ఉన్నది ఒక్కటే జీవితం - తాత మోహనకృష్ణ

Vunnadi okate jeevitam

"జీవితం చాలా విలువైనది...అందులో పెళ్ళి చాలా ముఖ్యమైనది. అందుకే, బాగా అలోచించి నీ పెళ్లి గురించి మంచి నిర్ణయం తీసుకో బాబు..నువ్వు కోరుకున్నఅమ్మాయిని చేసుకుని హ్యాపీ గా ఉండు " అన్నాడు తండ్రి రాఘవ

"నాన్నా..! ఎప్పుడూ సరదాగా ఉండే మీరు, ఇప్పుడు నా పెళ్లి విషయంలో ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు..? నాకు ఏ లోటు రాకుండా మీరే చూసుకున్నారు...ఇక మీదట కూడా మీరే నా గురించి చూడండి. మంచి అమ్మాయిని చూసి మీరే పెళ్ళి చేయండి"

"నువ్వు చెప్పింది నిజమే..నిన్ను చదివించడం..ఇంతటివాడిని చెయ్యడం వరకూ అంతా నేనే చూసాను. మీ అమ్మ లేకపోయినా, నేనే నీకు అన్నీ అయి చేశాను..కానీ, నీకు పెళ్ళైన తర్వాత..నీ జీవితం మారిపోతుంది..ఆ మార్పు నీకు బాగుండాలి"

"పెళ్ళైతే పెళ్ళాం వస్తుంది..మనం ముగ్గురం హ్యాపీగా ఉంటాం.. అంతేగా నాన్నా..ఇంకేముంటుంది..?"

"నువ్వు చెప్పింది నిజమే..కానీ నీ ఆనందం నువ్వు సెలెక్ట్ చేసుకునే అమ్మాయిని బట్టి ఉంటుంది. నీకు నచ్చిన అమ్మాయిని, సరైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడం చేత నీ లైఫ్ లో తొంభై శాతం హ్యాపీనెస్ డిసైడ్ అవుతుంది..లేకపోతే పది శాతం కూడా ఉండదు..ఆలోచించుకో..అందుకే నిర్ణయం నీదే"

"ఏమైంది నాన్న...! అమ్మ నిన్ను బాగా చూసుకోలేదా..?"

"ఇప్పుడు నా గురించి ఎందుకు బాబు..నీ పెళ్లి గురించి ఆలోచించు.."

"లేదు నాన్న...ఎంతో మంచివారైన మీరు.. ఇంత నిరాశగా ఉన్నారంటే, ఎందుకో నేను తెల్సుకోవాలి..మీ కథ నాకు చెప్పండి.."

"ఆ రోజుల్లో కాలేజీ లైఫ్ లో ఫ్రెండ్స్, చదువు అంతా హ్యాపీ గా సాగింది. నేను ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకర్. నన్ను చూసి మా అమ్మ నాన్న చాలా మురుసిపోయేవారు. నేను నా తర్వాత జీవితం చాలా గొప్పగా ఉహించుకునేవాడిని.

నా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ..మా నాన్న కూడా నన్ను ఇప్పుడు నేను నిన్ను అడిగినట్టుగానే అడిగారు. "నేను మీ ఇష్టం..మీరు ఏ అమ్మాయిని చేసుకోమంటే తననే చేసుకుంటాను..." అని అన్నాను

ఎప్పటినుంచో...తన ఫ్రెండ్ కూతురిని నాకు ఇచ్చి చేద్దామని మా నాన్నకి ఉండేది. అమ్మాయిని నేను చూడకుండా మా నాన్న మాటమీద ఒప్పేసుకున్నాను. పెళ్ళైన తర్వాత తెలిసింది.. మీ అమ్మకి కోపం ఎక్కువని..ప్రశాంతంగా ఉండే నాకూ, మీ అమ్మకు అంతగా కుదరలేదు. బతికినంతకాలం మీ అమ్మకి కోపం రాకుండా తనుకు నచ్చిన విధంగానే అన్నీ చేసాను. చివరికి ఆఖరి రోజుల్లో, మంచి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇపిస్తానన్నా..వద్దని మొండికేసింది మీ అమ్మ. అలా మీ అమ్మ నాకూ, నీకు దూరమయ్యింది. అప్పుడు అనిపించింది, మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం చాలా ముఖ్యమని.

ఉన్నది ఒక్కటే జీవితం. మా నాన్న చేసిన తప్పే, ఈ నాన్న చేయదలుచుకోలేదు...నీ లైఫ్ నీ ఇష్టం..నీకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకొని హ్యాపీగా ఉండు.." అన్నాడు రాఘవ

*********

మరిన్ని కథలు

Acharanaseeli
ఆచరణశీలి
- డి.కె.చదువుల బాబు
Twin flames
ట్విన్ ఫ్లేమ్స్
- నాగమంజరి గుమ్మా
Manchi sneham
మంచి స్నేహం
- కొల్లాబత్తుల సూర్య కుమార్.
Amma
అమ్మ
- డి.కె.చదువుల బాబు
Telu kuttina dongaalu
తేలుకుట్టిన దొంగలు
- మద్దూరి నరసింహమూర్తి
Filter coffee
ఫిల్టర్ కాఫీ
- ఇందు చంద్రన్