కోతి బావ పెళ్ళి. - సృజన.

Kothi bava pelli

" మామా మనుషులకు లేనిది మనకు ఉన్న ప్రత్యేకత ఏమిటి ?" అన్నాడు కోతి. " అల్లుడు మనుషులు ఆహారం తింటూ నీళ్ళీ తాగుతారు మనం అంటే జంతుజాలం ఆహరంతో నీళ్ళు తీసుకోము " అన్నాడు కుందేలు.

" కోతి సేనాధిపతులకు జయము జయము తమరి ఇరువురిని సింహరాజుగారు తక్షణం రమ్మన్నారు "అన్నది రామచిలు.

" వెళదాం పదమామా " అంటూ కుందేలుతో కలసి సింహరాజుని వద్దకు వెళ్ళారు. కుందేలు,కోతిని చూసిన సింహరాజు " కుందేలు వారు మాసేనాపతి కోతి పెండ్లి ఐదు రోజులు చేయాబోతున్నాం ,వడ్డించిన వంటకం మరలా వడ్డించకుండా అలా ఐదు రోజులు మూడు పూటల వడ్డించాలి.పదార్ధాలు మహ కమ్మగాఉండాలి.దానికి నీవు ఏంవంటకాలు చేయిస్తున్నావు , నీవంటలు వాసనఎక్కువ రుచి తక్కువ ఏపదార్దాలు చేస్తున్నావు" అన్నాడు.

సింహరాజుగారి మాటలు విని ఆనందంతో కోతిబావ దబ్బున కిందపడి మూర్చపోయాడు. కొతిముఖాన ముంతడు నీళ్ళు గుమ్మరించాడు మంత్రి నక్క.

" ప్రభు క్యారెట్ హల్వా చేయడానికి బొంబాయి వారిని, పలురకాల కుర్మలు చపాతీలకు ధిల్లి వారిని , జరసగుల్లా,జిలేబి చేయడానికి కలకత్తా వారిని, మాల్ పూరి చేయడానికి రాజస్తాన్ వారిని,పనస అప్పడం,గోంగూర, పచ్చళ్ళు, ఊరగాయలకు చేయడానికి గుంటూరు వారిని,పాలతో చేసే తీపి పదార్ధాలకు గుజరాత్ వారిని ,లస్సిచేయడానికి పంజాబువారిని "అంటుడగా...దబ్బుమని కిందపడి మూర్చపోయాడు మరో పర్యాయం కోతి.

" వీడికి ఈమూర్చల రోగం ఎప్పటినుండి వచ్చింది తెలియక వీడిని సేనాపతిని చేసానే "అన్నాడు సింహరాజు.

"ప్రభు ఇది వ్యాధికాదు మీరు అతని పెండ్లిలో తమరు చేయి స్తున్న వంటకాలు విని ఆనందంతో మూర్చపోయాడు "అని మరో ముంతనీళ్ళు కోతి ముఖంపైన గుమ్మరించాడు కుందేలు.

"ప్రభు మునగ,ముల్లంగి సాంబారు చేయడానికి తమిళనాడు వారిని, లడ్లు చేయడానికి బందరు వారిని, గుమ్మడి కాయతో దప్పళం చేయడానికి తూర్పు గోదావరి వారిని, ,గోంగూర వంటకాలకు గుంటూరు వారిని, కాశ్మీరు బాస్ మంతి బియ్యం, తెలంగాణానుండి అన్నిరకాల పళ్ళరసాలు ,కాకినాడకాజాలు,తాపేశ్వరం పూతరేకు ,ఒకటేమిటి భారత దేశంలో పేరు పొందిన వంటకాలు వండే అందరిని పిలిపిస్తున్నాను ,అలాగే ఈమని వారి బ్యాండ్ మేళాం, సినీగాయకుల పాటలు, పేరుపొందిన నర్తకీమణుల నృత్యాలు ఏర్పాటు చేసాను" అన్నాడు కుందేలు.

దభీమని మరోమారు కిందపడి మరోమారు మూర్చపోయాడు కోతి.

" ఈసారి ఈమూర్చకు వాడే తేరుకుని లేస్తాడులే ! నువ్వు మొహంపైన నీళ్ళుగుమ్మరించక తింగరి వెధవకు జలుబు చేస్తే పెళ్ళిపీటలపైన ఇబ్బంది పడతాడు ,వీడి పెళ్ళికి ఆరు కిలోల బరువైన బంగినపల్లి మామిడిపండు చదివించబోతున్నాను " అన్నాడు సింహరాజు. ఆమాట వింటూనే ఎగిరి మూడుగంతులు వేసాడు కోతి.

ఆకాశమంత పందిరివేసి వైభవంగా కోతి పెళ్ళి వైభవంగా జరిగింది. సింహరాజుగారు వెదురు గంపలోని పెట్టుకువచ్చిన పెద్ద మామిడి పండు చదివింపుగా కోతికి అందివ్వబోయాడు.

మామాడి పండు రెండు చేతులు చాచి అందుకోబోయిన కోతి దభీమని చెట్టుపైనుండి కింద ఉన్న ముళ్ళచెట్టుపై పడ్డాడు.తన శరీరంలో దిగబడిన ముళ్ళను తీసుకుంటూ ఉండగా, వచ్చిన కుందేలు "ఏమిటి అల్లుడు శరీరం అంతా ఈముళ్ళేమిటి ?"అన్నాడు.

" మంచికల మామా ఆకలలో సింహరాజుగారు నాకు పెద్దమామిడి పండు చదివింపుగా ఇవ్వబోయాడు , రెండు చేతులుచాచి సింహరాజు గారు ఇచ్చే మామిడి పండు అందుకోబోయి, చెట్టుకొమ్మవదిలాను అంతే పట్టుతప్పి చెట్టుపై నుండి జారి కింద ముళ్ళకంపలో పడ్డాను "అన్నాడు కోతి. "అయ్యొ ఎంతపని జరిగింది బాధపడకు అల్లుడు "అన్నాడు కుందేలు .

" బాధలేకుండా ఎలాఉంటది మామా పెళ్ళి అయిన అనంతరం మామిడి పండు తిన్నాక చెట్టుపైనుండి కిందపడితే ఓర్చుకునేవాడిని , పెళ్ళిలేదు, మామిడి పండు లేదు. కల మంచిదే దాని ఫలితమే బాగోలేదు "అన్నాడు కోతి.

" పగటి కలలు కన్నావా అల్లుడు "అన్నాడు కుందెలు.

మరిన్ని కథలు

Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు