ధృవుని వంశము. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Dhruvuni vamshamu

స్వాయంభువ మనువుకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఉత్తానపాదుడు ప్రముఖుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యల వలన ధ్రువుడు (సునీతి) ఉత్తముడు (సురుచి) అనే ఇద్దరు కుమారులు కలిగారు. కాలప్రభావం వలన ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రి నవ్వు నవ్వి నీకు తండ్రి తొడ పై ఎక్కే అధృష్టం లేదు, అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. నీకా అధృష్టం కలగాలంటే శ్రీహరిని ప్రార్థించమని చెబుతుంది. ఆ పరుష భాషణానికి చింతాక్రాంతుడై ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు సునీతి ధ్రువుడితో నాయనా కాలప్రభావం వలన నీ తండ్రి తనను దాసీ కంటే తక్కువగా చూస్తున్నాడని, కష్టం కలిగించే పలుకులైన సవతి సరైన విషయం చెప్పిందని, శ్రీహరి పాదధ్యానము వలన జరగనివి ఉండవని స్వాయంభువ మనువు శ్రీహరిని ధ్యానించి ఉత్తమ గతి పొందాడని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి రాజధాని నుండి అడవికి బయలుదేరాడు.

అప్పుడు మార్గమధ్యములో నారదుడు కనిపించి ఎక్కడికి వెళ్ళుతున్నావు అని అడుగగా ధ్రువుడు అప్పటి వరకు జరిగిన వృత్తాంతం తన సవతి తల్లి చేత పొందిన అవమానం చెబుతాడు. నారదుడు ధ్రువుడిని ఓదార్చి రాజధాని నగరం పంపడానికి ప్రయత్నిస్తాడు. కాని ధ్రువుడి పట్టుదలకు మెచ్చి యమునా నది తీరములో ఉన్న మధువనంలో ధర్భాసీనుడవై ప్రాణాయామ నిష్ఠతో శ్రీ మహావిష్ణువును ఆరాధించమని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నారాయణ మంత్రము ఉపదేశిస్తాడు. ధ్రువుడు యమునానదిలో త్రికరణ శుద్ధిగా స్నానము చేసి దర్భాసీనుడై నారాయణు గురించి తపస్సు చేస్తాడు. ముందు మూడు రోజులకు ఒకమారు వెలగ పండు లేదా రేగి పండు తినేవాడు తరువాత ఆరు రోజులకు ఒకమారు పండి రాలిన ఆకులు తింటు తపస్సు చేశాడు. ఆ తరువాత మూడు నెలలకు తొమ్మిది రోజులకు ఒకమారు మంచి నీరు త్రాగి తపస్సు చేశాడు. ఆ తరువాత 12 రోజులకు ఒకమారు గాలి పీల్చి తపస్సు చేశాడు. మరికొన్ని రోజులకు గాలి కూడా పీల్చకుండా తపస్సు చేస్తూండగా సమస్త బ్రహ్మాండంలో అల్లకల్లోలం సృష్టించబడి దేవతలు నారాయణుడి వద్దకు వెళ్ళి విషయం విన్నవిస్తారు. అప్పుడు నారాయణుడు ధ్రువుడు తన గురించి తపస్సు చేస్తున్నాడని, వాని వలన ఈ ఉపద్రవం వస్తున్నదని చెప్పి వానికి ప్రత్యక్షం అయ్యి దీక్ష విరమింప జేస్తానని చెబుతాడు.

నారాయణుడు ధ్రువుడికి శంఖ చక్రాలతో ప్రత్యక్షమై ధ్రువుడి శిరస్సు నిమిరగా ధ్రువుడు 12 శ్లోకాలతో నారాయణుడిని స్తుతిస్తాడు. దానికి నారాయణుడు ప్రీతి చెంది అంతరిక్షంలో సప్తఋషులు, నిఖిల తారాగణాలు, సూర్యచంద్రులు నిరంతరం ప్రదక్షిణం చేసే ధ్రువక్షితి అనే స్థానం కలిపిస్తున్నానని చెప్పి, ఆ ధ్రువక్షితికి చేరే ముందు కొన్ని రోజులు రాజ్యపరిపాలన చేయమంటాడు. ఆ విధంగా నారాయణుడిని ప్రసన్నం చేసుకొని ఆశీర్వాదం పొందిన ధ్రువుడి తిరిగి రాజధాని చేరుకొంటాడు. రాజధాని చేరుకొనిన ధ్రువుడిని చూసి తండ్రి ఉత్తానపాదుడు సంతోషం పొంది, రాజ్యానికి పట్టాభిషేకం చేసి వానప్రస్థాశ్రమమునకు వెళ్తాడు.

