అమ్మ - B.Rajyalakshmi

Amma

ఖంగుఖంగు దగ్గుతూ పొట్టచేత్తోపట్టుకుని కుక్కిమంచంపైనపడుకున్న రాజమ్మ నీరసంగా ఓపికతెచ్చుకుని లేచికూర్చుని వంగి నేలమీద వుమ్మేసింది .రాత్రంతా దగ్గుతో నింద్రుండదు యెప్పుడో తెల్లారుఝామున నిద్రపడుతుంది వున్నట్టుండి దగ్గుపొరతో లేచికూర్చుంటుంది .నీరసం నిస్సత్తువ .ఉదయం పదిగంటలు అవుతున్నది మెల్లగా గోడపట్టుకుని నడుస్తూ బావిదగ్గర పళ్ళుతోముకుని ముఖం మీద నీళ్ళుకొట్టుకుని మంచం దగ్గర నేలమీద నిస్త్రాణగా కూర్చుంది .ఆ చిన్న పెంకుటిల్ల్లు ముగ్గురికి ఆశ్రయం యిమిస్తున్నది .కొడుకు శివయ్య పెళ్లి జరిగి యెనిమిది నెలలయింది .రెండుచిన్నగదులు ఒకవంటిల్లు వెనుకాల నుయ్యి కాస్తచోటు .ఆ యిల్లు రాజమ్మ తండ్రి రాజమ్మకు కట్టిచ్చిన యిల్లు ..

రాజమ్మ ఆ వూళ్లోనే పుట్టింది. పెరిగిం మేనరికం అంటూ పోరుపెట్టి మేనత్త సీతమ్మ తనవెర్రికొడుకు పిచ్చయ్య తో పెళ్ళిజరిపించింది .సుమారు పదేళ్లతేడాతో రాజమ్మకు పిచ్చయ్యకు పెళ్లయ్యింది .అప్పుడు రాజమ్మకు పదమూడేళ్లు .అరకొర ఆదాయం ,బోలెడు చాకిరీ .పిల్ల యిబ్బందులు చూడలేక చిన్నపెంకుటిల్లు తండ్రి కట్టిచ్చాడు .పెళ్లయిన ఐదేళ్లకు రాజమ్మ కు శివయ్య పుట్టాడు .వాడికి యేడాది వయస్సులో పిచ్చయ్య మరణించాడు .అంతే రాజమ్మకు కష్టాలు మొదలయ్యాయి .

పల్లెటూరి కష్టాలు పొలం పనుల నష్టాలూ చూసిన రాజమ్మ శివయ్యను పట్టుదలగా చదివించింది ఎన్నో వూడిగాలు చేస్తూ మొత్తానికి శివయ్యను హైస్కూలు దాకా చదివించింది .శివయ్య కూడా బుద్ధిగా చదువుకున్నాడు . తన ఆరోగ్యం. తన బాగోగులు పట్టించుకోలేదు రాజమ్మ .కొడుకే ప్రాణం ,కొడుకే సర్వం . చిన్న కంపెనీలో శివయ్యకు చిన్న వుద్యోగం వచ్చింది .రాజమ్మకు కొద్దిగా ఊపిరిసలిపింది .అందివచ్చిన కొడుకును చూసుకుని మురిసిపోయింది .మొదటిజితం తో తల్లికి. చీరె తెచ్చాడు శివయ్య . ఆ చీరె కట్టుకుని కొడుకు తో తలెత్తుకుని వీధిలో అందరూ చూస్తుంటే గుడికి వెళ్లింది . ప్రశాంతం గా జీవితం వెళ్లిపోతున్నది .

“ అత్తా కాఫీ “ అంటూ కోడలు గౌరి పిలుపు తో రాజమ్మ ఆలోచనలకు తెరపడింది .కాఫీగ్లాసు పట్టుకుంది కానీ దగ్గు రావడం తో తాగలేక పక్కకు పట్టింది .

“గౌరీ యీ దగ్గు నా వల్లకావడం లేదు ,దీనికన్నా ప్రాణం పోవడం హాయి ,మందులు కూడా అయిపోయాయి వాణ్ణి అడగాలంటే మనసు ఒప్పుకోవడం లేదు “అంటూ కోడల్ని చూసింది రాజమ్మ .కారణం యేమిటంటే శివయ్య పనిచేసే కంపెనీ మూత పడింది .శివయ్య వుద్యోగం పోయింది .రెండునెలలుగా ప్రతిరోజూ వుద్యోగం కోసం వెతుకులాట .దాచుకున్న కొద్దిడబ్బులతో యిల్లు నడుస్తున్నది .

శివయ్య కు పెళ్లయ్యి రెండుసంవత్సరాలు అవుతున్నది ,వుద్యోగం లో చేరిన కొత్తల్లోనే బంధువులమ్మాయి గౌరి శివయ్యల పెళ్లి జరిపించింది రాజమ్మ .గౌరి చదువుకున్న పిల్ల .కష్టసుఖాలు తెలిసినపిల్ల .యింటిబాధ్యతలు తీసుకుంది .అంతబాగుడన సమయం లో రాజమ్మకు !దగ్గు తగ్గడం లేదు ఒకపక్క వుద్యోగం పోయింది ,అప్పులు చేయాల్సివస్తున్నది రాజమ్మను కూడా దాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లాలి !శివయ్య సతమతమవుతున్నాడు

శివయ్య తల్లి దగ్గు ఆయాసం చూసి “అమ్మా మందులు లేవని చెప్పలేదెందుకు ?”అంటూ రాజమ్మ చెయ్యి పట్టుకుని ఆప్యాయం గా నిమిరాడు .రాజమ్మ అంత ఆయాసం లో కూడా చెమటలు కారుతున్న ముఖం తో కొడుకును చూస్తూ నవ్వుతూ తలవాల్చేసింది .శివయ్య బిత్తరపోయాడు .రాజమ్మ చెయ్యి చల్లగా తగిలింది .బిగిసిన ఆమెచెయ్యి గట్టిగా విడతీసాడు .చెవి దిద్దులు మెరుస్తూ వున్నాయి ..

తల్లి తనకోసం పడ్డ తపన ,,కొడుకును బాధ పెట్టకూడదన్న తృప్తి ఆ దిద్దుల్లో కనపడ్డాయి .శివయ్య గౌరి రాజమ్మ కాళ్లదగ్గర కన్నీటిఅభిషేకం చేసారు .

పాఠకులారా మాతృరుణం తీర్చగలమా !! కేవలం అశ్రుతర్పణం చెయ్యగలం !

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు