నిజమైన దీపావళి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Nijamaina deepavali

మా జే.వి.సి. రోజా అపార్టమెంట్ ఆఫీస్ లో మాదంపతులకు రెండు కుర్చిలు రెండు బల్లలు వేసి వచ్చే వ్యాధి గ్రస్తులకు ఉచితంగా సేవచెసుకుని అవకాశం కలిగించారు.ఆడవారికి ,పిల్లలకు నాశ్రీమతి,మగవారికి నేను చూస్తుంటాము.

మాప్రాంతం అంతా అపార్ట్ మెంట్లు ఎక్కువకనుక వందలాది,ఆళ్ళలో పని చేసే వాళ్ళు వారి కుటుంబాలు అక్కడికి చెరువలోని ముత్తుకాడు కాలువ ఒడ్డున ఏసౌకర్యాలులేని తాత్కాలిక ఇళ్ళు నిర్మించుకుని ఉండసాగారు.

రాత్రి వ్యాధిగ్రస్తులు ఎక్కువగా రావడంతో బాగా పొద్దు పోయింది . ఈరోజు సెలవు కావడం వలన ఆలస్యంగా నిద్రలేచి దంతాలు,వళ్ళు తోమడం ముగించి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొన్నాను. మూడో పెసర అట్టు అల్లం పచ్చడి అద్దుకు తింటున్న నాముందు, నాఅర్ధాంగి నవ్వుతూ వచ్చి

లాప్ టాప్ పెట్టి కళ్ళు ఎగుర వేసింది. అందులోని సమాచారం చూసి నాకళ్ళు పెద్దవి అయ్యాయి. చేతులు శుబ్రపరచుకుంటూ.... ఈవిషయం నాన్నగారికి చెప్పాలి అనుకున్నాను.

' మావయ్య గారు ' అని చెరవాణి నాచేతికి అందించింది నాశ్రీమతి

" నాయనా మనం న్యాయస్ధానంలో దాయాదులపై గెలిచాము " అన్నారు.

" నాన్నగారు మీకు మరో శుభవార్త నాకు ,మీకోడలికి రష్యా ప్రభుత్వం మంచి జీతంతో ఆహ్వనించింది "అన్నాను నేను.

" నాయనా మరో రెండు తరాలకు సరిపడా విలాసంగా జీవించే ఆస్తులు మనకు ఉన్నాయి. మాకు ఒక్కడే సంతానమైన నీవు సంపాదనకోసం విదేశాలు వెళ్ళాలా? నీఆశయాలకు అనుగుణంగా నేర్చిన విద్యను ఇక్కడే సార్ధకం చేసుకో, చెన్నయ్ నగరం లో కాకుంటే భారత దేశంలోని ఏనగరం ఐనా మాకు సమ్మతమే ,దీపావళి పండుగకు ఈరోజు మీఅమ్మతో పినాకినీలో అక్కడికి వస్తున్నాం ఇదిగోమీ అమ్మ మాట్లాడుతుందట "అన్నాడు .

" నేచెప్పిన సోలార్ దీపాల సంగతి ఏంచెసావు నాయనా "అన్నది . " అంతా సిధ్ధమే " అన్నాను నేను.

ఇంతలో శారదా ( మాఇంటి పనుల్లో నాశ్రీమతికి సహయంచేస్తుంది )

" అమ్మగారు పని అయిపోయింది,దీపావళి వస్తుంది జీతం ముందుగా ... " అన్నది. శారదకు హిందీ మాత్రమే వచ్చు. " శారదా మీరు ఉండే వాడకట్టులో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి "అన్నాను. తను సమాధానం చెపుతూ నాభార్య జీతంతోపాటు అదనంగా మరో జీతం కలిపి ఇస్తూ ,నాకేసి చూసింది. "శారదా మరోమూడు వేలు పండుగకు పిల్లలకు బట్టలు తీసుకొమని అమ్మగారు అధికంగా ఇచ్చారు " అని హిందీలో అన్నాను.

నవ్వుతూ మాఇద్దరికి నమస్కరించి వెళ్ళిపోయింది శారదా.

అమ్మానాన్నగార్లను తీసుకురావడానికి నేను కారుతో నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంట్రల్ స్టేషన్ కు కు బయలు దేరాను.

దీపావళి పండుగ రోజు సాయంత్రం ఐదు గంటలకు శారదా వాళ్ళ నివసించే వాడకట్టుకు మాకుటుంబం బయలుదేరి వెళ్ళాం. అక్కడ వాళ్ళంతా డాక్టర్ గారు వచ్చారు అంటూ మాచుట్టు మూగారు. ఇంటికి ఒకరి వంతున లైనుగా నిలబడమని శరదకు చెప్పాను. ఇంతలో మూడు మిని వ్యానుల్లో నేను ఆర్డర్ చెసిన సామాగ్రి వచ్చింది. ఒక వ్యానులోని స్వీట్స్ పాకెట్ నాన్నగారు,మరో వ్యానులోని బాణాసంచా ప్యాకెట్స్ అమ్మగారు,ఇంకో వ్యానులో ఉన్న దోమతెరలు నాశ్రీమతి , ఇంటికో టవలు నేను పంచసాగాము. అనంతరం మాఅమ్మగారి కోరిక మేరకు నేను వేయించిన నాలుగు సోలార్ దీప స్ధంబాలు అమ్మచేతులమీదుగా వెలిగించబడ్డాయి.

వాడకట్టు వాసుల ఆనంద కేరింతలతో ఆప్రాంతమంతా మారు మోగింది.

" శారదా పిల్లలు చదువు కోవడానికి దీపాలు లేవన్నావుగా అందుకే మాఅమ్మగారు ఈఏర్పాటు చేయించారు "అన్నాను. ఆవాడకట్టులోని వారంతా మాకు వీడ్కోలు పలుకగా ఇల్లు చేరాం.

రాత్రి ఏడుగంటల ప్రాంతంలో ఆ వాడకట్టు సోలార్ దీపాల వెలుగులో, ఇరవై ఆరో అంతస్తు బాల్కానిలో ఉన్నమాకు స్పష్టంగా ,తారజువ్వల రంగులలో ,మతాబు మెరుపులతో,చిచ్చుబుడ్ల చిరు నవ్వులతో,భూచక్రాల రంగవెల్లులతో శోభాయమానమైన ఆనంద లోకంలా మాకు కనిపించింది.

నాకేసి చూసిన మాఅమ్మ " జివి నిజమైన దీపాళి అంటే ఇదే "అన్నది.

" నిజమే జీవితంలో ఎదటి వారిని ఆనంద పరచే అవకాశం ఏకేందరికో లభిస్తుంది అప్పుడే వారు సార్ధక జన్ములు అవుతారు "అన్నారు నాన్నగారు.

ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా దొరకని అరుదైన ఆనందం ఇది ఇటువంటివి సంతోషకరమైన క్షణాలు పొందడానికి ఏ కొందరికో మాత్రమే సాధ్యం " అని

నవ్యుతూ నాశ్రీమతి అందించిన పాయసం గిన్నె అందుకున్నాను.

మరిన్ని కథలు

Tagina saasti
తగిన శాస్తి
- Naramsetti Umamaheswararao
Ganji kosam
గంజి కోసం
- B.Rajyalakshmi
Ante maremee samasyalu levu
అంతే, మరేమీ సమస్యలు లేవు
- మద్దూరి నరసింహమూర్తి
O anubhavam
ఓ అనుభవం
- జి.ఆర్.భాస్కర బాబు
Navvina naapachenu pandindi
నవ్విన నాపచేను పండింది
- కాశీవిశ్వనాధం పట్రాయుడు