తీయని వూపిరి - B.Rajyalakshmi

Teeyani voopiri

ఆఫీసుకెళ్ళేహడావిడిలో శివ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ సుందరి వైపు చూసాడు ,సుందరి కాఫీ కలుపుతున్నది .”నువ్వు తినెయ్యొచ్చుగా “అన్నాడు శివ .


“నేను స్నానం పూజ చేసుకునికానీ తిననుగా “అన్నది. నవ్వుతూ సుందరి .అతను రోజూ యిదే ప్రశ్న ,ఆమె రోజూ యిదేజవాబు రొటీన్ అయిపొయింది .
శివ అందగాడు ,ఆజానుబాహువు హుందాగా వుంటాడు.పెళ్లయ్యి మూడేళ్లవుతున్నది ,ఇద్దరూ అన్యోన్న్యముగా వుంటారు .సుందరికి పిల్లలంటే యిష్టం కానీ శివ “ఇప్పుడేం తొందర “అంటాడు.ఉద్యోగంచేస్తానంటే వద్దంటాడు .మూడునెలల నించీ శివ లో యేదో మార్పు కనిపిస్తున్నది రోజూ ఆఫిసుకెళ్లేటప్పుడు సుందరి ని గుచ్చిగుచ్చి చూస్తాడు ఆమె mukhyam లో యేదో వెతుకుతాడు ,సుందరి చాలాసార్లు అతన్ని అడగాలనుకుంటుంది కానీ అతన్ని హుందాతనం చూస్తూ అడగలేకపోతున్నది .మోటారుసైకిల్ యెక్కుతూ నవ్వుతూ చెయ్యుపుతాడు .

సుందరి స్నానానికి వెళ్లాలనుకుంటు తలుపు ముయ్యబోయింది కానీ సీత తలుపు తోసుకుని వచ్చి కుర్చీలో కూర్చుంది .సీత శివ పిన్ని కూతురు .సీత భర్త బ్యాంకు బదిలీ వాళ్ళ ఆ వూరొచ్చి ఏడాదయ్యింది.సుందరి యింటికి దగ్గర్లోనే యిల్లు తీసుకున్నారు .అయిదేళ్లకొడుకు విజయ్ ని బడికి పంపి అప్పుడప్పుడు సుందరి దగ్గరకొస్తుంది .
సుందరి స్నానం ఆపుకుని యిద్దరికీ వేడి వేడి కాఫీ తెచ్చింది .
“వదినా అన్నయ్య గురించి నికోమాట చెప్పాలి ,మళ్లీ చెప్తున్నా అన్నయ్య ఒక మాల్ లో అక్కడ పనిచేసే అమ్మాయితో కనిపించాడు .వాళ్ళ చనువు నాకు అనుమానం వేస్తున్నది .ఆ అమ్మాయిని ఫోటో తీసాను చూడు “అంటూ సీత ఫోటో చూపించింది .సుందరి ఆ ఫోటో చూస్తూ అందం గా వుంది అనుకుంది .అందుకే శివ కు నచ్చినట్టుంది అనుకుంది .
“వదినా నువ్విలా నెమ్మదిగా వుంటే లాభం లేదు .అన్నయ్య ను గట్టిగా అడగలేవు ,గట్టిగా మాట్లాడలేవు అందుకే ఆ అమ్మాయినే గట్టిగా బెదిరించు “అంటూ కాసేపు కబుర్లు చెప్పి సీత వెళ్లపోయింది .సీత వెళ్ళినతర్వాత అలాగే ఆలోచిస్తూ వుండిపొయింది సుందరి .
ఏమని అడగను శివాని ?రెండు ఎల్లలుగా చూస్తున్నది ,శివ యేదో ఆలోచనలతో సతమతమవుతున్నాడు .శివ యేదో ఒకరోజు మనం విడిపోదాం సుందరీ అంటాడేమో అప్పుఫు తాను ఒంటరి అవుతుందిగా యిప్పటినించే ఒంటరి తనం. అలవాటుచేసుకోవాలి ,శివ అంటే తనకిష్టం కానీ అతనికి ఆ అమ్మాయంటే యిష్టం ,సుందరీ లో నిరుత్సాహం .
ఒకరోజు శివ ఆఫీసులో పనెక్కువగా వుంది ఆలస్యం గా వస్తానన్నాడు .ఆ రోజు. సుందరి మాల్ కి వెళ్లి ఆ అమ్మాయిని చూడాలనుకుంది .నచ్చిన చీరె కట్టుకుని బ్యాగ్ తీసుకుని తాళం వేసి బయటకొచ్చింది .ఆలా నడుస్తూ రోడ్డు ప్రక్క నించుని చుట్టూ పరిశీలనగా చూసింది .జనం జనం జనం ఉరుకులపరుగుల పయనం .పరువాల యువతీయువకులు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుతూ త్రుళ్ళుతూ కనిపిస్తున్నారు .కొందరు భూభారమంతా తామే మోస్తున్నట్టుగా నడుస్తున్నారు .ఇంకా కొన్నిరోజుల్లో తాను ఒంటరిగా బ్రతకాల్సిందేగా ! శివ తనకు నచ్చిన జీవితం యెంచుకుంటున్నాడు సుందర్ మనసు పరిపరి విధాల పరుగెత్తుతున్నది .ఆటో లో మాల్ కి వెళ్లింది.వు
సమయం సుమారు మూడుగంటలవుతున్నది .మాల్ లో యెక్కువ రద్దీ లేదు . సీత పంపిన ఫోటో వల్ల ఆ అమ్మాయిని గుర్తుపట్టింది .అక్కడ ఆడవాళ్ల డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నది .సుందరి ప్రక్కనే వున్నా చీరెలు చూస్తున్నట్టుగా నిలబడి ఆ అమ్మాయిని పరిశీలనగా చూసింది .అందం గా చలాకీగా వుంది ..సుందరిని. చూసి “ఏం చూపించమంటారు మేడం”నవ్వుతూ అడిగింది .

