ఆచరణశీలి - డి.కె.చదువుల బాబు

Acharanaseeli

నందుడనే యువకుడు పనికోసం వెతుక్కుంటూ భువనపురం చేరాడు. అక్కడ భూపతి అనే భూస్వామి తోటలపై అజమాయిషీ చేయడానికి మనిషి కోసం చూస్తున్నాడని తెలిసింది.నందుడు భూపతి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది ఉన్నారు. భూపతి వాళ్ళందరితో నందుడిని వెంటబెట్టుకుని తన తోటల్లోకి తీసుకుని వెళ్ళి అందరికీ తలో కాగితం ఇచ్చి సాయం త్రానికల్లా అందులో వ్రాసిన దాన్ని అర్థం చేసుకుని చెప్పాలని చెప్పి వెళ్ళిపోయాడు. నందుడా కాగితం చూస్తే అందులో ఇలా వ్రాసి ఉంది. ముచుంక్షిర నిరివా న్నఉ ల్లోదపఆ దురాకినిప మునతరిమసో దురాకోసుతీ మ్ముసొ లరుతఇ డాంకులే తిమనుఅ కుచంగిలిక ముష్టన కిడివాటిదుఎ నందుడికి వెంటనే ఆవాక్యాల భావం అర్థ మయింది.అప్పుడు వాడు కాగితాన్ని జేబులో వేసుకుని చుట్టూ చూశాడు. అక్కడ కొన్ని మొక్కలకు నీళ్ళు అందటం లేదు.వాడు వెంటనే పాదులు తీసి ,బోదులు త్రవ్వి వాటికి నీరు అందే ఏర్పాటు చేసాడు. తర్వాత వాడికి కొన్ని మామిడిచెట్ల క్రింద బుట్టలు కనిపించాయి.అప్పుడు నందుడు చెట్లెక్కి పక్వానికొచ్చిన పండ్లను కోసి,బుట్ట లను నింపాడు.ఆపని పూర్తయ్యేసరికి సాయంత్రం కావస్తోంది.నందుడికి బాగా ఆకలి వేస్తోంది.అయితే బుట్టల్లోని పండ్ల జోలికి వెళ్ళకుండా తోటలోని బావి దగ్గర కెళ్ళి నీళ్ళు తాగి కడుపు నింపుకున్నాడు. కాసేపటికి భూపతి దగ్గరనుండి కబురు వచ్చింది.నందుడు వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు. భూపతి వాళ్ళను కుతూహలంగా చూస్తూ" ఆ కాగితాల్లో ఏముందో అర్థం చేసుకున్నారా?" అని అడిగాడు. నందుడితో కలిపి నలుగురు ఆవాక్యాలకు సరిగ్గా అర్థం చెప్పగలిగారు. అందులోవాక్యా లు తిరగబడి ఉన్నాయి.వాటిని వెనుక నుండి ముందుకు చదివితే ఇలా ఉన్నాయి. 'ఆపదల్లో ఉన్న వారిని రక్షించుము. సోమరితనము పనికి రాదు. అనుమతి లేకుండా ఇతరులసొమ్ము తీసుకో రాదు. ఎదుటి వాడికి నష్టము కలిగించకు. నలుగురికీ మళ్ళీ ఏం పరీక్ష ఉంటుందోనని నందుడు అనుకున్నాడు. కానీ భూపతి నందుడిని ఎన్నిక చేసినట్లు ప్రకటించాడు. నందుడు ఆశ్చర్యపడ్డాడు. మిగతా ముగ్గురూ అది అన్యాయమన్నారు. భూపతి నవ్వి "నా మనుష్యులు మిమ్మ ల్నందరినీ గమనిస్తూనే ఉన్నారు.మీరు తోటలో ఉన్నంతసేపు ఏంచేయాలో తోచక ఆకులు త్రుంచి,కొమ్మలు త్రెంపి అల్లరి చేసారు. అంతేకాదు నా అనుమతి లేకుండా పళ్ళు కోసుకుని తిన్నారు."అన్నాడు. అలా చేయకూడదని మీరుచెప్పలేదు. కాగితంలోని వాక్యాలు అర్థం చేసుకుని చెప్పమన్నారు.వెనుకనుంచి చదవాలని గ్రహించి,మేము ఆవాక్యాలకు అర్థంచెప్పాము.నందుడూ ఆవాక్యాలకు అర్థం చెప్పాడు. అలాంటప్పుడు అతన్ని మాత్రం పనికి ఎన్నుకోవటం అన్యాయమే ."అన్నారు. "మీరు కాగితంలోని వాక్యాలకు అర్థం చెప్పారు.కానీ వాటి అర్థం నందుడొక్కడే ఆచరించాడు.ఎలాగంటే....ఆపదలో ఉన్న కొన్ని మొక్కలకు నీళ్ళు పోసి రక్షించాడు. సోమరితనం లేకుండా మామిడిపళ్ళు కోసా డు.అనుమతి లేదుకనుక తాను కోసిన పళ్ళను తినకుండా ఆకలి వేస్తూంటే మంచి నీళ్ళు త్రాగి కడుపు నింపుకున్నాడు.తోటకు నష్టం కల్గించలేదు.నందుడు ఆచరణ శీలి. అలాంటి వాడి కోసమే గాలిస్తున్నాను. మంచిని ఆచరించే నందుడే నాక్కావాలి" అన్నాడు భూపతి. ఆ ముగ్గురూ తమ తప్పు ఒప్పుకుని, భూపతి ముందు చూపును,నేర్పును,నందు డి గుణాలనూ ప్రశంసించి వెళ్ళిపోయారు.

మరిన్ని కథలు

Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న