క్షమయా ధరిత్రి - MS

Kshamaya dharitri

క్షమయా ధరిత్రి అంటే ఏంటో తెలుసా నాన్నా, ......! ఆ భూ మాత కు ఉన్నంత ఓపిక ఉంటుంది. అమ్మ కు. అంటే? అందరు అమ్మలకు కూడా. ....!! హ్మ్... ఇవన్నీ నీకూ ఇప్పుడే అర్థం కావులే. నువ్వింకా పెద్దవాళ్ళి,అప్పుడు తెలుస్తుంది. అయినా నా మట్టి బుర్రకు ఈ విషయం అర్ధం అవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది. పద రా బుజ్జి, స్లీపింగ్ టైం నీకు. డైపేర్ మార్చుకుని బజ్జుoదువు. దాయి దాయి దారో.. ఓకే, రెడి మై స్వీట్ బుజ్జి గాడు. ఆ కళ్ళు మాత్రం మీ అమ్మే రోయి. ముద్దు చేస్తూ నిద్ర పుచ్చా నా ఒకటిన్నర సంవత్సరపు బుజ్జిగాడిని. ***** ఆరు నెలల క్రితం, మీరా, ఎక్కడన్నావు?? ఎంత సేపటి నుంచి అరుస్తున్నాను. ఎక్కడ నువ్వు??? రాత్రంతా నిద్ర లేదు, ఇప్పుడే ఇలా నిద్ర పట్టింది. నువ్వొచ్చావు. ఇదే డైలాగ్ నువ్వు ఇప్పటికి చాలా సార్లు వాడేసావు. నీకు బోర్ కొట్టకపోవచ్చు, నాకు మాత్రం మహా విసుగు వస్తోంది మీరా. అలా విసుక్కుంటే, ఎలా?? జరిగేది ఇదే కాబట్టి నేను ఇదే చెబుతున్నా. అయినా నీ డ్యూటీ టైమింగ్స్ మార్చుకున్నావా ఏమైనా?? లాస్ట్ మంత్ వరకే అన్నావు. ఇప్పుడూ అలానే కంటిన్యూ చేస్తూ వున్నావు. ఇదే తంతు, వచ్చి రాగానే, ఇంట్లోకి. ఛా... నేను ఇంకెన్ని ఛా లు వల్లవించాలి?? నడుచుకుంటూ వంటింట్లోకి వెళ్లి, ఐదు నిముషాలకు రూమ్ లోకి వెళ్ళిపోయింది. మౌనం. హాల్ నుంచీ మొత్తంలో మొత్తంగా అల్లుకుంది.మాలో కూడా. పావు గంటకు రూమ్ నుంచి బయట వచ్చింది. గీసెర్ ఆన్ చేశాను, వెళ్లి స్నానo చేసి రా అంది. నా మేల్ ఇగో, సంతోషించిoది. తానే ఫస్ట్ మాట్లాడాలి అనుకున్నాగా. లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాను. కాఫీ కప్ తో రెడి గా ఉంది. చేతికి ఇస్తూ, పేపర్ సోఫా లో ఉంది, నేను టిఫిన్ సంగతి చూస్తాను. నువ్వు పూజ చేసెయ్యి. కాస్త త్వరగా. బుజ్జి కి ఈ రోజు టి టి వేయించాలి. అప్పోయిoట్మెంట్ 9.00 కే. చెప్పేసి వెళ్ళిపోయింది. ఏమంత హడావిడి అని?! తేలిగ్గా కొట్టిపడేసా కాఫీ కప్ పక్కన పెట్టేస్తూ. పేపర్ దులిపి ఎడిటోరియల్ కాలం నుంచీ మొదలుకొని, షేర్ న్యూస్ వైపు చూపు తిప్పే లోపే, క్యార్ మంటూ సౌండ్. పేపర్ మడత పెట్టెలోపే,మరో మారు క్యార్, దానితో పాటు, కుక్కర్ విసిల్ రెండూ ఒకేసారి dts సౌండ్ లో మోగుతున్నాయి. చిరాకేసి, రూమ్ లోకి నడిచి, బుజ్జి ని ఎత్తుకుని హాల్ లో వచ్చేసా, ఈ లోగా విసిల్ సౌండ్ సద్దుమణిగింది. తను కిచెన్ నుంచి వచ్చి, బుజ్జి ని ఎత్తుకుంది. ఎక్కడికి వెళ్లిపోయావు నువ్వు, కాస్త గట్టిగా అనేస్తూ పూజ గది వైపు నడిచా. అక్కర్లేదు. నువ్వు నీ పేపర్తో స్పెండ్ చేసే టైం లో నా వంట, పూజ రెండూ పూర్తయ్యాయి చురుగ్గా చూసింది ఆ కళ్ళతో. నీకు ఎన్నిసార్లు చెప్పి వుంటా, ఆ టి షర్ట్ తో పూజ చేయకు అని. టైమింగ్ లేని క్వశ్చన్ నాది. తల అడ్డంగా తిప్పేసి, బుజ్జి ని తీసుకుని బాల్కనీ లోకి వెళ్ళిపోయింది. నూనె రాస్తూ మర్దన చేయిస్తోంది నీరెండలో. చుట్టూ చిన్ని చిన్ని కుండీలు ఉన్నాయి, తానే అన్నింటినీ శ్రద్ధగా అమర్చుకుని,పెంచుకుంటోంది. మధ్యలో కాస్తoత ఖాళీ చోటు ఏర్పాటు చేసుకుంది. అక్కడే ఇప్పుడు సపర్యలు చేస్తోంది. మొదట్లో బొద్దుగా ఉండేది, ఈ మధ్యన లావుగా కనిపిస్తోంది. నేనే ఏం చెప్పాను, నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ?? ........ నో రిప్లై. వాడితో కబుర్లు చెబుతూ, నవ్వుతూ ఉంది. స్నానానికి తీసుకెళ్లింది. నా వైపు చూడకుండానే. వాడి స్నానం, రెడీ సంగతి చూసేలోపే, నాకు ఆకలి పెరిగిపోయింది దానితో పాటు అర్థం పర్థం లేని, కోపం కూడా. నా ఆకలి సంగతి ఏమిటి, ఇంతేనా ఇక. బారెడు జడ ముందుకు పడుతుంటే, బిర బిర అడుగులు వేసుకుంటూ వచ్చి, టిఫిన్ వడ్డించింది. ఎప్పుడూ ఇదేనా, ఇంకోటి చేయొచ్చుగా. ఫోన్ లో చెక్ చేస్తూ ఉంది ఏదో మెసేజ్. నిన్నే,.. గద్దింపు. అహం అహంకారంగా మారితే ఇంతే మరి. ఏంటండి సౌమ్యంగా అంది. నా మాటంటే లెక్కే లేదు నీకు. ప్లేట్ నుంచి వెనక్కు జరిగా. ఫోన్ పక్కన పెట్టి, పక్కన కూర్చుని,తన చేత్తో టిఫిన్ పెడుతూ ఉంది. చాలు అనే మాట రానివ్వకుండా, ముద్ద ముద్దలో ఏదో అమృతం నింపి పెడుతోంది. పొలమరితే గానీ, తెలీ లేదు నాకు, తన టిఫిన్ సంగతి. నువ్వు తిను అనేసా. ఏ మాంచి బుద్ది ఇది? ఎప్పటిదో?? నీళ్లు అందిస్తూ అంది. పాలు తాగాను కాసేపాగి తింటాను అని. నిజానికి తన టిఫిన్ ఇది కాదు. నాకు రోటీ చేసి, తాను డైట్ ఫుడ్, అదీ చప్పగా ఉన్న ఆ తిండి తినడం, తలచుకుంటేనే ఒహ్ నో అనిపించింది నాకు. మీరు తినండి, నాకు మాములేగా. బుజ్జి బాగా పుష్టిగా ఉండాలి అంటే,నేను ఇలాంటి ఫుడ్ యే అలవాటు చేసుకోవాలి.పైగా పాలు కూడా బాగా పడతాయి అని బామ్మ చెబుతూ ఉండేది. ఏంటో... నీ ఇష్టం. పైకి లేచా. ఆల్మండ్స్ ఫ్రిడ్జ్ పై ఉన్నాయి. లేచాక తినాలి మర్చిపోవుగా, చెప్పేసి క్లీనింగ్ లో పడిపోయింది. ఫోన్ లో మెసేజ్! తీసి చూశాను. క్యాబ్ బుక్ అయినట్టుగా ఉంది. ఇందాక తాను ఫోన్ తీసింది ఇందుకోసమే నేమో!!