చెట్టు బాధ - లక్ష్మీ కుమారి.సి

chettu baadha

అనగనగా ఒక సాయంత్రం వేళ ఒక చెట్టు బాధగా ఉంటుంది అది చూసిన మరోచెట్టు ఆ చెట్టుని ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది .అప్పుడు ఆ చెట్టు అంటుంది ఏం లేదు మనం ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ అంటే అన్ని జీవులకు తినడానికి పండ్లు ఇస్తున్నాం పీల్చుకోవడానికి గాలిని ఇస్తున్నాం నివసించడానికి కొమ్మల రూపంలో వాళ్ల గృహాన్ని తయారు చేసుకునేందుకు సాయం చేస్తున్నాం కదా! అవును అంతే కాదు మనం వాళ్లకు పువ్వులని మరియు నిలువ నీడను ఇస్తున్నాం అయితే ఇప్పుడు ఏమైంది ఎందుకు అలా బాధగా ఉన్నావ్. అప్పుడు ఆ బాధపడే చెట్టు అంటుంది మనం ఇన్ని ఇస్తున్నప్పుడు వాళ్లు మనకు ఏమిస్తున్నారు? వాళ్ళు మనకు ఏమైనా ఇవ్వడానికి బదులు . వాళ్లు మనల్ని చంపే విషవాయువును గాలిలోకి వదులుతున్నారు, వాళ్ల స్వార్థం కోసం మన ప్రాణం తీస్తున్నారు, వాళ్ళ ఆనందానికి మన ప్రాణాన్ని బదులు తీసుకుంటున్నారు. మనం వాళ్లకు కీడు చేయనప్పుడు ఎందుకు వాళ్ళు మన పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అని ఆ చెట్టు బాధతో చెప్పింది అప్పుడే మెల్లగా సూర్యాస్తమయం పూర్తయింది .చంద్రుడు వచ్చాడు ఆ చంద్రుడు అప్పుడప్పుడే మబ్బుల మధ్యలో నుంచి తొంగిచూస్తూ వస్తున్నాడు. వస్తూ వస్తూ కలువ పువ్వులను వికసింప చేశాడు చంద్రుడు వాళ్ళ మాటలు విన్నాడు అప్పుడు ఆ చెట్టు చంద్రుని వైపు చూసి మీరైనా నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగింది .అప్పుడు చంద్రుడు ఇలా చెప్పాడు మనుషులందరూ ప్రకృతిని మర్చిపోతున్నారు. ఈ టెక్నాలజీ పెరిగిన అప్పటినుంచి మనుషులకు ప్రకృతి ఏమవుతుంది అన్న ఆలోచన లేదు కానీ ఇది ఏదీ శాశ్వతము కాదు కదా !మరి మీరు లేకపోతే ఈ జీవకోటికి ఆధారమే లేదు అందువల్ల ఏదో ఒక రోజు వాళ్ళ పొరపాటుని తెలుసుకుని ఈ ప్రకృతి పట్ల బాధ్యతగా నడుచుకుంటారు అని చంద్రుడు చెట్లకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు చెట్టు ఇదంతా ఎలా ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటుంది. అప్పుడు మరో చెట్టు అంటుంది మనుషులు గాని సెల్ఫోన్ టవర్లకు బదులు చెట్లను నాటినట్టయితే ఖచ్చితంగా ఇది తొందరలోనే జరుగుతుంది మొబైల్ ఫోన్స్ ఉపయోగించాలి.కానీ పరిమితిగా .అతిగా ఉపయోగిస్తే మనకు ఆధారమైనవి ఏవి మనకు మిగలవు . ఒక ఫోన్ వాడకున్న పర్వాలేదు కానీ చెట్టును మాత్రం నరకకండి. ఈ ప్రపంచంలో ఎన్నో జంతువులు ఉన్నాయి అందులో మానవజాతి గొప్పది ఎందుకంటే మానవజాతికి ఆలోచించి శక్తి ఉంది ఎంతో జ్ఞానం ఉంది మరి అంత గొప్ప జాతి అయిన మనం కొంచెం కూడా మిగతా జాతుల గురించి ఆలోచించకుండా వాటి అన్నింటిని మనం మన స్వార్థం కోసం ఉపయోగించడం మన జాతికి అవమానం కదా! మనకు ఆయువును పోస్తున్న చెట్లను మనం మర్చిపోయి ప్రవర్తిస్తే మనకు ఆయుష్షు ఎక్కడ నుంచి వస్తుంది .

మరిన్ని కథలు

A1 farmula
ఏ1 ఫార్ములా
- వై.కె.సంధ్యా శర్మ
Oke okkadu
ఒకే ఒక్కడు
- కందర్ప మూర్తి
Mitam
మితం
- ఆదిత్య ప్రణవ్
Bamma ki ichina mata
Bamma ki ichina mata
- Prabhavathi pusapati
Peddakodalu
పెద్దకోడలు
- మద్దూరి నరసింహమూర్తి
Parina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం
Tatayya salahalu
తాతయ్య సలహాలు
- గాయత్రి కులకర్ణి
Seshajeevitam
శేష జీవితం
- మద్దూరి నరసింహమూర్తి