ప్రేమ ఒక నాటకం - బొబ్బు హేమావతి

Prema oka natakam

లాబ్ లో వేద...ఆమె ను చూడగానే.... సీనియర్ కిరణ్....పెదాలు తడుపుకుంటూ కోరికతో ఆమె వైపు చూస్తూ ... "ఫోన్ చేసి వచ్చి ఉండవచ్చు కదా. అయినా చెయ్యి పట్టుకుంటే అలా కదలక మెదలక ఉంటే ఎలా ??? కోపంతో పాము లా బుస్సుమనాలి. అలా అయితే ఎలా?" అని అంటూ ఉంటే అటు పక్కన కూర్చొని ఉన్న సరళ నవ్వుతోంది. వేద ...ఇద్దరి వైపు మార్చి మార్చి చూసింది.

వేద మనస్సులో వేధ ఘోష. ఒక్కసారి గా షాక్ కు గురయింది వేద ..."అంటే పెళ్ళి కుదిరేదా. అతను మరి అప్పట్లో ఎక్కడ లేని ప్రేమ చూపి తరువాత తనపై ఎంతో నిర్లక్ష్యం చూపాడు కదా. చెయ్యి పట్టుకుని తన పై సెక్సువల్ ఎటాక్ చేసి ఎవరూ చూడలేదు కదా అని త్వరగా పెళ్లి చేసుకుని తప్పించుకున్నాను అనుకున్నాడు.

కానీ తాను అతనిని చొక్కాపట్టుకునో లేదా కాళ్ళు పట్టుకుని ఉంటే.....అరెరే కుదిరేదా తమ పెళ్లి...అయ్యో ఎంత పని జరిగింది. ఇప్పుడు తాను అనుభవించే ఈ హృదయపు వేదన తనకు ఉండేది కాదేమో". "అంటే సరళ ఇప్పుడు చెప్పిందా? నేను తనని అడిగి సుమారు రెండు సంవత్సరాల పైన అయ్యింది. సాయం చేయలేదు సరికదా. ఇప్పుడు ఎగతాళి నవ్వు.

మరి ఆ రోజు తన ఒడిలో తల పెట్టుకుని ఏడ్చింది....". అతని నిర్లక్ష్యమైన మాటలకూ సరళ వంకర బుద్ధికి ఆమె మనస్సుకు గాయం అయ్యింది. వేద దుఃఖాన్ని ఎప్పుడో మర్చిపోయింది. బాధని మోసి మోసి మనిషి సగం అయిపోయింది. వేరొకరిని ఎలా పెళ్లి చేసుకునేది అన్న ఆలోచన ప్రతి క్షణం. మోసపోయామని చావ కూడదు.

మరణిస్తే ఒక్కరోజే.... కానీ బతికి ఉంటే వానికి తాను ప్రతి క్షణం గుర్తుకు వచ్చి అది వాడికి మరణమే?. "ఓహ్ మొత్తానికి కిరణ్ తనకు తన చిన్న వయసులోనే పెళ్లి కుదిరింది అని చెప్పి తన మనస్సుతో ఆడుకున్నాడు.

నిబద్ధత...హా......ఒక్కరంటే ఒక్కరికి కూడా నువ్వు నా చెయ్యి పట్టుకున్నావని చెప్పలేదు కిరణ్ ......నిన్ను ప్రేమించానని చెప్పాను. నీకు అవమానం నాకు కూడా" అని వేద అనుకున్నది. కానీ నిజానికి ఎవ్వరికి చెప్పినా నమ్మరు అని, అతని నోటితోనే చెప్పించాలని అనుకున్నది. ఎందుకంటే అతనికి చాలా మంచివాడు అనే పేరు ఉంది. తప్పు చేసి, కలుగులో దాక్కున్న ఎలుక...దానిని ఎలాగైనా బయటకు రప్పించాలి అనుకున్నది. ఎలాగో తప్పు జరిగిపోయింది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చూడడమెందుకు అనుకుని అతను బయట పడితే పెళ్లి చేసుకుందాము అని అడగాలి అనుకున్నది. ....ఒక్కసారి గా అడగడం ఎందుకు అనుకుని... స్టెప్ వైస్ వెళదాము అనుకున్నది... కానీ ఎలుక బయటకు రాలేదు.

వేద కన్ఫ్యూషన్ లో మిగిలిపోయింది. ప్రేమ అన్నది నిజమా లేదా అపద్దం అనేది తెలియలేదు. వేద కు complex ptsd వచ్చింది. ఎందుకంటే... sexual assault , harassment , abuse , loss of loved one అన్నీ కలిసి పిచ్చి పట్టింది. అయినా ఒక మగాడు చెయ్యి పట్టుకున్నాడు ...నేను ఫ్రీజ్ అయ్యాను అని చెబితే కూడా అవమానం కదా....జీవితంలో ఎప్పుడూ ఎవరూ తనను టచ్ చేయలేదు ....దుఖం తో అనుకున్నది వేద.... తన తల్లి పెంపకం అలాంటిది. కనీసం కన్న తండ్రి కూడా తనను ఎప్పుడు ముట్టుకోలేదు. "నీకు దూరంగా ఉండాలి అని నీతో మాట్లాడను అన్నాను కిరణ్ ...అయ్యో కిరణ్... నువ్వు నాకు, నీ కాబోయే భార్య తో పోటీ పెట్టావు అని అర్థం చేసుకోగానే... దూరం కావాలని అనుకున్నాను. ....ఎందుకంటే నిన్ను వదిలి ఉండలేనంత ప్రేమ నాలో పెరుగుతుండడం గమనించాను. నువ్వు నీ పెళ్లి గురించి చెప్పగానే నేను నిన్ను అడిగాను "పెళ్లి చేసుకోవాలా". అప్పుడు నువ్వు నాతో అన్నావు "అవును చేసుకోవాలి". ఆ మాట నాకు అలాగే గుర్తు ఉండిపోయింది.

నాకు ఇష్టం లేని పెళ్ళి మా వాళ్ళు చెయ్యలేరు. నేను వద్దు అంటే ఇక వద్దని అంతే. ఇష్టం లేదు అంటే లేదు అంతే. మరి నీ సంగతి నాకు తెలియలేదు కిరణ్.... అంటే మన పెళ్లి కుదిరేదా? ఇప్పుడు మీ మాటలు వింటూ ఉంటే నా మనస్సు కాలిపోతూ ఉంది". వేద మనస్సు గాయపడింది. దొంగ పోలీస్ ఆటలో దొంగ దొరకలేదు.... తప్పించుకున్నాడు తప్పు చేసి కూడా? వేద కి వెంటనే కిరణ్ ను మొదటిసారిగా తన ఇంటి దగ్గర చూసింది గుర్తుకు వచ్చింది. ఆ రోజు కిరణ్ పొట్టి డొక్కు సైకిల్ లో వచ్చాడు వేద ఇంటికి ...అతనిని చూడగానే ఆ క్షణమే వేద అతని ప్రేమలో పడింది...మొదటి చూపు లోనే.... అది ప్రేమ లేదా ఆకర్షణ ఎవరికి తెలుసు? ఆ దేవుడికి తప్ప?. కిరణ్ ఆ రోజూ తమ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు తాను కిరణ్ ను చూసినట్లు అతనికి తెలియదు. కిరణ్ నన్ను ప్రొఫెసర్ పంపాడు అని నాన్న తో చెప్పి, ల్యాబ్ లో చేరుతుందా అని అడగగానే, నాన్న చేరుతుంది అని సమాధానం ఇచ్చినప్పుడు తాను అక్కడే ఉంది. కానీ కిరణ్ తనని చూడలేదు. వేద అతని తో స్నేహం చెయ్యాలని అనుకున్నది. అతని లోని రెస్పాన్సిబిలిటీ, కేర్ ఆమె ను ఆకర్షించింది. వేద కిరణ్ లోని ఏ శ్రద్ధను ను చూసి ఆకర్షణకు గురి అయ్యిందో, చివరకు ఆ శ్రద్ద తన పట్ల దక్కలేదు. వేద కిరణ్ దగ్గర నిర్లక్ష్యానికి గురి అయ్యింది. ప్రేమను ఆశించింది... ఆ ప్రేమ దొరకలేదు... నీ ప్రేమకు నేను అర్హురాలినే అని చెప్పాలని చూసింది... ప్చ్ .... ఎంత దగ్గర కావాలని ప్రయత్నిస్తే... అంతకు అంత దూరం అయిపొయింది.

అతను ఆ బంధానికి డోర్ ఓపెన్ చేస్తాడు, అంతలోనే ఆ తలుపులు మూసేస్తాడు. నిజానికి అతనికి కావాల్సింది బ్యాక్ డోర్ రిలేషన్షిప్. తనకుతానుగా నేను అందుబాట్లో నీకు ఉన్నాను అని చెప్తూ అంతలోనే నేను నీకు దొరకను అంటూ డ్రామా ఆడటం. ఆ రోజు వేద ఆలోచించింది... దుఃఖం తో ...ఇది ఎక్కడ మొదలు అయ్యింది... ముందు అతనిని తన ఇంటి దగ్గర చూసి... మంచివాడు స్నేహం చేద్దాం అని అట్ట్రాక్ట్ అయ్యింది... కానీ అది అతనికి తెలియదు... తరువాత అతను తనతో ఆట ను మొదలు పెట్టాడు... ముందు అతనే మొదలు పెట్టాడు.... అతను తనను యూనివర్సిటీ గేట్ దగ్గర కూర్చొని అట్ట్రాక్ట్ చేసాడు... బహుశా అందుకే తానూ అతనికి ఎదురు వెళ్ళింది... అతను గేమ్ ఆడాడు.... తరువాత గేమ్ కంటిన్యూ చేసాడు... అతనికి తనపై ఎటువంటి ప్రేమ లేదు అనుకోగానే గుండె పగిలింది. ఆమెకు పిచ్చి పట్టింది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది....ఆమెకు గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వచ్చాయి. వేద విశ్వవిద్యాలయం లోని పరిశోధన శాల లో చేరగానే...లాబ్ లో స్నేహితులు కిరణ్ తో అన్నారు..."నీకు జూనియర్ వచ్చింది కదా...మరి మాకు పార్టీ...ఎప్పుడు?". వేద ని చూస్తూ కిరణ్ అనుకున్నాడు "ఎందుకో ఎంత చూసినా ఈ అమ్మాయిని ని ఇంకా చూడాలనిపిస్తుంది. బహుశా దీన్ని ప్రేమ అంటారేమో?". కిరణ్ తన స్నేహితులతో పందెం కాసాడు..."ఒరే నేను ఈ అమ్మాయిని పడేస్తాను. పందెం అన్నాడు". అతనికి చిన్నప్పటినుండి ఎవరైనా మంచి వాళ్ళని చూస్తే వాళ్ళ మోరల్ వాల్యూస్ ని, ఎథిక్స్ ని దెబ్బ తీయాలి అని అనిపిస్తుంది. తాను ఎంతో మంచివాడు అని... వాళ్ళు చాలా చెడ్డ వాళ్ళు అని ప్రపంచానికి చూపాలి అని అనిపిస్తుంది. వాళ్ళని లొంగదీయాలి అని అనిపిస్తుంది.

ఎందుకో కిరణ్ కి వేద ను చూడగానే ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అని అనిపించింది. ఈర్ష భగ్గుమంది. ఈ అమ్మాయి ఏదో ఆకర్షణ తో ఉంది. ఈ అమ్మాయి ని ఓడించాలి. ప్రేమ లో పడెయ్యాలి, ఏడిపించాలి అని అనిపించింది. ఈ ఆట లో వేదకు ఒక్కటి అర్థం అయ్యింది.... మంచితనం ప్రపంచానికి చూపకూడదు అని. అప్పటికే వేద కు పెళ్లి చెయ్యాలి అని ఇంట్లో సంబంధాలు వెతుకుతున్నారు. కిరణ్ ఆటను మొదలుపెట్టాడు. కిరణ్ అన్నాడు వేద తో "నేను చాలా అల్లరి చేస్తాను.....వేంటనే వేద "నేను కూడా బాగా అల్లరి చేస్తాను " అన్నది అతని స్నేహం కోసం. కిరణ్ వెంటనే " మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తామో చూద్దామా ? పందెం " అన్నప్పుడు, వేద "సరేనని" తల ఊపింది వేద. ఆ క్షణం పందెం అన్నది ఎంత దూరం పోబోతుందో ఇద్దరికీ తెలియలేదు. పిచ్చి వేద కిరణ్ ట్రాప్ లో పడిపోయింది. మనస్సు ఎంతో మందిని ప్రేమిస్తుంది. కానీ ఏది నిలబడుతుంది అన్నది తెలియదు. కానీ కిరణ్ కు తెలియని విషయం ఏమిటి అంటే... వేద అతని మీద ప్రేమతో తనకు తానుగా ఆ ట్రాప్ లో కి నడిచి వచ్చింది. కిరణ్ నేనే పడేసాను అని అనుకున్నాడు...పాపం పిచ్చోడు. వేద ఆ రోజు ఇంటి నుండి విశ్వవిద్యాలయానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నప్పటికే అనిపించింది...కిరణ్ తనను ఇష్టపడుతున్నాడా అని.....నిన్న పొద్దున్నే యూనివర్సిటీ ఫస్ట్ గేట్ కు ఎదురుగా ఉన్న ఫౌంటైన్ దగ్గర అతనిని చూసినట్లు గుర్తు వచ్చింది . ఎవ్వరి కోసం ఆ ఎదురు చూపులు అనుకున్నది. తన కోసం కాదు గదా అనుకున్నది. ఈ రోజు బస్ దిగగానే అటు చూసింది. యూనివర్సిటీ లో అమ్మాయిల హాస్టల్ దగ్గర ఉన్న గేట్ కి ఎదురుగా ఉన్న ఫౌంటైన్ దగ్గర కూర్చొని కిరణ్ తనని చూస్తూ.....అతను ఆమెను అలాగే పొడిచి పొడిచి చూస్తూ. ఆ చూపులో ... రొమాంటిసిజం... ప్రొద్దు తిరుగుడు పువ్వు సూర్యుని వైపు ఆకర్షించబడినట్లు, అతని వైపు ఆకర్షించబడింది ... ఆమెకు సిగ్గు ముంచుకు వచ్చింది. నవ్వుకుంటూ ల్యాబ్ కి వెళ్ళగానే సరళ ఎదురు వచ్చింది సరళ తో చెప్పింది.... "కిరణ్ గేట్ దగ్గర ఉన్నాడు" అని... సరళ నిశ్శబ్దంగా ఊ.... అని ఊరుకున్నది. సరళ కు అది గేమ్ అని నిజం తెలిసినా వేద కు చెప్పలేదు... వేద ఆలోచిస్తూ అనుకున్నది " కిరణ్ ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు.... తన కోసమా.... వేరెవ్వరి కోసమా? My dear friend moulded with love and care..... వేద అతనికి పడిపోయింది. అంటే ట్రాప్ లో తనకు తానుగా అడుగు పెట్టింది. "The most exciting attractions are between two opposites that never meet". ఇంతవరకు మౌన ముగ్దలా ఉన్న వేద.... కిరణ్ ని చూడగానే మాటల ప్రవాహం అయిపోయింది. అతని కోసం మాట్లాడటం మొదలు పెట్టింది. తొందరలోనే కిరణ్ మిత్రుడు అయ్యాడు.అతను ఆ అమ్మాయి చూపుల వల లో నుంచి తప్పించుకోలేక ఆ వలలో చిక్కుకుపోయాడు. సీనియర్ తనీష్ ... ఒక రోజు వేద వైపు చూసి...నీ లాగా ఎవ్వరు ఉండరు వేద అంటూ...i like you అనగానే వేద వెంటనే థాంక్స్ అంది. పక్కనే ఉన్న సరళ వెంటనే నోరెళ్ళబెట్టి అబ్బా అంది. వెంటనే కిరణ్ చెవులు కొరికింది... "ఈ పిల్ల వేదం కు చాలా పెద్ద కొమ్ములు ఉన్నాయి.... చిన్న పెద్ద అని చూడట్లేదు... చాలా గర్వం... సీనియర్ అని ఎవరికి గౌరవం ఇవ్వట్లేదు" అన్నది. "నువ్వు చూసావో లేదో... పక్క ల్యాబ్... నిరంజన్ ఈమె కోసం వచ్చాడు... కొంచెం లూస్ క్యారెక్టర్ లాగా ఉన్నది... ఆడ వాళ్ళ కాలేజీ లో చదివారు అంటేనే... బాగా అబ్బాయిల తో రాచకార్యాలు నెరిపే ఉంటుంది. నువ్వు ఎందుకు ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అన్నది". కిరణ్... సరళ వైపు చూసి... "ఆబ్బె... నాకేమి ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆ పిల్ల కొవ్వు దించాలి అని అనిపించింది . భలే స్టైల్ కొడుతూ ఉంది.... అంతే ...లవ్వు గివ్వు నాకేమి లేవు అన్నాడు". కిరణ్ పొట్టి సైకిల్ పై వచ్చి వేద ని చూసి ఆగినప్పుడు కిరణ్ ని చూస్తూ వేద "నువ్వు పొట్టి... నీ సైకిల్ కూడా పొట్టి" అని సైగ చేసింది. వెంటనే కిరణ్ వేద ని చూసి "అబ్బో నువ్వు ఇంత లావు" అంటూ సైగ చేసి కోపంగా తరగతి గది లోకి వెళ్ళిపోయాడు. అక్కడే కాలేజీలో చదువుతున్న అల్లరి పద్మిని కిరణ్ వాచ్ పుస్తకాల వెనక దాచిపెట్టి వేదతో చెప్పొద్దూ అనగానే అలాగే అని తల ఊపింది. ఆ క్షణం అల్లరి పద్మిని కళ్ళల్లో అతని మీద ప్రేమ. కిరణ్ వచ్చి వెతుక్కుంటూ వేద వైపు చూసి నీవు దాచావా అని అడగగానే వేద లేదు అని తల ఊపింది అమాయకంగా. కిరణ్ వెతుక్కుంటూ పుస్తకాల వెనక చూసినప్పుడు వాచ్ కనిపించగానే వేద వైపు చూసి తల ఊపి వెళ్ళిపోయాడు. వేద ...కిరణ్ ని అల్లరి చేసాను అని నవ్వుకున్నది. కానీ సరళ, కిరణ్, గోపాల్... వాళ్ళు నవ్వుకుంటూ... సరళ కిరణ్ తో అన్నది .... "మీ వేద గేమ్ ఆడుతోంది...నీతో అంటూ...ఆమె ఒక మగరాయుడు" అని నవ్వుకున్నారు. వేద కిరణ్ తో మాట్లాడుతూ "మీరెంతమంది" అని అడిగింది... "నాకు ఒక తమ్ముడు...ఒక చెల్లి ..అంటూ తమ్ముడి పేరు నరేంద్ర...చెల్లి పేరు శుభ" అని కిరణ్ అనగానే... వేద "భలే మంచి పేర్లు పెట్టారు మీకు అందరికీ అన్నది"... వేద మొహం లో అడ్మిరేషన్... ఎందుకంటే నరేంద్ర అన్న పేరు వినగానే వేద కు స్వామి వివేకానంద గుర్తుకు వచ్చారు. నిజానికి చిన్నతనం లోనే వేద సూటిగా కొట్టినట్లు మాట్లాడటం అలవాటు చేసుకున్నది...అప్పుడు తన వైపు ఎవ్వరు చూడరు కదా. తన దగ్గరకు ఎవ్వరు రారు. మనస్సులో ఒక్కటి బయటకు ఒక్కటి మాట్లాడకూడదు అనుకున్నది. ఎందుకంటే వేద ... ఎనిమిది తరగతి చదువుతున్నప్పుడు...తిరుమల లోని తుంబురు తీర్థం కు వెళ్ళినప్ప్పుడు...తీర్థం లో స్నానం చేసేటప్పుడు...... ఒకడు తన చెస్ట్ గట్టిగా ప్రెస్ చేసాడు. వెంటనే వేద భయం తో కెవ్వున కేక వెయ్యగానే... పక్కకు వెళ్ళిపోయాడు. కానీ అమ్మ ... "గట్టిగా అరిస్తే తన పరువు పోయింది"... అని పది రోజులు వేద ను తిట్టింది. అది వేద మనస్సులో బలంగా నాటుకు పొయ్యింది. ఆమె నిజానికి ఎప్పుడూ మగ పిల్లల వైపు చూసేది కాదు. స్నేహంగా మాత్రమే మాట్లాడేది.కానీ కిరణ్ తో స్నేహం కోసం ఆ రూల్ పక్కన పెట్టేసి గల గలా మాట్లాడటం మొదలు పెట్టింది. పాముకు పాలు పోస్తే కాటేయక మానుతుందా. కిరణ్ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నప్పుడు... వేద కిరణ్ వైపు చూసి బుద్దావతారం...అనుకున్నది. కానీ వేద కు తెలియని విషయం ఏమిటి అంటే... అతను ఆమెను స్టడీ చేస్తున్నాడు... ఈమె తనకు పనికి వస్తుందా అని... ఎమోషనల్ కనెక్టివిటీ కోసం. అతను ఆమె మనస్సు తో ఆడుకోవడం మొదలు పెట్టాడు అని ఆ తింగర బుచ్చికి అర్థం కాలేదు. అతను తన పని తానూ చేసుకుంటూ దాగుడు మూతలు ఆడుతూ ఆమె మనస్సు లోకి దూరాడు. ఆమెను అతను బాగా అర్థం చేసుకున్నాడు ఎందుకంటే... ఆమె బ్రెయిన్ ను స్టడీ చేసాడు... ఆమెను మాటల్లో పెట్టి.... ఆమెను మాయ చేయాలి కదా. అతనికి కాగ్నిటివ్ పవర్ చాలా ఉంది. అది ఎంతవరకు అంటే తన స్వలాభం చూసుకునే వరకు మాత్రమే. అతని హృదయం ఖాళీ అని చాలా రోజులకు వేద కు అర్థం అయ్యింది. కిరణ్ తో అన్నది..."అరే అలా సైలెంట్ గా ఉంటే ఎలా... నీలో నీవే ఆలోచించుకుంటూ...నవ్వుతూ ఉండాలి కానీ" అనగానే కిరణ్ వేద వైపు చూసి ఊరుకున్నాడు. ల్యాబ్ లో అందరి తో వేద నవ్వుతూ మాట్లాడుతూ తిరుగుతున్నప్పుడు ....కిరణ్ వేద ని చూసి "అమ్మ వజ ఎక్కువ పోసినట్టు ఉంది...తెగ వాగుడు" అనుకున్నాడు. ఏదో ఆకర్షణ వేద ఎంత వద్దనుకున్నా కాదనుకున్న తన మనస్సు కిరణ్ వైపు లాగేస్తోంది. అతను ఎటు వైపు పోతే అటు వైపు పోయేది. ఈ అట్రాక్షన్ ను ఆపడానికి శాయశక్తులా ప్రయత్నించసాగింది. ఆకర్షణ ను అంతం చేయాలి అంటే దానికి ఎదురు వెళ్ళాలి అనుకున్నది. పరిచయం అయ్యిన పది రోజుల లోనే ఒకరి గురించి ఒకరికి తెలియక ముందే విర్ల్ విండ్ రొమాన్స్ మొదలయ్యింది. కిరణ్ బయటకు చెప్పక పోయినా ... ఆమెను చూసిన రోజే అతను ఆమె తనది అని ఫిక్స్ అయ్యాడు....కానీ as victim not as partner. అతనికి ఇద్దరు కావాలి... లేదా ఇంకా ఎక్కువ మంది కావాలి.... ఒకరు పనికిరాకపోతే మరొకరు. కిరణ్ ని చూడగానే ఎందుకో ఆట పట్టించాలని అనిపించింది వేద కు. రొమాంటిక్ అట్రాక్షన్ ... ఆపుకోలేని అలజడి అతనిని చూడగానే ! అతనే తన రారాజు అని ఫిక్స్ అయ్యింది. ఆ అలజడి స్నేహం చేస్తే తగ్గిపోతుంది అని వేద అతనితో స్నేహం చేసింది. అప్పటి వరకు అమ్మాయిల కాలేజీలో చదివిన వేద , అప్పుడప్పుడే లోకాన్ని దగ్గరగా చూస్తున్న వేద , యూనివర్సిటీ లో అడుగు పెట్టగానే, ఎందుకో అది ఒక రంగుల ప్రపంచం లా కనిపించింది. అందులో తాను ఒక సీతాకోక చిలుక అయ్యింది.ఒక ఉత్సాహం (excitement) వేద లో.... ఆ ఉత్సాహం ప్రేరేపకం అయ్యింది. వేద ప్రేమలో పడేలా చేసింది. ఆ రోజు లాబ్ కి వెళ్ళగానే కిరణ్ కనిపించలేదు.

మూగబోయిన మనసును ఊరడించలేక... వేద సరళ వైపు చూసి "కిరణ్ సార్ రాలేదా ఇంకా " అని అడిగింది. సరళ వేద వైపు చూసి "వచ్చాడు...లైబ్రరీ కి వెళ్ళాడు" అని చెప్పింది. వేద లైబ్రరీ కి వెళ్ళింది కిరణ్ ని వెతుక్కుంటూ...ఆ గదిలో చూసింది ...కనిపించలేదు. ఇంకో గదిలో చూసి అలా లైబ్రరీ లో వెతుక్కుంటూ వెళ్ళింది ...అక్కడ కనిపించాడు...కిరణ్ పరిశోధన ఆర్టికల్స్ చదువుతూ ఉండగా చూసి అతని దగ్గరకు వెళ్ళింది. కిరణ్ ని చూడగానే వేద మనస్సు పురివిప్పిన నెమలి అయ్యింది... వేద ను చూడగానే కిరణ్ అన్నాడు "చూసావా ఈ పరిశోధన ఎంత అద్భుతంగా ఉంది". కిరణ్ వైపు చూసి ఏమి మాట్లాడాలో తెలియక... వేద వెంటనే అనింది "అయితే ఏమి చెయ్య మంటావు". కిరణ్ మనస్సు మూగబోయింది. ఆ క్షణం కిరణ్ కు తెలియని విషయం ఏమిటి అంటే... వేద తనను వెతుక్కుంటూ అక్కడకు వచ్చింది అన్నది. కానీ వేద రూపం కిరణ్ మనస్సులో ముద్ర పడిపోయింది. ఇద్దరి మధ్య రగులుతున్న అగ్ని జ్వాలలు...తట్టుకోలేక ...కిరణ్ విరహపు బాధ తో గడ్డం పెంచి బ్లాక్ షర్ట్ బ్లాక్ ఫాంట్ వేసుకొని దిగులుగా ఉండటం చూసి.... గోపాల్ అన్నాడు...కిరణ్ తో "ఏరా ఎవ్వరి మీద అయినా సమ్మె చేస్తున్నావా" ...కిరణ్ చూపులు వేద వైపు చూస్తూ.... నవ్వి పెదవులు చప్పరిస్తూ ఊరుకున్నాడు. కిరణ్ మౌనంగా వేద ని గమనించసాగాడు. కిరణ్ కి ఎక్కడ చూసినా వేద కన్పిస్తున్నది. పుస్తకం తీసినా మూసినా వేద కన్పిస్తున్నది. ఏమి చదవలేక పోతున్నాను ఈ అమ్మడు కన్పించిన తరువాత అనుకుంటూ దుండు పై తల వాల్చి ఆ అమ్మాయి తో కలలో తెగ కబుర్లు చెప్తున్నాడు. వేద గమనించి గమనించనట్టు నిశ్శబ్దంగా ...మనస్సులో అనుకున్నది "మీరు కుర్రాళ్ళు ...మమ్మల్ని ఊహించుకుని అతిగా ఆశ పడుతున్నారు". తరువాత ఒక రోజు కిరణ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు...వేద తన స్నేహితురాలు తో కలిసి వెళ్ళింది. అతని కోసం చూస్తే...ఈ పక్క రూట్ లో రాలేదు...సరే అటు పక్క రూట్ లో వెల్లింది... అక్కడ కనిపించాడు. అతని వైపు చూసి నవ్వుతూ మాట్లాడించింది...అతను ఆమెను అలాగే చూసి తల దించుకుని వెళ్లి పోయాడు...... అలా అతని కోసం లైబ్రరీ కి వెళ్ళింది...ఆడిటోరియం దగ్గర కూడా వెతుక్కుంటూ వెళ్ళింది...ఇవి ఉండవు... పోతాయి...బాధ పెట్టవు..హృదయం లో తియ్యని ప్రేమను పుట్టిస్తాయి...కానీ ఇవి ఏవి కిరణ్ కు తెలియవు. వేద ఏదో పని మీద తనకు ఎదురు వచ్చింది అనుకున్నాడు. కానీ ఆమె ముద్ర అతని హృదయం లో పడిపోయింది. ఆ రోజులలోనే సరళ.. వేద తో అన్నది... "కిరణ్ కి పెళ్లి కుదిరింది. అతను కూడా ఒప్పుకున్నాడు" అని చెప్పింది. వెంటనే ఆ రోజు వేద కిరణ్ ని అడిగింది..."నీకు పెళ్ళి అని చెప్పింది సరళ మేడం". కిరణ్ వేద వైపు చూస్తూ "అవును" అన్నాడు. " పెళ్లికి ఒప్పుకున్నావా"....అన్నది. ...." హా ఒప్పుకున్నాను " అనగానే వేద అన్నది "ఎవరు ఆ అమ్మాయి" . కిరణ్ అన్నాడు వేదతో "నా అత్త కూతురు. చిన్నప్పుడే నాకు నా మరదలితో పెళ్లి కుదిరింది. మా నాన్న మా అత్తకి మాట ఇచ్చాడు " అని కిరణ్ చెప్పాడు. వెంటనే అడిగింది కిరణ్ ని "పెళ్లి చేసుకోవాలా". ... " చేసుకోవాలి" అని అన్నాడు వేద వైపు చూస్తూ. వేద అన్నది "కట్నం".... కిరణ్ వేద కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు...."తీసుకోను". "ఆ అమ్మాయికి ఎంత వయస్సు " అని వేద అడగగానే "నాకంటే ఒక సంవత్సరం చిన్న" అన్నాడు. ఏమి చదువుకున్నది అనగానే... పది అయ్యింది అన్నాడు. మనస్సులో వేద అయోమయానికి గురి అయ్యింది. ప్రేమ నాటకానికి రతెర తీసింది అతనే. కానీ అప్పుడే పెళ్లి అంటున్నాడు అనుకున్నది. "కిరణ్ మంచివాడే", కట్నం తీసుకోకుండా చదువు లేని అమ్మాయిని తన తండ్రి మాట ఇచ్చాడని పెండ్లి చేసుకుంటున్నాడు అనుకున్నది. వేద తన గేమ్ ఆపేసింది . పెళ్ళి కాబోతున్న వానితో గేమ్ ఏమిటి అనుకున్నది. అతనే తన మనస్సుని తెరిచి ఆమెను ఆహ్వానించి అంతలోనే అతను తన మనస్సు తలుపులను ముసివేశాడు. వేరొకరికి ప్రామిస్ చేయబడ్డప్పుడు తాను కోరుకోవడం తప్పు అనుకున్నది. ఆ క్షణం వేద కు అర్థం కాలేదు...కిరణ్ మాటలతో మోసం చేసాడని అని...అది తన జీవితాన్ని కాల్చేయబోతుంది అని...ఆమె మెదడు లో కన్ఫ్యూషన్ పుట్టించాలి . అతనికి అదే కావాలి, ప్రశాంతమైన బంధం లో అతనికి ఇష్టం, ప్రేమ కనిపించవు. ఆమె పెళ్లి గురించి అడిగిన రోజే అతనికి తెలుసు... ఆమె తనను ఇష్టపడుతోంది అని.. కానీ మనస్సు తో ఆడుకునే వానికి మనస్సు లేదు. అతను ఆడపిల్లలను హరాస్ చేస్తూ వాళ్ళను హర్ట్ చేస్తూ ఆనందం పొందుతాడు. ఆ క్షణమే వేద...ఇతనికి పెళ్ళి కాబోతుంటే తాను ఎందుకు ఇతని పట్ల ఆకర్షణకు గురి అవుతున్నది అనుకున్నది. ఊహ చాలా ప్రమాదంగా మారిపోయింది. కానీ అతని కోసం వేద రెండు సార్లు.... ఒకటి లైబ్రరీ కి వెళ్ళింది....రెండు ఆడిటోరియం దగ్గరకు వెళ్ళింది. అతను తనకు పెళ్ళి అని చెప్పగానే వేద ఇక తన ఆటను ఆపేసింది. కానీ ఆమె తన కోసం వచ్చింది అని అతనికి తెలియదు. ఆమె గేమ్ ఆడింది తనలాగే అనుకున్నాడు. తరువాత స్నేహ పూర్వకమైన ప్రేమతో ఉంది. తనకు అతను వద్దు అనుకున్నది. కానీ... ప్రేమ పుట్టాక చావదు కదా??? ఆమె తన మనస్సును అణచుకున్నది.

ఇతను తనను చూసి చూసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు... కొన్ని రోజులు చూసి చూసి పోతాడు అని అనుకున్నది వేద . కిరణ్ వేద తో అన్నాడు.."మేడం తో నే ఉంటావు కదా"..అనగానే వేద ఉంటాను అని తల వూపింది. సరళ ఒక్కటే ఉన్నప్పుడు ఆమె తో నే ఉండేది. లాబ్ అయ్యాక ఇద్దరు కలసి ఇంటికి వెళ్ళేవారు. వేద అనుకున్నది..... వెనుక నుండి ప్రయత్నిద్దాము... ఎందుకంటే...కిరణ్ పిరికివాడు అని అర్థం అయ్యింది. కిరణ్ కు సరళ కు మధ్య అనుభందం ఉంది. అవసరం అయితే ఆమె ద్వారా ప్రయత్నిద్దాము అనుకున్నది. ఆమె తో ఎంతో స్నేహం గా ఉంది. ఒకవైపు కిరణ్ తనకు పెళ్లి కుదిరింది అని చెప్తూనే మరొక వైపు వేద మీద ప్రేమ కురిపించసాగాడు. అతను తన ఆటను ఆపలేదు. ఆమెను అరౌస్ చెయ్యడానికి ఆమె వీక్నెస్ కనుక్కున్నాడు. అది సెక్స్. అవును అమ్మాయిలు సెక్స్ అంటే భయపడతారు.... ఎందుకంటే వారికి మోరల్ అన్నది ఉన్నప్పుడు, పెళ్లి కాకుండా సెక్స్ ఏమిటి అనుకుంటారు. అతనికి ఆమెతో రిలేషన్ అవసరం లేదు. ఆమె తనకు తానుగా అతని ప్రేమను పొందడానికి పోటీ పడాలి. అంటే ఆమె తనను అతనికి అర్పించుపోవాలి. అప్పుడు అతను ఆమె తనకు పనికి వస్తుందా లేదా అని టెస్ట్ చేసి పనికిరాకపోతే వదిలేస్తాడు. వేద ఎంతో చురుకుగా ఉన్నా ఎప్పుడు హద్దు మీరలేదు...వెరీ స్ట్రిక్ట్. ఇంతలో వేద సరళ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పింది తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఒక సంబంధం కుదిరినట్టే ఉంది అన్నది. వెంటనే సరళ అందరికీ చెప్పింది తొందరలోనే వేద కు పెళ్లి అని. కిరణ్ వేదని అడిగాడు "ఆ అబ్బాయి ఏమి చేస్తుంటాడు ". వేద తల వంచుకుని చెప్పింది "బ్యాంకు లో" పనిచేస్తుంటాడు. కిరణ్ వేద ని ఆట పట్టిస్తూ ఆ అబ్బాయి పేరు వేద పేరు ముందు చేర్చగానే వేద కిరణ్ తో అన్నది " అలా చెప్పకు". కిరణ్ అడిగాడు వెంటనే..."ఏమి". ...."నాకు ఇష్టం లేదు" అన్నది వేద. ......"ఓహ్ వేద కు ఇష్టం లేదా?" అని కిరణ్ అనుకున్నాడు. కానీ నిజానికి పెళ్లి కాకుండా ఆ విధంగా సంబంధం అంటగట్టడం అన్నది వేదకు నచ్చలేదు. ఒక రోజు వేద ప్రిన్సిపాల్ ఆఫీస్ కి వెళ్లి శాలరీ స్లిప్ మీద సంతకం తీసుకుని వచ్చేటప్పటికి... సరళ వేద వైపు చూసి... కోపంగా.... "మేము ఎప్పుడు ఇలా మాటలు పడలేదు... నువ్వు మాకు చెడ్డ పేరు తెస్తున్నావు... నీలాంటి దానిని ఎక్కడా చూడలేదు"... అని నోటికి వచ్చినట్లు మాట్లాడింది... వేద దుఃఖాన్ని అదుపులో ఉంచుకుని భాధతో మౌనంగా ఉంది....చివరకు స్వతంత్రంగా ఉండడం కూడా తప్పుగా కనిపిస్తున్నది ఈమెకు అనుకున్నది. ఈమె కు నాకు చాలా అంతరం ఉంది...అనుకున్నది. వేద కు అప్పటి వరకు ఎదిరించడం అన్నది రాదు. అందరూ తన వాళ్ళే అనుకున్నది.