మనసు సారీ అడగమంది. మళ్ళీ మౌనమై కూర్చుంది. తలపొగరు! వంట చేసి, బుజ్జి హాస్పిటల్ వర్క్ కూడా చేసుకుని వచ్చింది. మధ్యాహ్నం ఒంటి గంటకు హాల్ లో వచ్చి చుస్తేగానీ తెలియలేదు నాకు. అలుపు ఎలా ఉంటుందో. సోఫా లో అలానే కూర్చుకుని వెల్లకిలా పడుకుంది. ఏదో పుస్తకం చదువుతూ మధ్యలో నిద్ర పట్టినట్టు ఉంది. అలానే ఉంచుకుని పడుకుంది. బుక్ పక్కన పెడుతూ చూశాను, పేరెంటింగ్ గురించిన బుక్, చిన్నగా నవ్వేశా, దీని పిచ్చి అనుకుని. లేపి రూమ్ లో మోసుకెళ్లి పోయా. కర్డిల్ లో బుజ్జి గాడు, పక్కనే బెడ్ పై తిను. పూర్తిగా బరువు దించక మునుపే, బేబీ ఏడుపు. ఎంత మొద్దు నిద్రలో వున్నా, అంత త్వరగా ఎలా మెలకువ వస్తుందో వీరికి?? దిగ్గున లేచి, వాడిని పొదుముకుంది. కళ్ళు నులుముతూనే, నన్ను చూసి, ఒహ్! లేచా వా, లంచ్ పెట్టన, టెన్ మినిట్స్. బుజ్జి నిద్ర పోతే సరే, లేకపోతే ఇంకాసేపు. రిక్వెస్ట్ చేస్తోంది. సరే, బుజ్జి కి ఫుడ్ తెస్తాను. వద్దు.వీడికి ఈ రోజు నా పాలు మాత్రమే. సరే, వయిట్ చేస్తా. హాఫ్ నవర్ అయినా, బుజ్జి నిద్ర పోలేదు. ఆకలి మంట. తానేమో జో కొడుతూ, మధ్యన టెంపరేచర్ చూస్తూనే ఉంది. మంట పెరిగి పోతోంది. డైనింగ్ బల్ల పై కూలబడి, గబ గబ కoచెం లో అన్నం, ఇంత కూర గుమ్మరిoచుకుని, ముద్ద నోట్లో కుక్కుకున్నా. దెబ్బకు ఘాటు నెత్తికెక్కింది. ఏంటిది మీరా?? కారం. ఘాటు మొత్తుకుంటున్నా. పరిగెత్తుకుని వచ్చింది. చెబితే వినవుగా నువ్వు. ఇది నా ఫుడ్. మీ ఫుడ్ కిచెన్ లో ఉంది. వుండు తెస్తా అంటూ వెళ్లి తెచ్చి, కoచెం మార్చి వడ్డించింది. ఈసారి ముద్ద కమ్మగా ఉంది. అయినా ఆ వెల్లుల్లి వాసన...!!!యాక్. ఎందుకంట ఆ వెల్లుల్లి?? ఆ వాసన భరించలేక పోయాను నేను తెలుసా... సరే ఈ సారి టేబుల్ పై పెట్టను. ముగించింది మొత్తానికి. ఆ..! ఇవేళ కాస్త లేట్ గానే వెళ్తాను ఆఫీస్ కి. నువ్వు పొద్దిటి లాగా ఆ టీ షర్ట్ తో పూజ చేయకు సాయంత్రం అనేశా. నవ్వేసి, సరే అంది. ఇప్పుడు ఆ నవ్వు ఎందుకని? ఆర్గుమేంట్ స్టార్ట్ చేశా. తిన్నది అరగాలి కాబోలు!?. సరే,నవ్వను. అంటూ చెయ్యి అడ్డుగా పెట్టుకుని నవ్వేస్తోంది. ఈ సారి, ఇగో బాగా పొగరెక్కి, చేతిలో ఉన్న యాపిల్ విసిరే దాకా దారి తీసింది. తాను మాత్రం, లాలనగా!, క్యాచ్ చేసి, ఔట్ అనేసింది. ఇప్పుడు ఎందుకా నవ్వు, బాగా దగ్గరగా వెళ్లి హార్ట్ చేశా. కుర్చీ ని ముందుకు జరిపి, కూర్చో చెబుతా అంటూ,... యాపిల్ నా నోటికి అందించి, ఏమండీ! శ్రీ వారు. మునిపటి లాగా,నేను మీతో ఉండడం లేదనే గా మీ కొత్త కొత్త పోకడ ఇదంతా... ఇదివరకు అమ్మ, అత్తమ్మ ఎవరో ఒకరు ఉంటూ, మనల్ని కనిపెట్టుకుని వున్నారు. ఎన్ని రోజులని వారు కూడా... మనతో వుంటారు? చెప్పండి?? ఇప్పుడు మీరు నేను మాత్రమే కాదుగా, బుజ్జి కూడా ఉన్నాడు. అందుకే కాస్త అడ్జెస్ట్ అవ్వాలి మీరు. ఆ కొత్త ప్రాజెక్ట్, నైట్ డ్యూటీ వద్దంటే విన్నారా? మా కోసం అని, రిస్క్ చేసి చేస్తున్నారుగా. అలాగే.... కొన్ని రోజుల పాటు మనకు ఈ రిస్క్ తప్పదు. చిన్నవే చూడడానికి! అనుభవిస్తేనే