అవంతిని పాలించే రాజు రత్నసేనురాజుకు రత్నాలు సేకరించే అలవాటు ఉంది.ఇతని మంత్రి పేరు సుబుధ్ధి. ఒకరోజు మంత్రి సుబుధ్ధిని పిలిచి " ఒక మాసంలోగా మన రాజ్యంలో ఉత్తమ అమాయకుడు ఎవరో నిర్ణయించి నాకు తెలియజేయండి ' అని ఆజ్ఞాపించాడు. రాచకార్యంగా మంత్రి సుబుధ్ధి వెళ్ళిన సమయంలో,ఒక రత్నాల వ్యాపారి రెండు అత్యంత విలువైన రత్నాలు తీసుకు వచ్చి, రత్నసేనుడికి ఇచ్చి రెండువేల వరహలు పొందాడు.
" ఇలాంటి ముఫై రెండు రత్నాలతో హారం చేయించాలి ఇటువంటివే ముఫైరత్నాలు తీసుకురాగలవా ?"అన్నాడు రాజు గారు . " ప్రభూ నేను తమరుకోరిన హారం చేయించి తీసుకు రాగలను .కానీ నేను చిన్న వ్యాపారిని అంత ధనం నావద్దలేదు తమరు రత్నాలకు ముఫైవేల వరహలు ,హారం చేయడాని మూడువేల వరహలు ఇచ్చి తమరి వద్ద నేను ఇచ్చిన రెండురత్నాలు ఇస్తే నెలరోజుల్లో హరంతో వస్తాను " అన్నాడు వినయంగా రత్నాల వ్యాపారి.
" అలాగే "అన్న రాజుగారు వ్యాపారికి ముఫై మూడు వేల వరహలు, రెండు రత్నాలు ఇచ్చి పంపించాడు.
మరుదినం వచ్చిన మంత్రి రాజుగారి రత్నాల హరం విషయం తెలిసింది.నెలరోజుల సమయం దాపోయింది. " మంత్రివర్యా రాత్నాల వ్యాపారి మనల్ని మోసం చేసాడా? " అన్నాడు.రాజుగారు. " ప్రభు తమరు అడిగిన ఉత్తమ అమాయకుడి పేరు ఈలేఖలో ఉంది చూడండి "అన్నాడు మంత్రి. లేఖ చూసిన రాజుగారు " ఇదేమిటి ఇందులో నాపేరు ఉన్నది " అన్నాడు. " పరిచయం లేనివారికి ముఫైమూడు వేల అతనివద్ద కొనుగోలు చేసిన రెండు రత్నారు అతనికే ఇచ్చిపంపిన తమరికంటే ఉత్తమ అమాయకుడు వేరే ఎవరు ఉంటారు ? అన్నాడు మంత్రి. " ఒకవేళ అతను తిరిగివస్తే ? "అన్నాడు రాజగారు. " ముఫై ఐదు వేల వరహలు ఉచితంగా లభించినా ఆవ్యాపారి తిరిగి తమవద్దకు వచ్చాడంటే ఆలేఖలో తమరి పేరు తీసి అతని పేరు రాస్తాను " అన్నాడు మంత్రి.