బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు - మంత్రిప్రగడ ఆంజనేయులు

Bakkati pellam-laavati mogudu

బక్కటి పెళ్ళాం చీపురు పుల్లంత సన్నగా ఉంటుంది. లావాటి మొగుడు ఒక ఏనుగు ఉన్నత లావుగా ఉంటాడు. ఎలా పెళ్లి అయిందో వీరిద్దరికీ దేవుడికే తెలుసు. మరీ సన్నగా ఉన్నానని తాను ఫీల్ అవుతుంది. మరీ లావుగా ఉన్నానని అతను అనుకుంటాడు మనసులో. ఒకరంటే ఇంకొకరికి కొంచం ఈర్ష. ఎందుకంటె సన్నగా ఉంటె కొంచం లావు కావాలని ఆమె, లావుగా ఉంటె కొంచం సన్నాబడాలని అతను ఎప్పుడు అనుకుంటారు. విషయంలో ఇద్దరి మనసులు బాధతో వాదులాడుకుంటారు, కీచులాడుకుంటారు, ఏమీ చేయలేక ఒకరి మీద పంచులు, కొన్ని అనవసరమైన మాటలతో కొన్ని సార్లు కోపాలలతో మూతులు మాడ్చుకుంటారు. వాదనలు, పనికిమాలిన మాటలతో ప్రతీరోజూ ఏదో ఒక చిన్న గొడవ జరుగుతూనే ఉంటుంది. కానీ, ఇద్దరూ కొన్నిసార్లు తమకు తాము ఓదార్చుకుంటారు. ఎందుకో కొంచం అసహనం, అసంతృప్తి, ఏదో చెప్పలేని బాధ, మనసులు గాయమై, ఏమీ చేయలేని పరిస్థితులు. ఒకరు మరీ సన్నగా ఉంటూ, ఇంకొకరు మరీ లావుగా ఉంటే, చూసే జనానికి కొంత జాలిలాంటి ఆలోచన వస్తుంది 'అయ్యో' ఏమిటిది, అని. కానీ, ఎవరేమి చేయగలరు. ఏది ఏమైనా, జీవితాలు గడపాల్సిందే. దేవుడి ఆశీస్సులతో భార్య భర్తలు అయ్యారు. సన్నమూ, లావు అన్నవి దేవుని లీలలే అని అనుకోవాలి. తప్పదు. సంసారం చేయాల్సిందే. మాటల యుద్ధం ఆగదు. ఎవరి సంసారాలు వారివి. ఎవరి గొడవలు వారివి. ఎవరి బాధలు వారివి. ఎవరి అనుభవాలు వారివి. ఎవరి జీవితాలు వారివి. ఎవరి కర్మలు వారివి. కానీ ఒకటి మటుకు నిజం. ప్రతీవారి జీవితాలలో గొడవలు ఉంటూనే ఉంటాయి. ప్రశాంతంగా జీవితాలు గడవాలనే ప్రసక్తి లేనేలేదు. జీవితాలు కాలంతో పయనించాలి, మంచి అయినా, చెడూ అయినా. క్రింద వాదనలు, వాదులాటలు, డైలాగ్ లు, కీచులాటలు, మీరే చూడండి.

లావాటి మొగుడు:

ఈదురు గాలొస్తే కొట్టుకు పోతావ్.

బక్కటి పెళ్ళాం:

నువ్వున్నావుగా మెట్రో పిల్లర్ లాగా.

నాకు అడ్డుగా నుంచో, ఏమీ కొట్టుకుపోను.

లావాటి మొగుడు:

బాగా తిండితిని లావెక్కచ్చు కదా.

బక్కటి పెళ్ళాం:

నువ్వున్నావుగా పిల్లర్లాగా, ఏమి ఉద్ధరిస్తున్నావని.

తిండి దండుగ

నేను సన్నగా ఉంటె నష్టమేమీ లేదు.

లావాటి మొగుడు:

నాలాగా లావుగా ఉంటె, చాలామంది భయపడతారు నన్ను చూసి.

బక్కటి పెళ్ళాం:

నీకు తెలీదేమో, నా నోరు చూసి, నా దరిదాపుల కెవరూ రారు.

లావాటి మొగుడు:

నీకు సగం సీట్ చాలు (వన్ బై టూ)

బక్కటి పెళ్ళాం:

నువ్వు ఆటోలో పట్టవు

కారులో పట్టవు,

బస్సులో పట్టవు,

కనీసం బాత్రూమ్ లో కూడా పట్టవు.

లావాటి మొగుడు:

ఊపిరి పోయేదానిలా బక్కగా ఉంటె ఎలా?

బక్కటి పెళ్ళాం:

నీకసలు ఊపిరాడు తుందా?

నడవ లేవు.

కూర్చుంటే లేవలేవు.

నాలాగా పనులు అసలే చేయలేవు.

లావాటి మొగుడు:

నాకు దేవుడు తిండి మస్తుగా తినమని ఈ ఆకారం ఇచ్చాడు

జీవితంలో కావాల్సిందేముంది?

ఫుల్ గా మెక్కడం.

అదృష్టముండాలి పీకల్దాకా తినడానికి.

బక్కటి పెళ్ళాం:

తిండితిని ఒక డ్రమ్ములా ఉన్నావు కదా.

ఎక్కడికైనా వెళ్లాలంటే రోడ్డురోలర్ గా దొర్లుకుంటూ పోవాల్సిందే.

లావాటి మొగుడు:

ఎందుకు?

ఎస్కలేటర్, లిఫ్టులు మాలాంటి వారి గురించే పెట్టారు.

బక్కటి పెళ్ళాం:

నువ్వు ఎక్కుతే ఒక ఇంచ్ కూడా కదలదు.

గట్టిగా మాట్లాడితే ఇనప తీగలు తెగి డమాల్ మని తెగి కిందపడిపోతుంది.

లావాటి మొగుడు:

పడితే పడ్డానులే.

ఒకేసారి పీడాపోతుంది.

బక్కటి పెళ్ళాం:

అదేం మాటలండీ.

నా కుంకుమ బొట్టు ఏమి కావాలి.

నేను సుమంగళిగా ఉండాలి కదా.

లావాటి మొగుడు:

ఈ బక్కటొళ్లు ఎక్కువ మాట్లాడుతారు.

తెలివెక్కువ.

ఏదో కొట్టినట్టు మాట్లాడుతారు.

బక్కటి పెళ్ళాం:

ఈ లావు దేవుడిచ్చినది.

నేను పెంచుకున్నాడు కాదు.

నాకేం ఇప్పుడు బాగానే ఉన్నాను.

లావాటి మొగుడు:

ఊదితే పడిపోతావు.

ప్రాణం పోయేలా ఉన్నావ్.

తిండి బాగా తిను.

బక్కటి పెళ్ళాం:

సన్నగా ఉండే వాళ్ళకేమీ కాదులే.

లావాటోళ్ళకే ప్రాబ్లెమ్.

చాలా ఎక్కువ కొవ్వుంటుంది.

ఏదైనా షుగర్ వ్యాధి వస్ట్జ్ అప్పుడు తెలుసుంది.

ఒళ్ళంతా ముడతలు పడి ముసలోడివిలా కనుబడుతావ్.

లావాటి మొగుడు:

జరిగేది జరగక మానదు.

నాకు తిండిపుష్టి ఎక్కువ.

అందరూ నీలాగా బక్కపీచులా ఉండరు కదా.

కొంచం ఎక్కువగా ఉన్నా అంతే.

దానికి నేనేమిసేతు బక్కిపెళ్లామా.

-----------

మరిన్ని కథలు

Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్
Bhavaateetam
భావాతీతం
- DODDIPATLA KALYAN KISHORE
Prema falam
ప్రేమ ఫలం
- పి. రాజేంద్రప్రసాద్
Neethone nenunta
నీతోనే నేనుంటా
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Amlet damlet
ఆంమ్లేట్ - డాంమ్లేట్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
REkkala kastam
రెక్కల కష్టం
- వరలక్ష్మి నున్న