భోజుడు భారతదేశ చరిత్రలో మంచి పేరున్న రాజు అతని రాజ్యం మధ్య భారతదేశంలోని మాల్వా ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమై ఉంది, ఇక్కడ అతని రాజధాని ధార-నగర (ఆధునిక ధార్) ఉంది. . అతని సామ్రాజ్యం ఉత్తరాన చిత్తోర్ నుండి దక్షిణాన ఎగువ కొంకణ్ వరకు మఱియు పశ్చిమాన సబర్మతి నది నుండి తూర్పున విదిష వరకు విస్తరించింది.పండితులకు అతని ఆదరణ కారణంగా, భోజుడు భారతదేశ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ రాజులలో ఒకడు అయ్యాడుభోజుడు కళలు, సాహిత్యం మరియు శాస్త్రాల పోషకుడిగా ప్రసిద్ధి చెందాడు. అతను బహు శాస్త్రజ్ఞుడు మఱియు అనేక రకాల అంశాలతో కూడిన అనేక పుస్తకాలు అతనికి ఆపాదించబడ్డాయి.భోజుడు తన తెలివితేటలు మఱియు సాంస్కృతిక కార్యక్రమాలకు అందించిన ప్రోత్సాహానికి ఉత్తమంగా గుర్తుండిపోతాడు.అనేకమంది తరువాతి రాజులు కూడా భోజుడును అనుకరించారు. ఉదాహరణకు, విజయనగర సామ్రాజ్యానికి చెందిన కృష్ణదేవరాయలు తనను తాను అభినవ-భోజ ("కొత్త భోజ") మఱియు సకల-కళ-భోజ ("అన్ని కళల భోజ")గా మార్చుకున్నారు చరిత్రకారులు ఆయనను విక్రమాదిత్యునితో పిలుస్తారు.
భోజరాజు పాండిత్యాన్ని కవులను ,తనదగ్గరకు వచ్చిన వారిని ఏ విధముగా ఆదరించి సత్కరిస్తాడో తెలియజేసే కధలు అనేకము ప్రచారములో ఉన్నాయి అటువంటి కథలలో ఒకటి ఇప్పుడు చెప్పుకుందాము. ఒక రోజు భోజ రాజు దగ్గరకు ఏదైనా సంభవం దొరక్కపోతుందా అన్న ఆశతో ఒక పేద బ్రాహ్మణుడు వస్తాడు. మహారాజు కాబట్టి తన అదృష్టం బాగుంటే భారీగా సంభవన దొరకవచ్చు అన్న ఆశతో రాజాస్థానానికి బయలు దేరాడు కానీ భోజరాజు మెప్పించాలి అంటే ఏంతో కొంత పాండిత్యం కావాలి అంటే కవిత్వం చెప్పడం లేదా రాజునూ స్తుతిస్తూ ఏదైనా రాజుకు నచ్చేవిధంగా కవిత్వాన్ని చెప్పడం చేయాలి మహారాజు సంతోష పడితే తన పంట పండినట్లే అని బ్రాహ్మణుడు ఆలోచించి రాజు గారి ఆస్థానానికి చేరాడు.
భోజరాజు బ్రాహ్మణుల పట్ల ఉన్న గౌరవం వల్ల వచ్చిన బ్రాహ్మణుని చూసిన వెంటనే లేచి నమస్కారం చేసి, "బ్రాహ్మణోత్తమా తమరి పేరు ఏమిటీ ఎక్కడ నుండి వస్తున్నారు "అని అడుగుతాడు. దానికి జవాబుగా బ్రాహ్మణుడు తన పేరు చెప్పి ,"మహారాజా నేను పరమేశ్వరుని నివాసం అయినా కైలాసం నుండి వస్తున్నాను "అని చెప్పగా సభలో ఉన్న వారు అందరూ ఆశ్చర్య పోయినారు. కానీ భోజరాజు బ్రాహ్మణుడి మాటల్లో ఎదో చమత్కారం ఉండి ఉంటుంది అన్న భావనతో బ్రాహ్మణుడితో చాలా యధాలాపంగా,ఇంటికి చుట్టాలు వస్తే ఇతరుల యోగక్షేమాలు అడిగినట్లుగా,"కైలాసములో పరమశివుడు ఎలా ఉన్నాడు? "అని అడుగుతాడు అప్పుడు బ్రాహ్మణుడు "పరమ శివుడా? ఇంకెక్కడి పరమశివుడు పోయాడు ఇప్పుడు పరమశివుడు కైలాసములో లేడు "అన్నాడు ఈ మాటలు విన్న మహారాజుకు నోట మాట రాలేదు అంతవరకూ ఎదో చమత్కారం అనుకున్న రాజు ఆశ్చర్య పోయి ," పరమ శివుడు కైలాసంలో లేకపోవడం ఏమిటి?"