అమ్మ అవంతిపురం రాజ్యాన్ని ధర్మ నందుడు పరిపాలిస్తున్నాడు. ఒకసారి ఆయన హోలీ పండుగ సందర్భంగా ప్రదర్శనకు అతి విలువైనవి తెచ్చి పెట్టమన్నాడు. వాటిని చూసి నచ్చిన వాటికి బహుమతులు ఇస్తానని చాటింపు వేయించాడు. బంగారునగలు,వెండి, మణిమాణిక్యాలు, విలువైన పురాతన వస్తువులు మొదలైనవి తెచ్చిపెట్టారు. రాజు వచ్చి అన్నిటినీ పరిశీలనగా చూస్తూ ఓచిత్రపటం దగ్గర ఆగాడు.రాజు కు ఆ పటం విచిత్రంగా అనిపించింది. ఓ స్త్ర్రీ ఐదుగురు పిల్లలకు అన్నం పెడతా వుంది.ఆ పటం మీద'అమ్మ' అని రాసివుంది . "ఈ బొమ్మ ఎవరిది?"అవ్నాడు రాజు. "నేనే గీశాను."అంటూ ఓ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ముందుకొచ్చింది. "ఏంటీ బొమ్మ?" అన్నాడు రాజు. "తన ఐదుగురు పిల్లలకూ అన్నంపెడుతు న్న అమ్మ బొమ్మ రాజా!బిడ్డల్నికని,ఎంతో కష్టాలకోర్చి బిడ్డలను కంటికిరెప్పలా చూసు కునే అమ్మను మించిన విలువైనదేముంది మహారాజా!"అంది అమ్మాయి. "నిజమే"అంటూ ఆనందపడిపోయి పదివే ల వరహాలు బహుమతిగా ఇచ్చాడు రాజు. మరో ఆరుమాసాల తర్వాత ఓ సందర్భం గా రాజు ఓచాటింపు వేయించాడు.పనికి రానివి ఏమైనా వుంటే ప్రదర్శనకు పెడితే రాజు వచ్చిచూసి నచ్చినవాటికి బహుమతి స్తాడని చాటింపు సారాంశం. ప్రజలు రాళ్ళూ రప్పలు,చెత్తచెదారం. ముళ్ళకంపలు మొదలగునవి తెచ్చి పెట్టారు .రాజు వచ్చి చూస్తూ పోతున్నాడు. ఓచోట ఓస్త్రీ బొమ్మ కనిపించింది. ఆబొమ్మ క్రింద 'అమ్మ 'అని రాసి వుంది. " ఎవరు గీశారు ఈ బొమ్మను?"అంటూ గట్టిగా అరిచాడు రాజు. "నేనే రాజా"అంటూ ముందుకొచ్చింది ఓ అమ్మాయి. "గతంలో విలువైనదని అమ్మ బొమ్మ పెట్టిం ది నువ్వే కదా!పనికి రానివి తెచ్చి పెట్టమం టే,బహుమతి పొందిన 'అమ్మ'ను తెచ్చి పెడతావా?"అన్నాడు. క్షమించండి మహారాజా!ఆ అమ్మ తన పిల్లలకిఅన్నం పెడుతున్న అమ్మ..ఈఅమ్మ ఒక్కకొడుకూ అన్నం పెట్టకుండా పనికి రాదనివదిలేస్తే బిక్షం ఎత్తుకుంటున్న అమ్మ.. తల్లినిమించిన దైవం వుంటుందా?ఆ నిజం తెలిసినా దేవుడి పూజ చేస్తారు,కానీ తమ పిల్లలు సంతోషంగా ఉంటే చాలనుకునే తల్లినిపట్టించుకోరు.తనుతిన్నా,తినకపోయినాతమ పిల్లలు తింటుంటే చూసిఆనందించే ది తల్లి మనసుకు,పిల్లల సంతోషమే తన సంతోషంగా భావించే తల్లి ప్రేమకు వెల కట్టగలమా?కానీ ఇప్పుడు రెక్కలొచ్చిన కొడుకులకు పనికిరానిదైంది"అంది ఆ అమ్మాయి. రాజుకు విషయం అర్థమై పదివేల వరహాలు బహుమతిగా ఇచ్చాడు. తల్లిదండ్రులను ఆదరించక వదిలేసే వారికి కఠిన కారాగార శిక్ష విధిస్తూ శాసనం చేసాడు..ప్రజలు చెడు అలవాట్లను వదిలేలా,చైతన్య వంతులను చేయటానికి ప్రత్యేక బృందాలను నియ మించాడు.