కిరణ్ వేద వచ్చేది చూసీ చూడనట్లు చూస్తూ వేద ని దాటి వెళ్ళగానే వేద కిరణ్ ని వెనక్కి తిరిగి చూడగానే కిరణ్ కూడా వేద ని వెనక్కి తిరిగి చూస్తూ .... ఇద్దరూ ఒక క్షణం ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు....ఇది ఆకర్షణ కాక మరేమిటి? యుక్త వయస్సులోని ఆకర్షణ ! ఆ రోజు వేద ....జడలో ఎర్రటి రోజా పువ్వు పెట్టుకుని వచ్చింది. ఆమెను చూసి కిరణ్ అనుకున్నాడు. ...ఈ రోజు వేద చాలా అందంగా ఉంది.... వేద వైపు చూసి అన్నాడు "తలలో రోజా చెట్టు పెట్టుకుని రావాల్సింది"..వేద నవ్వుతూ ఊరుకున్నది. వెంటనే "నువ్వు సిగరెట్ కాలుస్తావా? అంటూ నీ పెదాలు ఎందుకు నల్లగా ఉన్నాయి" అన్నాడు...వేద కు అతని మీద కోపం తెచ్చుకుందాం అన్నా కోపం రావడం లేదు...... అబ్యూస్ .... వేద నవ్వుతూ అతనిని చూస్తూ ఉన్నది. అబ్యూస్ కూడా ప్రేమ లా కనబడుతూ ఉంది వేద కు. కిరణ్ తో తన కజిన్ ఇక్కడే పని చేస్తున్నాడు అని చెప్పింది... ఎక్కడా అని అడిగి కనుక్కుని... చివరకు అది కూడా ఆమెకు వ్యతిరేకంగా వాడుకున్నాడు. వాళ్లు అంటే వేద కజిన్ యూనివర్సిటీ వీసీ కి బంధువులు... చాలా బాగున్నారు... అని అందరికి కథలు చెప్పి తప్పించుకున్నాడు. వేద వైపు చూసి కిరణ్ "వేద...నువ్వు మేడం తో నే ఉంటావు కదా అనగానే ...ఉంటాను అని తల వూపింది వేద... సరళ పని పూర్తవ్వగానే...లాబ్ కు తాళం వేసుకుని, ఆమె తో కలిసి నాలుగు కాళ్ళ మండపం వరకు వచ్చి, తరువాత ఆమె అటు తన ఇంటి వైపు వెళితే, వేద తన ఇంటి కి వెళ్ళేది. అలా ఎన్నో రోజులు...సరళ తో కలిసి ఇంటికి వెళ్ళింది. ఆమెతో ఎంతో మంచిగా ఉండడానికి చూసింది. "సర్వేశ్వరుడు సర్వాంతర్యామి" అని నమ్మే నీల... సరళ ఇంట్లో తులసి కోట చుట్టూ కూడా తిరిగింది. కిరణ్ ఏమో తనకు పెళ్ళి అంటున్నాడు. తను ఏమో అతనిని ఇష్ట పడుతున్నది. ఆమె కు అతని మీద ప్రేమ ఉన్నది... అతనితో పెళ్లి కోరుకుంటున్నది కానీ అతను ఆమెతో ఎఫైర్ కావాలని అనుకుంటున్నాడు. వేద కిరణ్ పక్కనే కూర్చుని చీమ తో ఆడుకోవడం మొదలు పెట్టింది ....అతను ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు. ....మరి అతనికి ముద్దుగా కనిపించాలి కదా...ఎందుకంటే కిరణ్ అంటే ఇష్టం వేదకు... అతను తనకు ఒక ప్రియమైన స్నేహితుడు. కిరణ్ ప్రొఫెసర్ కేటీఆర్ చైర్ లో కూర్చుని వేద వైపు చూసి అన్నాడు..."ఎప్పటికైనా నేను ఇక్కడ కూర్చోవాలి" అలా అని అంటూ ఉన్నప్పుడు వేద అతని వైపు స్నేహ పూర్వకంగా ప్రేమగా చూస్తూ ఉన్నది...అది అతనికి గుర్తు ఉందో లేదో కానీ వేద కు...... గుర్తు ఉంది... కిరణ్ ... వేద పక్క పక్కన కూర్చొని ఉండడం ... కిరణ్ ఆమెని తాకాలని తాకాడు. ఆమె కాలి బొటన వేలుని తొక్కాడు. వెంటనే వేద తన కాలును వెనక్కి తీసుకుంది. ఆమెలో ఆక్సిటోసిన్ పుట్టింది. అది ఆమెను అరౌజ్ చేసింది. అది ఆమెకు అతని మీద ప్రేమను పుట్టించింది. అతనే తన సోల్ మట్ అనుకున్నది ఆమె. But, its a trap. ఆమె అతనితో కాలు దూరంగా పెట్టు... నేను నడవాలి కదా అన్నది. ఆమె తో ... "వేరొకరి తో ఆమెకు అనుభందం ఉందా"... అని ప్రశ్నించాడు. సెక్స్ టాక్ చేస్తూ... ఆమె కాలు తొక్కి ఆమెను అరౌసే చేసాడు. ఆమెను తనకు అటాచ్ అయ్యేలా చూసుకున్నాడు. ఆమె తనకు తెలియకుండా అతని ట్రాప్ లో మునిగిపోయింది. ఒక రోజు కిరణ్ వేద వైపు చూసి అన్నాడు.... "ఊరెళ్తున్నాను". వేద కిరణ్ తో అన్నది..... "మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు"...అలా అడగడం లో ఏదో దిగులు. కిరణ్ వేద వైపు చూసి చెప్పాడు " రెండు రోజుల లో వచ్చేస్తాను". వేద సరళ తో అన్నది...."కిరణ్ సార్ ఈ రోజు వస్తాను అన్నారు...రాలేదా" అని అడిగింది... సరళ అన్నది "అప్పుడేనా....ఒక్కసారి ఊరికి పోతే వారం రాడు" అంటూ ఉంది .... కానీ అంతలోనే లో....వేద కు కిరణ్ వస్తున్నట్లు అనిపించి వెను తిరిగి చూసింది....కిరణ్ కనిపించాడు...వేద కళ్ళు కిరణ్ ను చూడగానే విచ్చుకున్నాయి అప్పుడు చూసాడు కిరణ్.....వేద కళ్ళల్లో.... వేద కు అతని మీద ఉన్న ప్రేమ....కొద్ది రోజుల్లోనే ఇద్దరికీ అర్థమైంది. తమ మధ్య ఒక భావోద్వేగ మానసిక బంధం ఏర్పడింది అని...బహుశా అదే ప్రేమ?...ఏమో? కిరణ్ ఆ రోజు వేదను పిలుస్తూ " వేద అది తీసుకురా ...ఇది తీసుకురా .......అంటూ ఉంటే...అనుకున్నది..ఓహో ఇతను వ్యామోహం అదే infatuation లో ఉన్నాడు...కొంచెం హెల్ప్ చేస్తే తగ్గిపోతుంది అనుకున్నది.....ఎలాగూ పెళ్ళి అంటున్నాడు...ప్రేమను చూపిస్తే ఏమి పోతుంది"...అనుకున్నది. అది కాకుండా అతను వేదకు సీనియర్...అతను పరిశోధన చేస్తున్నప్పుడు సహాయము చేయడం తప్పనిసరి... అదొక మత్తు లో ఎవ్వరినీ పట్టించుకోక ఒకరి వ్యామోహం లో ఇంకొకరు పడిపోయారు.వేద అతని లవ్ బాంబింగ్ కి పడిపోయింది. అప్పటికే వేదకు పెళ్ళి చూపులు జరిగాయి...మాటలు అనుకున్నారు...కాన్సల్ కూడా అయ్యింది further talks ....కానీ అతనికి చెప్పలేదు....వేద అతను అడిగినవి నవ్వుతూ తెచ్చి ఇచ్చింది... వేద ఎప్పుడు మాటల తో మనిషి ని దూరంగా పెట్టేది తన దగ్గరకు రాకుండా. కానీ వీడి తో స్నేహం కోసం గలగల నవ్వూతూ మాట్లాడింది. ఆఖరకు అలా నవ్వుతూ ఉండటం... సంతోషంగా ఉండటం కూడా గిట్టని వాళ్ళు ఉంటారు... సరళ లో ఏదో hatred చూసింది... సరళ సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చింది..వేద తో చాలా రోజుల వరకు మాట్లాడడం మానేసింది. ఒక పక్క అగ్ని లా వేద హృదయం కాలుతూ .... లావా లా పొంగుతున్న ఫీలింగ్స్... వాటిని అణగదొక్కుతూ... వేద .... ఒక రోజు కిరణ్ వర్షం పడుతుండడం చూసి వేద తో "గొడుగు తీసుకుని వెళ్లి సరళ ను లైబ్రరీ నుండి తీసుకుని రా వేద. నేను చెప్పగా నీవు వచ్చినట్లు సరళ తో చెప్పొద్దు. నీకుగా నువ్వు వచ్చినట్లు చెప్పు" అన్నాడు. ఆమెను మంచి చేసుకో అని చెప్పక చెప్పాడు నీలతో . వేద సరేనని సరళ ని తీసుకుని రాగా ...తిరిగి వచ్చిన వెంటనే "వేద నువ్వే వచ్చావా నా కోసం " అనగానే వేద వెంటనే "లేదు కిరణ్ పంపితే వచ్చాను' అంటూ కిరణ్ వైపు చూసినప్పుడు కిరణ్ ఏమనాలో తెలియక వేద వైపు చూసి... మనస్సులో అనుకున్నాడు "వేద కు నిజం చెప్పడం మాత్రమే వచ్చు". అక్కడ కిరణ్ ను వేద ఫిక్స్ చేసింది..కిరణ్ వేదను ఐడియలైజ్ చేసుకున్నాడు. వేద అనుకున్నది ..." సరళ మెప్పుదల కోసం నేను ఎందుకు అపద్దం చెప్పాలి...ఈమె అస్సలు మంచిది కాదు. కానీ వీడికి తెలియట్లేదు. ఈమె తమ ఇద్దరినీ విడదీయాలని అనుకుంటున్నది. వీడు ఉంటే ఉంటాడు పొతే... పోతాడు....పిశాచి లాంటి ఈమెను నేను ఎందుకు మంచి చేసుకోవాలి. ఒక్కసారి మేమిద్దరమూ ఒక్కటి కానీ అప్పుడు చెప్తా నీ కథ" అని అనుకున్నది మనస్సులో. రిలేషన్ షిప్ అంతా కన్ఫ్యూషన్ ... ముందుకు ఒక్క అడుగు అయితే... వెనక్కు నాలుగు అడుగులు. అంతా మనస్సులో దొంగాట. ఒక రోజు సరళ వేదని అడిగింది...""నీ పెళ్లి ఎప్పుడు". వేద అన్నది "కాన్సల్ అయ్యింది. మా నాన్నకు ఇష్టం లేదు". సరళ వైపు చూస్తూ చెప్పింది "ఈ విషయం కిరణ్ కు చెప్ప వద్దు". ఎందుకు చెప్పవద్దు అనింది అంటే.... కిరణ్ ఆమెకు పూర్తిగా అర్థం కాలేదు. సరళ సరేనని తల ఊపింది. అలా ఒకసారి చెప్పొద్దు అని సరళ ను అడగడం అన్నది చివరకు వేద కిరణ్ ను ఒకరికి ఒకరికి శాశ్వతంగా దూరం చేస్తుంది అని ఆ క్షణం వేద ఊహించలేదు ...it's a part of the game. గేమ్ మనము అడక్కర లేదు... మన చేత ఆ దేవుడు కూడా ఆడిస్తాడు... కిరణ్ తన స్నేహితులతో కలిసి కబుర్లు చెబుతూ వేద ను గమనించసాగాడు....ఆ పొట్టి పిల్ల నా అంటూ! పద్మిని అనే తమ జూనియర్ స్టూడెంట్ గురించి మాట్లాడుకుంటూ.... కిరణ్ వేదను చూస్తూ ఉన్నాడు. వేద కిరణ్ వైపు చూస్తూ ఉంది... ఆ చూపులో ప్రేమ భావము... "నేనందరి మద్యా ఉన్నప్పుడు కళ్ళెత్తి నెమ్మదిగా నిశితంగా చూస్తావ్........నీకేం తెలుసు?ఆ క్షణం నాలోచెలరేగే స్పందనల గురించి, నిశ్శబ్ద సంఘర్షణల గురించి? అకస్మాత్తుగా నిన్ను తప్ప అందర్ని మాయం చేసే శూన్యం గురించి...." కిరణ్ లో మరో కోణం.అమ్మాయిల మనస్సు లతో ఆడుకునే వెదవ బుద్ది కనిపించింది వేదకు. వేద మనస్సు విరిగిపోయింది. ఇతనికి ఎంత మంది కావాలి అని అనిపించింది. ఒక పక్క తనతో ఆడు మాటలు. ఇంకో పక్క అత్తా కూతురు తో పెళ్లి. చాలక ఇంకా ఏంతో మంది అమ్మాయిలు వీనికి అనుకున్నది. వేద ఆలోచిస్తున్నది "నా పెళ్లి రద్దు అయ్యింది. మరి కిరణ్ కి చిన్నప్పుడే పెళ్లి కుదిరింది అంటున్నాడు. మరి మేమిద్దరమూ ప్రేమలో ఉన్నాము. ఇప్పుడు కిరణ్ తనతో అనుభందం పెంచుకుంటే , అతను తన చిన్నతనం లోనే ఇంకొకరికి వాగ్దానం చేయబడినప్పుడు, తాను ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినట్లు కదా" . బల్బ్ వెలుగుతోంది....మళ్ళీ ఆరిపోతోంది...అంటే వేద ...అతనికి పెళ్లి అని దూరంగా పోతున్నది.......మళ్ళీ అతని ఆకర్షణ లో పడి అతనికి దగ్గరవుతున్నది. అంతే కాకుండా కిరణ్, సరళ ఇద్దరు డబ్బు మనుషులు అని వేద అనుకున్నది. ఆ రోజు తన రీసెర్చ్ పేపర్ లో సరళ పేరు ముందు రావడం చూసి వేద అనుకున్నది ఈమె మంచిది కాదు...మరి కిరణ్...వేదకు అర్థం కాలేదు....కిరణ్ ప్రతి దానికి సరళ మీద ఆధారపడటం చూసి... కిరణ్ కి సరళ కు మధ్య ఎమోషనల్ బాండ్ ఉన్నట్లు గమనించింది. ఆమెకు నీడలాగా ఎప్పుడు కిరణ్. అంటే ఇద్దరి మధ్య ప్రేమ. మరి తానూ???? అంటే తాను అతనికి సెక్స్ ఆబ్జెక్ట్.... అప్పటికే ల్యాబ్ లో ల్యాబ్ అటెండర్ నరహరి అందరికీ చెప్తున్నాడు... "కిరణ్ కు సరళకు అనుబంధం ఉంది... పొడుగుది పొట్టోడు అంటున్నాడు... రాత్రిళ్ళు లు ఇద్దరే ఉంటున్నారు ల్యాబ్ లో అని పుకార్లు" ...వాళ్ళు దానిని ఖండించడం లేదు...అని అనుకున్నది. కిరణ్ ఎటువంటి వాడో అనుకుని భయపడింది.మోహము... ప్రేమ రెండు ఒక్కటి కాదు కదా... అంతలో తమ మధ్య బంధం మరింత పెరిగింది గమనించి వేద అతనితో ఇక మాట్లాడకూడదు అనుకున్నది. అప్పటికే ఒక పక్క కిరణ్ వేద తో... తన కాబోయే భార్య సుజి గురించి చెబుతూ ఇంకో పక్క తమ జూనియర్ పద్మిని మీద ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు. వేద మనస్సులో అనుకున్నది..."ఇది ఏంటి...నేను ఇక్కడ లేని అమ్మాయితో పోటీ పడుతున్నాను. ఇతను తనను ట్రాప్ చేశాడా అనుకున్నది". వేదకు చాలా కోపం వచ్చింది కిరణ్ మీద....ఎందుకో తెలియదు? అది అలకా లేదా కోపమా???. ఏమి self respect ఉండకూడదా???. తమ మధ్య మాటలు ఆగిపోవడం తో కిరణ్ ప్రతి క్షణం వేద ని నిశ్శబ్దంగా గమనించడం మొదలు పెట్టాడు. బహుశా వేద దృష్టి లో అది కూడా ఆట. వేద చిన్న తనం లో తన స్నేహితురాలు మణి తో ఇలాగే మాట్లాడను అని అన్నప్పుడు ...ఇద్దరూ ఒకరి తో ఒకరు మాట్లాడకుండా తమ తమ స్నేహితులతో స్కూల్ నుండి తిరుమల గుడి చుట్టూ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు...వేదను చూసి మణి పాట పాడింది...."ఆహా ఆ నడక చూడు"...అంటూ.....అది ఆట అయినప్పుడు....ఇది కూడా ఆట అనుకున్నది. అతను తన స్నేహితుడే కదా అనుకున్నది. కానీ పాములా కాటేస్తాడు అనుకోలేదు. ఒక రోజు కిరణ్ వేద అలకతో ఉండేది చూసి "వేద మాట్లాడు నాతో" అనగానే వేద అడ్డంగా తల ఊపింది నీతో మాట్లాడను అని. వేద కిరణ్ తో మాట్లాడటం మానేసింది...కిరణ్ నాతో మాట్లాడు అన్నా...నో అన్నట్లు తను తల ఊపింది...వేద కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు....అతని తొందరపాటు....ఒక రోజు ....రెండు రోజులు చూసాడు కిరణ్. వేద నాతో మాట్లాడక పోతే ప్రాణం పోయినట్టు ఉంది. ఆకలి లేదు...ఏ పని చేయ బుద్ది కాలేదు....అనుకున్నాడు.వేద తప్పించుకుంటున్నది అని అనుకుని... కిరణ్ ఆలోచించి.....ఎలాగైనా వేద ని దక్కించుకోవాలని, ఏమి చెయ్యాలో తెలియక ఒకరోజు వేద పరిశోధన పని మీద ఉన్నప్పుడు అకస్మాత్తుగా వచ్చి ఉద్రేకంగా ...వేద చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. వేద ఏదో ఆలోచిస్తూ డోర్ హేండిల్ పట్టుకుని ఉన్నప్పుడు కిరణ్ రావడం చూసింది. కిరణ్ వచ్చి రాగానే డోర్ హేండిల్ మీద ఉన్న వేద చేతిని గట్టిగా పట్టుకున్నాడు.వేద వెంటనే ఎంతో అలజడి కి గురి అయ్యింది. పక్కనే ఉన్న సరళ ఏమి తెలియనట్లు నిశ్శబ్దంగా ..అయ్యో పసిపిల్ల అని కూడా లేదు... అటు చూస్తే అక్కడ ల్యాబ్ అటెండర్ నరహరి వీరిని గమనిస్తూ ఉన్నాడు.వేదకు ఎలా ఎదురు తిరగాలోఅర్థం కాలేదు.గట్టిగా అరిస్తే తనకు అవమానం కదా అని చాలా అలజడితో అనుకున్నది.అది కాకుండా ఆ లాబ్ లో ఎవరితో ఎవరు చనువుగా ఉన్నా పుకార్లు. మానం పోయాక బతకడం పనికి రాదు కదా ! అప్పటికే కిరణ్ మీద సరళ మీద పుకార్లు....ఇప్పుడు ఇక తన మీద కూడానా! భయం తో గడగడ లాడి పోయింది...విపరీతమయిన అలజడి తో వణికిపోయింది.... మొదటి సారి కిరణ్ తన చెయ్యి పట్టుకున్నప్పుడు, అది ఎటువంటి ప్రభావం చూపలేదు. ఎంతో మంది బస్సులో, ఆటోలలో మహిళల మీద చేతులు వేస్తూ ఉంటారు. మనలో మనం వారిని వెదవలు అనుకుంటూ దూరం జరుగుతూ ఉంటాము. తేలికగా తీసుకుంటాము. అలా ఆ సంఘటన వేద మనస్సులో నిలబడలేదు. కానీ అంత వరకు ఎవరు ఏ మగాడు వేదను తాకలేదు. కారణం పెంపకం. వేద చిన్న తనంలో తిరుమలలో పెరిగింది. ఆధ్యాత్మికంగా ఉన్న వాతావరణంలో ఎంతో స్వేచ్చగా పెరిగింది. తన స్నేహితుల ఇళ్లకు వెళుతూ ఉండేది. ఎంతో స్వచ్ఛంగా ఆడుతూ పాడుతూ పెరిగింది. ఎవరు ఎప్పుడు తప్పుగా తనతో ప్రవర్తించలేదు. కానీ కాలం ఎప్పుడు ఒక్కలా ఉండదు కదా. మరొక రోజు లాబ్ లో ఉన్నప్పుడు... కిరణ్ వేద మాత్రమే ఉన్నారు....వేద పూర్తిగా పరిశోధన లో మునిగి ఉంది...నీటిలో తన చెయ్యి ఉంచి పరిశోధన చేస్తూ ఉంది.... వేద ఆలోచనలతో ఉన్న కిరణ్ వేద దగ్గరకు నెమ్మదిగా వెళ్ళాడు ...వేద కు అత్యంత దగ్గరగా వచ్చి తన చేతిని చాలా బలం ఉపయోగించి ఉద్రేకంగా వేద చేతిని పట్టుకున్నాడు. అది కూడా వేద పరిశోధన ల్యాబ్ లో నీటిలో తన చెయ్యి ఉంచి పని చేసుకుంటూ ఉన్నప్పుడు. వెంటనే వేద కు ఏదో షాక్ తగిలింది.... హృదయం లోనూ వెనువెంటనే మస్తిష్కం లోనూ....తను అలా అదిరిపోయి నిల్చొని ఉండిపోయింది... కిరణ్ వేద వైపు చూస్తూ.... వేద అత్యంత ఆకస్మికంగా కలిగిన కుదుపు వలన గడ్డ కట్టిన స్థితిలోనూ ....నీటిలో ఇద్దరి చేతులు. అవి ఇద్దరి హృదయాలను పెనవేసేశాయి. కిరణ్ వేద చేతిని గట్టిగా పట్టుకున్న తరువాత... కొద్ది నిమిషాల పాటు వదిలి పెట్ట లేదు. వేద కండ్లు కదపలేదు ...శరీరాన్ని విదల్చలేదు...అలాగే నిర్జాంతపోయి ...ఒక బొమ్మ లా... ఫ్రీజ్ అయ్యింది.కిరణ్ తనకు తానుగా దూరం జరిగాడు....తనని అలా చూస్తూ బాగా పనిష్ చేసాను అని నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వేద మీద సెక్సువల్ అసాల్ట్ జరిగింది ....వేద తన శరీరం నుండి తను డిటాచ్ అయ్యింది. ఎంతో నొప్పి ...ఎంతో బాధ....నాకు ఎందుకు ఇలా జరిగింది అని ఏడ్చుకుంటూ లాబ్ లో అటు ఇటు తిరిగింది.నాకు తమ్ముళ్లు కూడా ఉన్నారు కదా...వారితో ఎప్పుడు ఇలా జరగలేదు...ఇతనితో ఎందుకు ఇలా జరిగింది అని ఏడుస్తూ అనుకున్నది. లైంగిక వేధింపులు నిరోధించడానికి ఇప్పట్లో ఎన్నో చట్టాలు వచ్చాయి... ఒక వ్యక్తిని ముట్టుకోవాలి అంటే మనం వారి అనుమతి తీసుకోవాలి....కానీ ప్రేమించిన వ్యక్తి అలా చేస్తే....ఇక ఎవరికి చెప్పుకోవాలి. తన ప్రాణ నాధుడు అయిన రాముడు స్వయంగా సీతను అడవుల పాలు చేసినప్పుడు....సీత తన బాధను ఎవరితో చెప్పుకోవాలి. ఆ క్షణంలో అకస్మాత్తుగా జరిగిన ఆ దుందుడుకు చర్య వలన....వేద కదలిక లేక బొమ్మలా నిలుచుండి పోవడం చూసి కిరణ్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక తరువాత వారి మధ్య మాటలు లేవు... ఆ తరువాత వారం ....కిరణ్ వేద ను తిరిగి మాట్లాడించాలని చూసాడు ... "వేద పండు.. వేద మాట్లాడు" అన్నా వేద మాట్లాడలేదు. గోపాల్ సమోసా తెచ్చి ఇచ్చి తినమని అన్నా వేద వద్దు అన్నది..కిరణ్ ఎంతో బాధతో తినను అంటూ ఉందిరా అనగానే తింటుంది లేరా అన్నప్పుడు...వేద కు ఆ బాధ లోలోపల ఉండడం వలన మాటలు రాక అక్కడ నుండి లేచి వెళ్ళిపోయింది. నిజానికి ఆ క్షణంలో వేద కు అతని చెయ్యి పట్టుకోవాలి అని అనిపించింది. ఎందుకంటే ఆమెను అతను సెక్సువల్ గా అరౌసే చేసాడు. అతను పెళ్లి అంటున్నాడు. పరాయి మగవాని చెయ్యి ఎలా పట్టుకునేది...పట్టుకుంటే ఎవ్వరైనా చూస్తే ....తప్పుగా అంటారు అని భయపడింది. కిరణ్ బాధతో వేద వెళ్లిన వైపు చూస్తూ ఉండి పోయాడు.వేద కిరణ్ ను కన్నెత్తి చూడలేదు..కిరణ్ గురించి ఎవరికీ చెప్పలేదు...వేద కిరణ్ ను తప్పించుకొని తిరగడం మొదలు పెట్టింది.... కిరణ్ వైపు చూస్తూ "ఏరా ఏమి చేసావు" అంటూ... గోపాల్ కిరణ్ ని అడగగానే ... తల పగిలిపోతుంది నాకు...నన్ను ఏమి అడగకు...అని కిరణ్ వాడిని వారించాడు వేద ను అలానే కిరణ్ చూడడం మొదలు పెట్టాడు......కానీ తను కిరణ్ వైపు చూసేది కాదు...అతను ఆమెను ఆపకుండా తదేకంగా చూడడం ...అది కూడా సెక్సువల్ హరస్మెంట్. అతను దుందుడుకు చర్య తో తన శరీరం మీద దాడి చేసాడు. ఎంత ఇష్టం ఉన్నా, ప్రేమ ఉన్నా అలా ఎదుటివారి అనుమతి లేకుండా మనల్ని ముట్టుకోవడం లైంగిక చర్య క్రిందకు వస్తుంది.వేద పూర్తిగా మాటలు రాక శరీరం తిమ్మిరి అయ్యినట్లు అలజడితో భయపడి పోయింది. వేద కు ఆ కొన్ని నిమిషాల సమయంలో జరిగిన దాడి అలా గుర్తుండిపోయింది ... వేద ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఎవరితో చెప్పుకోవాలో తెలియక... చెబితే నమ్ముతారా? నమ్మరో? అని అనుకుంటూ "కిరణ్ మంచి వాడే కానీ తప్పు చేశాడు ...నా చెయ్యి పట్టుకుని తప్పు చేశాడు" అని బాధపడింది. మనిషి మంచివాడా లేదా చెడ్డవాడా అన్నది కాలం నిర్ణయిస్తుంది....కానీ కిరణ్ మాత్రం తొందరపాటు తనం కలవాడు, ఓపిక లేనివాడు. కిరణ్ తన చేతిని పట్టుకోగానే ...కిరణ్ కు తనకు మధ్య పెరిగిన అనుభందం వేదకు సమస్య అయిపొయింది.....i want to surrender to you...అనుకున్నది. ఒక్కసారిగా చాలా ఎక్కువగా ఆక్సిటోసిన్ తనలో నుండి రిలీజ్ అయ్యి అతనితో వేదకు ప్రేమ బంధం ఏర్పడింది. వేద కు, ఆ రోజుల్లో ప్రతి క్షణం అతని ఆలోచనే. చాలా రోజులు నిద్ర లేదు. చాలా బాధ కలిగింది. కిరణ్ తన చెయ్యి పట్టుకున్నప్పుడు భయంతో తన ఆత్మ , శరీరం రెండూ వేరు వేరు అయ్యాయి. తన శరీరం పూర్తిగా ఆ క్షణంలో గడ్డ కట్టింది. అంతేకాక వేద కు ఎందుకో గుండెల్లో చాలా నొప్పి కలిగింది. అతను వేద మనస్సు లోకి దూరిపోయాడు..ప్రతి క్షణం అతని ఆలోచనలు వేద లో. వేద ఆలోచిస్తూ అనుకున్నది "నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఫ్రీజ్ అయ్యాను. అయ్యో ఏమి చేసేది నేను. నాలో భావోద్వేగాలు పెరిగాయి. కోరికలు పెరిగాయి. అతను నన్ను ఉత్తేజితం చేశాడు. అతను నా అనుమతి లేకుండా నా చెయ్యి స్పర్శించడం వలన నాలో శృంగార భావనలు తలెత్తాయి" అంటూ బాధ పడసాగింది. ఆ క్షణమే వేద కు అనిపించింది "ఇద్దరి కిి పెళ్లి అయిపోయినట్టు" . వేద కిరణ్ స్పర్శ తో అరౌజ్ అయ్యింది....సెక్సువల్ క్లైమాక్స్ కు చేరింది. సెక్సువల్ ఆర్గాస్మ్ అన్నది జరిగింది....(sexual orgasm). కానీ వేద లో భయం మొదలయ్యింది...ఇదేంటి ఇలా అయ్యింది...అతను ఎవరు....నాకు అతని మీద ఇంత ప్రేమ ఎందుకు....అన్ని ప్రశ్నలే తన లో...ఇది నిజమైన ప్రేమ..ఇద్దరి మధ్య ప్రణయం మొదలు అయ్యింది. కానీ అతనిని చూసి వేద వణికి పోసాగింది. కిరణ్ కు పెళ్లి కుదిరింది...నాకు పెళ్లి కుదిరింది అని కిరణ్ కు తెలుసు...అలాంటప్పుడు కిరణ్ ఎందుకు తన చెయ్యి పట్టుకుని తనని ప్రేరేపించాడో వేద కు అర్థం కాలేదు....కిరణ్ మీద వేద కు నమ్మకం పోయింది. కిరణ్ తన జీవితంతో ఆడుకోవాలని అనుకుంటున్నాడా అని వేద చాలా దుఃఖపడసాగింది. వేద కిరణ్ ఎక్కడ తనని స్పర్శిస్తాడో నని భయపడి కిరణ్ తన దగ్గరకు రాకుండా తిట్టడం మొదలు పెట్టింది. ఎందుకంటే అతని స్పర్శ ఆమెలో అగ్నిని రగిల్చింది కిరణ్ అన్నాడు సరళ తో "వేద వెళ్లి పోయాక, ఇక్కడ సుజి ని కూర్చోబెడతాను" వెంటనే వేద కిరణ్ తో అన్నది "ఇక పది రోజుల లో నేను వెళ్లి పోతాను. నీవు సుజి ని తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టు". కిరణ్ కి అంత వరకు తెలియని విషయం ఏమిటి అంటే వేద కూడా అతనిని ఇష్టపడింది. కానీ చెయ్యి పట్టుకుని ప్రేరేపించిన తరువాత ఆమెకు అన్నీ అతనే అయ్యాడు. కానీ ఈ విషయం బయట పెట్టితే వేద మీద మళ్ళీ మళ్ళీ ప్రేమ పేరుతో సెక్సువల్ అసౌల్ట్ జరుగుతుంది అని భయపడి అతనికి చెప్పలేదు. కానీ ఆమెకు అతనిని పెళ్ళి చేసుకోవాలి అని అనిపించింది. కానీ అతనికి తన ఇంటి నుండి తన చెల్లెలు రాసే ఉత్తరాలు. ప్రతి ఉత్తరం లో వదిన బాగుంది...అంటూ... వదిన దగ్గర డిగ్రీ కట్టిస్తున్నాను అంటూ...అతను తన పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు అని చెప్పక చెప్పేవి. అంటే మానసికంగా రెడీ అయ్యాడు అని చెప్పేవి. కిరణ్ స్నేహితుడు కరణ్ వేద దగ్గరకు వచ్చి "నీ కళాశాల చదువు ఎప్పుడు పూర్తి అయ్యింది"...అని ఆరా తీస్తూ ...వేద వయస్సు తెలుసుకుని..."మరీ ఏమి చిన్న పిల్ల కాదు. మన కంటే రెండు మూడేళ్ళ చిన్న" అంటూ కిరణ్ వైపు చూసాడు. కిరణ్ వేద తో తన మరదలు సుజి గురించి చెప్తూ...తన స్నేహితులతో రంజని గురించి చెప్తూ...ఇంకో పక్క సరళతో మానసిక అనుభందం తో...ఏమనాలి ఇతనిని?? తరువాత కిరణ్ వేద ని తన భయాన్ని చూసి నప్పుడు అతనికి వేద అంటే చాలా ముద్దు వచ్చింది. కిరణ్ తనని చూస్తూ ఉండిపోయాడు . కిరణ్ కు తనని ఎంత చూసినా ఇంకా చూడాలనిపించింది. వేద ఏ పని మీద ఉన్నా కిరణ్ అక్కడకు వచ్చి తనని చూడటం మొదలు పెట్టాడు.. starring, stalking ... అది కూడా sexual harassment. ఎంతలా చూడటం మొదలు పెట్టాడు అంటే...చేతులు రెండు తన మొహం పై పెట్టుకుని కళ్ళు మాత్రమే కనిపించేటట్లు...ఆమెని చూడటం. వేద అక్కడ కూర్చోలేక దూరంగా ఉండటం మొదలుపెట్టింది. అది కూడా సెక్సువల్ హెరాస్మెంట్ ఆమెకు. అది ఆమెలో భయాన్ని పుట్టించింది. అతను తనకు పెళ్ళి అని చెప్తూ తనను స్టార్రింగ్ చెయ్యడం ఎంత వరకు సబబు. వేద అతనిని చూసి బయపడడం మొదలు పెట్టింది. వేద ల్యాబ్ లో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా సరళ వేద వైపు కోపంగా చూసి అక్కడ రాబిట్ పిల్లలు ఉన్నాయి ...నువ్వు ఇక్కడ నుండి లేసి వేళ్ళు.... రాబిట్ పిల్లలకు స్నానం చేయించు అన్నది.... వేద సరేనని రాబిట్ పిల్లలను ఒక్కటొక్కటి నెమ్మదిగా తీసుకుని స్నానం చేయించింది... మరుసటి రోజు రాగానే వేద ను చూసి సరళ కోపంగా ఏమి చేసావు రాబిట్స్ అన్ని చచ్చిపోయాయి అన్నది. వేద కు దుఃఖం ఆగలేదు.. ఏడుస్తూ ఉంటె... కిరణ్ వచ్చి వేద చేతిని పట్టుకుని ఓదార్పుగా చూసాడు. తిరిగి అమ్మాయి చెయ్యి పట్టుకోవడం... అప్పటికే వేద అతని స్పర్శకు అలవాటు పడింది. సరళ ఎప్పుడు ల్యాబ్ లో రుసరుసలు ఆడుతూనే ఉండేది. ఆమె మాటలు వేదకు కత్తులు లాగా దూసుకుని వచ్చేవి. అగ్ని నిప్పుల మీద ఉన్నట్లు ఉండేది ఆమె తో పని చేసేటప్పుడు. ఎందుకు ఇలా ఉంది ఈమె అని వేద అనుకున్నది. వేద కు అర్థం కాలేదు. ఇన్ని ఏండ్ల తరువాత ఇప్పుడు ఆలోచిస్తే అనిపించింది...ఎక్కడ వేద కిరణ్ ఒక్కటి అవుతారో అనే భయము ఆమెలో... కిరణ్ ఎప్పటికీ ఆమెకు మాత్రమే సొంతంగా కావాలి. అతను ఆమె అదుపులో ఉండాలి. వేద... సరళ మాత్రమే లాబ్ లో ఉన్నారు..."ప్రొఫెసర్ త్యాగరాజు ఉన్నాడు వేద ...నువ్వు ఇప్పుడే ఇంటికి వెళ్లకు "...అన్నది సరళ వేద ఆమె కోసం ఉన్నంతలో....వర్షం మొదలు అయ్యింది...ఇంతలో కిరణ్ రాగానే వేద ఇంటికి బయలు దేరింది..కానీ వేద సరళ కోసం తోడుగా ఉంది అని తెలిసి ప్రొఫెసర్ పంపలేదు. ఇంత టైం ఇక్కడే ఉన్నావు కదా ఇంకా ఉండు అన్నారు. వేదకు వర్క్ ఇచ్చాడు... ఇది కంప్లీట్ చేసి తరువాత వేళ్ళు అని చెప్పాడు... చాలా చీకటి పడింది.అప్పుడు పొమ్మన్నాడు. అక్కడ ఉన్న గొడుగు ఇమ్మని అడిగింది వేద. నాక్కావాలి అన్నది సరళ...ఇంకొకటి ఉంది కదా...అది ఇమ్మని అడగగానే....అది కిరణ్ హాస్టల్ కి వెళ్ళాలి ...ఆయనకు కావాలి అన్నది. నిర్దయగా ప్రవర్తించింది. కిరణ్ పక్కనే నిశ్శబ్ధంగా నిల్చున్నాడు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా...చూస్తూ? ఇతను కనీసం ఒక ఆడపిల్ల ఎలా వర్షం లో వెళ్తుంది అని కూడా ఆలోచించలేదు? మరి ఇతనిని పెళ్ళి చేసుకుంటే ...తనకు తోడు నిలబడతాడా???? చీకటిలో ఒంటరిగా వర్షం లో తడుచుకుంటూ చాలా కష్టపడి ఎంతో దూరం నడిచి ఆటో కూడా దొరకక ఇంటికి చేరింది. నాన్న గేట్ వేసేసి "ఇంట్లోకి రాకు...ఇంత లేట్ గా వస్తావా...పో బయటకు" అన్నారు....గుండె పగిలింది...ఎవరున్నారు తనకు????. పొద్దున్న తిరిగి కాలేజ్ కి రాగానే కిరణ్ వేద వైపు చూస్తూ "వస్తావని అనుకోలేదు ఇక వస్తావని అనుకోలేదు" అని పాటలు. వేద మనస్సులో అనుకున్నది...పిల్ల చేష్టలు. వేద వైపు చూసి ఏమన్నారు మీ పేరెంట్స్ అనగానే కిరణ్ వైపు చూసి తల వంచుకుని "తలుపులు వేసేశారు ఇంట్లోకి రావద్దని"...అనగానే అతని లో నవ్వు. కిరణ్ ఏదో పని చేస్తూ పనిలో పనిగా వేద చేతులు తాకాలని లేదా తన పాదాలు ముట్టుకోవాలని చూస్తూ ఉండేవాడు. వేద భయం తో అతనికి దూరం గా ఉండటం మొదలు పెట్టింది. " కిరణ్ ఏమో తనకి చిన్నప్పుడే పెళ్లి కుదిరింది అంటున్నాడు. మరి కిరణ్ కు తెలియని విషయం ఏమిటంటే తన పెళ్లి ఆగిపోయింది. మరి కిరణ్ కు సుజి తో పెళ్లి కుదిరిినా కూడా తన చెయ్యి ఎందుకు పట్టుకున్నాడో " ఎంత ఆలోచించిన వేద కు అర్థం కాలేదు. బోటనీ స్వామి సర్ తన ల్యాబ్ లో పనిచేయమని వేద ను పిలిచాడు... కానీ వేద అనుకున్నది...ఇంకా ఇక్కడే ఉంటే.... ఇతనికి తానూ అవకాశం ఇచ్చినట్లు అవుతుంది... అనుకుని సున్నితంగా తిరస్కరించింది.వేదకు ఆకలి కావడం మానేసింది. ఏదో గుండెల్లో బాధ, దిగులు. బహుశా అది విరహమేమో. ఆ రోజు పొద్దున్నే సరళ వేదను నోటికి వచ్చినట్లు తిట్టడం మొదలు పెట్టింది... "నువ్వు పది రోజులలో వెళ్లిపోతావు....నువ్వు మాకు ఏమి సాయం చెయ్యక్కరలేదు...నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు"...అని దెప్పడం మొదలు పెట్టింది... పక్కన నిశ్శబ్ధంగా కిరణ్. ఒక వ్యక్తి ని మనం ఇష్టపడితే ...నోటి తో చెప్పాలి లేదా అడగాలి....లేదా రాయాలి....కానీ నా మనస్సు తెలుసుకో అంటే తెలుస్తుందా? వేద పరిశోధన శాల ని వదిలి వెళ్ళటప్పుడు ...వేద కిరణ్ ని వదిలి వెళ్ళలేక పోయింది.వేద వాష్ రూమ్ కి వెళ్లి బోరున ఏడ్చుకుంటూ అయ్యో గేమ్ గేమ్ అంటూ నా జీవితాన్ని నాశనం చేసేసాడు. ఇప్పడు ఎలాగా పెళ్లి పెళ్లి అంటున్నాడు అనుకుని ఏడ్చుకుని బయటకు రాగానే, అప్పటికే వేదని వెతుక్కుంటూ అక్కడకు వచ్చిన కిరణ్ నవ్వుతూ...వేద వైపు చూసి అన్నాడు "ఏమి వేద .......వదిలి వెళ్ళ లేక పోతున్నావా". కిరణ్ చూపులో... రెచ్చగొడుతూ ఆమెని... (provoking)...నువ్వు ఎలా తప్పించుకోగలవు నా నుంచి... అన్నట్లు అతని చూపులో... వేద బాధగా కిరణ్ వైపు చూస్తుంటే కిరణ్ వేరొక వైపు చూస్తూ...అతని మాటలలో చూపులలో ఏదో కన్నింగ్ నెస్ ...? ఏమిటా మోసం .... ఇది కూడా గేమ్ అతనికి? నా నొప్పి నా బాధ అతనికి అర్థం కావడం లేదా???వేద కు ఆ క్షణం అతనిని గట్టిగా దగ్గరకు లాక్కొని మనం పెళ్ళి చేసుకుందాం అని అడగాలని అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఆమెకు అతని మీద ఫీలింగ్స్....అతని పెదవులతో పెదవులు కలపాలని. ఆమెకు అలాంటివి చేయాలంటే పెళ్ళి చేసుకోవాలి ...ఎందుకంటే ఈ ప్రేమలు శాశ్వతము కావని తన నమ్మకము. కానీ అతను తనకు పెళ్ళి అని తెలిసి తన చెయ్యి పట్టుకున్నాడు. మోసగాడు ... ఏమో? మరి అతనికి పెళ్ళి అని తనతో చెప్పి తనకు పెళ్లి అని తెలిసి తన చేతిని ఎందుకు పట్టుకున్నాడు...ఆమెకు అర్థం కాలేదు? కిరణ్ వేద చెయ్యి అలా పట్టుకోవడంలో వారి మధ్య ఏదో తెలియని బంధం ఏర్పడింది.మరి ఆ బంధం తనను లాగుతుంటే ఏమి చెయ్యాలి? కొద్ది రోజుల లోనే వేద కు అర్ధం అయ్యింది... ఆమె పూర్తిగా అతని ప్రేమలో పడిపోయింది . అతను లేకుండా బతకలేను అనుకున్నది... అతను పిరికివాడు. అతను తప్పు చేసింది నిజమే? తన చెయ్యి పట్టుకోవడం తప్పే. కానీ తను అతని కోసం రెండు సార్లు వెళ్ళింది కదా. అది నిజమే కదా...అతను ఎలాంటి వాడో తెలియక పోతే పోయింది. తను నిలబడాలి ఈ ప్రేమ కోసం అనుకుంది. కానీ.... అతను సరళ మీద మానసికంగా ఆధారపడ్డాడు... చాలా ఆలోచించి వేద తన బాధ్యత గా ఒక ముందడుగు వేసింది. అతని కోసం తాను నిలబడాలి అనుకున్నది. తరువాత ఒక రోజు పరిశోధనశాల కి వెళ్లి కిరణ్... ఎదురుగా కూర్చున్నది. కిరణ్ ఆ రోజు వేద ని "నీ పెళ్లి ఎప్పుడు" అని అడిగాడు ...వెంటనే కిరణ్ కళ్ళల్లోకి చూస్తూ వేద అన్నది "కాన్సల్ ". పందానికి నేను రెడీ అన్నట్లు సూటిగా అతనిని చూసింది.ఆ క్షణం కిరణ్ కళ్ళల్లో ఏదో భయం తో కూడిన కలవరపాటు.అతని కళ్ళల్లోని కలవరం చూసినప్పుడు వేద కు అనిపించింది.... ఇతను తనకు పెళ్లి అయ్యిపోతుంది అనుకున్నాడా... అప్పుడు తప్పించుకోవచ్చు అనుకున్నాడా? పక్కనే ఉన్న సరళ ని చూస్తూ "చెప్పలేదా" అన్నది. సరళ నవ్వుతూ చెప్పలేదు అన్నట్లు తల ఊపింది. పాపం కిరణ్ ఇంకా ఈమెను నమ్ముతున్నాడు అని అనుకున్నది. ఆమె తన గురించి మాత్రమే ఆలోచిస్తుంది... వేరొకరితో ఆమెకు ఏమి పని? స్వార్థపరురాలు... ఒకరోజు వేద కు పోస్ట్ లో రీడర్స్ digest పత్రిక శంకర్ పేరుతో ఎవరో పంపారు. వేద కు అనిపించింది... వీడు పంపించాడు అని...సెక్స్ లేదనా??? ఒకరోజు వేద కిరణ్ ని ల్యాబ్ లో కలవడానికి వెళ్ళింది. ఆ రోజు కిరణ్, సరళ, గోపాల్ ఆటో ఎక్కారు సరళ ఇంటికి వెళ్ళడానికి... వేద నేను వస్తాను అంటే...సరళ కోపంగా వేద వైపు చూస్తూ..."వద్దు ...నువ్వు మాతో రావద్దు"...అనగానే గోపాల్ "రానీ" అంటున్నాడు కానీ...కిరణ్ తల వంచుకుని కూర్చొనుండడం వేద చూసింది. వేద అనుకున్నది కిరణ్ తనకు కనీసం మాట సాయం కూడా రావట్లేదు అనుకున్నది. ఆ క్షణం వేదకు అనిపించింది కిరణ్ పిరికివాడి వలే తనను వదిలేస్తున్నాడు ...ఎందుకో వేదకు అర్థం కాలేదు...కులమా....? డబ్బా? ఇతడిని నేను రెండో పెళ్లి ఎలా చేసుకునేది.... తనకు పెళ్లి కుదిరింది అన్నప్పుడు...ఆ అమ్మాయి జీవితం పాడు చేయలేక... నా జీవితం నాశనం చేసుకోలేక.. ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తూ...ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు ఈ ఆటో ను లాక్కొని పోతే అనుకున్నది.నాలో నొప్పిని కలిగించి ఏ నొప్పి లేని అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అనుకున్నది. ఎలాగైనా కలుగు లోని ఎలుకను బయటకు రప్పించాలి అని ఆలోచించింది. ఏమి చెయ్యాలా అని ఆలోచించింది. ఎంత బాధాకరం ఒక మనిషి చెప్పిన అపద్దం వలన మరొక మనిషి పూర్తిగా ఊహాలోకం లో ఏదేదో ఊహించుకోవడం!!! జీవితమంతా వేద ఆ ట్రామా తో బాధ పడుతూనే ఉంది. తన జీవితం లో మొదటి అడుగులో పడిన దెబ్బ తనని కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. సరళ ...కిరణ్ ఇద్దరు ఒక్కటైపోయి గోపాల్ ని కూడా మార్చేశారు. కిరణ్ తన మనసులో అనుకున్నాడు "ఈ వేద మగరాయుడి లా నా వెంట పడుతూ ఉంది..నాకు వద్దు ఈ పిల్ల .....డబ్బులు లేవని ఎప్పుడైనా నన్ను వదిలేస్తుంది..లేదా.. కొడతారేమో. నాకు భయమేస్తుంది అమ్మో నేను చచ్చిపోతాను"....అని కిరణ్ ఊహ లోకంలో ఊహించుకుని ఆమెను వదిలి వేయాలని అనుకున్నాడు. సరళ కిరణ్ కు వత్తాసు పలికింది. ఎంతో మంచి వాడు అయినా గోపాల్ నిశబ్దంగా ఉండిపోయాడు. చాలా కాలం తరువాత అంటే సుమారు ఇరవై రెండు సంవక్షరాల తరువాత మాటల్లో ఒక సారి కిరణ్ వేద తో అన్నాడు "అప్పట్లో మీరు చాలా బాగున్నారు ....అందుకే నేనే వద్దనుకున్నాను". తను అతనిని వదిలి వెళ్ళలేక పోతున్నది అని తెలిసి కూడా మీరు బాగున్నారు... అందుకే నిన్ను వద్దనుకున్నాను అని అంటే అతని ఉద్దేశం ఏమిటి? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాను అని బాధ లేదా? నిజానికి ఆమె married life ను కోల్పోయింది. అతని లో empathy లేదు. వేద కు ఒక విషయం అర్థం అయ్యింది. ఒకరొజు కిరణ్ లాబ్ లో వేద తో మాట్లాడేటప్పుడు...మా బ్రదర్ సుదర్శన్ ఇక్కడే యూనివర్సిటీ లో పని చేస్తున్నాడు అని చెప్పింది. ఆ ఒక్క మాట పట్టుకుని కిరణ్ అందరికీ ఏమి చెప్పాడు అంటే వేద వాళ్ళు బాగా ఉన్నవాళ్లు. సుదర్శన్ అంటే వైస్ ఛాన్సలర్ కి కుడి భుజం లాంటి వాడు. అమ్మో అటువంటి అమ్మాయి నాకు వద్దు అని అనుకున్నాను . అందరికి అదే చెప్పాడు. పాపం జనాలు నమ్మేసారు ఆ అపద్దల కోరు మాటలని. అతనికి డబ్బు కావాలి. ఏ అమ్మాయి అయినా ఒక్కటే. కానీ వేద అతనిని వదిలి వేయాలి అనుకోలేదు. తప్పు చేస్తే చేసాడు... పెళ్లి చేసుకుంటే... కమిట్ట్మెంట్ అవుతుంది. ఏ అరేంజ్డ్ మ్యారేజ్ అయితే... పెళ్లి అయ్యాక... వాడు ఎలాంటి వాడో తేలుతుంది. వీడు అయితే ఇప్ప్పుడే తేలిపోయింది కదా అనుకున్నది.తన స్నేహితురాలు విజయ తో అన్నది వేద..."విజయ నేను కిరణ్ ను ప్రేమిస్తున్నాను"... విజయ వెంటనే అన్నది..."అయితే పెళ్లి చెసుకో". వేద బాధపడుతూ అన్నది.... "ఎలాగో తెలియట్లేదు". వేద అతనికి తన మనస్సు తెలపాలని అనుకున్నది. ఎలా చెప్పాలో తెలియట్లేదు అని సతమతమైంది తన మనస్సు ....ఎవ్వరికి తెలియకుండా ఎక్కడికైనా పిలిచి అతనితో మాట్లాడటం అన్నది చేయాలి అనిపించలేదు...ఎందుకంటే అతను ఎవ్వరు చూడకుండా తన చెయ్యి పట్టుకుని తనను ప్రేరేపించి ...ఇద్దరు ఒక్కరైపోయారు...కానీ విపరీతంగా వస్తున్న శృంగార ఆలోచనలు భయం కలిగిస్తున్నాయి....అతను నాకు పెళ్లి అంటున్నాడు....ఒంటరిగా పిలిస్తే సెక్సువల్ గా మారుతుంది.... అప్పటికే మనసులు ఒక్కటి అయ్యాయి.... ఎప్పుడైతే అతను తన చెయ్యి పట్టుకున్నాడో....అప్పుడే తన మెదడులో శృంగార సంఘటన నిక్షిప్తం అయ్యింది....పెళ్లి లేకుండా శరీరాలు కలవకుండా....శృంగారం పూర్తి అయ్యింది...అతను అంటే కొంచం సిగ్గు, బిడియం.. ఏమి చెయ్యాలి అని ఆలోచించి చివరికి నెహ్రు వీధిలోని "గిఫ్ట్ ఫర్ ఎవిరిడే" షాప్ కి వెళ్లి వెతికింది. ఒక గ్రీటింగ్ కార్డు నచ్చి వెంటనే కొన్నది.ఆ గ్రీటింగ్ కార్డు లోనే పెళ్లి చేసుకుందాము అని అడగాలని అనుకున్నది...కానీ కిరణ్ తనకు పెళ్లి కుదిరింది అంటున్నాడు. కిరణ్ ని తాను పెళ్లి చేసుకోవాలా అని అడిగినప్పుడు చేసుకోవాలి అని చెప్పాడు. పెళ్లి అంటేనే బాధ్యత...ప్రేమకు పెళ్లి అవసరం లేదు. కానీ ఇలా పెళ్లి కాబోతున్న వానికి ప్రేమిస్తున్నాను అని చెప్పడం పది మందిలో ఎంత సిగ్గుచేటు అని బాధపడుతూనే ... గ్రీటింగ్ కార్డు పోస్ట్ లో వేసింది. కిరణ్ బయటకు వస్తే తన ప్రేమను అతనికి తెలపాలని అనుకున్నది. పెళ్లి చేసుకుందాము అని అడగాలని అనుకున్నది. కనీసం తన ప్రేమకు నిలబడతాడా లేదా చూద్దాము అనుకున్నది. ఎందుకంటే ఇంతవరకు కిరణ్ కు వేద కూడా అతనిని ప్రేమించింది అని తెలియదు. Now the game started.... వేద కిరణ్ కు గ్రీటింగ్ కార్డ్ పోస్ట్ లో పంపింది. ఆ రోజు న్యూ ఇయర్ ... వేద ల్యాబ్ కి వెళ్లి అడిగింది "గ్రీటింగ్ వచ్చిందా" అని. కిరణ్ "లేదు" అని తల ఊపాడు. కిరణ్ ....."గ్రీటింగ్ వచ్చాక ఎవరికీ చూపకు" అన్నది . కిరణ్ చిరునవ్వుతో అలాగే అంటూ తల ఊపాడు.వేద గ్రీటింగ్ లో రాసింది స్పష్టంగా "I LOVE YOU".మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి అడిగింది "నీకు కార్డ్ చేరిందా" అని...."చేరింది" అని నవ్వుతూ తల ఊపి తల దించుకున్నాడు.వెంటనే "నీకు నచ్చిందా" అడిగింది వేద కిరణ్ ని . కిరణ్ నవ్వుతూ నచ్చింది అంటూ సిగ్గుపడుతూ తల దించుకున్నాడు. అతను తల దించు కోవడం తోనే ఎందుకో అర్థమయ్యింది వేద కు "అతను వెనకడుగు వేస్తున్నాడు అని". కిరణ్ దగ్గర నుండి ఏ జవాబు రాలేదు వేద కు. "తన ధర్మం తాను నెరవేర్చాను" అని వేద అనుకున్నది . ఇంటికి ఒకటే గా ఫోన్ కాల్స్ రావడం మొదలు పెట్టాయి. అమ్మ వేద వైపు చూసి "ఆ కాల్స్ ఎవరి కోసం" అన్నది సీరియస్ గా...అమ్మ గొంతులో "నీ కోసం కాదు కదా" అన్న అర్థం ధ్వనించింది. వేద ఈ వేధింపులు తట్టుకోలేక దగ్గర లోని పాఠశాలలో పంతులమ్మ గా చేరింది. చిన్న చిన్న పిల్లలతో గడుపుతూ ఉంటే వేద కు కాలమే తెలియలేదు. ఇంత వరకు హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకునే వాళ్ళము నేను కిరణ్ ఇద్దరం. ఇప్పుడు ఇద్దరికీ మాటలు రానట్లు మౌన ముద్ర వేసాము. కానీ కిరణ్ ని వదిలి పెట్టాలి అని అనిపించలేదు. వేద కు ప్రతి క్షణం కిరణ్ ఆలోచనలే. వేద కిరణ్ ని కలవాలి అనుకున్నది. ఆ రోజు సరళ ను కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లి నప్పుడు అక్కడ కిరణ్ కనిపించాడు. వేద అతని వెనకే సూపర్ బాజార్ కి వెళ్ళింది. కిరణ్ వేద తో అన్నాడు "నువ్వు చిన్న పిల్లవి.. నీకు ఏమి తెలియదు". అతను అన్న మాటలకు వేద తల దించుకున్నది . ఆ క్షణం కూడా అతను వేద తో ఎంతో నిర్దయగా ప్రవర్తించాడు. వేద అతని తో కలిసి నడుస్తూ ఉన్నంతలో వేద ఇంటికి వెళ్లాల్సిన దారి రాగానే..."నువ్వు ఇక పో" అంటూ నిర్దయగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు. వేద మూగగా అతను వద్దు అనుకుంటున్నాడు అని అర్ధమయ్యి అతనిని ప్రశ్నించలేకపోయింది . ఆ క్షణం అర్థం కాలేదు...చిన్న పిల్ల అంటే ఏమిటి??? అంత వరకు తాను చిన్న పిల్ల నే . కానీ ఆతను తన చెయ్యి పట్టుకోగానే పెద్ద దాన్ని అయ్యాను కదా! అనుకున్నది.అయినా ఆ స్నేహాన్ని వదలలేనని కిరణ్ ని కలవడానికి అధ్యయన కేంద్రానికి వెళ్ళింది. వేద కిరణ్ కి కబుర్లు చెబుతూ పాఠశాల లోని పిల్లల గురించి చెప్పడం మొదలుపెట్టింది. చిన్న చిన్న పిల్లలు వారి అల్లరి ఎంతో మైమరిపిస్తూ ఉండగా అతన్ని కలిసినప్పుడు వేద ఆ పిల్లల గురించి చేప్పేది. కిరణ్ వైపు చూస్తూ వేద మురిసిపోతూ "పండు అనే బాబు బుజ్జి అనే పాపా ఎంత ముద్దుగా ఉంటారో " అంటూ ఉంటె కిరణ్ మనసుకు అర్థమై నవ్వుకుంటూ ఉండేవాడు. "పండు పెన్సిల్ బుజ్జి లాక్కొని పరుగెత్తుతుండే బుజ్జి ని పండు పట్టుకుని తన పెన్సిల్ లాక్కొని " "బుజ్జి నీ మీద మాం కు చెబుతా" అని బెదిరిస్తూ నా దగ్గరకు వచ్చి "చూడు మాం బుజ్జి నన్ను అల్లరి పెడుతోంది" అని అన్నాడు. "వారిద్దరి గొడవలు అన్ని కాసేపటి వరకే" ...అన్నది వేద. "అంతలోనే బుజ్జి పక్కన ఎవరైనా కూర్చుంటే..... పండు వాళ్ళని బెదిరించి బుజ్జి పక్కన కూర్చునేవాడు" పండు బుజ్జి ఇద్దరు ఒకరి పక్కన ఇంకొకరు ఎప్పుడు వదిలి పెట్టకుండా కూర్చుంటారో చెప్తుంటే కిరణ్ నవ్వుతూ ఉన్నాడు.వేద అనుకొనింది "కిరణ్ కి అర్థం కాలేదా లేదా నటిస్తున్నాడో తెలియట్లేదు"... పది మందిలో అతని పై ప్రేమ చూపడం ఎంత అవమానం...ఎంత బాధ!!? సంవక్షరాలు గడిచినా ఆ అవమానం పోలేదు. ఆ బాధ తగ్గలేదు వేద కు అనిపించింది...కిరణ్ కు ఇప్పటికే శారీరక సంబంధం ఉంది. ఎవరితో....అది సుజి తో నా??? లేక వేరే ఎవ్వరితోనా??? అతను సెక్స్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాడు అని అనుకున్నది. అది అతనికి తనతో ఊహలో కలలో ఐపోయింది. తన మీద అతనికి ఇష్టం పోయింది అని అనుకున్నది. ప్రొఫెసర్ రాజు రూమ్ వరకు వెళ్లి....కిరణ్ కి ఏమి ఇబ్బందో అని ఆలోచించి వెనకకు వచ్చేసింది దిగులుతో . కానీ చాలా రోజులు బాధ పడింది...ఆ రోజు ఎందుకు ప్రొఫెసర్ కి చెప్ప లేక పోయాను... చెప్పక తప్పు చేశాను అనుకున్నది.తర్వాత ఆలోచించింది వేద.... తాను ఎందుకు ఇంకో మెట్టు దిగకూడదు అని. ప్రేమ కాదు పెళ్లి వరకు వెళ్ళాలి మనం అని చెప్పాలని అనిపించింది.అలా తలచి ఒక రోజు లాబ్ కు వెళ్ళినప్పుడు .... ఆ రోజు కిరణ్ కనిపించలేదు కానీ అతను సోదరి లా భావించే సరళ కలిసింది. . ఆమె ఒక్కటే ఉంది lab లో.అప్పుడు వేద సిగ్గు తో తల వంచుకొని మరీ అడిగింది ... love marriage మంచిదా లేక arranged marriage మంచిదా" అని. సరళ వేద కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది, ఈ రోజు పొద్దున్నే కిరణ్ అడిగాడు ఇదే మాట, నేను arranged marriage మంచిది అని చెప్పా అంది. వేదకు ఆ క్షణాన సరళ మనస్సు స్పష్టంగా అర్థం అవుతున్నది. మీరు ఇద్దరు ఈ జన్మ లో కలవలేరు అని తన కళ్ళల్లోకి చూస్తూ చెప్పినట్లు అనిపించింది. ఆమె లోని అసూయ వేద కంటికి నిలువుగా కనిపించింది. వేద మనస్సు కిరణ్ కోసం పరితపించింది. వేద నిశ్శబ్దంగా కిరణ్ ని తిరిగి కలవలేక వెనుతిరిగింది. నన్ను అడగవచ్చు కదా కిరణ్ ఇదే మాట అని ....ఇంక ఎవ్వరికీ చెప్పాలి, నాకు ఇంకా ఎవ్వరు ఉన్నారు అనుకొని తిరిగి వచ్చేసింది. కానీ ఆశ పుట్టింది. Arranged అంటే పెళ్ళి కి వీలవుతుందా. ఆమె చెప్పదు కిరణ్ కి అని తెలుసు.ఎస్వీ ఆడిటోరియం దగ్గర కూర్చొని ఆలోచించింది...ఏమి చెయ్యాలి ఇప్పుడు. ఇప్పటికిప్పుడు వసతి గృహానికి వెళ్లి కిరణ్ తో మాట్లాడవచ్చు కానీ కిరణ్ బయట పడలేదు. కిరణ్ కోసం తను హాస్టల్ కి వెెళ్లితే బరితెగించింది అంటారేమోనని బయపడింది.అయ్యో చెయ్యి కోసుకుంటే వాడు తనను పెళ్లి చేసుకుంటాడా??? ఆ పని ఎలా చేసేది. చచ్చిపోవాలని అనిపిస్తున్నది. అయ్యో నేను ఆ పని చెయ్యలేను...అయ్యో వీడు లేకుండా ఎలా బతికేది? చావకూడదు...బతికి చూపించాలి...చచ్చిపోతే ఒక్క రోజే ఎడ్చి వూరుకుంటాడు. అదే బతికి ఉంటే బతికినంత కాలం నరకమే. వేద మనస్సు రాయి అయిపోయింది. ...నేను ఇన్ని సార్లు కిరణ్ ని కలుస్తున్న కానీ కిరణ్ నా కోసం ఒక్కసారి కూడా రాలేదు. గోపాల్ కి చెబుదామా...అతని ఫోన్ నెంబర్ తేలియదే అనుకున్నది. అయినా కిరణ్ దగ్గర నుండి ఎటువంటి జవాబు రానప్పుడు ఎలా బలవంతం చేసేది అని ఆలోచించింది. తమ్ముడు రమేష్ కి ఫోన్ చేసి రమ్మందామా అనుకున్నది. ఇంటిలో అమ్మా నాన్నకు చెపుదామా ...నేను అతనినే పెళ్లి చేసుకుంటాను అని ఆలోచించింది. అమ్మా నాన్న అతని కాళ్ళు పెట్టుకోవాలా...లేదా అతనిని కొడితే అప్పుడు... పెళ్లి చేసుకుంటాను అంటాడేమో... కానీ అతనిని టచ్ చేస్తే వాళ్ళ కులపోళ్ళు వచ్చి, మా వాడిని కొడతారా, మా వాడు అటువంటి వాడు కాడు అని తన తల్లి తండ్రి ని అవమానిస్తే? ఎంత అవమానం తన వలన, తన తల్లి తండ్రికి. కానీ ఇప్పుడు అమ్మ నాన్న వచ్చి అతనిని పెళ్లి కి వప్పిస్తే... రాబోయే కాలమో లో ఏదైనా problems వస్తే అప్పుడు అతను నిలబడతాడా... లేక తను అక్కడ నుండి తిరిగి రావాలా... అని ఆలోచించింది. బలవంతంగా పెళ్లి చేసుకున్నా కూడా దాన్ని లవ్ మ్యారేజ్ లేదా లేచి పోయింది అంటారు. ఇక్కడ లవ్ ఎక్కడ ఉంది అనుకున్నది.కిరణ్ చొక్కా పట్టుకుని "నన్ను ప్రేమించు" అంటే ప్రేమ పుడుతుందా లేక "నన్ను పెళ్లాడు" అంటే ఆ పెళ్లి నిలబడుతుందా అని ఆలోచించింది.అయినా కిరణ్ లేక బతకలేను అనుకున్నది.... కాని అతనిని నేరుగా అడిగేయాలని ఇంకొక రోజు లాబ్ కు మళ్ళీ వెళ్ళింది. వేద చేసిన తప్పు పోలీస్ స్టేషన్ కి వెళ్ళక పోవడమే. పోలీసులు పెళ్ళి చెయ్యగలరు కానీ మనస్సులుకలపగలరా??? పోలీస్ స్టేషన్ లో అతనిని కొట్టిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటాను అంటాడేమో.... కానీ అప్పుడు కూడా జీవితాంతం లవ్ అనే ముద్ర మొయ్యాలి కదా. ప్రేమ కనిపించలేదు నాకు అనుకున్నది. సరళ ఒక రోజు అన్నది "కిరణ్ పెళ్ళి స్కూల్ సెలవులు అయిన తరువాత జరుపుతాను అంటున్నది అతని అత్త" అంటూ ఉన్నప్పుడు పక్కనే నిశ్శబ్ధంగా వేద... లో లోపల బాధ. వేద స్కూల్ నుండి అదే పట్నం లో ఉన్న ఆటవిక పరిశోధన శాల లో ఉద్యోగంలో చేరింది. వేద కిరణ్ ను కలవడం మానుకోలేదు. కిరణ్ వేద మనస్సులో భాగం అయిపోయాడు. అలా కిరణ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక రోజు అతను అన్నాడు ...."నేను మీ రీసర్చ్ కేంద్రానికి వస్తాను.... వర్క్ చేసుకోవాలి" . వెంటనే వేద తల వంచుకొని సరేనని తల ఊపింది. తన మనసు బాధ తో నిండిపోయింది. నన్ను ఎందుకు ప్రేరేపించాలి....ఇప్పుడు నన్ను వదిలేస్తున్నాడు అని అనిపించింది. ఇతను తనకు జీవిత కాల threat గా మారబోతున్నాడు. దీనిని పగల గొట్టాలి అని అనుకున్నది. నేను పెళ్లి చేసుకునేది తరువాత... ముందు వీడి తాట తియ్యాలి అనుకున్నది. చిన్న తనం లో అమ్మ నాన్న ఎప్పుడు కొట్లాడు కోవడం చూసి తను అలా ఉండ కూడదు అని అనుకున్నది. నాన్న duty నుండి రాగానే...బయటి ఆడ వాళ్ళ కోసం పరుగెత్తడం....అమ్మ నాన్నను పోవద్దు అంటూ...ఆయనకి కాళ్ళకు అడ్డంగా పడుకొని ఏడవడం గుర్తుకు వచ్చింది. తరువాత నాన్న డబ్బు కోసం లాటరీ టికెట్స్ కొనడం...ఇంట్లో గుట్టలు గుట్టలు గా లాటరీ టికెట్స్. అంటే నాన్నకు డబ్బే ముఖ్యం. ఆమె అనుకున్నది నాకు అతనికి మధ్య మీడియేటర్ అవసరమా. ఆ రోజు వేద కిరణ్ ని కలసినఫ్ఫుడు...అతను తన పెళ్ళి పత్రికలు పంచుతున్నాడు. వేద చొరవగా ఆ పెళ్లి పత్రిక అందుకుని చూసినప్పుడు ....ఆ పెళ్ళి పత్రిక లో చూడగానే కిరణ్ కాబోయే భార్య పేరు ముందు వేద పేరు. వెంటనే అతనిని అడిగింది "ఏంటిది వేద సుజి ". అతను మారు పలకకుండా ఒక కార్డ్ ఐదు రూపాయలు పడింది అన్నాడు తల వంచుకుని. వేదకు వెంటనే అనిపించింది "ఏంటిది కిరణ్ డబ్బు తో ప్రేమ ని కొంటున్నాడా....?". పెళ్ళానికి తన పేరు పెట్టుకుని తప్పించు కోవాలని అనుకుంటున్నాడు అని అర్థమయ్యింది. వేద గుండె పగిలింది... మరి తన చెయ్యి ఎందుకు పట్టుకుని తన మనస్సును బంధించాడు...ఆమెకు అర్థం కాలేదు. అతను కోరి పెళ్ళి చేసుకుంటున్నాడు అని అర్థమైంది. అతను త్రాసు లో ఒక పక్క వేద ను మరొక పక్క సుజి ను ఉంచి తూచాడు. సుజి తో పెళ్ళి జరిగితే ఇంట్లో సపోర్ట్ ఉంటుంది. అదే వేద ను పెళ్ళి చేసి కావాలి అంటే కెరీర్ పాడవుతుంది. డబ్బు ఉండదు. ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు అనుకున్నాడు. త్రాసు సుజి వైపు తూగింది. వేద ను వదిలేశాడు.తరువాత చాలా కాలానికి కిరణ్ మాటల్లో చెప్పాడు...ఆమె ను పెళ్లి చేసుకోవడం వలన పెద్ద ఇల్లు వచ్చింది . తాను పుట్టింది చిన్న ఇంట్లో...ఆ ఇల్లు తమ్ముడికి వదిలేశాడు.పాపం అత్తగారు పెద్ద ఇల్లు కట్టిస్తాను అని చెప్పడం తో ఆశ....పెళ్ళి చేసుకున్నాడు. అలా కిరణ్ కోసం వేద పోరాడింది. ...చొక్కా పట్టుకొని గుంజుకు వెళ్లి నన్ను పెళ్లి చేసుకో లేదా ప్రేమించు అంటే ప్రేమ వస్తుందా లేక పెళ్ళి నిలబడుతుందా....పెళ్ళి నాకు అంటే నేను prostitute నా అని వేద ఏడ్చింది. అతను తన కోరికలు తీర్చుకోవడానికి పెళ్ళి చేసుకుంటున్నాడు....మరి తాను ఏమి చెయ్యాలి.....వాడిని ఇక బిచ్చం అడుక్కోవాలి! నిజానికి అతను ఎంతో పిరికివాడు...చాలా కన్నింగ్ . వాడికి సరళ సపోర్ట్ కావాలి. మరి అలాంటి వాడు పెళ్ళి చేసుకుని ప్రేమ నుండి తప్పించుకోవచ్చు అన్న దారి అతని కి చూపింది ఎవ్వరు???..అతను నా చెయ్యి పట్టుకున్నాడు అని నేను మా తల్లి తండ్రితో చెప్తానని అంత భయపడ్డాడు మేము కొడతాము అని???......చచ్చిపోతాను అని ప్రాణ భయం!!! తన ప్రేమను నాతో చెప్పకుండా పారిపోయాడు! క్రిస్టియన్ marriage లో పెళ్ళి కొడుకు, పెళ్లి కూతురు తమ ఇష్టాన్ని సమ్మతిని తెలిపితే నే పెళ్ళి జరుగుతుంది. అంటే కిరణ్ తన సమ్మతిని తెలిపాడు ...నెల రోజుల ముందే నోటీస్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు తాను అక్కడకు వెళ్లి ఈ పెళ్లిని ఆపాలా? కానీ తనకు తానుగా పెళ్ళి చేసుకోవాలి ఈ అమ్మాయిని అని లేని వానితో ఎలా బతికేది? తర్వాత కిరణ్.... వేద ఇంటికి పెళ్లి కార్డు తెచ్చిచ్చాడు. వేద అతన్ని పరిశీలనగా చూసింది. అతని కళ్ళు తనను చూడగానే మెరుస్తున్నాయి. తన కళ్ళు విస్తరించినట్లు పెద్దగా...వేద కు అర్థం అవుతున్నది అతనికి తన మీద ఉన్న ప్రేమ. వేద కు ఒక్క క్షణం అతని కాళ్ళు పట్టుకుందామా అని అనిపించింది. నన్ను వదిలి వేయకు అని అడుక్కుందామా అని అనిపించింది. కిటికీలు అన్ని వేసేసింది. తలుపులు మూసింది. కానీ మరుక్షణం తనకు అనిపించింది.....పెళ్ళి అన్నది బాధ్యత. అలా తను చేసిన పనికి బాధ్యత తీసుకోని వాడిని ఎలా అడుక్కుని పెళ్లి ఎలా చేసుకునేది అనిపించింది. ఆ రోజు కిరణ్ తన చెయ్యి పట్టుకున్నప్పుడు గుండెల్లో బాధ కలిగింది వేదకు...ఆ బాధ పోనేలేదు....పెళ్లి జరిగినా బాధను భరించాల్సిందే ...జరక్కపోయినా బాధ ను భరించాల్సిందే...అనుకుని కిరణ్ వైపు దిగులుగా చూసి ఏమి చెప్పాలో తెలియక మూగగా చూస్తూ ఉండిపోయింది వేద ఎప్పుడు అనుకునేది మగ ఆడ సమానం...ఇద్దరికీ బాధ్యతలు ఉంటాయి...అలాంటి వేద అతనికి తినుబండారాలు పెట్టి అతను తింటూ ఉండగా దీనంగా చూస్తూ దిగులుగా నేలపై కూర్చున్నది. పూర్తిగా అతని పై మమకారాన్ని పెంచుకున్నది. తమ ఇంట్లో అమ్మ ...పిన్నమ్మ..పెద్దమ్మ..అమ్మమ్మ ..ఎవరైనా సరే అలా నేలపై కూర్చొని మగవారిని పైన కూర్చో బెట్టి సపర్యలు చేస్తారు. అలా వేద కూడా అతనిని అంతగా నమ్ముకున్నది. అతని ప్రేమ దొరకక ఆమె అతనికి codependent అయింది. ఆమె అప్పుడు అతనికి సబ్మిసివ్ కాకూడదు అనుకునింది. తరువాత వేద కు వేరొక పెండ్లి జరిగిన తరువాత ఆమె ఎప్పుడు నేల పై కూర్చోలేదు. భర్తతో సరి సమానంగా కూర్చున్నది. అతను ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకునే వాడు తనతో సరి సమానంగా. వేద .... కిరణ్ పెళ్లి కార్డు ఇచ్చి వెళ్ళాకా బాధపడుతూ...అనుకున్నది....ఇప్పుడు ఇతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా... లేక విషం పెట్టి చంపాలా..వాళ్ళ ఇంటికి ఆత్మకూరు కి వెళ్లి పెళ్లిని నిలపాలా....నా చెయ్యి పట్టుకుని వదిలేశాడు అని చెప్పాలా? పో మా చెయ్యి పట్టు కుంటే ఏమౌతుంది అంటారేమో? తన జీవితాన్ని నాశనం చేసి... పెళ్లి చేసుకోబోతున్నాడు. అతను తనను మోసం చేసాడు... అయ్యో అనుకుంటూ... వద్దు ప్రేమ అంటేనే ఇవ్వడం అతనికి ఏమి కావాలో తీసుకోని... అనుకుని మనసుని స్థిమితం చేసుకుంది. ప్రేమ పెళ్లి అంటేనే ఎంతో మంది ని ఒప్పించాలి. అతని ఇంట్లో నచ్చచెప్పాలి. మా ఇంట్లో వాళ్ళని కనికరించమని అడగాలి. ఇక నేను అతనిని బిచ్చం అడుక్కోవాలా నన్ను పెళ్లి చేసుకో అని అనిపించింది. నాకు కొంచమైనా సిగ్గు ఉందా లేక పూర్తిగా సిగ్గు వదిలేసానా అని దుఃఖం వచ్చింది. అయినా అతనికి ఏమి కుటుంబ బాధ్యతలు ఉన్నాయో. నిజంగా ప్రేమ అన్నది అతని మీద తనకు ఉంటే అతనికి అడ్డుపడకూడదు అని తలచింది. వెంటనే కిటికీలు తెరిచింది. మూసిన తలుపులు తెరవగానే చల్లటి గాలి ఇంటి లోనికి చొరబడింది. వేద నవ్వుతూ వంట గది లోనికి వెళ్లి పళ్ళ రసం తెచ్చి కిరణ్ కు ఇచ్చింది. వెళ్ళేటప్పుడు అతను వేద వైపు చూసి "తప్పకుండా పెళ్లి కి రావాలి" అన్నప్పుడు "నేను పెళ్లికి రాలేను' అని వేద అన్నది. వెంటనే కిరణ్ గుండ్రని కళ్ళతో " ఏమి చెప్పు ఏమి చెప్పు ఎందుకు రాలేవు " అన్నప్పుడు "మా ఇంట్లో పంపరు" అన్నది వేద వెంటనే. కిరణ్ వేద వైపు చూసి "మళ్ళీ మీ ఇంటికి ఎప్పటికీ రాను" అంటే వెంటనే వేద "రావద్దు ఇక ఎప్పటికీ" అన్నది. ఆ క్షణం అనుకున్నది వేద...ఒరేయ్ నీకు తెలియట్లేదు రా మన ఇద్దరి మధ్య ఉన్న బంధం....పోరా పో...నా గురించి నీకు తెలియదు అనుకున్నది.... నాకు తెలుసు నువ్వు తిరిగి వస్తావు....అప్పుడేం చేసేది నేను అనుకున్నది.. అతన్ని తనకు భర్తగా అనుకుని అతనికి తనతో బంధం వద్దు అనుకుంటున్నాప్పుడు తాను బలవంతం చేయకూడదు. అతనికి ఏమి కావాలో చెయ్యని అనుకున్నది. కానీ దిగులుగా మళ్ళీ ఆలోచించింది...పెళ్ళి పత్రిక లో ఉన్న ఇంటి అడ్రస్ కి వెళ్లి పెళ్లిని ఆపమనాలి అనుకున్నది. వేద కు గుండె పగిలి పోతున్నది. మళ్ళీ ....వద్దు వెళ్లి పోనీ ...బలవంతం వలన బంధాలు నిలబడవు అనుకున్నది. అతని ఇంటికి తాను వెళ్ళాలి అంటే అతను నిలబడడం లేదు కదా అనుకున్నది. వేద షాప్ లో తెగ తిరిగి ఏమి బహుమతి ఇద్దామా అని ఆలోచించి... బహుమతిగా కిరణ్ పెళ్లి కి ఒక గడియారం కొని సరళ దగ్గర ఇచ్చింది. smile always.... అతను ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలి అని కోరుకున్నది.ఈ గిఫ్ట్ కిరణ్ కి ఇవ్వండి అంటూ ఇచ్చేటప్పుడు కూడా ...... సరళ మొహం లో నవ్వు....ఎగతాళి నవ్వు...ఇక మీరిద్దరూ జన్మలో కలవలేరు.....అని ఆనందం. బహుశా ఆమెకు తెలుసు....కిరణ్ వేద ఒక్కటి అయితే సరళ దూరం కావాల్సిందే .. అందుకే ఆవిడ ఎప్పటికీ వారిద్దరినీ కలవనీయదు ...ఆవిడకు తెలుసు....వేద కిరణ్ ను ఆమె నుండి వేరు చేస్తుంది అని??? ఎలాగో కిరణ్ వేదను వద్దు అనుకున్నాడు....చాలు...!!! ఆమెకి కావాల్సింది అదే...ఒక మగ వాడికి అంతకు ముందే ఒక ఆడదానితో మానసిక అనుభందం ఉన్నప్పుడు....ప్రేమ లో పడినా....అతను ఆ ప్రేమకు నిలబడలేడు. కిరణ్ తన పెళ్లి అయిన పదమూడవ రోజు వేద పనిచేస్తున్న పరిశోధన ఆలయానికి వచ్చాడు. అప్పటికే వేద అక్కడ ఉన్న తన స్నేహితులకు "కిరణ్ ను ప్రేమించాను అని చెప్పాను...కానీ అతను జవాబు ఇవ్వలేదు. అమ్మాయి దొరికింది...వెంటనే పెళ్ళి చేసుకుంటున్నాడు" అని చెప్పింది...దిగులుతో భారమైన హృదయం తో కాలం గడుపుతూ ఉంది. కిరణ్ ఆటవిక పరిశోధనశాల లోకి రాగానే...వేద ఉన్న గది లోకి వచ్చేటప్పటికి...వేద అతని కోసం ఎదురు చూస్తూ ఉంది...వస్తాడు అని తెలుసు... వేద అటు చూడగానే "అదిగో వచ్చాడు"...తన కళ్ళు అతనిని చూడగానే విచ్చుకున్నాయి ఆనందము తో ప్రేమతో...excitement.అది అతను చూసాడు. వచ్చి వేదకు నేరుగా కూర్చున్నాడు..... " కొత్త పెళ్లి కొడుకు ముస్తాబు లో"... వేద తన వైపు చూసి "పెళ్లి పార్టీ" అనగానే ఇస్తాను అని ...గెస్ట్ లైన్ హోటల్ కి తీసుకుని వెళ్లి సమోసా ఇంకా టీ ఆర్డర్ పెట్టి తన కళ్ళల్లోకి చూడగానే వేద తన తల పక్కకు తిప్పుకుంది. ఎందుకో తెలియదు కానీ ఆ రోజు నుండి కిరణ్ అక్కడే వేద ఉన్న పరిశోధన ఆలయం లో ఉండిపోయాడు. అక్కడే పరిశోధన మొదలు పెట్టాడు. నిజానికి కిరణ్ వేదను చూడకుండా ఉండలేడు. కానీ తప్పు జరిగిపోయింది. అతనికి పెళ్ళి అయిపోయింది. కిరణ్ భోజనం తెచ్చి తినమని అన్నప్పుడు వేద నాకు వద్దు అంటే...కిరణ్ అందరి ముందు వేద వైపు చూస్తూ అన్నాడు"నువ్వు తినకపోతే నేను తినను". వేద తనలో తానే ప్రశ్నించుకున్నది.... "ఇది ఏంటి...ఇతనికి పెళ్లి అయ్యింది...ఇప్పుడు ఇక్కడకు వచ్చి ప్రేమను చూపిస్తున్నాడు... తాను అతని చుట్టూ తిరిగినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఇక్కడకు ఎందుకు వచ్చాడు" అనుకున్నది. ఒక రోజు కిరణ్ అన్నాడు..." నీ ఫోన్ నెంబర్ ఇచ్చాను సుజి కి. సుజి ఏమి చెప్తుందో నాకు చెప్పు "...అనగానే వేద నిశ్శబ్దంగా వినింది. ఆ మరుసటి రోజు...సుజీ ఫోన్ చేసింది వేద కు ...."నాకు అబార్షన్ అయ్యింది. కిరణ్ కు చెప్పండి " అన్నది. ఆ మాటలు వేద కిరణ్ కు చెప్పింది.ఏంటి నేను ఎలా కనిపిస్తున్నాను కిరణ్ కు. తనను ఎందుకు ఇంత అవమానిస్తూ హింసిస్తూ ఉన్నాడు. వేద ఆ క్షణం లో కుళ్ళి కుళ్ళి ఏడ్చింది లోలోపలే. వేద బాధ పడి పడి కిరణ్ కు తల్లి అయ్యింది. అంటే అంత ప్రేమ...భరించింది. మనస్సు ఖాళీ అయ్యి పోయింది.కిరణ్ వేద తో ఏదో చెప్పాలని చెప్పలేక... వేద వినాలని అనుకోలేదు....ఎందుకు వచ్చావు అని అడగలేదు...కోపం కిరణ్ మీద వేద లో...వేద స్నేహితురాలి గా అతని తో మాట్లాడేది.వేద మనస్సు ఎండిపోయింది. కోపాన్ని చంపుకుని... ప్రేమను పంచడం మొదలు పెట్టింది. అది ఏరోజు అయినా ఆమెను కాల్చేస్తుంది అని ఆమెకు తెలుసు. ఆమెకు తప్పక మానసిక రోగం వస్తుంది అని తెలుసు... ఎందుకంటే... కోరికలు చంపుకుంది.... ప్రేమను చంపుకుంది.... కోపాన్ని దిగమింగింది... ఏమి తెలియనట్లు చెయ్యి పట్టుకుని మాటలతో అమ్మాయిని వంచించి ...హాయిగా పెళ్ళి చేసుకుని....