అమేయ రెండవ తరగతి చదువుతోంది. చాలా తెలివైన పిల్ల. ప్రతిరోజు టీవీ చూస్తుంది... ఖాళీ దొరికితే ఫోన్లో నుంచి తన పైకి తీయదు. ఇరవై నాలుగు గంటలూ ఫోన్ లోనే మునిగిపోతుంది.
ఒకరోజు వాళ్ళ అమ్మ శివకుమారి ఆన్లైన్లో ఇంటికి కావలసిన కొన్ని వస్తువులను బుక్ చేయడం చూసింది. అది ఎలాగో తెలుసుకుంది అమేయ. నాటి నుంచి తనకు కావలసిన డ్రస్సులు, ఆట వస్తువులు వంటివి ఆన్లైన్లో బుక్ చేయడం ఎక్కువయ్యింది. అది అలవాటుగా విసన్నంగా మారింది. అమేయ కోరికలు ఎక్కువ అవ్వడం కాస్త వాళ్ళ అమ్మకు తలనొప్పిగా మారింది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలా అంటూ బాధపడింది.
ఒకరోజు వాళ్ళ అమ్మకు తెలియకుండా తనకు కావలసిన ఆట వస్తువులను బుక్ చేసుకుంది అమేయ. డెలివరీ బాయ్ వచ్చి గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చి డబ్బులు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ షాక్ అయింది. ఇది ఎవరు బుక్ చేశారు అని ఆశ్చర్యపోయింది. అర్థమైంది... ఆ రోజుకి డబ్బులు ఇచ్చి అతన్ని పంపించి అమేయని దండించి ఊరుకుంది.
తర్వాత తనకు తెలియకుండా ఇంకా ఏదో బుక్ చేసిందని డెలివరీ బాయ్ వచ్చినప్పుడు విషయం తెలిసి ఆశ్చర్యపోయింది అమ్మ. ఇంకా లాభం లేదు .. దీనికి బుద్ధి చెప్పాల్సిందే... అనుకుంది గట్టిగా. అంతే!
మర్నాడు వాళ్ళ అమ్మ ఓఎల్ఎక్స్ గురించి చెప్పి ఇందులో పాత వస్తువులు ఆమ్మవచ్చు అంటూ వివరంగా చెప్పింది. ఫోటో తీసి పెట్టి ఓఎల్ఎక్స్లో పెట్టింది. ఇదేదో బాగుందని అమేయ ఇంట్లో తనకి నచ్చని బొమ్మలు, వస్తువులు ఫోటోలు తీసి ఓ ఎల్ ఎక్సలో పెట్టింది. ఇది గమనించింది అమ్మ.
మర్నాడు ఎవరో ఒక బాయ్ వచ్చాడు. "ఇక్కడ అమ్మాయి ఎవరు?" అని అడిగాడు. "ఏమి...ఎందుకు?" అడిగింది అమ్మ.
"తనని అమ్మేశారు ... ఓ ఎల్ ఎక్స్ లో ఫోటో పెట్టారు... ఇదిగో చూడండి...ఆమెను ఇవ్వండి" అన్నాడు.
గుండె ఆగినంత పని అయింది అమేయకి. "లేదు... ఎలాగైనా మీ అమ్మాయిని తీసుకెళ్లాల్సిందే..." గట్టిగా పట్టుబట్టాడు అతడు.
అమ్మ ఎంతగానో బ్రతిమాలింది. "బాబు... ఇంకెప్పుడు మా అమ్మాయి ఆన్లైన్లో ఇటువంటి బుకింగ్స్... తప్పు చెయ్యదు... ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను. ఇంకెప్పుడు మీరు రావద్దు." వేడుకుంది.
అమేయ తలుపు చాటున దాక్కుంది. "మీ అమ్మాయి ఇటువంటి ఆన్లైన్ బుకింగ్ ఎప్పుడైనా చేసిన నేను మరలా వస్తా... అప్పుడు వరకు ఈ ఆర్డర్ ని క్యాన్సిల్ చేసుకోకుండా ఉంచుతా.. " అని చెప్పి వెళ్ళిపోయాడు.
తనను కాపాడిన అమ్మకు థాంక్స్ చెప్తూ కావలించుకుంది అమేయ..." ఇంకెప్పుడూ ఆన్లైన్ బుకింగ్ చేయనమ్మా...సారి..."అంటూ.
తన పథకం పారినందుకు అమేయకి తెలియకుండా ముసిమూసిగా నవ్వుకుంది అమ్మ.