ఎంత లోతో, లోటో తెలుస్తుంది. ఓపిక నాకు మాత్రం ముందు నుంచి ఉందా ఏంటి? మీవల్లే గా, బుజ్జి కోసమేగా అలవాటు చేసుకున్నా. అలాగే ఇవి కూడా... మెల్లగా సర్దుకుంటాయి. ఆ... అన్నట్టు!?? టి షర్ట్ కు తేడా ఉంటుందా?? ఎక్కడైనా?? మీరు వేసుకున్నా, మా వంటి పైన వున్నా, పూజ మనసుతోనే గా!. వెల్లుల్లి తింటేనే, పాలు బాగా పడి, బుజ్జి కి బలం ఇస్తాయి. వాసన అని ఏవగించు కుని ఉంటే? 'తరపు తలరాతలు' ఎలా సాగుతాయి సవ్యంగా?? మీరే చెప్పండీ? అన్నట్టు, ఇంకో టూ మంత్స్ అంతే. తర్వాత మీతో నే ఉంటుందిగా మీ మీరా! పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని బుర్ర పాడు చేసుకోవద్దు. సరేనా. చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది. మౌనం.! ఈ సారి, నాలో నేనే శోధించి, సాధించా. Karyeshu Yogi, Karaneshu Daksha, Rupecha Krishna, Kshamayathu Rama, Bojyeshu Truptha, Sukhadukkha Mitra, Shatkarmayuktha, Khalu Darmanatha. అని ఆ రోజు ideal హుస్బెండ్ గా ప్రొమిస్ చేశాను. అదంతా జస్ట్ ప్రొమిస్! మరి రియల్ లైఫ్ లో??? ఇదిగో ప్రస్తుతానికి ఇలా.... ఏవండోయ్!.... వెనకంట అల్లుకుని మంద్రంగా చెవిలో ఊసులాడు తోంది మీరా గొంతు. ష్...! ఇందాకే పడుకోబెట్టాను. మీటింగ్ ఎలా జరిగింది? లావుగా... ఛి, బొద్దుగా అనాలి. ముద్దు. ఢీ ఇచ్చేసా. ఆ...! ష్... ష్...! చిన్నగా నవ్వేస్తోంది తాను. పద భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. నాకుంది. పైగా ఈ రోజు బోలెడు ఐటమ్స్ చేసి పెట్టా, పద పద... రేపటి నుంచీ డైట్ చేస్తాను. నోరుమూసుకుని తింటూ వుండు. భరించేది నేనేగా. నాకు లేని ఇబ్బంది నీకు ఎందుకు?? బుజ్జి లేచాడు. ఆగు, తిను నువ్వు,నేను వెళ్లి చూస్తా. మరో కoచెం అవసరం లేకుండానే మా భోజనం తృప్తిగా ముగిసింది. ఒక వైవు, బుజ్జి, మరో వైపు తాను వడిలో జో కొడుతూ బాల్కనీ నుంచీ చుక్కలను చూస్తూ, లెక్కపెడుతూ, కొన్ని లెక్కలు తప్పుతూ ఉంటే! కొంటెగా! మందలిస్తూ, హాయిగా సంతోషంగా గడిపే లైఫ్. అదే ఒక లైఫ్. ఈ గ్యాప్ లో, ఆ ఇగో, పొగరు, వగరు, దాని తాలూకు అల్సర్ మనకు ఎందుకు చెప్పండి?? చెప్పినంత తేలిక అని కొట్టిపడేస్తారు ఏమో?? చదివినంత తేలిక అని వారు నిరూపిస్తున్నారుగా. ఎలా అంటారా?? Karyeshu Dasi, Karaneshu Manthri; Bhojeshu Mata, Shayaneshu Rambha, Roopeshu lakshmi, Kshamayeshu Dharitri, Shat dharmayukta, Kuladharma Pathni’. అని. మనం "ఎంత" , 'వారి ' ముందు. ఆలోచించే ఆచరిస్తున్నారుగా పెద్దలు. వారితో పాటే మనమునూ..... ఉంటానే. ఇట్లు మీరా వసంత్.

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్