ఏమి తెలియనట్లు ఫారెస్ట్ officeకి వచ్చి ప్రేమను చూపించి ...మోసం మోసం.... వేద వదలలేదు....అతనిని చూడడానికి వెళుతూనే ఉంది....కబుర్లు చెబుతూ నవ్వుతూ...మరి తను పట్టుబడింది...అతను పట్టు బడాలి కదా.... పైన పంచ భూతాలు ఉన్నాయి...ఆకాశంలో దేవతలు ఉన్నారు....వూరుకుంటారా....!!!! మానం పొయ్యింది కానీ ప్రాణం పోలేదు కదా. చెయ్యి పట్టుకున్నాక వదలాలి అంటే ఒకటి తన ప్రాణం అన్నా పోవాలి లేదా వాని ప్రాణం అన్న పోవాలి లేదా ఇద్దరి ప్రాణాలు అన్నా పోవాలి....అదే కదా ధర్మం. బతికి చూపించాలి అనుకున్నది. ఆమెకు పిచ్చి పట్టింది....అది ఆమెకు తెలియదు. ఒక రోజు వేద విశ్వవిద్యాలయం లోని ల్యాబ్ కి వెళ్ళగానే ...సరళ వేద ఒళ్ళో పడుకుని ఏడ్చింది..."కిరణ్ జీవితం నాశనం అయ్యింది" అన్నది. కిరణ్ లోపలి రాగానే వేద కిరణ్ ని అడిగింది...."ఏమి సార్ మీ అక్క ఏడుస్తుంది" అన్నది. "నీ భార్య ఎలా ఉంటుంది" అన్నది...కిరణ్ వేద వైపు చూస్తూ "నీలాగా ఉంటుంది" అన్నాడు. సరళ చిన్నగా నవ్వుతోంది. వేద అనుకున్నది మనస్సులో "సరళ ను తాను వచ్చి అడిగింది కదా పెళ్లి చేసుకోవాలి అని...మరి ఈమె తెలిసి ఏడుస్తుందా లేక నటిస్తుందా" అనుకున్నది. తరువాత ఒక రోజు సరళ తన అన్న పెళ్ళికి వేద ఇంటికి వచ్చి పిలిచింది... ....వేద పెళ్ళికి వెళ్ళింది...పట్టు చీర కట్టుకుని...జుంకాలు పెట్టుకుని...నగలు వేసుకుని...... సరళ వేద ను చూడగానే "ఇటు రా" అంటూ ఒక గుంపులో కూర్చోబెట్టింది....కిరణ్ భార్య అంటూ ఒక అమ్మాయి ని పరిచయం చేసింది. కిరణ్ చెల్లెలు, తమ్ముడు అంటూ పరిచయం చేసింది.... అటు దూరంగా కిరణ్... వేద కిరణ్ వైపు చూడగానే ... కిరణ్ వేద కళ్ళలోకి చూస్తూ.... కిరణ్ వేద కళ్ళు కలుసుకున్నాయి... వేద కళ్ళతోనే కిరణ్ ని ప్రశ్నించింది..... "ఇది ఏంటి" .... భార్యా రూపవతీ శత్రుః.....అనుకున్నాడా? డబ్బు చాలు అనుకున్నాడా??? అంతలో కిరణ్ తండ్రి చనిపోయాడని తెలిసింది. వేద వెళ్లి కిరణ్ ను కలిసి తన సానుభూతి తెలిపింది. "సార్ ఏమి జరిగింది" అని కిరణ్ ని అడిగింది... గుండె పోటు వచ్చి పోయాడు నాన్న అని చెప్పి తల వంచుకున్నాడు. కోపం తీర్చు కోవాలంటే బాగా తిట్టి కొట్టోచ్చు...కానీ ప్రేమతో ఇంకా బాగా మనిషి లో మార్పు తేవొచ్చు... అతను తనని వద్దు అనుకున్నా కూడా తాను అతని బాగస్వామి కదా మానసికంగా! అతనిని తాను వద్దు అనుకోలేదు!! కిరణ్ సరళ ఇంటి దగ్గర లోనే ఒక ఇంట్లో తన కొత్త కాపురం పెట్టాడని వేద కు తెలిసింది. వేద సరళ ఇంటి కి వెళ్లి కిరణ్ ను కలిసి అతని చెల్లెలి కాలేజీ అడ్మిషన్ కోసం వివరాలు చెప్పింది. Dare... ప్రేమ లో గేమ్ లో dare కూడా ఒక భాగమే... కిరణ్ భార్య pregnant అయితే గాజులు ఇద్దాము....కుంకుమ పువ్వు ఇచ్చి పండంటి బిడ్డ కలగాలి అని కోరుకుందాం అనుకున్నది. మనం మంచే కదా కోరుకోవాలి. ఆ రోజు కిరణ్ ను కలిసి నప్పుడు కిరణ్ చూపు లో... అదో తియ్యదనం . తరువాత వేద తనకు తానుగా ఆటవిక పరిశోధన శాల లో జాబ్ మానేసి విశ్వవిద్యాలయం లో బోధకురాలి గా వెళ్ళిపోయింది. ఎందుకంటే తన మనస్సు వాని చుట్టూ తిరుగుతోంది... వాడికి పెళ్ళి అయిపోయింది...అతను HPLC వర్క్ చేస్తున్నా...తన పని అయ్యాక...వాడి దగ్గర కూర్చోవడం మొదలు పెట్టింది...అతను తన స్నేహితుడే....కానీ వానికి తనకు మధ్య అంతరం... పది మంది లో ఎంత నామర్ద.... కిరణ్ కు ఫోన్ చేసి చెప్పింది..."నేను ఇక్కడ జాబ్ మానేసాను. నువ్వు వర్క్ చేసుకో" అన్నది..... కిరణ్ గొంతులో ఏదో కలవరం. కిరణ్ కు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్తే.... కిరణ్ తన భార్య పేరు తన పేరు కలిసి వచ్చినట్లు సుజికిరణ్ అని గ్రీటింగ్ పంపాడు. ఆ రోజు వేద కు దుఃఖం ఆగలేదు. కిరణ్ తనను ఎందుకు బాధ పెడ్తున్నాడో వేద కు అర్థం కాలేదు. అతను గేమ్ ఆడుతున్నాడు తన జీవితం తో అనుకున్నది. నాకు పెళ్ళి ఐపోయింది ఇక నువ్వు నన్ను ఏమి చెయ్యగలవు అని సవాలు విసురుతున్నాడు ..పిచ్చి ప్రేమ అంతే కదా? గాయ పడిన వానికి తెలుస్తుంది బాధ ....గాయం చేసిన వాడికి ఏమి తెలుస్తుంది. వేద దిగులు తో లాబ్ కి వెళ్ళినప్పుడు కిల్లర్ పాటలు పెద్దగా వినిపిస్తున్నాయి. లోపల చూడగానే....కిరణ్ ...సరళ ఇచ్చిన పెళ్ళి గిఫ్ట్ అతి పెద్ద టేప్ రికార్డర్ లో పాటలు పెట్టుకుని స్నేహితులతో కలిసి నవ్వుతూ ఆనందంగా ఉన్నాడు. వేద ను చూడగానే ఇద్దరి కళ్ళు కలుసుకుని విడిపోయాయి.వేద మూగగా రోదిస్తూ ఉంది. ఇంట్లో వేద కు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు...ఒక దాని తరువాత ఒకటి...అమ్మ నాన్నలు ఎందుకు తనతో ఆడుకుంటున్నారు అనుకున్నది వేద. తమ్ముడు వేద తో మాట్లాడుతూ తన చేతి ముద్ర తీసుకుని వెళ్లి కంచి నుండి జాతకం తెచ్చాడు. అమ్మ దగ్గర నుండి ఒకటే పోరు. నీ జాతకంలో నువ్వు పూర్వ జన్మలో ప్రేమికులను విడదిసావని ఉంది. అందుకే నీకు పెళ్ళి కావట్లేదు అని ఒకటే హింస. వేద మనస్సులో అనుకున్నది...నేను ప్రేమించిన వాడినే వదులుకున్నాను....పెళ్ళి చేసుకుని నా దగ్గరకు వస్తే...వచ్చాడు కదా అని నేను భార్య భర్త లను విడదీయలేదు...నన్ను నిందిస్తున్నావు అనుకున్నది. ఆరోజు వేద ఇంటి ముందు నిల్చొని రాత్రి బాగా చీకటిలో బయటకు చూస్తూ ఉంది....ఒక మోటారు బండి ఇంటి ముందుకు వచ్చినట్లే వచ్చి సర్రుమని తిరిగి వెనకకు వెళ్లి పోయింది. వేద గమనించింది.... అది వేరెవరో కాదు ....కిరణ్ .... మరుసటి రోజు కిరణ్ ని కలవడానికి వెళ్లి కిరణ్ ని అడిగింది...రాత్రి చీకటిలో నువ్వు మా ఇంటి వైపు వచ్చి నన్ను చూసి వెనకకు తిరిగి వెళ్ళావు కదా అన్నది...కిరణ్ వెంటనే నేను కాదు అన్నాడు... వేద లేదు నిన్ను నేను చూసాను అని దిగులు తో అంటూ ఉంటె ..సరళ వేద వైపు చూసిి" కాదంటున్నాడు కదా. ఇంకా ఎందుకు అడుగుతున్నావు" అన్నది. కిరణ్... సరళ తో "నువ్వు ఊరుకో అని ఇప్పటికే నా కోసం ముగ్గురు కొట్టుకుంటున్నారు" అన్నాడు. అప్పుడు వేద వెంటనే ఎవరా ముగ్గురు అన్నది. సరళ నవ్వుతూ ఉంది. సిగ్గులేని జీవితాలు? అతని లో ఒక గర్వం...నా కోసం ఎంత మంది కాసుకుని ఉన్నారు...అని మద గర్వం...ఇంకా వేద మనస్సు తో ఆడుకుంటునే ఉన్నాడు. వేద ఏదైనా కొత్త కోర్స్ చెయ్యాలి అనుకున్నది. జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని నాన్న తో కలిసి చెన్నై వెళ్ళింది. చెన్నై లో దామోదర్ అంకుల్ ఇంట్లో నాన్న వదిలి పేట్టి వెళ్ళిపోయాడు. దామోదర్ అంకుల్ డ్రైవర్ నీ పంపితే అలా మొత్తం చెన్నై చుట్టి వచ్చింది. మెరీనా బీచ్ లో జంటలను చూడగానే తాను ఒంటరి అని గుర్తుకు వచ్చింది. కిరణ్ తలని పట్టుకుని బాధతో తన స్నేహితుడు గోపాల్ తో అన్నాడు.."వేద ఇంకా నన్ను వదిలి పెట్టడం లేదు. నాకు పెళ్ళి అయ్యింది. సంసారం ఉంది అని తెలిసి కూడా నా చుట్టూ ఇంకా తిరుగుతున్నది". చెన్నై నుండి తిరిగి వచ్చాక వేద ని పరిశోధన శాల లో చూసి వెంటనే కిరణ్ ఏదో పని ఉన్నట్లు వెళ్ళిపోయాడు. అతని లోని ఫీలింగ్స్ చూసి వెంటనే సరళ ను అడిగింది వేద "ఇప్పట్లో రాడా కిరణ్". సరళ ఏమో తెలియదు అన్నట్లు చూసింది.వెంటనే వేద కిరణ్ కు ఫోన్ చేసి అన్నది ...."రా...నీతో మాట్లాడాలి". కిరణ్ వెంటనే "నేను రాను" అంటే వేద వెంటనే అన్నది "ఎందుకు రావు? రా"అన్నది. కిరణ్ "సరే ఎక్కడకు వచ్చేది" అంటే...వేద అన్నది " స్నో ఫీల్డ్ కి రా " అన్నది. అక్కడకు కిరణ్ వెళ్ళగానే వేద బోరున ఏడుస్తూ ఉంది. చుట్టు చాలా మంది కూర్చుని ఐస్ క్రీం తింటున్నారు.కిరణ్ తనకు ఎదురుగా కూర్చొని "ఏమి ఏడుస్తున్నావు ..ఎవరినైనా ప్రేమించావా" అని అడిగాడు... వేద "ఔను అన్నట్లు తల వూపింది".కిరణ్ "ఎవ్వరిని చెప్పు... ఎవ్వరిని చెప్పు" అని అడిగాడు ...వేద కండ్లల్లో నీళ్లతో .... వెంటనే కిరణ్ చెయ్యి పట్టుకుంది...అది dare అంటే ......... పది మంది లో చెయ్యి పట్టుకోవడం. కిరణ్ " నాకు పెళ్ళి అయిపోయింది" అని చెప్పి వెంటనే చెయ్యి విడిపించుకున్నాడు"... వెంటనే కిరణ్ దురుసుగా అన్నాడు... "నువ్వు నాకు ఏమిచ్చావు".."ఆ గ్రీటింగ్ కార్డ్ ఒక్కటే కదా...అది మీ ఇంటికి పంపిస్తాను". మీ అమ్మా నాన్నకు చెప్తాను. మీ తమ్ముళ్లకు చెప్తాను అనగానే విస్మయం వేద కళ్ళల్లో. ......వేద మనస్సు విరిగి పోయింది... కానీ దొంగగా ఎవ్వరు చూడకుండా తన చెయ్యి పట్టుకున్న కిరణ్ ఎక్కడ...పదిమందిలో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెయ్యి పట్టుకున్న వేద ఎక్కడ....ఆమె సింహమే కదా!!! కిరణ్ వెంటనే... వేద "ఇక రా పోదాం ఇక్కడ నుండి".... గోపాల్ నేను బయలు దేరుతున్నప్పుడే అడుగుతున్నాడు "ఎక్కడికి రా" అని అంటూ.... "కళ్ల నీళ్లు తుడుచుకో" అంటూ "ఈ చీర బాగుందే ...ఎవరు సెలెక్ట్ చేశారు" అన్నాడు మాట మారుస్తూ.... వేద నేనే అన్నట్లు తల ఊపింది. కానీ ఆ క్షణమే వేద గుండె పగిలింది....కిరణ్ నవ్వు చూడగానే. కానీ కిరణ్ మొహంలో ఎంతో ఆనందం... వేద తరువాత కిరణ్ ని కలవడం మానేసింది. ...కానీ కిరణ్ తన స్నేహితులతో కబురు పంపాడు...వెళ్లి ఏమి అని అడగగానే....ఏమి రావడం మానేసావు అన్నాడు..."ఇక రాను" అన్నది వెంటనే... చలం ఒక రోజు వేద తో అన్నాడు....వేద నేను కిరణ్ సార్ రూం లో ఉంటాను....నువ్వు అడుగుతావా అనగానే వేద అడుగుతాను....అని అడిగి అడగగానే ...కిరణ్ పంపించు అన్నాడు. కిరణ్ ఉద్దేశం లో వేద అతడి భార్య....మరి ఆమె అడిగితే కాదంటాడా.... ప్రేమిస్తున్నాను అని గ్రీటింగ్ పంపినా కదలని వాడు, వెంటపడి వెనకే వెళితే చిన్న పిల్ల అన్నవాడు, ఎదురుగా వచ్చినా పట్టించు కోని వాడు, వాడికి పెళ్ళి అయినా...కలలో రారాణీ ఆమె...కానీ ఇలలో ఆమెకు అతనికి ఏ సంబంధం లేదు. కిరణ్ తరువాత వేద సాయంత్రము చదువుకుంటున్న ట్యుటోరియల్ కి వచ్చాడు....దిగులుతో వేద తన పొడవాటి జుట్టు కత్తిరించుకున్నది. ఎందుకంటే అతన్ని... నీ భార్య ఎలా ఉంటుంది అని అడిగితే...నీలాగా అంటే ఏమిటి అర్థం... తన లాగా పొడవు జుట్టా... లేక పొట్టి జుట్టా...లేదా వాని ఉద్దేశం తానే వాడి భార్య ? అనుకున్నది. . ..... వేద కిరణ్ వైపు చూసి "నా హెయిర్ చూడు" అనగానే."అలాగే మైంటైన్ చెయ్యి" అన్నాడు కిరణ్.....పక్కనే చలం...రండి సార్ వెళ్దాము అని పిలవగానే నిశ్శబ్ధంగా వెళ్లి పోయాడు. వేద చైనా కు పరిశోధన నిమిత్తం వెళ్ళాలని అనుకున్నది....ఢిల్లీ కి ఇంటర్వ్యూ కి వెళ్ళింది... ప్చ్ ..అది అప్పటికే వెరెవ్వరి కోసం ఇచ్చేశారు... చైనా లో phd వచ్చి ఉంటే దూరం వెళ్లిపోవాలి అనుకున్నది...రాలేదు... రోజు రాముల వారి గుడికి వెళ్ళడం...అయ్యో ఏమి చెయ్యాలి నేను అని ఆ దేవునితో మొరపెట్టుకోవడం...నాకు దారి ఏది అని ప్రార్థించడం...చివరకు ఒక రోజు పూజారిని అడిగింది...స్వామి నాకు దారి ఏమిటి...ఆయన ఆమె వైపు మౌనంగా చూసాడు. ఆరోజు లైబ్రరీ కి వెళుతూ ఉన్నప్పుడు...అమ్మ అన్నది వేదతో "ఎవరు వస్తున్నారు అక్కడకు? వేద నిశ్శబ్ధంగా అమ్మను చూసి ముందుకు వెళ్ళిపోయింది.తన కోసం ఎవ్వరు వస్తారు? కిరణ్ ను కలవడానికి లాబ్ కు వెళ్ళినప్పుడు ...రోజు లైబ్రరీ కి వెళ్తున్నాను అని చెప్పింది. అతను విని ఊరుకున్నాడు. ఒక రోజు తన స్నేహితురాలు పద్మిని... వేద తో అన్నది...కిరణ్ సార్ సెమినార్ కు వచ్చాడు.... తరువాత కలిసినప్పుడు వేద కిరణ్ తో అన్నది...నువ్వు అక్కడకు సెమినార్ కు వెళ్ళావట కదా...అనగానే...వేద వైపు కోపంగా చూస్తూ అన్నాడు "ఏమి చెప్పావు పద్మిని తో...చెబితే నీకే అవమానం" ... వేద అనుకున్నది నాకు అవమానం అయితే నీకు లేదా? తరువాత ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కోసం తయారు అయ్యింది....క్వాలిఫై కాలేదు...ఇక గేట్ రాసింది... ఊహూ రాలేదు... కిరణ్ ను కలిసి అతని బుక్ఇచ్చేసి వచ్చి లైబ్రరీ లో కూర్చొని తల వంచుకుని వాడిని వదిలి ఉండలేక పోతున్నాను అని ఏడుస్తుంటే... ఎదురుగా కిరణ్ వచ్చి నిల్చొని....వేద అనగానే తల ఎత్తి చూసింది... అతను...ఏడవద్దు...అంటూ... బోంచేశావా అనగానే...లేదు అని వేద తల ఊపగానే...వెళ్లి ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యి అంటున్నప్పుడు వేద అతని వైపు సూటిగా చూసింది... అతని మనస్సులో శాడిస్టిక్ ఆనందం. ఆమె బాధపడితే అతనికి ఆనందం. అతను తల వేరొక వైపు మళ్ళించుకున్నాడు....వేద కన్నీళ్లు తుడుచుకుని ఇంటికి వెళ్ళింది. ఎవరున్నారు....ఇంటిలో వేద కోసం ఎదురు చూస్తూ...??? అమ్మ??? నాన్న??? కొత్త బండి కొనగానే....వేద లాబ్ కు వెళ్ళినప్పుడు....కిరణ్... ఉండు...నేను వస్తాను అని గాంధీ రోడ్ వరకు బండి లో వచ్చి వేద తో కలిసి....గాంధీ రోడ్ లో పాలకోవా తీసిచ్చి... బిల్ నువ్వే పే చెయ్యి అని వేద తో అని...ఇక పో నువ్వు....నాకు పనుంది అని వెళ్ళిపోయాడు. వేద బెంగుళూరు కు పరిశోధన కోసం వెళ్ళినప్పుడు కిరణ్ కు ఫోన్ చేసి చెప్పింది..."ఇక్కడ చాలా చలిగా ఉంది" వెంటనే కిరణ్ అన్నాడు "నాక్కూడా". మనస్సులో ఆశలు కోరికలు చచ్చిపోయాయి వేదలో....ఇంట్లో తల్లి తండ్రి...ఎవరిని అయినా ప్రేమించావా...తీసుకునిరా...పెళ్ళి చేస్తాము...అనగానే వేద అమ్మ వొళ్ళో తల పెట్టుకుని బోరున ఏడ్చింది... ఒక రోజు లాబ్ లో మాట్లాడుతూ కిరణ్.... నేను మీ మహిళా యూనివర్సిటీ కి వచ్చాను. నిన్ను కిటికీలో నుండి చూసాను అనగానే అమాయకంగా వేద నిజం గా అని అడగ గానే కిరణ్ నిజం అంటూ నవ్వాడు. వేద కు తెలుసు ఏది నిజం ఏది అపద్ధం అన్నది. కిరణ్ లాబ్ లో work చేసుకుంటూ ఉన్నప్పుడు...వేద ను ఆ రోజు చూడగానే.... ఏరా ఇంట్లో చెప్పి ఉంటుందా ...అని తన స్నేహితులతో అంటూ వేద ను చూస్తూ అటు ఇటు తిరుగుతుంటే వేద అనుకున్నది....వెదవ ఏమి చెప్పాలి ఇంట్లో....నీకు పెళ్ళి అయిపోయింది అనా అనుకున్నది. వేద లాబ్ కి వెళ్ళినప్పుడు ఒక రోజు వేద వైపు చూస్తూ "ఎక్కడికైనా ఎత్తుకుపోవాలని ఉంది" అనగానే ఆ మాటలు సూటిగా వేద హృదయాన్ని తాకాయి. వేద చేతిలో ఉన్న జెల్ ప్లేట్స్ వదిలేసి ఏమి ఆలోచన లేక నిశ్శబ్దంగా కూర్చుంది. సరళ వేద వైపు చూస్తూ నవ్వుతూ ఉంది. కిరణ్ రీసర్చ్ అయిపోయింది...ఒక రోజు వెళ్లి వేద కలిస్తే "నేను ఇక వెళ్ళి పోతున్నాను అనగానే" ఆమెలో ఏదో దిగులు....లెటర్స్ రాయి ఈ address కు అనగానే దిగులు తో అతనిని చూస్తూ తల ఊపింది... ధర్మేచ, అర్ధేచ, కామయేచ (కాంయ్యేచ) నాతి చరితవ్యా....అతనిని నేను అనుసరించలేను.... కానీ నేను ఎక్కడకు వెళ్ళేది? ఆ రోజు వేద కిరణ్ కి ఫోన్ చేసింది. ఎవరో వ్యక్తులు ఫోన్ తీశారు. కిరణ్ కావాలి అనగానే ఎవరని చెప్పమంటారు అని అడిగారు... సుజి అని చెప్పండి అనింది. కిరణ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏమి అన్నాడు. నేను సుజి ని కాను వేదని అని " నన్ను వదిలి వెళతావా" అని అడిగింది.వెంటనే కిరణ్ అన్నాడు "ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తాము... పోయేటప్పుడు ఒంటరిగా పోతాము".వెంటనే "సరేనని" ఫోన్ పెట్టేసింది వేద . తరువాత కిరణ్ ఒక రోజు వేద వైపు చూసి ..."పది మంది తో తిరిగి ఒక్కరిని ఎంచుకుంటుంది"...అన్నప్పుడు వేద కదిలి పోయింది ఆ మాటలకు....ఆ రోజు రాత్రి ఇంటికి కాల్ వచ్చింది..ఎవరో లో గొంతుక తో అంటున్నారు..."143 "...తను వెంటనే అన్నది దుఃఖం తో "రాస్కెల్ ఇడియట్ ఎవరినన్నా అక్కడ చూసుకో".. వెంటనే అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. నాన్న కూడా బాధపడుతూ వచ్చి ఫోన్ తీసుకుని .."ఎవర్రా అది" అన్నారు.... కిరణ్ తన చెయ్యి పట్టు కోకుండా ఉంటే అది వేరే సంగతి. కానీ చెయ్యి పట్టుకుని ఒక బంధం ఏర్పడినాక ఆ అమ్మాయిని వదిలివేయడం అంటే??? వాడు మనిషేనా???వేద పంచ భూతాలను ప్రార్థించింది. తన చెయ్యి పట్టుకుని తన మానం తీసేసి మనోచోరుడు అయ్యి ఏమి తెలియనట్లు పెళ్ళి చేసుకుని ముసుగు ఒకటి వేసుకుని మంచివాడు అన్నట్లు ఉన్న కిరణ్ పట్టుబడాలి అని ప్రార్థించింది. ప్రతి రోజు రాముల వారి గుడికి వెళ్లి పంచ భూతాలను "నా ప్రేమ నిజమైతే వాడు పట్టుబడాలి" అని ప్రార్థించింది. చావా బతుకా అనుకుంటూ ...అతనికి తన ప్రేమ ను తెలుపుతూ ఉత్తరాలు రాసింది. నాకే పెళ్ళి అయితే కొడుకు పుడితే సూర్య కిరణ్ అని పేరు పెట్టుకుంటా. కూతురు పుడితే సూర్య మేఘా అని పెరు పెట్టుకుంటా. ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై కల కాలం నిలిచిపోవాలి మన మిరువురం అని అంటూ కన్నె కలలు అన్నీ కలిపి తన ప్రేమ ను ...అదే అంత కాలం లోలోన దాచుకున్న ప్రేమ ను అతని పై కుమ్మరించింది. అతని భాషలో అవి ఫీల్లింగ్స్. వేద కు ఇంట్లో బాధలు... .ఆ రోజులలో ఒక రోజు ...వేద తన స్వంత తమ్ముడి దగ్గర harassment కు గురి అయ్యింది...ఇంట్లో ఉండలేక హాస్టల్ లో ఉందాము అనుకున్నది...అమ్మకు చెప్పింది నేను ఇంట్లో ఉండాలి అంటే నాకు నేను చెప్పేటంత వరకు పెళ్ళి చేయవద్దు...అమ్మ ఒప్పుకున్నది....ఎవ్వరికీ చెప్పుకోలేక దిగులుతో రంజని దగ్గరకు వెళ్ళింది....రంజని వేద కళ్ళల్లో బాధను వ్యధను చూసింది... ఒక రోజు కిరణ్ దగ్గర నుండి... ఫోన్ ..."నిన్ను కలవాలి" అన్నాడు. ఎక్కడ అని అడగగానే "లైబ్రరీ దగ్గరకు రా"..అన్నాడు.......వేద అక్కడకు వెళ్లిన వెంటనే... వెంకట రమణయ్య అక్కడ కనిపించాడు... .వేద రమణయ్య వైపు చూసి ఏమి సర్ ఇలా వచ్చారు అనగానే.... ఏమి లేదు అని వెళ్ళిపోయాడు...కాసేపటికి కిరణ్ అక్కడకు వచ్చాడు... పిరికివాడు.... ఇంకా పాపం రమణయ్య తోడు కావలసి వచ్చింది... వేద అక్కడ విషయాలు ఇక్కడ విషయాలు మాట్లాడుతూ ఉంటే... విని ఊకొట్టి వెళ్ళిపోయాడు... ఎందుకు ఇప్పుడు వచ్చాడు అన్నది వేదకు అర్థం కాలేదు... .. సరే ఇంకొక అవకాశం ఇద్దాము అనుకున్నది వేద. బహుశా రంజని దగ్గరకు తాను బాధతో వెళ్లిన విషయం వానికి రంజని చెప్తే వచ్చాడా??? ఒకరొజు స్వంత తమ్ముడు తన పైన పడుకుని ఉన్నాడు. తాను...మంచి..నిద్రలో..ఉండగా...పైన....పూర్తిగా...ఇంటి ముందు అమ్మ????....afterall కిరణ్ వాడిని కౌగిలించుకున్న ఏమౌతుంది...Giving a hug is symbol of saying a lovely welcome/farewell......స్నేహితుడే కదా.... ....మరి కలలో చేసే శృంగారం....అతనితో తనకు జరిగే ఫాంటసీ...వాడేమో నా జీవితాన్ని నాశనం చేసేటట్లుగా ఉండావు....అన్నట్లు వాని behaviour? మరి తన జీవితం???? ఇద్దరు ఒక్కరే మనం అని తాను అనుకుంటున్నది...అతనికి అది లేదు????నొప్పి పోలేదు...బాధ తీరలేదు!!!!అప్పుడే అర్థమైంది...తాము ఇద్దరం కలిసి జీవిస్తే కానీ....తమకున్న బాధ తీరదు...మరి అది కుదరదు కదా? ఎందుకంటే అతనికి పెళ్ళి ఐపోయింది!! అతని జీవితం బాగుంది...తీరనిది దాహం మాత్రమే???? ఒక రోజు కిరణ్ స్నేహితుడు గోపాల్ వేద ను విశ్వవిద్యాలయం లో కలిసి టీ కి వెళదాము రమ్మని పిలిచాడు. అప్పుడు చెప్పాడు వేద తో " కిరణ్ కి ప్రాబ్లమ్స్". వెంటనే వేద అడిగింది ...ఏమి ప్రాబ్లమ్స్..."ఫ్యామిలీ ఉంది... కొడుకు పుట్టాడు" అని చాలా నెమ్మదిగా చెప్పాడు. అప్పుడు ఆలోచించింది ... కిరణ్ నా స్నేహితుడు. నేను అతను బాగుండాలి అని ఆలోచించాలి కానీ అతని జీవితాన్ని నాశనం చేయకూడదు. అతనికి ఫ్యామిలీఉంది..తనకు లేదు??? డబ్బులు ఉన్నాయి...స్నేహితులు ఉన్నారు...తనకు??? ఒంటరి... ఒంటరి...ఒంటరి???? చిన్న పిల్లాడు అని తలచి, బాల్య చేష్టలు గా భావించి తనని క్షమించుకుంటూ అతన్ని కూడా క్షమించింది. బతికి చూపించాలి అనుకున్నది. తనకు ఇంకొకరు దొరకరా? ఎక్కడో ఒకచోట బతకలేనా? అనుకున్నది... నిజానికి అతను చేసిన గాయం మాననెలేదు. తరువాత వారం కిరణ్ వేద ను కలిసాడు...అది కూడా గుడిలో!!! వేద ను చూస్తూ "ఎక్కడికైనా వెళ్లి పోదామా అంటూ... ఆ పక్క నుండి మీ వాళ్ళు ఈ పక్క నుండి మా వాళ్ళు తరుముకుంటూ వస్తారు" అన్నప్పుడు... వేద నవ్వు తో అతని వైపు చూస్తూ ఉండగా.... వెంటనే కిరణ్ వేద తో అన్నాడు "పెళ్లి చేసుకో వేద" ....వేద అడిగింది "నేను అంటే నీకు ఇష్టం లేదా ప్రేమ లేదా అంటూ ...కిరణ్ నవ్వుతూ అటు తిరిగాడు... "నన్ను మైంటైన్ చేస్తావా" అనగానే నవ్వుకుంటూ మెరిసే కళ్ళతో అన్నాడు "నాకు కొడుకు పుట్టాడు... మనం ఫ్రెండ్స్ గా ఉందాం" వేద అతని వైపు చూస్తూ "అది ఎలాగా" అనగానే .... "ఇప్పుడు ఉన్నట్లే" ...అన్నప్పుడు వేద కిరణ్ వైపు చూస్తూ నేను ఉండలేదు అన్నది ...ఏమి ఎందుకు ఉండలేవు అనగానే... నిశ్శబ్దంగా ఉండిపోయింది. కిరణ్ కు అప్పడి వరకు తెలియని విషయం ఏమిటి అంటే.... వేద ఎప్పుడో కిరణ్ ను ప్రేమించింది అన్న విషయం కిరణ్ కు తెలియదు. ఏదో దయ చూపినట్లు మాట్లాడాడు అనిపించింది. వేద అతనిని నన్ను మెయింటైన్ చేస్తావా అని అడిగి అతను తిరిగి వేద దగ్గరకు రాకుండా చేసింది. ఎందుకంటే అతను పిరికివాడు. Narcicist. తన లాభం చూసుకునే వాడు. అతని వలన వేద ట్రామా లో ఇప్పటికీ బతుకుతుంది. అతని వలన సెక్సువల్ అబ్యూజ్ కి, నెగ్లెక్ట్ కి, మోసానికి గురి అయ్యింది. కిరణ్ ఈ బంధం లో తనకు ఏమి కావాలో చెప్పక పోవడం, అతన్ని వేద అర్థం చేసుకోవాలి అని అనుకోవడం ఆమె ను బాధ పెట్టాయి. సరళ వలన మనుషుల మీద నమ్మకం పోయింది. అతనికిి కొడుకు పుట్టాడు అని చెప్తున్నపుడే అతని కళ్ళల్లో ఆనందం. పెళ్ళి చేసుకో వేద అన్నప్పుడు....అతని మనస్సులో లోలోపల ...ఏదో కోరిక....ఆమె తనకు తానుగా నిన్ను వదిలి ఉండలేను, నన్ను పెళ్లి చేసుకో అని అడగాలని కోరిక....ఎలా అడుగుతాము...అతనికి పెళ్ళి ఐపోయింది కదా!!! ఎలా అడుగుతాము...అతనికి పెళ్ళి ఐపోయింది కదా!!! వేద బస్సు లో గుడి నుండి వస్తూ ఆలోచించింది. ఏమి చెయ్యాలి... ఇతడిని ఇంటికి తీసుకుని పోవాలా? మరి అతని భార్య.... పుట్టిన బిడ్డ... అది కూడా కొడుకు?రేపు నా జీవితం నాశనం అయ్యింది నీ వలన అనొచ్చు? నా కుటుంబానికి నన్ను దూరం చేసావు అనొచ్చు? తనను జుట్టు పట్టుకుని కొట్టి బయటకు తోయోచ్చు? తనకు కూతుర్లు పుట్టోచ్చు? కోరిక తీరాక ఏమైనా జరగవచ్చు!!? తమ మధ్య ప్రతి క్షణం ఉన్న అరౌసల్ పోవాలి అంటే కలిసి ఏక శరీరులం కావాలి. ఒక నెల లేదా ఆరు నెలలు...తరువాత.మోజు ఎంత కాలం ఉంటుంది...ఓ రెండు నెలలు అని ఆలోచించింది!!! జీవితం వేరే... ప్రేమ వేరే? ప్రేమ కోసం లేదా తాను చేసిన తప్పు కోసం అయినా నిలబడలేని వ్యక్తి... ఆలోచించింది!!! నమ్మలేము క్షణ క్షణము మారే వ్యక్తి ని నమ్మలేము. ఆ రోజు రాత్రి అతని భార్య... కలలో కనిపించింది. ఆమె నిండు గర్భంతో కడుపులో ఒక బిడ్డ, నిండు చూలాలు...చంకలో ఇంకో బిడ్డ...చేతిలో ఒక బిడ్డ... దీనంగా....ముగ్గురు బిడ్డలతో...begging in the street...ఉల్లిక్కిపడి నిద్ర లేచింది....!!??? ఆ శాపాన్ని నేను భరించలేను అనుకున్నది. వేద కిరణ్ కి ఒక ఉత్తరం రాసింది . "నువ్వు నన్ను ప్రేమించావో లేదో కానీ నేను నిన్ను నువ్వు నా చెయ్యి పెట్టుకోక ముందే ప్రేమించాను. కానీ నీవు నాకు చిన్నప్పుడే పెళ్లి కుదిరింది అన్నావు. పెళ్లి చేసుకోవాలా అని అడిగితే చేసుకోవాలి అన్నావు. అందుకే నేను ఆ విషయం నీకు చెప్పకూడదు అనుకున్నాను.కానీ నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు...అందుకే ప్రేమించాను అని చెప్పాను. లేకపోతే చెప్పేదాన్ని కాదు .... ఆ గ్రీటింగ్ కార్డ్ లోనే అడుగుదాం అనుకున్నాను మనం పెళ్ళి చేసుకుందాము అని. కనీసం నువ్వు బయటకు వస్తె చెప్దామని అనుకున్నాను.నువ్వు రాలేదు. ప్రేమకు పెళ్లి అవసరం లేదు. పెళ్లి అన్నది బాధ్యత. ఇక ప్రేమ అంటావా....ప్రేమ అన్నది సర్వ సమానం... అది నాకు సంబంధించినది...నీ మీద ప్రేమ ఉన్నది...నీ బార్య మీద ఉంది...మా అమ్మ నాన్న మీద ఉంది.... తిరుమలలో నాతో చదువుకున్న నా చిన్ననాటి స్కూల్ ఫ్రెండ్స్ మీద ఉంది...దానికి నీకు సంబందం లేదు. ...దానికి నీకు సంబందం లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటే కూడా నేను నిన్ను చేసుకోను. నువ్వు నాతో అన్నావు కదా పెళ్లి చేసుకో వేద అని ...కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను.కానీ నువ్వు నా పెళ్ళికి రావద్దు. నిన్ను చూస్తూ నేను తట్టుకోలేను. నువ్వు నాకు కనిపించావు అంటే నేను పెళ్లి మండపం నుండి దిగి వచ్చేస్తాను. నాకు నీ బార్య నా కలలో కనిపించింది. ఆమె నిండు గర్భంతో కడుపులో ఒక బిడ్డ, చేతిలో ఒక బిడ్డ, చంక లో ఇంకో బిడ్డ తో వీధులలో బిచ్చం అడుక్కుంటున్నట్లు కల వచ్చింది. నేను ఆ పాపం చేయలేను. నీవు బాగుండాలి. నీ జీవితం నాశనం చేసుకోవద్దు. నువ్వు ఎంతో ఎత్తుకి ఎదగాలి. పది మందికి సహాయ పడాలి. నేను నిన్ను తల్చుకుంటూ బతికేయగలను. నేను చచ్చిపోయి ఉంటే నువ్వు ఏమి చేసేవాడిని...నాకు ఉన్నవి మూడు options.. ఒకటి చచ్చిపోవడము , రెండు సన్యాసం తీసుకోవడం, మూడు పెళ్ళి చేసుకోవడం...నేను మూడో option ఎంచుకున్నాను. నువ్వు ఫారెస్ట్ డిపార్టుమెంటు బియోట్రిమ్ కి వచ్చావు ...ఎందుకు వచ్చావో నాకు తెలియదు....నా కోసం వచ్చావో లేదా నీ పని మీద వచ్చావో నాకు తెలియదు. నువ్వు రాకపోతే నేను అలాగే గట్టి పడేదాన్ని. నువ్వు వచ్చావు కాబట్టే నేను నీ కోసం అప్పుడప్పుడు నిన్ను చూడాలని వచ్చాను. అంతేగాని పరాయి సొత్తు నాకు ఎందుకు" . ఆ ఉత్తరం లో రాయని ముఖ్యమైన విషయం ఏమిటంటే..అతను తన చెయ్యి పట్టుకున్నప్పుడే అతనికి తనకు పెళ్లి ఐపోయింది... ఎందుకంటే ఎదో బంధం ఏర్పడింది... అది తనను అతనికి దగ్గరగా ఉండమని చెప్తోంది... అతనికి పూర్తిగా స్వాతంత్రము ఇవ్వాలని... ఆ మనసు బంధం గురించి రాయలేదు. తమ మనసుకు జరిగిన పెళ్లి బంధం గురించి రాస్తే అతను తనను వదిలి పెట్టాడు అని తెలుసు .... తరువాత జీవితంలో ఇద్దరు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఆ విషయం ఉత్తరం లో రాయలేదు.ఉత్తరం చేరగానే కిరణ్ వేద కోసం వచ్చాడు... దిగులు మొహం తో ...వేద తో కలిసి యూనివర్సిటీ వరకు వచ్చాడు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ గోపీనాధ్ ల్యాబ్ లో పట్టు పురుగులు మీద పరిశోధన చేయబోతున్నాట్లు చెప్పాడు. వేద తో కలిసి చివరి నడక నడిచాడు. వేద తో అన్నాడు"ప్రొద్దుటూరు లో రూం తీసుకున్నాను రా పోదాం". వేద రాను అనీ తల అడ్డంగా ఊపింది. వేద వెంటనే అన్నది "నువ్వు నా కోసం ఇక ఎప్పటికీ రాకు". వెంటనే కిరణ్ అన్నడు బాధగా "విషం తాగాలి రోజూ" . వేద అన్నది "విషమా..ఏమిటి అది". కిరణ్ తల అడ్డంగా ఊపి వెళ్ళిపోయాడు. అంతా నటన ఆమెను లేపుకుపోవడానికి అలా అనుభవించడానికి. వేద మనస్సుని రాయి చేసుకున్నది. వేద అతను ఏదో బాధ లో ఉన్నాడనీ తలచి మరుసటి దినం యూనివర్సిటీకి వెళ్ళింది....అతను నిశ్శబ్ధంగా పట్టు పురుగులు డిస్సేక్షన్ చేసుకుంటూ...వేద మాట్లాడించిన మాట్లాడలేదు. వేద తిరిగి వచ్చేసింది. అదే చివర వాళ్ళిద్దరూ కలవడం. ఆమె మనస్సుని రాయి చేసుకున్నది. వెదవ నన్ను రా అని పిలుస్తాడా. నేను పెళ్ళి చేసుకుందాం అనుకున్నాను. వీడు నన్ను లేచి పోదాం అంటున్నాడు అని కోపం తో అనుకున్నది. అతని మీద చాలా కోపం తెచ్చుకున్నది. వేద ఈ ఉత్తరం లో ఒక నిజం చెప్తూ కిరణ్ ని తన పెళ్లి వరకు లాగింది. వేద కు కడుపు కాలింది . మనస్సు విరిగి పోయింది. రివర్స్ సైకాలజీ ప్రయోగించింది. ఆ పై దేవుడి ఆట. కిరణ్ పెళ్లి కి వస్తాడు అని వేదకు తెలుసు. కిరణ్ తనకు కనబడ కుండా తనను చూస్తాడు అని తెలుసు. పెళ్లి చేసుకుంటాను అని అంటాడు అని కూడా తెలుసు. తన ప్రేమను చెప్తూ వేద చెయ్యి పట్టుకున్నాను అని చెప్తాడు అని కూడా తెలుసు. కానీ పెళ్ళాం బిడ్డలను వదిలేయడు అని కూడా తెలుసు. That is the game of love. పంచ భూతాలు పట్టి బంధించి అతనిని వేద పెళ్ళి వరకు లాక్కొని వచ్చాయి. పెళ్ళి అంటే అనురాగమే కాదు బాధ్యత కూడా! డా.బి. హేమావతి

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు