అత్తా కోడలు అమ్మ కూతుర్లు కాలేరా? - Lakshmi Priyanka

Atta kodalu amma kuturlu kaaleraa?

తరుణి ఒక సగటు మిడిల్ క్లాస్ అమ్మాయి. తల్లిదండ్రులు ఐన సుభద్ర, ఆనంద్ లు బాగానే చదివించారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుంది. మంచి జాబ్ చేస్తోంది. నెలకి ఒక 50000 సంపాదిస్తోంది. తన కాళ్ళ మీద తాను నిలబడుతుంది. అంతే కాదు కళల పట్ల ఇంటరెస్ట్ ఉన్న అమ్మాయి. భరతనాట్యం లో ప్రవేశం ఉంది అంతే కాదు అరంగేట్రం కూడా చేసింది. తల్లిదండ్రులకు తమ కూతురు అంటే పంచ ప్రాణాలు. ఐన ఆడపిల్లకు పెళ్లి చేయక తప్పదుగా. ఒక సంబంధం చూసారు. మంచి కుటుంబం. చక్కటి అబ్బాయి. సొంత ఇల్లు. అదే ఊరిలో ఉంటారు కనుక అమ్మాయి ఎక్కడికి దూరంగా వెళ్లకుండా అక్కడే ఉంటుంది అన్న ఆలోచన. అబ్బాయి పేరు వరుణ్. తరుణి కి సరి అయిన జోడి. ఇద్దరు ఈడు జోడు బాగుంటారు అనుకున్నారు. వరుణ్ ఫోటో తరుణి కి చూపించారు. తనకి కూడా నచ్చాడు. ఈ సంబంధం చూసిన తమ చుట్టం నారాయణకు పెళ్లి చూపులు ఏర్పాటు చేయమని ఫోన్ చేసారు. అలాగే ఏర్పాటు చేసాడు నారాయణ. ఆనంద్ : సుభద్ర .. త్వరగా అమ్మాయిని రెడీ చెయ్..!! సుభద్ర: అలాగే.. మీరు మార్కెట్ కి వెళ్లి స్వీట్స్ తీసుకురండి..!! సుభద్ర అమ్మాయిని రెడీ చేసి టీ కాఫీ అలాగే జంతికలు వంటి కొన్ని పిండి వంటలు చేసింది. ఆనంద్ కూడా కొన్ని స్వీట్స్ తీసుకొచ్చాడు. అన్ని నీట్ గ టీపాయ్ మీద సర్దింది సుభద్ర. ఆనంద్: కార్ వచ్చింది.. పెళ్ళివారు వచ్చారనుకుంటా.. వెళ్లి గేట్ దగ్గర చూసాడు. పెళ్లి వారు వచ్చేసారు. ఆనంద్: పెళ్లి వారు వచ్చేసారు సుభద్ర అని ఆమెని పిలిచాడు. సుభద్ర: నమస్కారం అండి.. కూర్చోండి అని వాళ్ళకి కాఫీ టీ అందించింది. వరుణ్ తండ్రి : అమ్మాయిని తీసుకురండి.. కాబోయే కోడలిని చూడాలని ఎదురు చూస్తున్నాం ఆనంద్: అలాగే అండి.. సుభద్రా.. అమ్మాయిని తీసుకురా.. సుభద్ర: అలాగే.. సుభద్ర తరుణి ని తీసుకొచ్చింది. అమ్మాయిని చూసి వరుణ్ అలాగే వరుణ్ తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారు. వరుణ్: మీ అమ్మాయితో మాట్లాడచ్చు కదా. ఆనంద్: అలాగే బాబు. తరుణి బాల్కనీ లో మాట్లాడుకోండి వెళ్ళండి . తరుణి : సరే నాన్న. రండి వరుణ్ గారు..!! వరుణ్: హాయ్ అండి.. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఈ సిగరెట్ మందు ఏమి అలవాటు లేవు. ట్రావెలింగ్ అంటే ఇష్టం.. బుక్స్ రీడింగ్ హాబీ అన్నాడు. తరుణి. నాకు కూడా ట్రావెలింగ్ అంటే ఇష్టం అండి. బుక్స్ పెద్దగా చదవను కానీ డాన్స్ అంటే బాగా ఇష్టం అండి. performances ఇస్తూ ఉంటాను అండి. వరుణ్: ఓహ్ గ్రేట్ అండి.. పెళ్లి తరువాత నేను కూడా మీకు కంపెనీ ఇస్తాను మీ పెరఫార్మన్సెస్ వెళ్ళేటప్పుడు అన్నాడు. తరుణి కి బాగా సంతోషం అనిపించింది. ఇద్దరు బాగానే స్నేహంగా మాట్లాడుకున్నారు. వచ్చి ఇద్దరికీ ఇష్టమే అని చెప్పారు. వరుణ్ తల్లిదండ్రులు అలాగే తరుణి తల్లిదండ్రులు బాగా సంతోషపడ్డారు. నిశ్చితార్థం పెళ్లి అన్ని చక చకా జరిగిపోయాయి. టైం ఏ తెలియనంత త్వరగా జరిగిపోయాయి. తరుణి వరుణ్ వరుణ్ ఇంటికి చేరారు. గృహప్రవేశం జరిగింది. కొత్త కాపురం ప్రారంభించారు. సహజంగానే కొత్త ఇల్లు కొత్త వాతావరణం కొత్త మనుషులు. తరుణి కి కొంచం భయం గానే అనిపించింది. మెల్లగా ఆ ఇంటికి అలవాటుపడడం మొదలుపెట్టింది. తన జాబ్ కి తాను వెళ్తోంది. అత్తగారికి పనుల్లో సాయం చేస్తోంది. వరుణ్ తో కలిసి సినిమాలకి డిన్నర్లు కి వెళ్తోంది. మామగారి ఆరోగ్యం గురించి పట్టించుకుంటోంది. అయినా తనకి చిన్న అనుమానం. అత్తగారు ఏమనుకుంటారో. అన్ని పనులు చేయట్లేదని ఏమైనా మనసులో అనుకుంటారో.. జాబ్ ఎందుకు అనుకుంటారో అలా రకరకాల ఆలోచనలు. కొంచం ఆ భయం తన ముఖం మీద కనిపించేది. వరుణ్ తల్లి అది గమించింది. వరుణ్ తల్లి: అమ్మ తరుణి.. ఆఫీస్ కి టైం ఐంది కదా.. ఇదిగో బాక్స్ తీస్కో. తరుణి. అయ్యో అత్తయ్య నేను పెట్టుకుంటాను కానీ మీకు ఎందుకు శ్రమ. వరుణ్ తల్లి.. శ్రమ ఏముందమ్మా. నా కొడుకు వరుణ్ కి ఎలా అయితే చేస్తానో నాకు ఇంకో కూతురు ఉంటె ఎలా చేస్తానో నీకు కూడా అంతే అమ్మ. నువ్వేం అనుమానం పెట్టుకోకు అన్నారు. తరుణి (మనసులో) .. అత్తయ్య గారి గురించి నా భయం అనవసరం ఏమో..!! తరుణి (అత్తగారితో) : అలాగే అత్తయ్య..thank you ..!! కానీ ఇంకా తన బెరుకు పోలేదు. ఇంకా కొత్త కదా అనుకున్నారు వరుణ్ తల్లి. తరుణి సాయంకాలం పని ఎక్కువ ఉండడం వలన లేట్ గా వచ్చింది.. తరుణి: అత్తయ్య సారీ .. పని ఎక్కువ ఉంది అందుకే లేట్ అయింది. ఏం అనుకోకండి వరుణ్ తల్లి.. అయ్యో తరుణి ఎందుకమ్మా.. వరుణ్ కి పనిలో లేట్ అయితే తిడతాన? ఈరోజుల్లో వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలీదా. నా కొడుక్కి లేని రూల్స్ నీకెందుకు పెడతాను? ఎప్పుడు అలా అనుకోకు. ఓన్లీ థింగ్.. ఒక్కదానివే వచ్చేటప్పుడు జాగ్రత్త..!! ఈలోగా వరుణ్ వచ్చాడు. వాళ్ళు మాట్లాడుకున్నది విన్నాడు. వరుణ్: తరుణి.. నువ్ ఇపుడు ఈ ఇంటి అమ్మాయివి. నాకు ఎలాంటి విలువ ఉంటుందో..నీకు కూడా అదే విలువ ఉంటుంది. నువ్ చదువుకున్న దానివి, చక్కటి కళ నీలో ఉంది. ఇవన్నీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి. ఎపుడు నీ మీద ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. భయపడకు.. బీ ఫ్రీ అన్నాడు, వరుణ్ తండ్రి.. అమ్మా ఎప్పుడు నువ్ అలా ఆలోచించకు అమ్మ.. నీకు ఎప్పుడూ ఈ ఇంట్లో తేడా జరగదు. పరాయి అమ్మాయివి అన్న భావన మాకెపుడు లేదు రాదు. అర్ధం అయ్యిందా? తరుణి: అలాగే అండి. అంది. ఇంకా ఎక్కడో తన మనసులో బెరుకు. కొత్తగా వచ్చింది కాబట్టి ఏమి అనడం లేదు అనుకుంటోంది. ఇంకొకరోజు డాన్స్ పెర్ఫార్మన్స్ కోసం ఒక ఇన్విటేషన్ వచ్చింది. పెర్ఫార్మన్స్ UK లో.. ఇంట్లో ఒప్పుకోరు అనుకుంది. దేశం దాటి పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి వెళ్లడమంటే ఇంట్లో అలా ఎలా సరే అంటారు అనుకుంది. ఆ లెటర్ దాచేసింది. ఆ మరుసటి రోజున పని మనిషి ఇల్లు ఉడుస్తోంది. పని మనిషి కంట ఆ ఉత్తరం పడింది. పని మనిషి: అమ్మ గారు ఇది చూడండి. క్రింద పడి ఉంది. ఇంగ్లీష్ లో ఉంది. మీరు చూడండి. ఏమైనా ముఖ్యమైన కాయితమేమో అని ఇచ్చానమ్మా..!! వరుణ్ తల్లి.. మంచి పని చేసావ్ రమణమ్మ. మా కోడలు డాన్స్ చేస్తుంది కదా.. తన డాన్స్ నచ్చి లండన్ లో డాన్స్ చేయడానికి పిలిచారు తనని అని నవ్వుతు చెప్పింది. పని మనిషి: అలాగా అమ్మ.. చాలా సంతోషం అంది. వరుణ్ తండ్రి.. ఓహ్.. మన కోడలు ఫారిన్ స్టేజి మీద మన భారతీయ నృత్యం చేస్తుందన్నమాట అయితే.. వెరీ గుడ్ అన్నాడు. వరుణ్ తల్లి: సరే నువ్వు పని చూస్కో. నేను దీన్ని జాగ్రత్తగా పెడతాను అని లోపలికెళ్ళింది తరుణి ఎప్పటిలానే ఆఫీస్ నుండి వచ్చింది. వరుణ్ తల్లి తాను రావడం చూసి కాఫీ చేసి తీసుకొచ్చింది. వరుణ్ తల్లి: ఫ్రెష్ అయి రా. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం..!! అంది తరుణి ఫ్రెష్ అయి రాగానే.. ఇద్దరు కూర్చుని కాఫీ తాగుతూ ఉన్నారు. వరుణ్ తల్లి ఆ ఉత్తరం తీసి తరుణి ముందు పెట్టింది. తరుణి: అత్తయ్య ... అదీ.. వరుణ్ తల్లి: నేను చూసానమ్మ... ఎందుకు ఈ లెటర్ దాచేసావ్?? మేము ఒప్పుకోము అనుకున్నావా? మేము అలా పాతకాలం వాళ్ళ లాగా ఆలోచిస్తాం అనుకున్నావా? నీకు నేను ఇదివరకే చెప్పాను. ఎప్పుడు అలా ఆలోచించకు అని. నువ్వు లండన్ వెళ్లి పెర్ఫార్మన్స్ ఇస్తే అది మన ఫామిలీ కె కదా గొప్ప. మన ఇంటికే కదా గౌరవం. అలాంటపుడు ఎందుకు అడ్డు చెప్తాము. నువ్వు డాన్సర్ అని తెలిసినప్పటి నుండి నీ డాన్స్ చూడాలని ఎంత కోరికగా ఉందో తెలుసా?? నా కోడలు ఫారిన్ స్టేజి మీద డాన్స్ చేసింది అని అందరికీ గొప్పగా చెప్పుకోవాలని నేను మీ మావయ్య అనుకున్నాం తెలుసా?? నువ్వేమో ఇలా ఆలోచిస్తున్నావు. వరుణ్ తండ్రి. అమ్మ తరుణి.. నాకు ఒక కూతురు ఉంటె బాగుండేది అనుకోని రోజు లేదమ్మా. ఎందుకో మేము ప్రయత్నించినా వరుణ్ తరువాత మాకు ఇంకా వేరే పిల్లలు పుట్టలేదు. వరుణ్ మా లోకమే అయినా ఎక్కడో ఒక కూతురు ఉంటె ఆ కళ వేరు కదా అని అనిపించేది. నువ్వు ఈ ఇంటికి రాగానే ఆ లోటు తీరింది. నువ్వే మా కోడలు నువ్వే మా కూతురు అనుకుంటున్నాము. ఎప్పుడు కూడా నిన్ను ఒక పరాయి పిల్లలాగా చూడలేదు. అంతే కాదు మీరు అమ్మ నాన్న కి కూడా నువ్వు ఒక్కతే కూతురివి. నువ్వు ఎంత అల్లారు ముద్దుగా పెరిగుంటావో మాకు తెలుసు. అలాంటప్పుడు ఈ ఇంట్లో నిన్ను కూతురిలా చూస్కోకుండా వేరే విధంగా నీతో ఎలా ప్రవర్తిస్తామమ్మా. వరుణ్ మాకు ఎంతో నువ్వు అంతే. మీ ఇద్దరూ మాకు రెండు కళ్ళు. నువ్వు వాళ్ళకి respond చేయి. ఈ డాన్స్ పెర్ఫార్మన్స్ కి ఒప్పుకుంటున్నట్లు వాళ్ళకి ఉత్తరం రాయి. నీకు అండగా మేముంటాం. నీ వలన మన కుటుంబానికి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా మంచి పేరు వస్తుందమ్మా.. మాకు అందరికీ చాలా సంతోషము అన్నాడు. తరుణి కి వాళ్ళ మాటలు విని ఆనందంతో మాట రాలేదు. కంట్లో ఆనందబాష్పాలు కారాయి. ముఖం మీద చక్కటి నవ్వు వచ్చింది. తన అదృష్టం మీద తనకి చాలా సంతోషం వేసింది. తాను ఈ కుటుంబం లో భాగం అవడం చాలా అదృష్టం అని ఎంతో పొంగిపోయింది. ఈలోగా వరుణ్ వచ్చాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే అలాగే స్వీట్ బాక్స్.. తరుణి కి ఆశ్చర్యం అనిపించింది. వరుణ్: ఏంటి ఫ్లవర్స్ అలాగే స్వీట్ తెచ్చాను అని చూస్తున్నావా?? మరి నా వైఫ్ ఫారిన్ లో డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతుంటే ఆ సంతోషం సెలెబ్రేట్ చేసుకోవాలి కదా.. అందుకే ఇది అన్నాడు. తరుణి: మీకు ఎలా తెలుసు? వరుణ్: అమ్మ నాన్న ఫోన్ చేసి చెప్పారు. అంతే కాదు ఈ విషయం నేను అత్తయ్య మావయ్య కి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళ కూడా చాలా సంతోషించారు. వాళ్ళని డిన్నర్ కి పిలిచాను. సో వాళ్ళు కూడా వస్తున్నారు. మనందరం బయట హోటల్ కి వెళ్లి భోజనం చేసి ఆ తరువాత చక్కగా ఒక సినిమా చూసి వస్తున్నాం అన్నాడు. తరుణి : ఓహ్.. చాలా