గంజి కోసం - B.Rajyalakshmi

Ganji kosam

పల్లె అంతా కరువుకాటకాలతో దిక్కుతోచని అయోమయం లో వున్నది . దాచుకున్న ధాన్యపుగింజలు గంజికాచుకుంటూ గడిపారు .అవీ అయిపోయాయి . ఇంతకీ నేను చెప్పేది యేమిటంటే. యీ రోజు టీవీ లో ఒక పాత సినిమా కరువు వర్షాలూ లేని పల్లెప్రజల కష్టాలు చూస్తుంటే మా బామ్మ చెప్పిన డొక్కలకరువు గుర్తుకొచ్చింది .ఆ విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను .

ముత్యాలమ్మ పల్లె పచ్చని పైర్లతో పాడిపంటలతో కళకళలాడుతూ వుండేది . హాయిగా వుండేవాళ్లు .ఒకయేడాది వానలు లేవు .యెండలు మండిపోతున్నాయి .పశువుల గ్రాసం నెమ్మదిగా తగ్గిపోతున్నది .అవి దాహం కోసం. అల్లాడుతూవుండేవి .చెరువులు గుంటలూ నీళ్లు తగ్గిపోతున్నాయి .పల్లె కళ తప్పింది . సత్తెమ్మ గుడిసె తాటాకు కప్పు ఎండకు మండిపోతున్నది .రెక్కాడితే కానీ డొక్కాడని ఆ కుటుంబం ఆకలి తో అల్లాడుతున్నది .సత్తెమ్మ కొడుకు బిక్షాలు పదేళ్లవాడు ,సత్తెమ్మ మొగుడు పోచయ్య కామందు పొలం లో అరకదున్నుతూ కాలుమెలిక తిరిగి పడిపోయాడు .అప్పటినించి మంచానికే అతుక్కుపోయాడు . దాచుకున్న గ్రాసం అయిపొయింది .

సత్తెమ్మ ఆలోచిస్తూ కూర్చుంది .ఇంతలో బాటమీద నడుస్తున్న రంగమ్మ సత్తెమ్మను పలకరించింది ,”సత్తెమ్మా ఏంది నీకు యెరకలేదా కూసుంటే కూడు మననోటికొస్తదా ,పద పద బడిదగ్గర కామందులు మనిషికి లోటా గంజి పోస్తున్నారుట నీ దగ్గర వున్న ముంతలు తీసుకుని బేగిన రా అమ్మో అక్కడ లైన్ పెరుగుతుంది “అంటూ రంగమ్మ సరసరా పరుగెత్తింది .సత్తెమ్మ లో వెలుగు తొంగిచూసింది .

“సత్తి బిక్షాలు ను తీసుకుని పోవే ,”అన్నాడు పోచయ్య .అప్పటికే బిక్షాలు. ఆకలి. తట్టుకోలేక మెలికలు తిరిగిపోతున్నాడు ,మధ్యాహ్నపు యెండ పెరుగుతున్నది . సత్తెమ్మ ఓపిక తెచ్చుకుని కొడుకు. తో బాట. దోవ పట్టింది ,బడి కొద్దిగా దూరం వున్నప్పుడు బిక్షాలు తూలిపడిపోయాడు వాణ్ణి సముదాయించుకుంటూ చెమట తుడుచుకుంటూ మెల్లిగా కన్నీళ్లు తుడుచుకుంటూ బడి దగ్గరకొచ్చారు యిద్దరూ.అక్కడ అందరూ గంజికోసం తోసుకుంటున్నారు .సత్తెమ్మ పిల్లవాడి చేతిలో ఒక ముంత ,తనచేతిలో ఒకముంత పట్టుకుని ఆ రద్దీలోనే తోసుకుంటూ అక్కడిదాకా చేరుకుంది . పిల్లాడి ముంతచెయ్యి గంజిపోసేవాడి దగ్గర పెట్టెలోపలే వాడిచెయ్యి. జారిపోయింది. కిందపడ్డాడు .”బిక్షాలు “అంటూ అరుస్తూ కిందికి. వంగింది సత్తెమ్మ .అంతే ఆ జనారణ్యం లో యెవరి ఆకలి. వాళ్లదేగా ,కిందపడ్డ. సత్తెమ్మ లేవలేదు ఎన్నో. కాళ్లు ఆమెమీదనించి వెళ్లిపోయాయి ,ముంత. మాత్రం చేతిలో. అలాగే వుంది .బిక్షాలు మరోచోట పడిపోయాడు .

జీవితం జీవనం యెవరూ వూహించని పయనం .ప్రకృతి గర్జిస్తే జీవనాలే ఛిద్రం అవుతాయి .మా బామ్మ. చెప్పిన. యీ విషయాలు యెప్పుడైనా గుర్తుకొస్తే మనసంతా. కలిచివేస్తుంది .లోటా గంజికోసం మనిషితపన అదే మనిషి అదేగంజి తాగే. వాడిని చిన్నచూపుచూడడం . ఆకలిని. ఆదరించి అందరిని ఆదరించడం మనిషిగా. మన. సామాన్య. సాధారణ బాధ్యత !

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్