ఇది ఒక తోట కధ . .... ఆ తోట మాలి పేరు రామరాజు. అందుకే ,అందరూ, దాన్ని, రాజు గారి తోట గా, పిలుస్తారు.
ఆ చుట్టు పక్కల రాజు గారి తోట అంటే , తెలియని వాళ్ళు లేరు . ఆ తోట అంటే , అక్కడ అందరికీ బొలెడంత ప్రేమ . అందుకే, ఆ తోట కధ ని , చెప్పాల్సిన అవసరం పడింది. .....
అది ఒక పెద్ద తోట . తోట నిండా రక రకాల పూల మొక్కలు , కొన్ని పెద్ద చెట్లు , వెప , మామిడి , లాంటివి. రక రకాల పూలతో , సౌరభాలతో , కళ కళ లాడుతూ వుంటుంది.
గులాబీలు, చామంతిలు, మందారాలు, పారిజాతాలు, మల్లెలు , జాజులు, ....ఇలా ఒకటేమిటి , చాలా రకల పూలతో చూసేవాళ్ళకి , ఎక్కడ లేని ఆనందం , కలగ చేస్తూ వుంటుంది.
అన్ని పూలూ, విరగ పూసినప్పుడు , ఆ తోట అందం , అంతా ఇంతా కాదు. ఇంక ఆ పూలని, పలకరిస్తూ , పిల్ల గాలులు, సీతా కోక చిలకలు. తుమ్మెదలు, తూనీగలు , ఇలా ఒకటి ఏమిటి , అన్ని పూలని పలకరించడానికి , ఉవ్విళ్ళు వూరే వాళ్ళే. అంతా, ఇంతా హడావిడి కాదు అక్కడ.
పూలన్నీ , ఒకళ్ళతో ఒకళ్ళు , గుస గుసలు,ముచ్చట్లు, పక పకలు . ఒకటే ఆటలు , పాటలు. ఆ తోటలోకి అడుగు పెడ్తే చాలు. ఎవరికైనా , ఎంత దుఖమైనా, ఇట్టే మరిచిపోయి , అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తారు. అలా ,వుంటుంది అక్కడ వాతావరణం.
ఆ పండుగ లాంటి , హడావిడిని చూస్తూ కాలం గడుపుతూ వుంటాడు, తోటమాలి.
ఎన్నో ఏళ్ళగా , ఆ తోటని చూసుకుంటూ వస్తున్నాడు ఆ మాలి. అతనికి ఇంకో ప్రపంచం లేదు. . ఆ మొక్కలని, సంరక్షించు కుంటూ అక్కడే కాలం గడుపుతూ వుంటాడు, ఆ మాలి. పెద్దగ విస్తరించిన వేప చెట్టు కింద, నులక మంచం వేసుకొని,
దాని మీద కూర్చునో , పడుక్కునో , తోటలో సందడి చూస్తూ , సంతోష పడుతూ వుంటాడు.
****
ఒక రోజు ఆ తోట మాలి తమ్ముడు వచ్చి కొన్ని మొక్కలు ఇచ్చి , వెళ్ళాడు. "ఇవి మిశ్రమ జాతి పూల మొక్కలు, మంచి పూలు పూస్తాయి !. ." అంటూ.
మాలి , తోట మధ్యలో చోటు చేసి, అవి అక్కడ వేసి , శ్రద్ధ గా పెంచాడు. అవీ, పూలు పూయడం , మొదలు పెట్టాయి.
అవి , తోటలో ఎవరితోనూ కలిసేవి కావు. వాటిలో అవే, మాట్లాడుకుంటూ వుండేవి.
అది చూసి తోటలో, మిగిలిన పూల మొక్కలు , చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టాయి.
" ఈకొత్త మొక్కలు , మనని పలకరించవు ?! "
" అవునవును ! ఏమిటో ఆ మిడిసి పాటు "
తోట అంతా , రెండు పక్షాలు గా విడిపోవడం మొదలు పెట్టింది.