ప్లాన్ చేశారు అయితే.. thank you అండి. థాంక్యూ అత్తయ్య మావయ్య అంది. వరుణ్ తల్లిదండ్రులు: థాంక్యూ ఎందుకమ్మా.. మేమేం పరాయి వాళ్లమా థాంక్యూ చెప్పడానికి. నీ క్యారెక్టర్ నీ అలవాట్లు నీ hobbies అన్నిటికీ ఈ ఇంట్లో విలువ ఉంటుంది. నువ్వు ఈ ఇంటి ఆడపిల్లవి అమ్మ..!! ఎపుడు నువ్వు దేనికి భయపడకు.. మా దగ్గర మొహమాటపడకు. అత్తమామలు అమ్మానాన్నలు కాకూడదా ?? కోడలు కూతురు కాకూడదా చెప్పు?? మాకు కోడలైన కూతురైన నువ్వే..!! మీ సంతోషమే మా సంతోషం.. మనమందరము సంతోషంగా ఉంటె.. ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది.. మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అందరి అత్తామామల్లా మేము కూడా ప్రవర్తిస్తే మన ఇల్లు ఒక యుద్ధభూమి లాగా మారుతుంది, అందుకే మేము ఎప్పుడు అలా ప్రవర్తించము.. నిన్ను నొప్పించము.. అర్థమైందా ?? తరుణి : అలాగే అత్తయ్య..!! ఈలోగా తరుణి అమ్మానాన్నలు వచ్చారు. వీళ్ళు మాట్లాడిన చివరి మాటలు వాళ్ళ చెవినపడ్డాయి. తమ కూతుర్ని తల్లిదండ్రులలాగా చూసుకునే అత్తమామలు దొరికినందుకు వాళ్ళ ఆనందం పట్టరానిది. మనసులోనే సంతోషించారు. వచ్చి కూతురిని అభినందించారు. అందరు కలిసి ఆ రోజు రాత్రి సంతోషంగా గడిపారు. తరుణి వాళ్ళ అత్తమామల ఆశ మేరకు వాళ్ళకి బదులు పంపింది. పెర్ఫార్మన్స్ ఇచ్చే రోజు వచ్చింది. తాను స్టేజి మీద డాన్స్ చేస్తుంటే తన వెంట ఉంది ఆ డాన్స్ చుసిన తన అత్తమామల కళ్ళలో ఆనందం..అలాగే తన భర్త కళ్ళలో సంతోషం.. ప్రపంచం మొత్తం తన ముంగిట్లో ఉన్నట్టు అనిపించింది తరుణికి. అమ్మానాన్నల లాంటి అత్తమామలు దొరికితే ప్రతి అమ్మాయి జీవితం ఒక స్వర్గమే కదా అనుకుంది మనసులో..!! ఇంతటితో ఈ కథ సమాప్తం..!!

మరిన్ని కథలు

Vikatakavi vinta padyaalu
వికటకవి - వింతపద్యాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaalani kaagitam
కాలని కాగితం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Gnana tatwam
జ్ఞానతత్వం
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Garudayya bharya
గరుడయ్య భార్య
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Bakkati pellam-laavati mogudu
బక్కటి పెళ్ళాం - లావాటి మొగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Barlo taagudu intlo vaagudu
బార్లో తాగుడు - ఇంట్లో వాగుడు
- మంత్రిప్రగడ ఆంజనేయులు
Panipilla
పనిపిల్ల (క్రైమ్ కథ)
- చెన్నూరి సుదర్శన్