అని బ్రాహ్మణుడిని అడుగుతాడు సభికులు కూడా ఈ వింత సంభాషణను ఆశ్చర్యంగా ఏమి జరుగుతుందో అన్న ఆసక్తిగా వింటున్నారు దానికి ఆ బ్రాహ్మణుడు "అవును మహారాజా! శివుడు తనలో సగభాగాన్ని పార్వతికిచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు గదా!" అన్నాడు. వింటున్న సభికులలో ఒక వ్యక్తి "అవును అయితే ఇంకా సగం ఉన్నాడు కదా పరమేశ్వరుడు" అన్నాడు "ఉండవయ్యా బాబు నేను చెప్తున్నా కదా " అని ఆ వ్యక్తి నోరు మూయించాడు
భోజరాజుకు బ్రాహ్మణుడి మాటలు బాగా ఆసక్తి కరంగా అనిపించాయి బ్రాహ్మణుడు "పార్వతికి సగభాగం ఇచ్చి, మిగతా సగం శ్రీహరికిచ్చేశాడు" అన్నాడు బ్రాహ్మణుడిని ఎలాగైనా తన మాటలతో ఇరికించాలని భోజరాజు," "మరి పరమశివుడు తన ఆస్థిపాస్తులు ఎవరికిచ్చాడు? అని అడిగాడు రాజు. "ఇప్పుడు సమాధానం చెప్పు చూద్దాం" అన్నట్టు ముఖం పెట్టి.. "ఆ ఏముంది మహారాజా నెట్టి మీద గంగను హిమాలయాలకు, చంద్రుణ్ణి ఆకాశములోకి పామును నాగలోకము లోకి పంపించాడు "అని తాపీగా బ్రాహ్మణుడు చెప్పాడు "మరి పరమశివుడు నా కోసం ఏమి ఇవ్వలేదా? నీవు కైలాసం నుండి వస్తున్నావు అంటే పరమశివుడిని అడిగి నాకోసం ఏమైనా తెచ్చి ఉంటావనుకున్నాను"అని రాజు బ్రాహ్మణుడితో అంటాడు.
"శివుడు భోళా శంకరుడు కదా అందుచేత అన్ని ఇచేసినా అయన దగ్గర ఔదార్యం మెండుగా ఉంది అందువల్ల ఆ ఔదార్యాన్ని మీకు ఇమ్మని చెప్పాడు మహారాజా " అని బ్రాహ్మణుడు రాజుతో అన్నాడు ఈ సంభాషణ రాజుకు సభికులకు చాలా ఆసక్తి కరంగా మారింది ఏమి జరగబోతుందో అని మంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మహారాజు కాసేపటికి తేరుకొని ,"నాకు ఔదార్యాన్ని ఇచ్చాడు సరే నీకు ఏమి ఇవ్వలేదా?"అని అన్నాడు "ఇవ్వకేమి మహారాజా అయన దగ్గర ఉన్న భిక్షాపాత్ర నాకు ఇచ్చి మిమ్మల్ని దర్శించుకోమన్నాడు ఎందుకంటే పరమ శివుడు ఇచ్చిన భిక్షాపాత్ర పుచ్చుకొని ఎవరి బడితే వారిని యాచిస్తే అది ఇచ్చిన శివుడిని అవమాన పరిచినట్లై ఔదార్యాన్ని మీకు ఇచ్చాడు కాబట్టి మిమ్మల్ని యాచించడం సమంజసం అని తమదగ్గరకు వచ్చాను మహారాజా"అని బ్రాహ్మణుడు మహారాజుతో అంటాడు. బ్రాహ్మణుడి మాటల చాతుర్యాన్ని సమయస్ఫూర్తిని రాజు సభికులు అందరు హర్షించారు మహారాజు బ్రాహ్మణుడి చమత్కార సంభాషణకు సంతోషపడి బ్రాహ్మణుడికి భారీగా కానుకలు ఇచ్చి పంపాడు ఆ విధముగా తన సమయస్ఫూర్తి మరియు చమత్కార సంభాషణ తో బ్రాహ్మణుడు కవిత్వం రాకపోయినా మహారాజు మన్నలను పొంది బహుమతులు అందుకున్నాడు.