" ఎప్పుడూ, ఎ అరమరికలు లేకుండా హాయిగా వుంటున్నాము. . ఇప్పుడు , ఈ గొడవ ఎందుకు? వాళ్ళు మాట్లాడకపోతే ఏమయింది? .. మనం మాట్లాడొచ్చు గా ! అయినా వాళ్ళు కొత్తగా వచ్చారు . నిజానికి , మనమే వాళ్ళని పలకరించాలి ", అంటూ
ఒక చామంతి , చొరవ తీసుకొని, అంది ,
" ఎలా వుందీ ఇక్కడ మీకు? మన తోట మాలి, మంచి వాడు. ఏ కష్టం లేకుండా చూసుకుంటాడు. చక్కా, అందరితోనూ మాట్లాడొచ్చు . ఏమీ భయము అక్కర్లేదు. ..."
కొత్త గా వచ్చిన మొక్కలకి పూసిన , ఒక పువ్వు అంది " మాకెందుకు భయం? మాకు భయం ఏమీ లేదు. మేము మీలా కాదు. మమ్మల్ని , ప్రత్యేకం గా తయారు చేసారు, మంచి పూలు పూయడానికి. చూడు నన్ను ! ఎంత పెద్దగా ,….అందంగా , …సౌరభాలు వెదజల్లుతూ ! , ..మేము ఎంతయినా వేరు . " మళ్ళీ అంది ,
" గమనించారో లేదో ?! , మెము ఎక్కువ రోజులు చెక్కు చెదరకుండా వుంటాము కూడా!. మీరు , ఒకటి రెండు రోజులే గా వుండేది . ..."
ఏమాత్రం , లెక్క లేకుండా మాట్లాడిన , ఆ పువ్వు మాటలకి చిన్నబుచ్చుకుంది, చామంతి.
అందరూ,దాన్ని దుయ్య బట్టారు . " తగుదునమ్మా అంటూ , వెళ్ళావు! ..నీకు ఒక్క దానికే, పెద్ద మనసు వున్నట్లు!.
అయిందా సంబడం . .. !!"
" ఎంత అహంకారం !! వీళ్ళు , ఏదో ప్రత్యేకంట ! ..ఆహ్హ హ్హ. హ్హా ........." అందరూ ఆక్షేపణగా, కాస్సేపు నవ్వారు.
" అసలు నా కన్నా అందమయిన వాళ్ళు వున్నారా ! చెప్పొచ్చింది !.... నా వాసనలకి, తుమ్మెదలు మురిసి మూర్చ పోతూంటాయి . అయినా చూస్తున్నా ! ఒక్క తుమ్మెదగాని , సీతా కోక చిలుక గాని , అసలు , ఎవరయినా వాళ్ళని పలకరించడం చూసామా ! .. వాళ్ళు , ఏదో పై నుంచి దిగినట్లు ! ఎంత అహంకారం తో , మాట్లాడు తోంది." అంది ఒక గులాబీ
నేను మాత్రం ,..అందం గా వుండనూ , నాకు మాత్రం , సౌరభాలకి ఏమి తక్కువ? కాకపోతే, నా సౌరభం ఉక్కిరి బిక్కిరి చేయదు. వాళ్ళు ఎక్కువ రోజులు వుండడం, ఎమిటి ?! నేను ఎన్ని రోజులయినా , ఎంత అందం గా వుంటానో , దానికి తెలియదు లా వుంది. ..." అంది చామంతి
" మేము మాత్రం !..... మాకు మేమే సాటి ! అందానికి అందం ! సౌరభాలకి , సౌరభాలు ! మా కోసం, ఎంత పిచ్చెక్కి పోతారు !? " అంది మల్లి
" నా సోయగాలకి , సౌరభాలకి , దాసులు కాని వాళ్ళు ఎవరయినా వున్నారా " అంది ఆకుల్లోంచి తొంగి చూస్తూ, జాజి .
" నన్ను , ఏకం గా స్వర్గం నుంచే తీసుకు వచ్చారు అంటారు . నాకు అందం వుంది. సౌరభాలు వున్నాయి . నాలాగ రెండు రంగులతో ఎవరు వున్నారు ? ! ఇంక నా విన్యాసాలతో పోటీ పడే వాళ్ళు ఎవరు ?! ..." అంది పారిజాతం.
ఇలా పూలన్నీ వాళ్ళ వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం మొదలు పెట్టాయి. ..
కొత్తాగా వచ్చిన పూల మొక్కల ప్రవర్తనకి , ప్రతిస్పందన గా మొదలు అయిన, ఆ గొప్పలు చెప్పుకోవడం , రోజు రోజు కీ ఎక్కువ అయి , ఒకరిని ఒకరు ,తక్కువ చేసుకోవడం, ఎద్దేవా చేసుకోవడం కూడా , మొదలు పెట్టారు.
" నేను అవుతే సంవత్సరం అంతా, పూస్తాను ! ఏదో రెండు మూడు నెలలే , మీరు పూసేది " అంది గులాబి
" ఎన్ని రోజులుపూస్తే , ఏముంది !...,, మాకోసమే కదా అందరూ, ఎదురు చూసేది ! ముట్టుకుంటె ముళ్ళు ! ..నువ్వు చెప్పొ చ్చావులే !!" అంది మల్లి.
" ఎన్ని పూలుంటే ఏముంది! దేవుడి పూజ కి, నేను వుంటే, ఇంకో పూవు పెట్టరు కదా ! నేను స్వర్గం నుంచి వచ్చాను . మీతో పోటీ పడడం, నన్ను నేను తక్కువ చేసుకున్నట్లే. " అంది పారిజాతం
" అసలు పూజ కొసమే, నేను పుట్టాను అంటారు....మీతో నేను పోల్చుకోవడం ఏమిటి !? " అంది మందారం.
అలా వాళ్ళు , .... వాళ్ళ మాటలు , అందరిలోనూ, వాళ్ళకి తెలియ కుండానే , న్యూనతా భావాన్ని, రేకెత్తించాయి.
దానితో అందరిలోనూ , అసంతృప్తి మొదలయింది.
"అందరికన్న , బాగుంటే ఎంత బాగుండును ! " అనే ఆలొచన , ఆశ, మొదలయింది అందర్లోనూ .
" మల్లే సౌరభం , నాకుంటే, నాకు తిరుగే వుండేది కాదు. అయినా , నాకు వొంటినిండా ముళ్ళేమిటో !? " గులాబీ ,
"గులాబి అంత పెద్ద అవుతే, ఇంకా బాగుండే దాన్ని . ఎక్కువ రోజులు పూయగలిగితే బాగుండును, ఇంకో పువ్వు ఊసు ఎత్తే వారే కారు ". మల్లె
"ఇంకొంచెం , సౌరభాలుంటే బాగుండేది నాకు. " చామంతి
"మరీ ఇంత నాజూకుగా కాకుండా , కొంచెం బొద్దుగా ఉండాల్సింది నేను. " జాజి
" పొద్దు పొడుస్తే చాలు పడిపోతాను, కొన్నాళ్ళు వుండొచ్చుగా!. " అంటూ పారిజాతం,
ఎప్పుడూ లేని విధంగా , ఇలా సాగాయి వాటి ఆలొచనలు.
రోజు రోజుకీ వాళ్ళ ల్లో, అసంతృప్తి ఎక్కువ అవసాగింది.
ఏప్పుడూ సంతోషాలతో , కళ కళ లాడే ఆ తోట , నెమ్మదిగా దాని కళ , కోల్పో సాగింది.
ఎవరికి , ఎవరు పడక , అందరూ, వారి లో వారు ముడుచుకు పోసాగారు. ఏ పొర పచ్చాలు లేని ఆ తోటలో, ఒకళ్ళతో , ఒకళ్ళు
పోటీ పడడం , ఒకళ్ళని ఒకళ్ళు తృణీకరించుకోవడం , ఎక్కువ అయింది. దానితో అందరిలో నూ కొపం , ద్వేషం !.... ఆటలు, పాటలు ఆగి పోయాయి.
