోనుండి బైటపడిన కోతిబావ సింహరాజు మెప్పు పొందాలని 'సింహరాజు వర్ధిల్లాలి అమోఘం ఇలాగే వారిపాలన కొనసాగాలి'అని పెద్దగా అరుస్తూ అడవి అంతా తిరగసాగాడు.మళ్ళి కోతి బావను తీసుకువచ్చి ఎత్తి బావిలో కుదేశారు.'ఏమిటిది నేను సింహారాజును పొగిడానుగా నన్ను తీసుకువచ్చి మళ్ళి బావిలో వేస్తున్నారేమిటి?' అన్నాడు.'ఓరి తిక్కలోడా సింహరాజు గారికి బధ్ధశత్రువైన పులి ఇప్పడు పరిపాలిస్తున్న రాజు. పులి రాజు గారి శత్రువైన సింహారాజును నువ్వు పొగిడినందుకు నీకు మళ్ళి పది రోజులు అదేశిక్ష అమలు చేస్తున్నాం ' అన్నారు ఎలుగుబంటి భటులు.
'ఓర్ని రాజుగారి బిడ్డను ఎత్తుకున్నా తప్పే దించినా తప్పే లా ఉందే నాపరిసస్ధితి' అన్నాడు కోతిబావ.'సమయం సందర్బం తెలియకుండా స్ధాయికి మించిన పనులు చేయకూడదు అనుకున్నాడు కోతిబావ.