సీత కు రామం తో పెళ్ళయ్యి యేడాది అయ్యింది .ఆప్పటినించీ ప్రతిరోజూ గదులు చిమ్ముతున్నప్పుడు ఒకమూల గోడవారగా పెట్టిన పాతసైకిల్ ని చూస్తే మహా చిరాకు .ఆ అద్దె యింట్లో రెండుగదులు వంటిల్లు ముందు చిన్న వరండా వెనుకాల కొద్దీ జాగాలో బాత్రూమ్ టాయిలెట్. ఒక గది సీతమామగారు,మరోగది సీతా రామం వాడుకుంటారు .రాఘవయ్యగారు బడిపంతులుగా పదవీవిరమణ చేసారు .భార్య జానకి నాలుగేళ్లక్రిందట చనిపోయింది .రామం ఒక్కడే కొడుకు .మధ్యతరగతి సంసారం .రామం కూడా బడిపంతులు గానే స్థిరపడ్డాడు . వాళ్లు వున్న వూరు పల్లెటూరు కాదు కానీ అన్ని సౌకర్యలు అందుబాటులో వున్నాయి .సీతకు పాతసామాన్లు ముఖ్యం గా ఆ డొక్కు సైకిల్ చూస్తే కోపం .
“మామయ్యగారూ. యీ డొక్కు సైకిల్ పారేద్దాం .తుప్పుకూడా పడుతున్నది “అని సీత అనడం అయన వినడం మామూలయిపోయింది .
రామం రోజూ సైకిల్ తుడిచిపెడతాడు ,సీత అతన్నిచూసి నవ్వుతుతుంది .
“నవ్వు నవ్వు సీతా ,యీ సైకిల్ మీదే మనకు పుట్టబోయే బాబు ను సైకిల్ మీదేగా. నేను బడికి ,బజారుకు తీసికెల్లేది ?”అంటూ రామం గర్వం గా సీతవైపు చూడడం రోజూ దినచర్య .
సీత కు నెలలు నిండుతున్నాయి ,,ప్రసవం సమయానికి అమ్మనే తనదగ్గరకు రమ్మన్నది సీత. ఒకరోజు సీత చాలనీరసం గా వుండి పడుకుంది .రాఘవయ్యగారు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు .ఆయన. కళ్లు పెద్దవయ్యాయి .వార్త యేమిటంటే ప్రజలంతా మెచ్చిన ముఖ్యమంత్రిని అవిశ్వాసతీర్మానం తో పదవినించి తొలగించారు .ప్రజానీకం రాష్ట్రమంతా ‘బంద్’ప్రకటన ! స్వచ్ఛందం గా అందరూ సహకిరిస్తున్నారు .రామం బడి కూడా మూసేసారు.రాఘవయ్యగారు టీవీ పెట్టి చూస్తున్నాను .
సీతకు నొప్పులు మొదలయ్యాయి రామానికి చెప్పింది .అతను ఆటోకోసం వెళ్లాడు .ఊరంతా గందరగోళం గా వుంది,బయట ఆటోలు లేవు ,అక్కడక్కడా వున్నా వాళ్ళురామన్నారు.రామం ప్రయ్సత్నించి నిరాశతో ముఖం వెళ్ళాడేసుకుని యింటికి వచ్చాడు .సీత కు నొప్పులు పెరుగుతున్నాయి .రాఘవయ్యగారు రెండునిమిషాలు ఆలోచించు “రామం సైకిల్ బయటపెట్టు ,”అన్నారు .రామానికి అర్ధం అయ్యింది .గబగబా దాన్ని బయటపెట్టాడు .అదిచూసి సీత కంగారు పడింది .
“ఇప్పుడు ఆ. డొక్కుసైకిల్ యెందుకు”అన్నది భయం భయం గా సీత .
“రామం నేను. సైకిల్ నడుపుటకు నువ్వు సీతను సైకిల్. పైన కూర్చోపెట్టి చెయ్యి పట్టుకుని నా వెనకాలే నడు ,అన్నిటికి ఆ భగవంతుడే ,యీ సైకిల్ యీరోజు మనకు భగవంతుని మరోరూపం ,అమ్మా సీతా ,యెక్కు”అన్నారు రాఘవయ్యగారు .
నెమ్మదిగా సీత సైకిల్ సీటుపైన కూర్చుంది ,రాఘవయ్యగారు హ్యాండిల్ పట్టుకున్నారు ,రామం సీతను జాగ్రత్తగా పట్టుకున్నాడు .రద్దీలేనీ సందుల్లోనించి హాస్పిటల్ చేరుకున్నారు .
సీత పండంటి మగబిడ్డను ప్రసవించింది .రామం ,రాఘవయ్యగారు బిడ్డను చూసిమురిసిపోయారు .”మామయ్యగారు నన్ను మన్నించండి ఈ సైకిల్. మనపాలిటి దేవుడు ,ఆమ్మో యిదే లేకపోయినట్లయితే “అంటూ సీత ఆయనకు చేతులుజోడించింది .
“సీతా ,యీ సైకిల్ మీదే. మీ అత్తయ్యను తీసికెళ్లాను రామం. పుట్టాడు ,మళ్లీ యీ సైకిల్ పైనే నిన్నుతీసుకొచ్చాం ,పండంటి రాఘవుడు పుట్టాడు “అంటూ రాఘవయ్యగారు రామాన్ని చూసారు .
అందరూ భగవంతుడిని ప్రార్ధించారు .