తోటలో నెమ్మదిగా, స్తబ్దత చోటు చేసుకుంది.
కొత్తగా వచ్చిన మొక్కలు కూడా , ఈ గొడవలకి , దూరం అవ లేక పోయారు . వారిని పొగిడేవారు లేక పోవడమే కాదు , కనీసం గుర్తించే వారు కూడా , లేకుండా అయిపోయారు. అందరూ , ఒకరిని ఒకరు , కించ పరుచు కునే పనిలో పడెసరికి , వారి అహంకారం, నీరు కారింది.
ఇలా అందరూ, ఒక విధమయిన, ప్రతి కూల భావోద్వేగంలో , వారి వారి సహజ సిద్ధమయిన అస్తిత్వాలని కోల్పోసాగారు.
తోట కళ తప్పేసరికి, రాను రాను , పిల్లగాలి, తుమ్మెదలు , తూనీగలు, సీతా కోక చిలుకలు , తోటలోకి రావడం , పూలని పలకరించడం , మానేసాయి.
మొక్కలన్నీ వాడి పోసాగాయి. ఎంత పోషణ చేసినా, ఒక్కరి మొహం లోనూ, కళ రావటం లేదు .
*****
ఇదంతా చూస్తూనే వున్నాడు తోట మాలీ.
వేప చెట్టు కింద, నులక మంచం మీద, పడుక్కొని తోటని చూస్తూ అన్నాడు.
" ఏంటంటావు ఈ జాడ్యం? ....తోట కళ లేకుండా వుంది. ..."
మాలి కి అలాగ, వేప చెట్టు తో మాట్లాడడం , కష్టం అయినా , సుఖం అయినా, వేప తో, పంచుకోవడం అలవాటు.
" కొత్త మొక్కలు , వచ్చినప్పటినుండీ చూస్తున్నా, ఒకరి పొడ, ఒకరికి ,కిట్టటం లేదు. "
" నేను గొప్పంటే , నేను గొప్ప ,అని పోటీపడుతూ వుంటే , ఎక్కడ పడుతుంది . "
" అయినా, మీ మనుషులకి , ఇది సాధారణమే కదా ! మీకు , వేరే వాళ్ళతో పోల్చుకోవడం , వేరే వాళ్ళని అనుకరించడం ఎక్కువ అని విన్నాను, " అంది వేప తోటనంతా చూస్తూ.
" అవును లే ! అందుకే , నేను ఇక్కడకి వచ్చి కాలక్షేపం చేస్తున్నాను. "
......
"నువ్వు, నువ్వులా వుండు , అని ఎవరూ చెప్పరు . వున్నా బతక నివ్వరు. ."
........
"..... ఈ కొత్త మొక్కలు , చాల రోజులు పట్నం లో, ఎక్కువ మంది మనుష్యుల మధ్య పెరిగుంటాయి . ఆ గాలి తగిలి నట్లుంది. "
" అయినా అందరితో వుంటూ , ప్రభావితం కాకుండా , వారిని వారు నిలబెట్టుకోవడం కష్టమే, మరి ! . " .
" అవును ! తనని తాను , తానుగా అవిష్కరించు కోవడం , చాలా కష్టమే, ఎంత ఒంటరిగా వున్న వాళ్ళకి అయినా !." వేప అంది .
"దేనికయినా విలువ , పోల్చడం ద్వారా నే , తెలుస్తుంది అనుకోవడం అవివేకం . కానీ అదే జరుగుతూంది. "మాలి అన్నాడు.
ఆలోచిస్తూ, ఇంకా , అన్నాడు,
" ప్రతీ ఒక్కరికి, పోల్చుకోవడం ద్వారానే , విలువ ఆపాదిస్తారు, పోల్చు కోడానికి ఎవరూ లేకపోతే అసలు విలువ లేనట్లు. "
......
"ప్రతీ ఒక్కటికీ ,దానికంటూ, ఒక. ప్రత్యేక మయిన , సంపూర్ణ మయిన , విలువ వుంటూనే వుంటుంది.
తెలుసుకొనే ప్రయత్నం , చేస్తేనేగా తెలిసేది. "
"అందరితో , ఎప్పుడూ పరుగులు పెడ్తూంటే , తెలుసుకోవాల్సిన అవసరం కూడా కనిపించదు ఎవరికీ . "
......
" అయినా , కొత్త మొక్కలు, వీళ్ళని అంత తొందరగా మార్చేయ గలిగాయి . ఎలా మారి పోయాయి ?! ... ఆశ్చర్యం !!"
......
" వాళ్ళని వాళ్ళు , ఎప్పుడైనా నిలిచి చూసుకుంటేగా , స్థిరం గా వుండేది. "
ఇద్దరూ అలా మాట్లాడు కుంటూంటే , మాలి కళ్ళు, వున్నట్లుండి దూరంగా పిల్లగాలి తో ఊసులు చెప్తున్న , గడ్డి మొక్క మీద పడింది.
ఆశ్చర్య పోయాడు.
వుండి వుండి, తుమ్మెదలు ,తూనీగలు , సీతాకోక చిలుకలు , కూడా రావడం గమనించేడు.
"చూసావా ఆ గడ్డి మొక్క ! తోట లో అది ఒక్కటే , సంతోషం గా వుంది !!! పూలతో , అక్కడ, అన్నిటినీ ఆకర్షిస్తోంది..!!! " అన్నాడు, మాలి , వేప తో.
"ఊ! ....అవును ! ..."
" దీనిని, తోట మధ్యలో వేస్తా. ఎదయినా మార్పు వస్తుందేమొ ! ...." అంటూనే , ఆపనికి పూనుకున్నాడు.
తోట మధ్యలో ఒక స్థలాన్ని, కాస్త ఎత్తు చేసి, అక్కడ ఆ గడ్డి మొక్కని వేసాడు. తోటలో అందరికీ , అది కన పడే టట్లు. .
" దీన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారా ? ....వాళ్ళని చూసి , ఇది నేర్చుకుంటుందా. ?...... " అని , పైకి అనుకుంటూ .
.....
చాలా జాగ్రర్త గా చూసాడు నాలుగు రోజులు , అది, కొత్త ప్రదేశానికి అలవాటు అయ్యేవరకూ.
రోజులు గడుస్తున్నాయి. గడ్డి మొక్క,, అక్కడా, అదే సంతోషంతో కనిపించడంతో , మాలి కుదుట పడ్డాడు.
ఎత్తులో వున్న , గడ్డి మొక్క ని చూసి అన్ని మొక్కలూ అశ్చర్య పోయాయి. .
ఆ గడ్డి మొక్క, దగ్గర గా వున్న పూల మొక్కలని, పలక రించడానికి ప్రయత్నించింది . వాళ్ళు బదులు పలకక పోయేసరికి వూరుకుండి పోయింది.
దాని మానాన అది , పాటలు, ఆటలలో ,మునిగి పొయింది .
" ఈ గడ్డి మొక్కని ఎప్పుడూ దగ్గరకే రానివ్వం ! అలాంటిది, అంత ఎత్తులో, దానిని వుంచారు. అదీ తలదించుకొని, కాలక్షేపం చేసుకోకుండా , ఎంత వగళ్ళు పోతోంది ?? "
" ఎంత ధైర్యం దీనీకి ?! మన ముందే ఇన్ని వేషాలు వేస్తోంది. తుమ్మెదలు, తూనీగలు కూడా, జాగ్రర్తగా దాని దగ్గరకే వచ్చి , వెళ్ళిపోతున్నాయి! .. వాళ్ళకేమయింది ! !! "
" నువ్వేమిటి అందగత్తె లాగా వేషాలు వేస్తున్నావు ?!. హొయలు ఒలక పోస్తున్నావ్ ?! " ఒక గులాబీ ఉండబట్ట లేక అంది.
" అదేమీ లేదు ! నేను వున్నట్లే నేను వున్నాను ! . అయినా ఎవరి అందం వాళ్ళది . " అంది గడ్డి మొక్క కి, పూసిన పువ్వుల్లో ఒకటి .