రాజ్య పాలన చేపట్టిన ధృవుడు వాయుదేవుని పుత్రిక ఇల ను వివాహం చేసుకున్నాడు, వీరి కి ఉత్కలుడు అనే కుమారుడు జన్మించాడు. మరోభార్య భ్రమిరి ఈమెకు కల్పుండు,వత్సరుడు,ధన్య అనే భార్యకు శిష్టుడు ,శంభువు అనేభార్యకు భవ్యుడు,మరియు గర్కుడు, వృషభుడు,వృకుడు,వృకలుడు,ధ్రతిమంతాడు అనే కుమారులు కలిగారు.

అంతకు మునుపు ఒకరోజు ... ఒకరోజు తన సోదరుడైన ఉత్తముడు అరణ్యానికి వేటకు వెళ్ళి ఒక యక్షుని చేతిలో మరణించాడు. ఆ వార్త విన్న సురుచి అగ్నిలో ప్రవేశించి ప్రాణ త్యాగం చేసింది. ఈ రెందు విషయాలు మనస్థాపం కలిగించి ధ్రువుడు హిమయత్పర్వతం లోయలో ఉన్న అలకపురిలో ఉన్న యక్షుల మీద యుద్ధం ప్రకటించాడు. కొద్ది సేపటి తరువాత యుక్షులు మాయ యుద్ధం చేయట మొదలుపెట్టారు. వారితొ మాయాయుద్ధం చేసే దారి తోచక ఆలోచిస్తుంటే మునులు ప్రత్యక్షమై నిఖిపలోకాలకు మూల కారకుడైన నారాయణుడిని స్మరించమని చెబుతారు. నారాయణుడిని స్మరించి నారాయాణాస్త్రం సంధించగా యక్షుల శక్తి సన్న గిల్లి వారి కాళు చేతులు మొండలు విరిగి క్రింద పడి పోయాయి. అప్పుడు ధ్రువుడి తాత స్వాయంభువ మనువు ప్రత్యక్షం అయి దేహాభిమానం కలిగిన పశుపక్ష్యాదులు చేసే కిరాతక కృత్యాన్ని చేస్తున్నడని,నారాయణుడిని ప్రసన్నం చేసుకొనిన నీకు అది సరికాదని హితబోధ చేశాడు. అంతేకాక యక్షులతో యుద్ధం వల్ల శివుడినికి సన్నిహితుడైన కుబేరుడికి ఆగ్రహం వచ్చిందని చెబుతాడు. ధ్రువుడు తన తాత మాటలు విని విరమించాడని తెలుసుకొని కుబేరుడు సంతోషించి, ధ్రువుడు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. అప్పుడు ధ్రువుడు కుబేరుడికి నమస్కరించగా కుబేరుడు ధ్రువునితో మీతతా మాటలు విని యుద్ధం ఆపినందుకు సంతోషంగా ఉన్నదిఉ, నిర్మలమైన శ్రీమహావిష్ణువును సదా స్మరిస్తూ జీవననం జరపమని సెలవిచ్చి వెళ్ళిపోతాడు.

ధ్రువుడు రాజధాని చేరి భూరి దానాలతో యజ్ఞాలు సాగించి కొంత కాలం పరిపాలన చేశాడు. తరువాత రాజ్యాన్ని తన కూమారుడికి అప్పగించి, తపస్సు చేసుకోవడానికి బదరికావనములో పద్మాసీనుడై శ్రీ మహావిష్ణువు స్మరిస్తూ కాలం వెల్లబుచ్చుతుండగా ఒకరోజు నంద సునంద అనే ఇద్దరు నారాయణ సేవకులు దివ్యవిమానం మీద ధ్రువుడిని తీసుకొని వెళ్ళడానికి వస్తారు. ధ్రువుడా దివ్యవిమానం ఎక్క లేకపోతుండగా యముడు వచ్చి తన వీపు మీద నుండి ఆ విమానం ఎక్కమనై చెబుఇతాడు. అలా వెళ్ళుతుండగా ధ్రువుడు నారాయణ సేవకులతో తన తల్లి చూడవలెనని కోరిక ఉన్నదని తెలుపగా వారి ముందు ఉన్న విమానం పైనున్న సునీతిని చూపించగా ధ్రువుడు ఆనందిస్తాడు.నేటికి మనకు కనిపించే ధ్రువనక్షత్రము ధ్రువుడి నారాయణ భక్తి సామ్రాజ్యపాలన ఫలంగా లభించనదే అని చెబుతారు.

ధృవుని అనంతరం వత్సరుడు రాజ్యభారం చేపట్టాడు, ఇతనిభార్య సర్వర్ది వీరికి పుష్పార్ణుడు-చంద్రకేతుడు-ఇష్టుడు-ఊర్జుడు-వసువు-యుడు అనేవారుజన్మించారు. వీరిలోపుష్పార్ణునికి ప్రభ-దోష అనే యిరువురు భార్యలు ఉన్నారు.ప్రభకు ప్రాతర్మ-థంధని-సాయిలు అనే ముగ్గురు పుత్రులు.దోష కు ప్రదోషుడు-నిశీధుడు-వ్యుష్టుడు అనేవారు జన్మించారు .ఇందులోవ్యుష్టుడి భార్య పుష్కరిణి వీరికి సర్వతేజుడు జన్మించాడు.ఇతని భార్యఆకూతి వీరికి చక్షస్సు అనే మనువు జన్మించాడు. ఇతనిభార్య నడ్వల వీరికి పురువు-కుత్సుడు-ద్యుమ్నుడు-సత్యవంతుడు-బతుడు-వ్రతుడు-అగ్నిప్టోముడు-అతిరాత్రుడు-సుద్యముడు-శిబి-ఉల్మకుడు అనేవారు జన్మించారు.వీరిలో ఉల్మకునకు అంగుడు-సుమనుడు-ఖ్యాతి-కత్రువు-అంగీరసుడు-గయుడు జన్మించారు.అంగుడు ఇతను ముృత్యువు కుమార్తె ఐన సునీథ దంపతులకు వేనుడు జన్మించాడు అతనిప్రవర్తన నచ్చనిఅంగుడు అడవులకు వెళ్ళిపోయాడు, అదితెలిసిన మునులు శపించగా వేనుడుమరణించాడు,మునులు వేనుడు శరీరం నుండి మునులు నారాయణ అంశంతో బాలుని సృష్టించారు అతని పేరు పృథుడు ఇతను తొలి చక్రవర్తిగా గుర్తింపు పొందాడు ఇతని పట్టాభిషేకానికి కుబేరుడు బంగారు సింహసనం,వరుణుడు చంద్రకాంతులువెదజల్లే ఛత్రం, వాయుదేముడు వింజామరము,ధర్మదేవత యశోరూపమైన యముడు రాజదండము,బ్రహ్మదేవుడు వేదకవచాలు,సరస్వతిదేవి మంచి ముత్యాల దండను, పూలమాలను,ఇంద్రుడుకిరీటం,లక్ష్మిదేవి తరగని సంపదను, శివుడు ఖడ్గాన్ని,పార్వతిదేవి శతచంద్రా అనేడాలును,చంద్రుడు తెల్లని గుర్రాలను,త్వష్ట అందమైనరధాన్ని,సూర్యుడు శరాలను,సూర్యుడు అజగవం అనేధనస్సును ,భూదేవి యోగమాయలైన పాదుకలు బహుకరించారు. పృధుడు పాలించినందున భూమి ఫృధ్వి ఐనది.పృధు భార్య అర్చి ఈదంపతులకు విజాతాశ్వుడు,ధూమ్రాశ్వుడు, హర్యాశ్వుడు, ద్రవిణుడు,వృకుడు,అంతర్ధానుడు,హవిర్బానుడు, నిత్యంహరినామ స్మరణతో వంద అశ్వమేధ యాగాలు చేసి సనత్కుమారుడి ద్వారా జ్ఞానభోధ పొంది స్వర్గం చేరాడు.

మరిన్ని కథలు

Aachari mastari vupayam
ఆచారి మాస్టారి ఉపాయం (బాలల కధ )
- కొత్తపల్లి ఉదయబాబు
Aadaleka maddela odu
ఆడలేక మద్దెల ఓడు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Garam chai
గరం చాయ్
- వేముల శ్రీమాన్
Kudi Edamaithe
కుడి ఎడమైతే
- మద్దూరి నరసింహమూర్తి
Complaint
కంప్లైంట్
- Kodali sitarama rao
Aakali
ఆకలి
- అరవ విస్సు