భువనగిరి రాజ్యాంలో ఓ పర్యాయం వార్తా వాహకుడి పదవికి ఒకరిని ఎంపిక చేయవలసి వచ్చింది. పలువురిని మంత్రి పరిక్షించగా శివయ్య, రంగనాధం అనే వారి ఇరువురికి చెరోక లేఖ ఇస్తు .
' నాయన రంగనాధం నీవు నేను ఏర్పాటు చేసిన గుర్రంపై వెళ్ళి బండారు పల్లి అనే నగర కొత్వాలుకు ఈలేఖ ఇచ్చి రా " అని ... " నాయనా శివయ్య నువ్వు బంటుమిల్లి అనే నగరం వెళ్ళి అక్కడ ఉన్న కొత్వలుకు ఈలేఖ అందజేసి రావాలి ఇవిగో దారికర్చులకు చెరి ఐదు రూకలు అని అందించి పంపాడు మంత్రి.
మరదినం వచ్చిన రంగనాధం,శివయ్యలను చూసి," రంగనాధం నీదారికర్చుల వివరం తెలియజేయి "అన్నాడు. " దారిలో భోజనానికి పూటకూళ్ళ ఇంటి వద్ద ,నాభోజనానికి ఒక రూక, గుర్రం దానాకు ఒకరూక చెల్లించాను. తిరుగు ప్రయాణంలో అదే పూటకూళ్ళ ఇంటివద్ద ఆగి బసచేయడానికి ఒకరూక,భోజనానికి ఒక రూక, గుర్రం దానాకు, ఆరాత్రి గుర్రం పరిరక్షణకు ఒక రూక చెలించాను మొత్తం ఐదు రూకలు అలా కర్చు చేసాను "అన్నాడు.
" శివయ్య నీవెంత కర్చు చేసావు ''అన్నాడు మంత్రి.
" మార్గమధ్యంలో ధర్మసత్రం వద్ద భోజనానికి ఆగి రాచకార్యార్ధాగా వెళుతున్నాను అని నావద్ద ఉన్న లేఖపై ఉన్న రాజముద్ర సత్రం నిర్వాహకులకు చూపించాను వారు నాకు ,నాగుర్రానికి అన్ని సదుపాయాలు ఉచితంగా కలిగించారు. తిరిగి రాత్రికి వస్తానని వారికి చెప్పి వెళ్ళి ,రాత్రికి అదే అసత్రానికే వచ్చి అక్కడే ఉచిత బోజనం,బసతో పాటుతో పాటు, గుర్రం సంరక్షణ పొంది వేకువనే బయలుదేరి వచ్చాను,ఇవిగో తమరు ఇచ్చిన ఐదు రూకలు వీటి అవసరం నాకు కలుగలేదు "అని మంత్రికి ఐదురూకలు అందించాడు.
" రంగనాధం నీకు శివయ్యకు ఉన్న వెత్యశం గమనించావుకదా ,పొదుపు ,సమయస్తూర్తి కలిగిన శివయ్యనే ఈపదవికి ఎంపిక చేస్తున్నా " అన్నాడు మంత్రి సుబుధ్ధి.