ఒక తాగుబోతు మొగుడు ప్రతీరోజు ప్రొద్దున్న బార్ తెరవగానే, తన స్నేహితుడితో మందు తాగుతాడు. మధ్యాన్నం కూడా కంటిన్యూ గాతాగుతూనే ఉంటాడు. రాత్రి ఎనిమిది దాకా తాగుతూంటాడు. మిత్రునితో ఆటు తాగుతూ పిచ్చాపాటి చేస్తూ, పనికిమాలిన మాటల మాట్లాడుతుండారు. ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. పనిలేదు పత్తాలేదు. బేకారిలాగా తిరుగుతాడు. ఇంటికి తూలుతూ ప్రతీరోజు వెళతాడు. ఇంట్లో పనికిమాలిన గ్వాగుడు వాగుతుంటాడు. భార్య ఏమీ అనలేక, సహనంతో, ఓపికతో బాధపడుతూ, సంసారం ఈడ్చుకుంటూ వస్తుంది. ఏమి చేయాలో ఈ తాగుబొతూ మొగుడిని కట్టుకుని అని కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది.
ఒకరోజు, ఒక ఆలోచన భార్యకు వస్తుంది. తన మొగుడిని ఇంట్లోనే తాగమని, కావాలంటే తన తాగుబోతు మిత్రుని ఇంటికి రప్పించుకొని తాగమంటుంది. సరే అని అంటాడు తాగుబోతు మొగుడు. కొద్దికాలానికి మెల్లమెల్లగా తాగుడికి మాన్పిస్తుంది భార్య. తానూ రాను తాగుడు మానేస్తాడు మొగుడు. సాంస్సారం కొంచం గూడ్స్ బండి నడిచినట్లు ఉంటుంది. తాగుడు వ్యవహారం ఉండదు. డబ్బు లేకపోయినా సరే, ఎలాగైనా బతకొచ్చు. అప్పో సొప్పో టెక్ని సంసారం చేయవచ్చు. తాగుడు చివరికి మానేస్తాడు. భార్య సంతోషంగా ఉంటుంది. మంచి మొగుడుగా మారుతాడు చివరికి. కొద్దీ రోజులయిన తరువాత, భార్య నెల తప్పి, చివరకు ఒక అన్దన్తి బాబు జన్మిస్తాడు. అందరు ఆనందంతో ఉంటారు. ఇప్పుడు భర్త ఏదో సంపాదించిన దానిలో భార్యకు కావలసినవి, ఇంటికి కావలసినవి, బాబుకు కావలసినవి తెచ్చి ఇస్తాడు, మంచి మొగుడు. యివన్నీ సంసారంలో ఉండే ఇతి బాధలు, కష్టాలు, సుఖాలు, అదే అంది దీనినే బిరియాని సంసారం అని అంటారు. భార్య భర్తలు హాయిగా ఉంటారు.
------
ఇద్దరు ఫ్రెండ్స్ బార్ కి వెళతారు తాగడానికి ఒక టేబుల్ లో కూర్చుంటారు.
ఒక పెగ్గు తాగుతున్నప్పుడు.
విక్రమ్:
అరె ఏంటిదిరా. నువ్వు రెగ్యులర్ గా కావడంలేదు.
రవి;
నా బిజీ లో నేనున్నాను. రోజూ యిదే పనికాదురా నాకు.
ఏదో కొంచం తాగితే ఒకే.
మరీ పీకలదాకా తాగితే ఇంట్లో గొడవలొస్తాయిరా.
విక్రమ్:
అవుననుకో. మనపని మనం చేసుకుంటూ పోవాలి.
రోజు గడిస్తే మళ్ళీ వెనక్కి రాదు.
రవి:
ఆమెమీల్ప్.
మెవ్వి సీజే[[ఓందో కరెక్టు అనుకో.
విక్రమ్:
రేపు ఏమవుతుందో ఎవరికి తెలీదు.
రవి:
అంటే ఇవాళే తాగేయాలా?
విక్రమ్:
పీకలదాకా తాగితేనే satisfaction రా
ఏంటి ఇశేషాలు?
రవి:
ఏముంటాయిరా.
ఇప్పుడొచ్చేవన్నీ ఎలెక్షన్ల రోజులు.
ఒకటి తరువాత మరొకటి.
డబ్బుకు కొదవుండదు.,
విక్రమ్:
అవునురా.
ఏ పార్టీ గెలుస్తుందిరా మన రెండు రాష్ట్రాలలో?
రవి:
అన్నీ ఫ్రీగా ప్రజలకిచ్చేవాడే గెలుస్తాడు.
విక్రమ్:
మరి ఏదీ ఇవ్వని పార్టీ?
రవి:
ఎందుకేస్తారు ఓట్లు?
జనాలు పిచ్చోళ్ళు కాదు.
విక్రమ్:
నిజంగా ఓట్లు అడుగుతే యెవ్వడు ఓటు వేయదు.
ఆమ్యామ్యాం ఉంటేనే ఓటు.
ఉట్టి అమ్యామ్యాం కాదు, ప్రతీరోజు భీర్, విస్కీ బిరియాని, డబ్బులు ఖచ్చితంగా ఉంటేనా ఓటు గ్యారెంటీ.
నోటు గ్యారంటీ గా ఉంటేనే ఓటు గారంటీ.
రవి:
అవుననుకో.
అది జగమెరిగిన నగ్న సత్యం.
చాపక్రింద నీరుగా ఇవన్నీ తప్పక జరుగుతూనే ఉంటాయి.
(రెండవ పెగ్గు, మోడల్ పెగ్గు, అయినా తరువాత)
విక్రమ్:
అరె ఏందిరా ఉద్యోగాలందుకురా.
ఏదైనా డబ్బున్న పొలిటికల్ పార్టీతోనే తిరగాలి.
ఇలాంటి మందు, బిరియాని, డబ్బు, అన్నీ ఫ్రీ ఎలెక్షన్లు అయేంతవరకు
రవి:
అవును, మందు తిండి, తిరుగుడు, టిఫిన్లు అన్నీ ఫ్రీ.
విక్రమ్:
యింకొఞ్చమ్ పోసుకోరా.
యింకో క్వార్ట్రర్ బాటల్ తెప్పించుకుందాం. నో వర్రీస్.
రవి:
మందు ఎక్కువైపోతే ప్రాబ్లెమ్ రా
విక్రమ్:
ఎక్కువైతే కిక్కు ఇస్తది.
గంట తరువాత అదే దిగిపోతుందిరా
రవి:
మరి ఇంటికి వెళ్ళాలి కదరా
విక్రమ్:
రాత్రికి కదా వెళ్ళేది
రవి:
మరి తిండి తినవా?
విక్రమ్:
ముందుంటే తిండేందుకు
రవి:
సరే రా యింకొక క్వార్ట్రర్ బాటిల్ తెప్పియ్యి
విక్రమ్:
బేరర్, బేరర్ (అరుస్తాడు)
బేరర్:
సార్ చెప్పండి సార్.
విక్రమ్:
ఇంకొక క్వార్ట్రర్, మిక్సతురే, రెండు బిస్లరీ సోడా తీసుకురా.
బేరర్:
సరే సార్.
రవి:
కొంచం మెల్లగా తాగుదాం విక్రమ్
విక్రమ్:
అవును.
లటుక్కుమని ఒక్క గల్ఫ్ లో తాగితే మజా ఏమీ రాదు.
బుర్ర గిర్రున తిరుగుద్ది.
రవి:
మనకు కావలసినవి అన్నీ యిచ్చే పార్టీ లో చేరదాం.
వాళ్ళ పని, మనపని ఈజీ గా ఉంటుంది.
కాన్వాస్ చేస్తే కాండిడేట్ గెలుస్తాడా, ఓడిపోతాడా, మనకి సంబంధం లేదు.
(మస్తుగా తారుతారు)
తూలుతూ విక్రమ్ తన ఇంటికి వెళతాడు.
కాలింగ్ బెల్ కొడతాడు.
(విక్రమ్ భార్య తలుపు తెరుస్తుంది)
ప్రియాంక:
తలుపు తెరుస్తుంది
విక్రమ్:
ఇంతసేపా తలుపు తెరవడం?
ప్రియాంక:
బార్లలో గంటలు గంటలు గ్లాసు పట్టుకు త్రాగుతూ ఉంటె అప్పుడు టైం తెలియదు.
ఒక్క ఐదు నిముషాలు తలుపు తెరిచేదాకా ఉండలేరా.
నేను పూజ గదిలో ఉన్నాను.
వదిలేసి రాలేను.
నాకేం తెలుసు ఇంత తొందరగా ఊడిపడతారని.
విక్రమ్:
ఏమీ. డైలాగులు వాడుతున్నావ్. కానీ కానీ తిండిపెట్టు త్వరగా.
ప్రియాంక: వచ్చింది ఇప్పుడే. ఇంకా కాళ్ళు చేతులు కడుక్కోలేదు.
అన్నీ అయినతరువాత తిండికి రండి.
వండింది తిందురుగాని.
ఏదుంటే అది తినండి.
విక్రమ్:
అంట్జ్, ఏ కూర వండలేదా.
ప్రియాంక:
అసలు తమరు కూరగాయలు తేస్తేగా వండేది. డబ్బు ఇవ్వరు.
ఎలా వండాలి కూరలు కోనందే.
పప్పులు, అప్పులు పాలు, పంచదార ఉండవు.
టీ పొడి అసలే ఉండదు కనీసం టీ తాగుదామంటే. అసలు ఏముంది కనుక తమరికి పంచభక్ష పరమాన్నాలుండాలి.
నేను రోజుకొకసారి గుప్పెడు మెతుకులు తిని పస్తులుంటున్నా.
అసలు గమనించారా.
ఎప్పుడూ ప్రొదున్నే బయటకు చెక్కేయడం, తాగడం, రాత్రికి ఇంటికి రావడం. ఇది ఏమైనా గెస్ట్ హౌస్ ఆ.
అన్నీ రెడీ గా ఉండడానికి, లేదా ఎదేమైనా, పయింగ్ గెస్ట్ రూమా?
నేనేమైనా వంటమనిషినా లేక పనిమనిషినా?
విక్రమ్:
అబ్బా, నా బుర్ర తింటున్నావ్.
ఏదుంటే అదిపడేయి.
తలా నొస్తుంది.
ప్రియాంక:
అన్నీ నోస్టాయ్హి.
పీకల దాకా తాగితే తలనొయ్యాక ఇంకేమి నొస్తది?
పెట్టింది తిని తొంగొంది.
విక్రమ్:
ఏదో ఏడువ్. అసలు దరిద్రం అంతా ఈ ఇంట్లోనే ఉంది.
ప్రియాంక:
ఇంట్లో దరిద్రం కాదు.
నీ నెత్తిమీద దరిద్ర దేవత తాండవిస్తోంది.
నీకున్న దరిద్రం మొత్తం నాకు అంటుకుంటోంది.
ఎలా ఉండేదాన్ని, నన్ను ఎలా తయారుచేశారు?
విక్రమ్:
నాకు ఓపిక లేదు.
తిండిపడేయి.
ప్రియాంక:
ఓపిక గ్లాసులు పట్టుకోవడానికి, బార్లలో వాగడానికి ఉంటుంది.
ఇంటికి వస్తే ఓపికుండదు.
వచ్చి తిండితిని తొంగో.
మళ్ళా రేపు ప్రొదున్న 8 గంటలకి చెక్కేస్తేవుగా.
విక్రమ్:
మరి బయటకి వెళ్ళాలి.
వెళ్తేనే డబ్బు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది.
ప్రియాంక:
ఛాన్స్ ఆ.
అసలు డబ్బు వస్తే, ఇంటిదాకా రాదుగా.
తాగుడు, డబ్బుంటే పేకాట ఫ్రెండ్స్ ఉన్నారుగా.
మీ గాంగ్ మెంబెర్స్.
ఇల్లు గుర్తుకు రాదు.
విక్రమ్:
అసలు ఏంటో మాట్లాడుతుంది.
నా బుర్రకేం ఎక్కడంలేదు.
ప్రియాంక:
బుర్రకి ఏమీ ఎక్కవు. రెండు పెగ్గులు పడితే అన్నీ అర్ధం అవుతాయి.
విక్రమ్:
ఓరినాయనో.
తిండితిని తొంగోవాలి.
వాతావబ్రాణం చల్లబడుతుంది.
ఇలాంటి వాగుడు పెళ్ళాం ఉంటె, భరించడం కష్టం.
నేను కాబట్టి ఇలాంటి వాగుడు పెళ్ళాంతో భరిస్తున్నాను.
(రగ్గు కప్పుకొని పడుకుంటాడు).
ప్రియాంక:
ఏం మొగుడా ఏంటో.
పెంపకం సరిగా రాలేదు.
పిల్లా లేదు పీచు లేదు, జెల్లా లేదు.నాకు కట్టబెట్టారు.
యింకా జీవితంలో బాగుపడే లక్షణాలు లేనేలేవు.వేస్టుగాడు.
దరిద్రం అంతా నా మొగుడు నెత్తిమీదే ఉంది.
ప్రొద్దున్న వెళతాడు.
రాత్రికి వస్తాడు.
ఏ కంపాకో వెళతాడు.
లేదా రెండవ సెట్ అప్ ఏమైనా ఉందా అని అనుమానం వస్తోంది.
ఈయన మొహానికి, రెండవది ఉండాలా?
డబ్బు లేదు దస్కం లేదు.
ఈ మొహానికి రెండొదికూడాను.
అయినా డబ్బు లేకపోతె ఎవ్వతి రాణిస్తుంది.
పోనీ అందగాడా అంటే, ఆ మొహానికి వాస్తులేదు.
ఇదొక గెస్ట్ హౌస్ అయిపొయింది.
ఏమో?
రాను రాను ఎలా భరించాలో అర్ధం కావడంలేదు.
అసలు ఇలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు పుట్టిస్తాడో అర్ధం కావడంలేదు.
నా పూజలు, ఉపవాసాలు అన్నీ వేస్తూ.
ఏడుస్తూ నిద్రపోతుంది.
-----------------
ప్రియాంక ఆలోచిస్తూ నిదురపోతుంది. తెల్లవారు ఝామున ప్రియాంకాకు ఒక అమోఘమైన ఆలోచన వచ్చింది. తన మొగుడు బయట బార్లలో, జనతా బార్లలో పనికిరాని వాళ్ళ సోబాతుతో తాగి గొడవలు తెచ్చుకునే వాటికన్నా, ఇంట్లోనే తాగమని, అదికూడా, ఒంటరిగా తాగలేరు కాబట్టి, ఎవరో ఒక మిత్రుని కి కూడా ఇంట్లో కూచోబెట్టి, తాగేటప్పుడు వాగాలని, ఈ విషయం చెప్పాలని నిర్ణయించుకుంది.
----------------
విక్రమ్:
పళ్ళుతోముకుండానే యిదిగో అండీ టీ.
త్రాగండి, అనేసరికి ఆశ్చర్యపోయాడు.
ప్రియాంక:
అవునండీ టీ త్రాంగండి.
విక్రమ్:
ఏదో మార్పు వచ్చిందో అని గొణుక్కున్నాడు
ప్రియాంక:
ఒక విషయం చెప్పాలనుకున్నా డ్
విక్రమ్:
ఏంటిది?
ప్రియాంక:
మీరు యివాలనుండి ఏ బార్లోనో, లేక జనతా బార్లోనో తాగొద్దు.
ఇంట్లోనే హాలులో కూర్చొని తాగండి.
ఒంటరిగా తాగలేకపోతే మీ మిత్రుని ఎవరినైనా తెచ్చుకుని తాగండి.
నాకు ఎలాంటి అభ్యంతరంలేదు.
విక్రమ్:
ఈ విషయం నచ్చింది.
సరే అన్నాడు.
ప్రియాంకా:
ఇవాలనుండే తెచ్చుకోండి తాగండి.
తాగడం ప్రారంభించండి.
కానీ, నన్ను మటుకు దిస్తుర్బ్ చేయకండి.
ఒక క్వార్ బాటిల్, లేదా ఒక హాఫ్ బాటిల్ లేదా ఒక ఫుల్ బాటిల్ చెచ్చుకోండి. మియు మిత్రునికి ఫోన్ చేసి పిలిపించుకోండి.
పీకలదాకా తాగండి.
కక్కుకొండి.
నో ప్రాబ్లెమ్.
నేను పట్టించుకోను.
విక్రమ్:
అలాగే. డన్.
(మనసులో అనుకున్నాడు.
ఇది చాలా ఉత్తమమైనదని.
బయట తాగితే నానా గొడవలు, వాగుడ్లు ఉంటాయని ఇంట్లో తాగితే బయట వాగినంత ఉండదని అనుకొన్నాడు.)
ప్రియంక:
నాకు ఏమీ అభ్యంతరం లేదు.
ఇక మీ ఇష్టం.
మీ మంచికే చెబుతున్నాను.
ఇంట్లో తాగితే మీకే మంచిది.
ప్రశాంతంగా తాగొచ్చు.
అవసరమైతే టీవీ పెట్టుకొని చూస్తూ తాగండి.
(ఇద్దరూ హ్యాప్పీస్.)
---------------
కొద్దిరోజుల తరువాత మెల్లిమెల్కిగా విక్రంతోని తాగుడు మాన్పించింది ప్రియాంక. కొంతకాలానికి విక్రమ్ తాగుడు పూర్తిగా మానేసాడు. ప్రియాంక సంతోషించింది.
----------------
ఒకటిమాటుకు నిజం. డబ్బు సంపాదించకపోయినా ఫరవాలేదు. కావాలంటే ఒకపూట భోజనం చేస్తే చాలు. ఏమీ కాదు. హెల్త్ బాగుంటుంది. మనసు ప్రశాంతత ఉంటుంది. ఏ గొడవలు రావు. ఒక్క డబ్బులేని లోటు టప. కానీ మందు తాగితే ఒళ్ళు గుల్ల అవుతుంది. గొడవలు వస్తాయి. ప్రశాంతత ఉంటుంది. అప్పులు అయిపోతాయి. పరువుప్రతిష్ఠ బజారు పాలవుతాయి. అనేక కుటుంబ కలహాలు వస్తాయహి. కుటుంబ మంగళకరమైన కార్యక్రమాలకు దూరమవుతారు. సంఘంలో పేరు ఉండదు. తాగుబోతు ఏ నిందిస్తారు. ఇంటి పేరు బదనాం కూడా వుంటుంది. మరీ ఖర్మకాలితే ఆక్సిడెంట్ లు కూడా వుంటాయి. చివరికి అంతే సంగతులు. చిత్తగించవలెను.
-------------