" అలా ఎలా అవుతుంది?, మమ్మల్ని చూడు, ఎంత అందము గా వున్నామో ! .. మాతో అలా మాట్లాడుతున్నా వంటే, సందేహం లేదు ! . నీకు పొగరు ఎక్కువే ! . "
గడ్డి పువ్వు , మాట్లాడ కుండా వుండి పోయింది. దాని పాటలు, ఆటలు , లో ఏమాత్రం మార్పు లేకుండా దాని మానాన అది ఉండసాగింది.
దాని ధోరణి , అందరికీ అశ్చర్యం కలగ చేయ సాగింది. ఎవరినీ , పట్టించు కోదు. ఏమీటి దీని ధైర్యం ! ఏముందని?!
" చూసి చూసి ఒక చామంతి అంది " నువ్వేమిటి, ఎవ్వరూ మాట్లాడకపోయినా పట్టించుకోవు ??.."
"మొదటి నుంచీ , ఒక్క దాన్నే , వుంటూ వచ్చాను . అలవాటయి పోయింది....."
"భయం , బాధా ఏమీ వుండవా ?..."
" ఊహు !!! ......"
మమ్మల్ని చూసి, మాలా ఉండాలని అనిపిస్తుందా ?
"లేదు. నాకు నేనే ఇష్టం ! నాలానే వుండడం ఇష్టం. ". ఏ మాత్రం తొణక కుండా అంది.
ఆశ్చర్య పోయింది చామంతి .
మళ్ళీ అంది గడ్డి పువ్వు " అందరిలోనూ , ప్రవహించేది ఈ భూమి, ప్రేమ ప్రవాహమే ! అందుకే, అంతా అందం గానే వుంటాం. ఎవరూ తక్కువ కాదు . ఎవరూ ఎక్కువ కాదు . ఈ భూమి తల్లికి , పక్షపాతం వుండదుగా !!"
పక్కనుంచి వింటున్న మల్లి , గులాబి, జాజి , మొహ మొహాలు చూసుకున్నారు.
చామంతి. ఏమీ, మాట్లడక పోయేసరికి , గడ్డి పువ్వు అంది " నేను బాగో లేను అనుకున్నా, ఇంకొకరు బాగున్నారనుకున్నా ,
భూమి తల్లి ని అవమానించడమే , అని అనిపిస్తుంది నాకు. "
ఈ మాటలన్ని , కొత్తగా వున్నాయి వాళ్ళకి . వాళ్ళు ఎప్పుడూ, ఇంత లోతుగా ఆలోచించలేదు.
గడ్డి పువ్వు మాటలు , అందరి లోనూ ఆలోచనలు రేకెత్తించాయి.
" నిజమే కదా ! అందరిలోనూ , భూమి తల్లి ప్రేమ ప్రవాహమే ! ఎప్పుడూ ఈ విషయం, ఆలోచనలో కి కూడా రాలేదు. " అంది మల్లి.
" మనము ఎక్కువ మాట్లాడుకునేది , ' నువ్వు గొప్పా ? నేను గొప్పా ? అందరికన్నా గొప్పగా ఎలా వుండాలి ? ఇంకా, మన గొప్పని ఎలా చూపించాలి ? మన గొప్ప చూపించుకోడానికి, ఎవరిని ఎలా కించ పరచాలి ? ... " ఇవేగా!... అందుకే ఈ గడ్డి పువ్వు మాట్లాడే మాటలు, కొత్తగా వున్నాయి " అంది గులాబి.
" ఇలాంటి మాటలు , ఇదివరకూ ఎప్పుడూ వినలేదు . ఏదయినా , చూసే గదా నేర్చుకుంటాము. అయినా , అందరూ ఎలా వుంటే మనమూ ,అలానే వుంటాము "
" మరి , ఆ గడ్డి పువ్వు ఎవరిని చూసి నేర్చుకుంది . అది మనలా మాట్లాడటం లేదు"
" నీ మాటలు మాకు కొత్తగా వున్నాయి . ఎక్కడ నేర్చుకున్నావు " అడిగాయి గడ్డి పువ్వుని .