సుందరి నవ్వుతూ బదులు చెప్పలేదు .సుందరి మాల్ అంతా తిరుగుతున్నది కానీ ఆ అమ్మాయి చుట్టే చూపులు తిరుగుతున్నాయి .కొంచెంసేపయ్యాక ఆ అమ్మాయి. గ్రహించింది .ఏదో ఇబ్బందిగా ఫీలయ్యింది .సుందరి మాల్ నించి వెళ్ళబోతూ ఒకసారి అమ్మాయి దగ్గరకు వెళ్లి “ప్లీజ్ మీతో కొద్దిగా మాట్లాడాలి “అన్నది .ఆ అమ్మాయి సుందరిని ప్రక్కగా తీసుకెళ్లింది .
“మీ పేరు టాగ్ వల్ల ఉష అనితెలుసుకున్నాను .ఉషా అందం గా చలాకీగా వున్నారు ,మా యింటికి వస్తారా ఒకరోజు ?మనం స్నేహాల్ గా వుందాం”అన్నది. సుందరి .ఉషబిత్తరపోయింది .సడన్ గా వచ్చి ముక్కుమొహం తెలియకుండానే మాట్లాడుతున్నది అనుకుంది ఉష
“ఆశ్చర్యం గా. వుందికదూ ! శివ friend వని తెలిసినప్పుడు నాకూ నీలాగే ఆశ్చర్యం వేసింది “.అన్నది సుందరి .అంతే సుందరి వెంటనే మాల్ నించి బయటకు వచ్చింది .ఉష చెమటలు తుడుచుకుంటూ చేతిలో నలిగిని కాగితాన్ని మళ్లీ మరోసారి చదువుకుంది .ఉదయం శివ పంపిన మెసేజ్ .
“ఉషా నువ్వంటే నాకిష్టం కానీ సుందరి లేనిది నేనుండలేను ,నేను లేనిది సుందరి వుండలేదు .నన్ను క్షమించు !నిమనసు బాధపెడితే నన్ను మన్నించు .నిన్ను ఒక స్నేహితురాలిగా అనుకున్నాను ప్లీజ్ నన్నుమర్చిపో యిట్లు ని స్నేహితుడు శివ “
ఉష సుందరిని చూసింది శివ మెసేజ్ చదివింది . కాగితాన్ని చింపేసి నవ్వుతూ. మాల్ లో కస్టమర్ వైపు వెళ్లింది .

ఆటోలో యింటికి చేరిన సుందరికి శివ. ఇంటిముందు వుండడం చూసి బిత్తరపోయింది .”ఎక్కడికి. వెళ్లావు నీకోసం. యెదురుచూస్తున్నాను నాకూ కలకత్తా బదిలీ. అయ్యింది .పదిరోజుల్లో చేరాలి ,”అంటూ. సుందరిని. దగ్గరగా తీసుకున్నాడు. శివ .మౌనం గా అతని గుండెపైన. తల ఆనించి మధురమైన వూపిరితిసుకుంది సుందరి .

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్