కట్నం - తాత మోహనకృష్ణ

Katnam


"సరోజా..! మన అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది..నాకు చాలా ఆనందంగా ఉంది" అన్నాడు ఆనంద్

"అవునండి..! నాకూ చాలా సంతోషంగా ఉంది. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు..మంచి ఉద్యోగం. ఇంతకన్నా మంచి సంబంధం మనకి అసలు దొరకదు..మన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు.."

"అందుకే కదా వారు కట్నం ఎక్కువ అడిగినా..కాదనక అప్పు చేసి ఇవ్వడానికి ఒప్పుకున్నాను"

"అవునండి..మనకి ఒక్కటే అమ్మాయి కదా..కట్నం గురించి ఆలోచిస్తే ఎలా చెప్పండి..? మనం మాత్రం ఏం చేస్తాం..? అందరూ ఇచ్చేదేగా.."

"అవును నిజమే..అమ్మాయికి కూడా అబ్బాయి బాగా నచ్చాడు..వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంది"

"ఏమండీ..పెళ్ళికొడుకు తండ్రి మన ఇంటికి వస్తారని కబురు చేశారన్నారు..ఎందుకో..?" అడిగింది సరోజ

"ఏమో..ఎంగేజ్మెంట్ అయిపోయింది..పెళ్లి దగ్గరలో ఉందిగా..ఏదో అడగడానికి అయి ఉంటుందిలే.."

ఆ రోజు సాయంత్రం...

"రండి బావగారు..కులాసా..? కూర్చోండి.. సరోజా..! బావగారికి కాఫీ తీసుకురా.. "

"అలాగే తెస్తున్నా.."

"బావగారూ..! ఒక విషయం.. మా అబ్బాయి అడగమన్నాడు.."

"చెప్పండి బావగారు.."

"మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. ఆ విషయం లో ఎటువంటి సందేహము పెట్టుకోకండి. కాకపోతే, పెళ్ళి కుడా మేమే మా ఖర్చుతో చేస్తాం..మీకు ఎటువంటి శ్రమ లేకుండా.."

"అంటే..? నాకు మీ మాటలు అర్ధం కావట్లేదు బావగారు.."

"మా అమ్మాయికి కుడా పెళ్ళి సంబంధం కుదిరింది. మగ పెళ్ళివారు చాలా కట్నం అడుగుతున్నారు. ఎందుకు అంత కట్నం..? " అని అబ్బాయి తండ్రిని అడిగాను

"మీ అబ్బాయికి మీరు అంత కట్నం తీసుకుంటునప్పుడు, మేము అడిగితే మాత్రం తప్పా..? " అని జవాబిచ్చాడు పెళ్ళికొడుకు తండ్రి

ఆ మాటకి నా చంప పై కొట్టినట్టుగా అనిపించింది..నోట మాట రాలేదు.

"మీరు కట్నం తీసుకోకుండా మీ అబ్బాయికి పెళ్ళి చేస్తే, నాకూ ఒక్క పైసా కట్నం వద్దు.." అన్నాడు పెళ్ళికొడుకు

"అందుకే మీ దగ్గర కట్నం వద్దని అనుకున్నాము..అలాగే మా అమ్మాయికి కూడా కట్నం ఇవ్వట్లేదు బావగారు.."

"ఎంత మంచి మనసు మీది బావగారు..మా అమ్మాయి చాలా అదృష్టవంతురాలు..." అని మురిసిపోయాడు ఆనంద్

ఈ మార్పు అంతా మంచికే అనుకుని.. అందరూ ఆనందించారు.

*********

మరిన్ని కథలు

Perugu diddina kapuram
పెరుగు దిద్దిన కాపురం
- జి.ఆర్.భాస్కర బాబు
Margadarshakudu
మార్గదర్శకుడు
- చెన్నూరిసుదర్శన్
Manishi kannaa nayam
మనిషికన్నా నయం!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Vaddee muddu kaadu
వడ్డీ ముద్దు కాదు
- మద్దూరి నరసింహమూర్తి
Varna yavanika
వర్ణ యవనిక
- జి.ఆర్.భాస్కర బాబు
Parikinee
పరికిణీ
- రాము కోలా దెందుకూరు
Atchi vachhina moorkhulul
అచ్చి వచ్చిన మూర్ఖులు
- డి.కె.చదువుల బాబు