రామాపురం అనే గ్రామంలో సీత ఉండేది. తను చాల తెలివైనది. సీతకి చిన్న నాటి నుండి చదువు అంటే ఆసక్తి ఎక్కువ ఉండేది. కాని వాళ్ల అమ్మ నాన్న మధ్య తరగతి వాళ్ళు అవ్వడంతో గవెర్న్మెంట్ బడిలో చేర్పించి చదివించారు. సీత ఆ బడిలో పదవ తరగతి వరకు చదివింది , మంచి మార్కులతో పాస్ అయింది. అసలు సమస్య ఇక్కడే మొదలైంది సీత కి పై చదువులు చదవాలి అనే కోరిక కలిగింది కానీ వారి ఆర్థిక పరిస్థితి అంత అంత మాత్రమే రామాపురం లో పదవ తరగతి వరకు మాత్రమే ఉంది. సీతని పై చదువుల కోసం పక్కనె ఉన్న గ్రామం లో ఇంటర్మీడియట్ జాయిన్ చేశారు. తను మంచిగా చదివి పాస్ అయింది అల తన చదువు డిగ్రీ వరకు పూర్తి చేసింది. సీతది పల్లె కావడం తో తర్వాత ఏమి చేయాలో అర్ధం కాలేదు.చేసేది ఎం లేక తను చదువును ఆపేసింది వాళ్ల ఇంటిలో ఆర్ధిక పరిస్థతి కూడా బాలేదు . కానీ ఒక ఆడ పిల్ల ని డిగ్రీ వరకు చదివించారు ఊరిలో వాళ్ళు మాత్రం ఆడపిల్లకి చదువు అవసరం ఏం ఉంది పెళ్లి చేస్తే ఇంటిలో ఉండి పిల్లలను చూసుకుంటే సరిపోతుంది అని అందరూ అనే వారు. సీత తో చదివిన స్నేహిురాలు పదవ తరగతి తో అపేసి పెళ్లి చేసుకుని ఇద్దరి పిల్లలను కంది కానీ వాళ్ల అత్త గారు మంచిది కాదు.తన భర్త కూడా వ్యాపారం పిచ్చితో ఉన్న ఆస్తులు కట్నం డబ్బులుకూడా పోగొట్టి అనారోగ్యాo తో చనిపోయాడు . సీత స్నేహిురాలిని ఆదుకోవడనికి ఎవ్వరు రాలేదు .అపుడు సీత తో తన కష్టం చెప్పుకుంటూ నేను నీల చదువుకుని ఉంటే నేను ఉద్యో గం చేసి నా పిల్లలను చూసుకునే దాన్ని ఊరి వాళ్ల మాటలు విని మా నాన్న నాకు పెళ్లి చేశారు ఇప్పుడు నేను నా పిల్లలు భారంగా ఒకరి పైన ఆధార పడి బ్రతకాల్సి వస్తుంది అని ఏడుస్తూ చెప్పింది. సీత తనని ఓదార్చి ధైర్యం చెప్పింది. సీత కి టీచర్ జాబ్ వచ్చింది వాళ్ల అమ్మ నాన్న లను మంచి స్థాయిలో ఉంచింది. అప్పుడు ఊరి వాళ్ల నోర్లు మూత పడ్డాయి. తన స్నేహతురాలి కథ విన్న సీత, అలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు అని అందరికి తన మాటలతో స్ఫూర్తి నింపి రామాపురం లో ప్రతి ఆడపిల్ల చదువుకునేల చేసింది . తను ఒక రోల్ మోడల్ అయింది . సీత ను చూసి వాళ్ల అమ్మ నాన్న లు గర్వం గా తిరిగే వారు. ప్రతి ఆడిల్లకు చదువు అవసరం నేటి కాలం లో ఆధునికత పెరిగింది కాని ఆడపిల్లల విషయం లో మాత్రం ఇంకా ఇలానే జరుగుతుంది. ఇక నైనా జనాల ఆలోచన రీతి మారాలి అని అస్థిస్తు ఒక అమ్మాయి. ఇక శెలవు.