మెరిసిన మమత - B.Rajyalakshmi

Merisina mamata

భర్త గోపాలం ఆఫీసుకు వెళ్లిపోయాడు .రాధ లోపలికి వచ్చి తలుపులు ముయ్యబోతుంటే “అదిగో గోపాలం గారి భార్య రాధ , మూడు నెలలక్రిందట మన వీధిలో అద్దెకు దిగారు ,పాపం పిల్లలు లేరు “అంటూ పక్కింటి సీత యెదురింటి సుమిత్రకు చెప్పడం రాధకు వినిపించింది .
“ అందుకేనేమో ఆవిడ ముఖం అదోలా వుంది పాపం “అంటున్నది సుమిత్ర .
రాధకు వొళ్లు మండింది “అదోలా ఏలావున్నాను ?”తలుపు తెరచి వాళ్లను చూస్తూ బిగ్గరగా అరిచింది .అంతే వాళ్లిద్దరూ వులిక్కిపడి గబగబా యెవరిళ్ళల్లోకి వాళ్లు వెళ్లి తలుపులు మూసుకున్నారు .రాధ కూడా తలుపులు మూసుకుని హాల్లో చిరాకుగా కూర్చుంది .
పాపం పాపం యీ మాట వినీ వినీ రాధకు చిర్రెక్కుతున్నది .తనకు పిల్లలు పుట్టకపోవడం వాళ్ల సమస్య కాదుగా ,తన తప్పూ కాదు .ఎదుటి వాళ్ల బలహీనతను పదే పదే గుర్తు చేస్తూ ఒకవిధం గా యెత్తిపొడుస్తూ ‘పాపం పాపం ‘అనడం రాధ కు అసహ్యం గా వుంది .వ్ అసలు వీళ్లకు పనీపాటా లేదు ,తనే వీళ్లను చూసి ‘అయ్యో పాపం ‘ అనుకోవాలి .
నేలక్రిందట జరిగిన సంఘటన రాధకు గుర్తుకొచ్చింది .

నవరాత్రుల్లో బొమ్మల కొలువు పెట్టుకుంది రాధ.చుట్టుప్రక్కల వాళ్లను పేరంటానికి పిలిచింది ..పిల్లలు కూడా వచ్చారు .పిల్లందరికీ స్వీట్స్ పెట్టింది ఆడుకోడానికి బొమ్మలిచ్చింది .పిల్లంతా ఒకేచోట స్వీట్స్ తింటూ సంతోషం గా ఆడుకుంటున్నారు .పేరంటాళ్లందరూ బొమ్మలకొలువు దగ్గర కూర్చున్నారు .రాధ అందం గా ముస్తాబయ్యి నవ్వుతూ అక్కడే కూర్చుంది .


వీధి చివరింటి సుశీల “రాధ గారూ మీకెంతమంది సంతానం ?” ప్రశ్నించింది .వెంటనే పక్కింటి సీత “పాపం రాధగారికి సంతానం లేదండీ “అన్నది .
“అయ్యో పాపం “అన్నది సుశీల .మళ్లీ “పాపం “

అప్పటికే రాధ వాళ్ళ మాటలు నవ్వుతూ వింటూనే “యీ సారి నా కొలువు థీమ్ తిరుమల యేడుకొండలు ,కొండపైన వున్న పవిత్ర ప్రదేశాలు ,బావున్నాయిఆ సుశీల గారూ”అంటూ అందరివైపు చూసింది .

“పిల్లలుంటే అంతా ఇల్లుపీకి పందిరేసివుండేవాళ్లు !అందుకే కొలువు బాగుంది .మా యింట్లో అయితే “అంటూ సీత మూతి తిప్పింది .మళ్లీ టాఫిక్ పిల్లలదగ్గరే ఆగింది .రాధ కు ఆవేశం వచ్చింది .
“నాకెందుకు పిల్లలు లేరు ,?వీధిలో ఆడుకుంటున్న అందరూ నా పిల్లలే ,నేను కన్నసంతానం అయితే నాలో స్వార్ధం పెరిగేదేమో “అన్నది రాధ ,తర్వాత యెవరూ మాట్లాడలేదు .తాంబూలాలు తీసుకుని వెళ్లిపోయారు .

కుక్క అరువుతో రాధ ఆలోచనలకు కళ్లెం పడింది .
కుక్కకు పెరుగన్నం పట్టింది .ప్రతిఫోజు సాయంకాలం పిల్లలందరూ రాధ యింటిముందు చేరి ఆడుకుంటారు .రాధ వాళ్ళకోసం తినడానికి ఏదోఒకటి చేస్తుంది .తనూ అక్కడేకూర్చుని ఎంజాయ్ చేస్తుంది .యించుమించు గోపాలం వచ్చేదాకా పిల్లలుంటారు .గోపాలం రాధ సంతోషాన్ని యెప్పుడూ కాదనలేదు .

ఒకరోజు గోపాలం ఆఫీసునించి వస్తుంటే హృదయవిదారకమైన సంఘటన చూసాడు .మూడేల్లబాబు బట్టలులేకుండా యేడుస్తూ తిరుగుతున్నాడు ,.గోపాలం బాబు దగ్గరకు వచ్చాడు .చుట్టూ యెవరూ ఆరాటపడడంలేదు .పిల్లాణ్ణి చూస్తుంటే జాలివేస్తున్నది .గబగబా ఒక బిస్కట్ పాకెట్ కొనుక్కొచ్చి వాడికి పెట్టాడు ! బాబు యేడుపు అపితిన్నాడు .గోపానికి ఆ పిల్లాణ్ణి ఆలా రోడ్డుమీద వదలబుద్ది కాలేదు .ధైర్యం చేసి ఆటోలో బాబును యింటికి తెచ్చాడు ..రాధకు వివరం గా చెప్పాడు .రాధ వాడికి స్నానం చేయించి చిన్న టవల్ చుట్టింది .గోపాలం అదే ఆటోలో వెళ్లి పిల్లాడికి చొక్కాలాగులు కొనుక్కొచ్చాడు .కాసేపు ఆడించి అన్నం పెట్టిపడుకోబెట్టింది .

“ఈ మనకు దైవమిచ్చిన బిడ్డ ,యే తల్లి కన్నబిడ్డో ! ఒకవేళ యెవరైనా వచ్చి అడిగితే యిచ్చేద్దాం ,అప్పటిదాకా మనబిడ్డే ,వీణ్ణి. రామం అని పిలుద్దాం సరేనా “అన్నది రాధ .

భార్య కళ్లల్లో వెలుగు చూసి మురిసిపోయాడు గోపాలం . దైవం యెవరిని యెప్పుడు కనికరిస్తాడో కదా అంతా దైవ సృష్టి !

మరిన్ని కథలు

Maa sir
మా సార్
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Tulasidasu deevena
తులసీదాసు దీవెన
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kanuvippu
కనువిప్పు
- సరికొండ శ్రీనివాసరాజు
Sogasari pilli Gadasari Eluka
సొగసరి పిల్లి - గడసరి ఎలుక
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Vimanashrayam lo papa
విమానాశ్రయంలో పాప
- మద్దూరి నరసింహమూర్తి
Prasadam
ప్రసాదం
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Sundari maarindi
సుందరి మారింది
- జి.ఆర్.భాస్కర బాబు