ఆకలి - అరవ విస్సు

Aakali

రావుగారిపేట ఉన్నతపాఠశాల స్టాఫ్ రూమ్ లంచ్ చేసి టీచర్స్ అందరూ రాబోయే పరీక్షలగురించి చర్చించుకుంటున్నారు. "సార్ ! సార్ ! ప్రసన్న- మమత భోజనం చేయలేదండీ మూడవ పిరియడ్ లో మూర్తిసార్ నోట్సు కంప్లీట్ చేయలేదని తిట్టారండీ! అందుకని కోపం వచ్చి ఏడుస్తూ కూర్చున్నారండీ" అని 9 వతరగతి విద్యార్ది సీత వచ్చి అప్పారావు సర్ తో చెప్పింది. "అయ్యో ! అలాగా! నడు నేను నచ్చ చెబుతా " అని బయలు దేరారు. "మీరు వెళ్ళడం ఎందుకు మాస్తారు ? అలా గారం పెట్తకండీ ఆకలేస్తే అదే తింటుందిలే !" అనిసహచర టీచర్ గోపాలం అన్నారు. "అవును అంతే ! లేనిపోని అలవాట్లు చేయకండి, కడుపుకాలితే ఎందుకు తినదు" మరో సహచర ఉపాద్యాయిని లోకేశ్వరి " మాస్టారూ మీరు ఇటువంటి కొత్త అలవాట్లు చేయకండీ !" మరో ఉపాద్యాయిని హారతి " పోనీలెండి! మన పిల్లలు అయితే అలా మౌనంగా ఊరుకుంటామా ! పోనిలెండి మీరు రావద్దు నేను వెళతా" అని చెప్పి అప్పారావు తరగతిగదికి వెళ్ళారు ఆయనతో పాటుమరికొద్దిమంది టీచర్స్ కృష్ణంరాజు, హరి,సురేష్ ,శివ కూడా వెళ్ళారు. " టీచర్ అంటే తల్లితండ్రులతో సమానం మీరు తెలివైన అమ్మాయిలు బాగా చదివితే మంచి ఉన్నతస్థానంలో వుంటారు అందుకే మీరంటే మాస్టారుకు ఇష్టం. ఎప్పుడూ మీగురించే మా టీచర్స్ అందరికి చెబుతారు మీరు బాగుపడాలనే అలా తిట్టారు ." అందరు టీచర్స్ అలా నచ్చచెప్పి అ భోజనం తినేలా చేసారు . ################# నెలరోజులు గడిసాయి. స్టాఫ్ రూమ్ లో కొందరు కూర్చోన్నారు. మరికొందరు స్టాఫ్ రూమ్ కు మూడు గదులు అవతలవున్న ప్రధానోపాధ్యాయీనిగదిలోవున్నారు . " గోపాలం గారు గోపాలం గారు 9వతరగతిలో వున్న కావేరి భోజనం చేయలేదంట ఎవరో! మాస్టారు తిట్టారట " అంటూ హడావుడిగా స్టాఫ్ రూమ్ కు వచ్చింది లోకేశ్వరి. " ఏమిటి? కావేరి భోజనం చేయలేదా ? అయ్యో ! పదండీ క్లాస్ వెడదాం పాపం ! ఆకలితో మలమలమాడిపోతుంది. పదండి త్వరగా " అని గోపాలం హూటాహూటిన క్లాస్ కు బయలుదేరారు. ఇంతలో మరోటీచర్ హారతి పరుగు పరుగున వచ్చి " ఎమండోయ్ ! కావేరి భోజనం చేయలేదంట ! అస్సలే ఆ అమ్మాయి ఆరోగ్యం అంతంత మాత్రం నడవండీ నచ్చచెబుదాం " అని ముగ్గురు బయలుదేరారు. అప్పారావుకు ఏమీ అర్థం కావడం.ఎనిమిదో వింతలా అనిపిస్తుంది. ఎప్పుడూ ఏ విద్యార్ధి భోజనం చేయకపోయినా పట్టించుకోరు . పైగా విద్యార్ధులందరూ పేదపిల్లలు, తల్లిదండ్రులు పొట్టకూటికోసం వలసవెళ్ళే కార్మికులు. ఏంటి ఇదంతా ? ఆలోచనలో పడి సహచర ఉపాధ్యాయులువంక చూస్తే వారు చిరునవ్వుతో అప్పారావును చూస్తున్నారు . " పదండీ మనంకూడా వెడదాం " అని అందరూ క్షాస్ కి వెళ్ళారు .అక్కడ సన్నివేశం చూసి అవాక్కయ్యారు. హారతి ఒడిలో కూర్చోబెట్టుకుని కావేరికి ముద్దలు తినిపిస్తోంది. గోపాలం భోజనం ప్లేటు పట్టుకున్నాడు. "అన్నం పర బ్రహ్మస్వరూపం అన్నం మీద కోపగించకూడదు అన్నం తినకుండావుంటే భగవంతునిమీద కోపం పడినట్టే ! మాస్టారు తిట్టారని భోజనం మానేస్తావా ? తప్పు కదూ ! " అని లోకేశ్వరి హితవచనాలు చెబుతుంది. అప్పారావుతోపాటు మిగిలిన టీచర్స్ కూడా సముదాయించి కావేరి చేత భోజనం చేయించారు. ############### అందరిలో మంచినిచూసే అప్పారావుకు ఏమీ అర్థం కాలేదు. స్కూల్ వదిలిన తర్వాత "హరి ఎప్పుడూ ఎవరూ భోజనం చేయకపోయినా స్పందించని వీళ్ళు ఏంటండీ !? ఇవాళ ఇంట కరుణ చూపించారు . నాకంతా వింతగావుంది" హరి చిరునవ్వు నవ్వి " అన్నం పరబ్రహ్మ స్వరూపం అప్పుడప్పుడు అది కొత్త స్వరూపంన్ని సంతరించుకుంటాది . లోతుగా ఆలోచించు ఇంటికివెళ్ళి టీ తాగి ప్రశాంతంగా ఆలోచించు విషయం అర్థం అవుతుంది" అన్నాడు ఆ రాత్రి అప్పారావు దీర్ఘంగా ఆలోచించాడు . విషయం బోధపడింది. బడి,గుడి,అమ్మఒడి పవిత్రం ఇక్కడకూడానా ???? మీరూ ఆలోచించండీ ???

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు