ఎర్రటి సూరీడు నడినెత్తిమీద మండిపోతున్నాడు. మంగయ్య తన భార్య రెండు సవర్ల బంగారు నగను పట్నంలో తాకట్టు పెట్టాడు. వచ్చిన పాతిక వేల రూపాయలను భుజంమీద తువాలులో కట్టి భద్రంగా చంకలో పెట్టుకున్నాడు. అప్పుడు సమయం పది గంటలు కావస్తోంది.
ఎర్రటి సూరీడు భగభగ మండుతున్నాడు. మంగయ్యకు ఒళ్లంతా ముచ్చెమటలు పట్టాయి. కడుపులో పేగులు అరుస్తున్నాయి. ఇంకో నాలుగు కిలోమీటర్లు నడిస్తే ఊరికి చేరుకుంటాడు. ఆకలితో వళ్లంతా వణుకుతున్నా తన కూతురు పెళ్లి చేయాలన్న ఆశతో ముందుకు నడుస్తున్నాడు. ఎండ వేడిమికి పడుతున్న చెమట బొట్టు ఒక్కొక్కటి చంకలో వున్న డబ్బుమూటపై పడి తడిసిపోతుంటే గుండెల్లో గుబులు ఎక్కువైంది. చెమట చుక్కలు పడకుండా డబ్బుమూట నెత్తిమీద పెట్టుకున్నాడు. జాగ్రత్తగా వంకదారిలో రాళ్లగుట్టపై అడుగుమీద అడుగు వేసుకుంటూ నడిచి ఊళ్లోకి అడుగుపెట్టాడు.
తన కోసం పూరిగుడిసెముందు నిల్చొని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న భార్య, కూతుర్ని చూసి ఆనందంతో ఎగిరి గంతేశాడు మంగయ్య.
ఇద్దరూ నెత్తిమీద పెట్టుకున్న డబ్బు మూటని కిందికి దించి తడిచిపోయిన డబ్బు తీసి ఎండలో ఆరబెట్టారు. గాలికి ఎగిరిపోతున్న నోట్లను ఎగిరి గంతేసి పట్టుకున్నాడు మంగయ్య. తన కూతుర్ని బాగా చూఉకునే భర్తను కట్టబెట్టాలని కలలు కన్నాడు మంగయ్య. తడి ఆరిన నోట్ల కట్టల్ని తీసి మూలన వున్న ఇనుప ట్రంకు పెట్టెలో దాచిపెట్టారు.
ఆ రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు నిద్ర మేల్కొని కాపలా కాశారు.
చీకటి మాయమై ధగధగ మండుతున్న సూరీడు వచ్చాడు. మంగయ్య పక్కనే వున్న టౌనుకి వెళ్లాడు. నల్గురికి ఇడ్లీలు, పూరీలు మూటగట్టుకుని ఆగమేఘాలపై వచ్చాడు.
ఊరి గుడిసె ముందు వేపచెట్టు కింద కూర్చొని పెళ్లి చూపులకి వస్తున్న పెళ్లికొడుకు కోసం ఎదురుచూశాడు.
సమయం మధ్యాహ్నం 12 గంటలు దాటింది. సూరీడు నడి నెత్తిమీద సెగలు గక్కుతూ తాండవం చేస్తున్నాడు. బయట మంగయ్య ఉక్కపోతకి ముచ్చెమటల్ని తుండు గుడ్డతో తుడుచుకుంటూ ఆశతో ఎదురుచూస్తున్నాడు.
తల్లీ కూతుల్లు ఇద్దరూ పట్టని ఆ ఇంట్లో వున్న సామాన్లు అన్ని ఓ గో,ఎ సంచిలో కుక్కి మూటగట్టి అటకమీద పెట్టారు. ఇప్పుడు నల్గురు కూర్చునే స్థలం రావడంతో గారాల కూతురు నేలమీద వేసిన చాపపై కూర్చొని దిక్కులు చూస్తోంది. ముఖానికి వేసిన ఎర్రని రంగుపొడి చెమటకి కరిగి నేలపై పడుతుండటంతో చీర కొంగుతో తుడుచుకుంటోంది.
