ఉపాయంతో తప్పిన అపాయం! - - బోగా పురుషోత్తం, తుంబూరు.

Vupayam tho tappina apaayam

వీరపు నాయని పల్లిని వీరసూరుడు పాలించేవాడు. అతని ఆస్థానంలో అనంతుడు, అతిథుడు అనే ఇద్దరు సైనికులు వుండేవారు. రాజ్యంలో ఏమి జరిగినా వారిద్దరూ గూఢచారులుగా వ్యవహరిస్తూ తగిన విశ్వసనీయ సమాచారం అందిస్తుండేవారు. ఎలాంటి సమస్యనైనా వారి సాయంతో రాబట్టి పరిష్కరించేవాడు.
ఒక్కో సారి రాజ్యంలో రాజు గారి భవనాలకు నిప్పు అంటుకుని రావణ కాష్టంలా దహించుకునిపోయి విలువైన వస్తు సామగ్రి కాలి బూడిది అయ్యేది. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక రాజు తలపట్టుకు కూర్చుని దీర్ఘంగా ఆలోచించేవాడు. ఈ పని ఎవరు చేస్తున్నారో నిఘావేసి కనుక్కోవాలని తన గూఢచారులైన ఇద్దరు సైనికులను ఆదేశించాడు.
ఆ ఇద్దరు సైనికులు ఆదోలా చూసి ‘‘ సరే ప్రభూ..! ’’ అని తలైపారు. మరుసటి రోజు ఇద్దరు చింపిరి జుట్టుతో వున్న మనుషులను లాక్కోచ్చి రాజు ముందు వుంచారు. ఏమీ తెలియని అమాయకులైన ఆ ఇద్దరూ భయంతో వణుకుతూ రాజు వద్దకు వచ్చి నిలబడ్డారు.
‘‘ నిప్పు పెట్టే పని ఎవరు చేస్తున్నారు చెప్పండి..? లేదంటే ఉరిశిక్ష వేస్తాను..!’’ హూంకరించాడు రాజు.
ఇద్దరి వెన్నులో భయం పట్టుకుంది. ‘‘ ప్రభూ.. ప్రభూ.. మీకు దండాలు..అంత పని చేయకండి..మా పిల్లలు అనాథలు అవుతారు..’’ రాజు కాళ్ల మీద పడ్డారు.
వాళ్లు అలా వేడుకోవడంతో వీరుసూరుడి మనసు వెన్నలా కరిగిపోయింది.
‘‘ పో వెళ్లండి.. ఇలా ఇంకో సారి చేశారంటే చంపేస్తా..!’’ అని హెచ్చరించి విడిచిపెట్టాడు.
కొద్ది రోజులు సమస్య తాత్కాలికంగా సమసిపోయింది. వీరసూరుడికి హాయిగా కంటిమీద కునుకు పడుతున్న వేళ మరో సమస్య వచ్చి పడిరది.
ఈ సారి రాజు జారీ చేసే కరెన్సీ నోట్లకు బదులు నకిలీ నోట్ల సమస్య వచ్చి పడిరది. ఏది అసలు నోట్లో, నకిలీ నోటో తెలియక ప్రజలు తికమక పడ్డారు.
వీరసూరుడికి నకిలీ నోట్ల గుట్టు తెలుసుకోవడం కష్టంగా మారింది. రాజ్యంలో తమ యంత్రాగాన్ని పూర్తి నిఘా వుంచాడు. అయినా ఏమాత్రం కనుక్కోలేకపోయారు.
ఈ సమస్య రాజుకు కొరకరాని కొయ్యగా మారింది. మళ్లీ రాత్రుల్లో నిద్ర కరువైంది. ఈ సారి మెరుపులాంటి ఆలోచన వచ్చి అమలు చేశాడు. నోట్లు రద్దుచేసి వస్తు మార్పిడి పద్ధతి ప్రవేశపెట్టాడు. పరిస్థితి చక్కబడిన తర్వాత నోట్లు పద్ధతిని పునరుద్ధరించాడు. మళ్లీ నకిలీ నోట్ల సమస్య ఎదురైంది. ఈ సారి దీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు.
దొంగనోట్లు తమ వద్దకు తీసుకొచ్చిన వారికి రెండు పది గ్రాముల బంగారు కానుకగా ఇస్తానని దండోరా ప్రకటించాడు.
ఇది విన్న నల్గురు వ్యక్తులు ఎంతో ఆశపడి తాము చెలామణి చేస్తున్న ఓ బస్తా దొంగ నోట్ల కట్టలను రాజు వద్దకు తీసుకెళ్లారు..‘‘ ఇదిగోండి.. మీరు అడిగిన దొంగనోట్లు .. అన్ని ఇచ్చేస్తున్నాం.. మీరు ప్రకటించిన పది గ్రాముల బంగారం ఇప్పించండి ప్రభూ వెళ్లిపోదాం..’’ అని ప్రాధేయపడ్డారు.
వారిని చూసిన రాజుకు చిర్రెత్తు కొచ్చింది. ఇన్నాళ్లు దొంగనోట్లతో నిద్ర లేకుండా ముప్పుతిప్పలు పెట్టిన వారికి జీవిత కారాగార శిక్ష విధించాడు.
ఆ తర్వాత దొంగ నోట్ల సమస్య తలెత్తలేదు. ప్రజలు, రాజు ప్రశాంత జీవనం గడిపారు.
రాజు ఉపాయంతో అపాయం తప్పించి సమస్యను పరిష్కరించినందుకు ప్రజలు ప్రశంసల జల్లు కురిపించారు.

మరిన్ని కథలు

Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న
ఓ breaking news
ఓ బ్రేకింగ్ న్యూస్
- బివిడి ప్రసాద రావు
chettu baadha
చెట్టు బాధ
- లక్ష్మీ కుమారి.సి
Katnam
కట్నం
- తాత మోహనకృష్ణ