అనగనగా కాగి పాఠం అనే ఒక ఊరు ఉండేది
ఆ ఊరిలో పూర్ణిమ అనే ఒక అమ్మాయి ఎప్పుడూ పుస్తకానికి దూరంగా పిల్లలతో ఆడే ఆటలకు దగ్గరగా ఉండేది పూర్ణిమకు అసలు పుస్తకాలు అంటే ఇష్టం ఉండేదే కాదు పుస్తకాన్ని శత్రువులా చూసేది. పూర్ణిమ వాళ్ళ అమ్మ పేరు చరిత పూర్ణిమకు ఎప్పుడు ఒక విషయం గట్టిగా చెప్పేది.
అదేంటంటే మనం ఎవరినైతే శత్రువులా చూస్తామో మనకు ఎవరైతే నచ్చరో మనం ఎవరినైతే అసలు చూడడానికి కూడా ఇష్టపడమౌ వాళ్లే కొంతకాలం తర్వాత నువ్వు వాళ్ళని వదిలిపెట్టలేనంత దగ్గరవుతారు అది మనిషైనా ,వస్తువైనా అని చరిత పూర్ణిమకు ఎప్పుడు చెప్పేది. కానీ పూర్ణిమ దాన్ని ఎంత మాత్రం పట్టించుకోదు. కొంతకాలం గడిచింది
పూర్ణిమ ఆటలకు దూరంగా ఒంటరిగా గడపవలసిన పరిస్థితి వచ్చింది. ముందు పూర్ణిమకు ఒంటరితనం ఆటలకు దూరంగా ఉండటం అస్సలు నచ్చలేదు ఏడ్చేది కూడా రెండు రోజులు గడిచాయి అప్పుడు పూర్ణిమ వాళ్ళ అమ్మ ఒంటరిగా ఎందుకు ఉండటం నీకోసం కొన్ని పుస్తకాలు తెచ్చాను చదువుకో అని చెప్పింది.
పూర్ణిమ తప్పక పుస్తకాలు తీసుకొని చదవడం ప్రారంభించింది మళ్ళీ ఇంకొక పుస్తకం తీసుకొని చదవడం మొదలు పెట్టింది మళ్ళీ మళ్ళీ చదివింది అన్ని పుస్తకాలను అలా ఆరోజు తనకు తెలియకుండానే చదివింది .ఆరోజు గడిచిపోయింది తర్వాత రోజు పూర్ణిమ ఎంతో ఆసక్తిగా ఇంట్లో ఉన్న పుస్తకాలు అన్ని చదివింది అలా తను కొన్ని రోజులు పుస్తకాలు చదవడంలో గడిచిపోయాయి
తర్వాత పూర్ణిమ ఆడుకోవడానికి వెళుతుంది అని చరిత అనుకుంది కానీ పూర్ణిమా గ్రంథాలయంలోకి వెళ్ళింది కొన్ని పుస్తకాలు చదివింది. మళ్ళీ రోజు వెళ్ళింది పుస్తకాలు చదివింది తన రోజులో ఒకసారి కూడా ఆటలు వైపు వెళ్లడం లేదు పుస్తకాలు చదవాలి అని ఆసక్తిగా గ్రంథాలయంలో రోజు గడుపుతుంది .
పూర్ణిమ రోజు కొత్త కొత్త పుస్తకాలను చదవడం మొదలు పెట్టింది. అలా తను కొత్త పుస్తకాలు చదవడం వలన తనకు ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. ఒకరోజు చరిత పూర్ణిమను ఈ విధంగా అడిగింది నువ్వు ఒకప్పుడు పుస్తకాన్ని శత్రువులా చూసే దానివి కానీ ఇప్పుడు నీకు ఇష్టమైన ఆటలు వదిలేసి నీ మిత్రులను విడిచి పుస్తకాలను ఎక్కువ చదువుతున్నావు ఎందుకు నీ స్నేహితులని ,ఆటలను వదిలేసావు అని అడిగింది అప్పుడు పూర్ణిమ ఏం చెప్పిందంటే ,అమ్మ నువ్వు చెప్పింది నిజమే నేను ఆటలు స్నేహితులని వదిలేశాను కానీ నాకు అసలు ఎంత మాత్రము బాధ లేదు నేను రోజు ఆటలలో ఎన్నో కొత్త ఆటలు తెలుసుకుంటూ ఆనందంగా ఉండేదాన్ని కానీ కొత్త ఆటలు తెలుసుకోవడంవల్ల ఏం ప్రయోజనం లేదు కదా!
నేను రోజు పుస్తకాలు చదువుతూ ఎన్నో కొత్త విషయాలను తెలుసుకుంటున్నాను. అవి మన ఆరోగ్యం గురించి అలాగే మన జీవన విధానానికి ఎంతో తోడ్పడుతాయి అలా కొత్త విషయాలు తెలుసుకోవడం వల్ల నాలో ఆసక్తి ,ఆలోచించే విధానంలోనూ మార్పు వచ్చింది.
ఇంక మిత్రులంటావా పుస్తకాలకు మించిన మంచి మిత్రులు ఉండరు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా స్నేహితులు ఎవరూ నా ఒంటరితనాన్ని తీర్చడానికి రాలేదు. కానీ నా పక్కనే ఉన్న పుస్తకాలు మాత్రం నన్ను ఒంటరితనం నుంచి దూరం చేసి నా తెలివితేటలు పెంచుకునే అవకాశం ఇచ్చి నా చెడు ఆలోచన నుంచి నా బాధ నుంచి దూరం చేసి నాకు ఆనందం పంచాయి ఈ పుస్తకాలు. నేను వీటిని ఎంత శత్రువులా చూసినా ఎంత దూరం పెట్టిన నాకు ఒంటరితనం దూరం చేసి నాకు తెలివితేటలు పెంచుకునే అవకాశం ఇచ్చి నా చెడు ఆలోచనల నుంచి నా బాధ నుంచి దూరం చేసి నాకు ఆనందం పంచాయి ఈ పుస్తకాలు.
నేను వీటిని నేను వీటిని ఎంత దూరం పెట్టిన నాకు ఒంటరితనం దూరం చేసే మిత్రులు కానీ ఎప్పుడూ ఉన్నాయి నాకు ఆటలు స్నేహితులు ఇవ్వలేనివి కూడా ఈ పుస్తకాలు ఇవ్వగలవు అమ్మ అందుకే నేను వీటిని విడిచిపెట్టను నన్ను ఒంటరితనం నుంచి దూరం చేసిన పుస్తకాలను ఒంటరిగా మిగిలిపోయిన అమ్మ. పుస్తకం అంటే కాగితాలు అక్షరాలతో నిండినది కాదు ఎవరు మన నుంచి దొంగతనం చేయాలని తెలివిని మనకు అందించేవి కొత్త విషయాలను పరిచయం చేసి ఒంటరితనం పోగొట్టే గొప్ప మిత్రులు పుస్తకం ఒకటే.
పుస్తకం అంటే మనకు దారి చూపే నేస్తం ,ఒంటరిని పోగొట్టే స్నేహం, ఎన్నో కొత్త విషయాలు పరిచయం చేసి ఆనందం పంచే వినోదం. మనకు ప్రతి పుస్తకం ఒక పాఠం నేర్పుతుంది ప్రదీప్ పాఠం మనం ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో తెలుపుతుంది. ప్రతి పుస్తకం మనలో ఏదో ఒక మార్పు తెస్తుంది ఆ మార్పు మనం ఒక మంచి పౌరునిగా మారడానికి మనకు దారి చూపుతుంది .మనం చదివే ప్రతి పుస్తకం మనకు గుర్తుండకపోవచ్చు కానీ ,మనం చదివే ప్రతి పుస్తకం మనలో మార్పు తెచ్చేలా ఉండాలి.