" మీ మాటలు కూడా , నాకు కొత్తగానే వున్నాయి . ..."అంటూ మళ్ళీ గడ్డి పువ్వు అంది ,
" నాకు అన్నీ నేర్పేది , నాలో ప్రవహిస్తున్న ఈ భూమి తల్లి ప్రేమ "
" మా లో లేదేమొ ఆ భూమి తల్లి ప్రేమ. అందుకే , మేము , ఒకరిని చూసి ఒకరం , నేర్చుకున్నాము. "
" ఎలా వుండదు ? అందరినీ పోషించేది భూమి తల్లేగా. అయినా, గుర్తిస్తేనే గా అనుభవానికి వచ్చేది. .."
అందరూ మౌనము గా వుండి పోయారు.
గడ్డి పువ్వు మాటలు , చాలా ప్రభవితం చేసాయి , అందరిని.
" మనం , మన వేళ్ళు గురించి , వేళ్ళు ఆనుకున్న భూమి గురించి ఎప్పుడూ అలోచించలేదు. "
" అవును ! అందరిలోనూ ప్రవహించేచి భూమి తల్లి ప్రెమేగా!! అది చెప్పింది నిజమే! "
"ఒకరు గొప్ప ,ఇంకొకరు తక్కువ అనుకోవడం లో అర్ధం లేదు. "
" ఈ గడ్డి పూవు ఏదో చెప్పిందని , అదేదో తెలివైన దానిలాగ, మనమేదో తెలివి లేని వాళ్ళ లాగ అనుకోక్కర్లేదు."
" ఇన్నాళ్ళు , మనము బాగానే వున్నాముగా . కొత్తగా ఎవరి దగ్గర , ఎవరూ నేర్చుకోనక్కర లేదు. అసలు మనము కొత్త మొక్కలు వచ్చేవరకూ బాగానే వున్నాము . ఎంత సంతోషముగా వుండే వాళ్ళం!. "
" అవే ,మనని , ఒకళ్ళ తో ఒకళ్ళకి ,పడకుండా ,చేసాయి
"అంత తొందరగా కొత్త మొక్కలు మనని మార్చేసాయి అంటే , అది మనలో ఎదో లోపం వుండబట్టే అని అనిపిస్తోంది. "
" స్థిరత్వం లేకపోతే , ఏ గాలి వీస్తే , ఆ గాలికి కొట్టుకు పోతారు మరి "
" మనం, మన వేళ్ళనే మర్చిపోయాము.... పోషించే భూమిని మర్చి పోయాం. .....అందుకే మనకి స్థిరత్వం లేదేమో ?! "
" గడ్డి పువ్వు చెప్పినట్లు, గుర్తిస్తేనే గా, భూమి తల్లి ప్రేమ అనుభవం లోకి వచ్చేది "
" అదే తప్పు ! ఎవరో చెప్పారని కాదు . నీకు , నువ్వు ఆలోచించడం నేర్చుకో ! .."
" నువ్వు నాకు చెప్పక్కర్లేదు. .... ఏమి చెయ్యాలో ...ఏమి చెయ్య కూడదో ......"
" అందరమూ అంటున్నదే కదా , నేను అన్నది... "
" ఈ అందరి గొడవ నాకు అనవసరం ....."
" అందరూ అన్న మాత్రాన , అది సరి అయినది అవదు . ఒక్కరే అన్నారు అని , సరి అయినది కాకుండా వుండదు, చూస్తున్నాము గా!!.. "
ఇలా, ఒక్కోళ్ళు , ఒక్కొక్క విధం గా , మాట్లాడుతూ చర్చ గా, సాగిన వాళ్ళ సంభాషణ, మళ్ళీ పొట్లటలోకి దిగింది.
దానితో , అందరూ ఎవరికి వాళ్ళు మళ్ళీ ముడుచుకు పోయారు.
కానీ రోజులు గడుస్తూంటె, ఒకటి ఒకటి , ఆలోచించడం మొదలు పెట్టాయి.
"ఎందుకని, భూమి లోనే వున్నా , భూమికి ఎందుకు దూరం. అయ్యాము ? మా వేళ్ళు చొచ్చుకుని వున్న , భూమిని ఎలా
మర్చిపోయాము. ..."
" అందుకే , మాలో మాకు ఈ పొర పచ్చాలు, వ్యర్ధమయిన అహంకారాలు . ... "
ఒకటి , ఒకటీ ... తమ లో ప్రవహిస్తున్న భూమి రసాలని గుర్తించడం నేర్చుకున్నాయి. ఆ విధంగా , వాటికి , భూమి తో మాట్లాడడం, భూమికి దగ్గర కావడం , సాధ్యం కాసాగింది. .
నెమ్మదిగా , వాళ్ళ ఆలోచనలు , ప్రవర్తన కూడా మారి పోయాయి. గర్వం , అహంకారం,..... వాటి తో పాటు న్యూనతా భావం ...... వ్యర్ధమై రాలి పోయాయి. . పోటిపడాల్సిన అవసరం కనిపించలేదు.
మాలి, తోటలో వస్తున్న మార్పుని చూస్తున్నాడు.
ఎండిపోతున్న తోట మళ్ళీ కళ కళ లాడ సాగింది. ఈసారి , ఇది వరకటి కన్న కొత్త అందాలు, కనపడ సాగాయి.
" ఒక్క గడ్డి మొక్క , ఎంతటి మార్పు తీసుకు వచ్చింది. ..." అన్నాడు మాలి వేపతో .
" అది చెప్పినట్లు, అది ఒంటరి గా వుండడం వల్ల , ఎవరి ప్రభావం దానిమీద లేదు. అందుకే, స్థిరంగా వుండ గలిగింది . " అంది వేప.
" అప్పుడప్పుడు అందరి నుంచి దూరం గా వుండాలి ఏమో , మనలని మనం , తెలుసుకోవడానికి. ?! . అందరిలో వుంటే , అది సాధ్యం కాకపోవచ్చు."
" అవును! ....... లేక పొతే , ఎవరికి వారు బదులు , మనసంతా అందరే వుంటారు. వారి వారి , నైజాలని , ఎప్పటికీ తెలుసుకోలేరు. "
తోటమాలీ , వేప సంభాషణ అలా సాగింది.
తోట లో అంతా సందడి. ఒక విధమయిన ప్రశాంతత . పిల్ల గాలులు ,లెక్కలేనన్ని, సీతాకోక చిలుకలు ,తుమ్మెదలు ,తూనీగలు. రక రకాల పక్షులు కూడా ఆ తోటకి రావడం ప్రారంభించాయి.
అవి , "కాస్సేపు ఈ తోటలో వుంటే చాలు ఎక్కడ లేని శక్తి , ప్రశాంతత , వస్తుంది. " అనుకుంటూ వుండడం , వింటూ వుంటుంది వేప.
"ఎవరి నైజాన్ని బట్టి , వారు ప్రవర్తిస్తూంటే , అంతా ప్రశాంతతే కదా. " వాటికి బదులు చెప్తూన్నట్లు , అంటూంటాడు, మాలి .
చాలా మంది, ఆ తోటకి రావడం మొదలు పెట్టారు.
" కాస్సేపు , మమ్మల్ని, నీ తోటలో కూర్చోనిస్తావా?! ఇక్కడ కాస్సేపు వుంటే , చాల ప్రశాంతము గా వుంటుంది , ఏ రుగ్మతలు అయినా , ఇట్టే పోతాయి అంటున్నారు . " అంటూ తోట మాలిని అడిగి , కాస్సేపు కూర్చుని, వెళ్తూండే వారు.
అలా , క్రమేణా , ఆ తోట, రాజు గారి తోట గా , ఆ నోట ఈ నోటా నాని , ఆ చుట్టు పక్కల అందరి ప్రేమ నీ , పేరునీ సంపాదించుకుంది.
************
మణి
రాజు గారి తోట