అది చూసి మంగయ్య పక్కింటికి వెళ్లాడు. ప్రాధేయపడి కిర్రుకిర్రు మని కొట్టుకుంటూ తిరుగుతున్న పాత ఎయిర్ కూలర్‌ని తీసుకొచ్చి కూతురి పక్కనే పెట్టాడు.
ఇప్పుడు నిప్పులు చెరుగుతున్న సూరీడు భగభగలు కాస్త తగ్గింది.
అంతలోనే రయ్‌మని వచ్చి ఇంటి ముందు ఆగిన కారును చూసి ఒక్క అంగలో పరిగెత్తుకొచ్చి కారు డోర్లు తీశాడు. లోపల ఎర్రగా, బొద్దుగా కూర్చొన్న పెళ్లి కొడుకును చూసి తన కూతురికి సరైన జోడీ అని ముసిముసిగా నవ్వుకుంటూ ‘‘ రా అల్లుడూ రా..’’ అప్యాయంగా ఆహ్వానించాడు మంగయ్య.
పెళ్లి కొడుకు అమ్మానాన్నలు కారు నుంచి దిగలేదు. తనకు ఈ సంబంధం ఇష్టం లేదన్నట్లు ఎరుపెక్కిన కళ్లతో అయిష్టంగా లోపలే కూర్చున్నారు.
అబ్బాయి కిందికి దిగి కిర్రుకిర్రు మంటున్న చెప్పులతో నడుచుకుంటూ పూరి గుడిసెలోకి వెళ్లాడు.
ఓ మూలన వేసిన దుమ్ము పట్టిన ప్లాస్టిక్ కుర్చీలో వినయం ప్రదర్శిస్తూ కూర్చున్నాడు అబ్బాయి.
అమ్మాయి నచ్చిందని, వెంటనే 50 వేలు డబ్బు కావాలని అడిగాడు అబ్బాయి. డబ్బులు ఇస్తే త్వరగా ముహూర్తం పెట్టుకుందామని అనడంతో మంగయ్య ఊహలతో గాలిలో తేలిపోయాడు.
మరో మాట మాట్లాడలేదు. వెళ్లి ట్రంకు పెట్టెలో వున్న యాభై వేలు తీసుకొచ్చి కొండంత ఆశతో అబ్బాయి చేతిలో పెట్టాడు మంగయ్య.
అబ్బాయి పొగడ్తలకు మైమరిచి నఅమ్మాయి త్వరగా తనకు ఓ తోడు దొరుకుతున్నందుకు ముసిముసిగా నవ్వుకుంది.
డబ్బు తీసుకున్న అబ్బాయి లేచి ‘‘ నాల్గు రోజుల్లో పెళ్లి విషయాలు మాట్లాడుకుందాం..’’ అని పైకి లేచి కారులో వాయు వేగంతో దూసుకెళ్లాడు.
నాల్గు రోజులయ్యింది. అబ్బాయి రాలేదు. ఫోను చేద్దామనుకున్నాఫోను నెంబరు కూడా తీసుకోలేదు. సంబంధం తెచ్చిన పెళ్లిళ్ల పేరయ్య వద్దకెళ్లాడు మంగయ్య.
‘‘ వాళ్లు డబ్బు వున్నోళ్లు .. చాలా పనులు వుంటాయి..అబ్బాయిది మంచి వ్యాపారం..మనం వాళ్లని ఒత్తిడి చేస్తే వెనక్కి వెళ్లిపోతారు..కొద్ది రోజులు ఆగు!’’ అన్నాడు పెళ్లిళ్ల పేరయ్య.
ఆ మాటకి మంగయ్య ఆశలన్ని పేకమేడలా కూలిపోయాయి. కాలు కదలలేదు. నిల్చున్న చోటు భూకంపంలా కదులుతున్నట్లయింది. ఏమి చేయాలో దిక్కుతోచలేదు. దిగాలుగా ఇంటికెళ్లాడు.
గుడిసెలో పస్తులతో పడుకుని ఎదురుచూస్తున్న మంగయ్య భార్య, కూతుర్ని చూసి ‘‘ అయ్యా.. ఏమైనా అల్లుడి జాడ తెలిసిందా అయ్యా..!’’ అడుగుతూ వడివడిగా పరిగెత్తుకొచ్చారు.
