కార్యసాధనలో మానవులు మూడువిధాలుగా ఉంటారని భర్తృహరి తన సుభాషితాలలో ఏనాడో పేర్కోన్నాడు.ఓపని ప్రారంభించడానికి ముందే అధములు ఆటంకము, శ్రమ కలుగుతాయి అనే భయంచేత అసలు పనిప్రారంభించరు.కాని మధ్యములు ప్రారంభించిన పని మధ్యలో విఘ్నాలు రావడం మోదలు కాగానే వాటికి భయపడి ప్రారంభించిన పనిని మధ్యలో వదిలివేస్తారు.కానీ కార్యసాధకులైన ఉత్తములు కార్యనిర్వహలో ఎన్నికష్టాలు ఎదురైనా తమకార్యాన్ని వదిలివేయరు. అనుకున్నది సాధించేవరకు విశ్రమించరు ,పట్టువదలని విక్రమార్కునిలా కార్యసాధకులు ఎంతో తెలిగా ఎదటివారి మనసు నొప్పించక ఆపదలను సునాయాసంగా దాటుకుంటూ వెళతారు.
ఇక్కడ "శ్రీ విద్యాప్రకాశనందస్వామి" వారుచెప్పిన కథగురించి తెలుసుకుందాం !
పూర్వం ఓరాజు డాంబికంతో, తనేదో రాజరాజనరేంద్రుడో-శ్రీకృష్ణదేవ రాయలనో-అపర భోజుడుగా తనను లోకం గుర్తించాలని ఆరాట పడుతుండేవాడు.ఒకరోజు కొందరు కవి పండితులను సభకు పిలిపించి,"మీరు మామీద ఒక మహభారతం రాయాలి" అన్నాడు. అదివిన్నవారంత విస్తుపోయారు. ఆరుమాసాల గడువిస్తున్నాను మీఅందరికి భోజన వసతి సకలసదుపాయాలు ఏర్పాటు చేయిస్తాను గడువులోగా ఆగ్రంధం పూర్తిచేయాలి లేదంటే మీఅందరిపైనా ఖటినమైచర్య తీసుకుంటాను"అని ఆజ్ఞాపించాడు.
వేరేదారిలేక పండిత కవులు" సరే" అన్నారు. వీరందరికి నాయకత్వం వహించే పెద్దన్న. ' సోదరులారా మీకు భయంలేదు దీనికి నావద్ద ఓ ఉపాయంఉంది ' అని వారందరికి వివరించాడు. అది విన్నవారంతా బ్రతుకు జీవుడాఅని హయిగా ఊపిరి పీల్చు కున్నారు.
అయిదు మాసాలు గడిచాయి పండితులు రాజభోగాలు అనుభవిస్తూ తమ కవితా పఠనంతో కాలక్షేపం చేయసాగారు. ఓకరోజు రాజుగారు తన గ్రంధం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని కవి పండితుల మందిరానికి వచ్చి పెద్దన్నను చూసి"అయ్య కవివరేణ్య నాగ్రంధం ఎంతవరకు వచ్చిందో తెలుపండి "అన్నాడు.
"మహరాజ ఆగ్రంధం రాయడానికి మేమంతా ప్రారంభించాలని అనుకుంటున్నాం కాని మాకు రెండు బలమైన సందేహలు ఉన్నాయి వాటిని తమరు తీర్చగలిగితే గ్రంధం ప్రారంభిస్తాం"అన్నాడు పెద్దన్న. "మీసందేహలు ఏమిటో చెప్పండి"అన్నాడు రాజుగారు.
"పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేసారుకదా! తమరు కూడా మహరాణివారితో కలసి అవి ఎక్కడ చేయబోతున్నారో తెలియజేసారంటే వెంటనే గ్రంధం ప్రారంభం అవుతుంది"అన్నాడు పెద్దన్న".ఏమిటి నేను రాణివారితో కలసి పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేయాలా" అన్నాడు తెల్లబోయిన రాజు.
" యిది ప్రజలు అందరికి తెలిసిన మహభారతం కదా మార్పు చేయడం సాధ్యంకాదు యిందులో మరో ముఖ్యవిషయం ఏమిటంటే ద్రౌపతి స్ధానంలో ఉన్న మహరాణి వారికి మీసోదరులు అయిదు గురు భర్తలుగా రాయవలసివస్తుంది "అన్నాడు పెద్దన్న.
అతని మాటలకు ఉలిక్కిపడిన మహరాజు"ఏమిటి విపరీతం యిలా రాస్తే లోకం నవ్వదా! అలా అయితే ఈగ్రధం వద్దు మేము యిప్పుడే ఆప్రయత్నం మానుకుంటుంన్నాం ,మీరు తక్షణం మీఇళ్ళకు వెళ్ళవచ్చ" అని పరుగువంటి నడకతో వెళ్ళి పోయాడురాజుగారు.
"చూసారా సోదరులారా డాంబికుడి కోరికలు రెక్కలు విప్పిన పక్షుల్లా అట్టేవచ్చి యిట్టే ఎగిరిపోతాయి. డాంబికానికి,మిడిమిడి జ్ఞానానికి, దారిచూపేందుకు జ్ఞానదీపం కావాలి.వివకమున్న మనిషైతే తను యితరులకు దీపంలాదారి చూపుతాడు.కనుక మనిషికి కావలసింది వివేకం కానీ,డాంబికం కాదు "అన్నాడు పెద్దన్న.