భువనగిరి రాజ్యాన్ని గుణనిధి పరిపాలిస్తూ ఉండేవాడు. అతనిమంత్రి సుబుధ్ధి. రాజుగారి సలహ సభ్యులను ఎంపిక చేసే బాధ్యత చేపట్టిన మంత్రి సుబుధ్ధి పలువురుని పరిక్షించి చివరిగా రంగనాధం, సోమయ్య అనే ఇరువురిని ఎంపికచేసుకుని " నాయనలారా విద్య ఒక్కటే మనిషి కి సరిపొదు దానితోపాటు తెలివితేటలు,లోకజ్ఞానం అవసరం.ఇప్పుడు నేను మిమ్మల్ని లౌక్యంతో కూడిన నాలుగు ప్రశ్నలు అడుగుతాను వాటికి సరైన సమాధానం చెప్పినవారే ఈపదవికి ఎంపిక ఔతారు. మొదటి ప్రశ్నఎంత దానం చేసినా తరగనిది ఏది ?రెండో ప్రశ్న ఎన్నడూ పండని కాయగా పిలవబడేది ఏది ? మూడవ ప్రశ్న కాయగా ఉంటూ పూవ్వుకు జన్మను ఇచ్చేది ఏది ? నాలుగో ప్రశ్న కాయగా ఉన్నప్పటీకి ఫలంగా పిలవబడేది ఏది?. సొమయ్య ఈప్రశ్నలు మర్మంతో కూడుకున్నవి సమాధానం చెప్పగలవా " అన్నాడు.
" మంత్రి వర్యా మొదటి ప్రశ్న దానంచేస్తే తరగని సంపద ఈలోకంలో ఏది లేదు. రెండొప్రశ్న ఎన్నడూ పండని కాయగా పిలవబడేది ఏదిలేదు. మూడవ ప్రశ్న కాయగా ఉండి పూవుకు జన్మను ఇవ్వడం అసంభవం .
కాయగా ఉన్నదాన్ని ఫలంగా పిలవడం అసంభవం "అన్నాడు.
" నాయనా రంగనాధం ఈప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలవా " అన్నాడు మంత్రి సుబుధ్ధి.
" తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను మొదటి ప్రశ్నకు సమాధానం విద్య ఇతరులకు ఎంత విద్యా దానం చేసినా అది తరగదు. రెండో ప్రశ్న ఎన్నడూ పండని కాయగా పిలువబడేది ఊరగాయ . ముడవ ప్రశ్న కాయగా ఉండి పూవుకు జన్మనిచ్చేది టెంకాయ దానిలో పువ్వు మొలవడం మనందరికి తెలిసిందే. నాలుగో ప్రశ్న కాయగాఉన్నా ఫలంగా పిలువబడేది సీతాఫలం .
" అన్నాడు. " భళా నిసమయస్ధుర్తి మెచ్చదగినదే! ఇపదవికి నీవే అర్హుడవు "అన్నాడు మంత్రి సుబుధ్ధి.