’’ లేదు’’ తల అడ్డం తిప్పాడు మంగయ్య.
మంగయ్య కూతురి కళ్లలో కన్నీరు జలజలకారింది.
చూసి ఓదార్చడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత మంగయ్యది..
మంగయ్య భార్య సైతం కూతురితో కలిసి కంటతడి పెట్టింది.
భార్య మెడలో వున్న రెండు సవర్ల బంగారు నగ పోయింది. తెచ్చిన డబ్బు చేతిలో ఒక్క రోజూ నిలవలేదు.. ఇంట్లో నిండుకున్న బియ్యం కుండల్లో అడుగున వున్న గ్లాసుడు రేషన్ బియ్యం తెచ్చి పొయ్యిమీద పెట్టింది మంగయ్య భార్య.
అన్నం తిని రెండు రోజులైంది. కూతురి పెళ్లి సంబంధం చేతికి అందినట్లే అంది కనుమరుగు కావడంతో దిగులుతో గడుపుతున్నారు.
కాసేపటికి తట్టలో అన్నం తీసుకొచ్చి ‘‘తినండి..’’ నేలమీద పెట్టి వెళ్లింది మంగయ్య భార్య.
మిరపకాయ పుసులు వేసుకుని తింటుంటే మంగయ్యకు పెళ్లిళ్ల పేరయ్య మీద కోపం తన్నుకొచ్చింది.
లేచి పెళ్లిళ్ల పేరయ్య ఇంటి గమ్మం ముందు నిల్చొన్నాడు.
‘‘ నువ్విలా మోసం చేస్తావని కలలో కూడా ఊహించలేదు ..!’’ గద్దించాడు.
‘‘ చూడు మంగయ్యా.. వాళ్లు వున్నోళ్లు ఏమైనా చేయగలరు.. నువ్వు సంబంధం చూడమంటేనే చూశాను.. ఇప్పుడు ఇలా అయ్యిందంటే నన్నేం చెయ్యమంటావు.. నా అనుభవంలో పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిన పెళ్లిళ్లు కూడా వున్నాయి.. అంతదాకా మీ పెళ్లి రాలేదు.. డబ్బు పోతేపోయింది.. పెళ్లి చూపులతోనే ఆగింది.. సంతోషించు..’’ అన్నాడు పేరయ్య.
మంగయ్యకు ఏం మాట్లాడాలో దిక్కుతెలియలేదు..!
మరుసటి రోజు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ల ఇంటి ముందు నిల్చొన్నాడు. ఆ చుట్టూ పేదల గుడిసెలను ఆక్రమించినట్లు ఆ పెద్ద అద్దాల మేడ ఎండకు ధగధగ మెరుస్తోంది.
ఆ ఇంటి ముందు గంట సేపు నిరీక్షించాడు. భవనం నుండి ఎవరూ రాలేదు.. చీకటి పడిరది..
సరిగ్గా అప్పుడే కిర్రుకిర్రు మంటూ నడుస్తున్న శబ్దం వినిపించింది. వేయి కళ్లతో ఎదురు చూశాడు మంగయ్య.
నిజంగా కళ్లను నమ్మలేదు.. ఎదురుగా పోగొట్టుకున్న 22 క్యారెట్ల బంగారం ఒక్క సారి కన్పించినట్లైంది. పరిగెత్తుకెళ్లి అల్లుడి భుజం పట్టి ఇన్నాళ్లు ‘‘ఎక్కడికెళ్లావ్ అల్లుడూ?’’ అని ఏడ్చేశాడు.
ఈ సారి ఆ మనిషి పక్కకి తప్పుకున్నాడు. వెనుకే వున్న సెక్యూరిటీ గార్డులు మంగయ్యను ఎత్తి దూరంగా విసిరేశారు.
ఆ విసురుకు మంగయ్య దూరంగా వున్న రాయి మీద పడ్డాడు. నుదిటి మీద గాయం తగిలి రక్తం జలజల కారింది. అయినా దెబ్బను లెక్కచేయలేదు.
మళ్లీ లేచి అల్లుడి వెనుక వెళ్లాడు. అప్పటికే ప్రహరి దాటి కారులో కూర్చున్నాడు ఆ వ్యక్తి. అయినా పట్టు వీడలేదు మంగయ్య. కారుకు అడ్డు వెళ్లాడు. ఈ సారి సెక్యూరిటీ చేతిలో వున్న లాఠీ కర్రతో మంగయ్య భుజం మీద గట్టి ఈడ్చి కొట్టాడు. ఆ దెబ్బకు పక్కటెముకలు ఇరిగి మంగయ్య లబోదిమని కుప్పకూలాడు.
బాధకు ఓర్చుకోలేక తల్లడిల్లాడు. కొద్ది సేపటికే నల్గురు పోలీసులు ప్రత్యక్షమయ్యారు.
మంగయ్యను విరిగిన రెక్కలు పట్టుకుని జీపులో తోశారు. బాధకు ఓర్చుకోలేక ఏడ్చుతున్నాడు. అయినా పోలీసులు కనికరించలేదు..
కాసేపటికి కిందికి దించి ఇనుప ఊచల మధ్య విసురుగా తోశారు.
మంగయ్యకు దిక్కులు తెలియడంలేదు. రెండు రోజులు మౌనంగా జైలు గదిలోనే కూర్చున్నాడు.
నాల్గు రోజుల తర్వాత మంగయ్యను జడ్జి ముందుకు తీసుకెళ్లారు.
భయంతో వణుకుతున్న మంగయ్యను చూపి ‘‘ మా పెద్దయ్యగారి మీద ఈయన హత్యాయత్నానికి పాల్పడ్డాడు..’’ పోలీసులు చెప్పుకుపోతుంటే
‘‘ ఎందుకు హత్యాయత్నం చేశావ్..? నీకు బతకాలని లేదా?’’ అని జడ్జి అడిగే ప్రశ్నలకు ఏమి సమాధానం ఇవ్వాలో తెలియక తికమక పడ్డాడు మంగయ్య.
కాస్త గొంతు సవరించుకుని ‘‘ సార్ ..ఈ పెద్ద మనిషి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని 50 వేలు కట్నంగా తీసుకున్నాడు.. ఆ తర్వాత నాల్గు నెలలు అవుతున్నా కంటికి కనిపించలేదు.. ఆయన దగ్గరకు వెళ్లి ‘‘ అల్లుడా ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లావు?’’ అని అప్యాయంగా పలుకరించాను ..అంతే.. పలుకరించిన పాపానికి నా రెక్కటెముకలు విరిచేశారు.. !’’ అని కంట తడి పెడుతున్నా కనికరించలేదు జడ్జి.
‘‘ ఏమిటీ? ఆయన కోట్లకు అధిపతి... వెయ్యి ఎకరాలు వున్న భూస్వామి.. నాల్గు ఫ్యాక్టరీలు వున్నోడు.. నీ దగ్గరకు రావడం ఏమిటి.. 50 వేలు కట్నం అడగడం ఏమిటి? అంతా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్?’’ అని మంగయ్య హత్యాయత్నం కేసు మోపారు.. ఏడాది జైలు శిక్ష , పాతిక వేలు జరిమానా వేశారు.
ఆ తీర్పుకు మంగయ్య మూర్చపోయి కుప్పకూలాడు. పోలీసులు రెక్కలు పట్టుకుని జీపులోకి తోశారు.. ఇక్క జీవితం చీకటి ఆవరించింది. అంతా చిక్క చీకటి..దిక్కులేని మంగయ్య లాంటి పేదలకు న్యాయ దేవత కరుణించడంలేదు.. తప కూతురికి మంచి అబ్బాయిని తెచ్చుకోవాలని కన్న కలలు అన్ని కల్లలయ్యాయి. జీవన గమనంలో ఇంకా ఎన్ని మలుపులు ఎదుర్కోవాలో ఏమిటో..?’ అనుకుంటూ రెక్కటెముకల నొప్పిని మరిచి ప్రాప్తం ఇంతే..! అనుకున్నాడు ఇనుప ఊచలు లెక్కపెట్టేందుకు సిద్ధమైన మంగయ్య.

Compose: