
శేషు 10వ తరగతికి వచ్చాడు. మంచి ధనవంతుల అబ్బాయి అతడు 10వ తరగతిలో మంచి మార్కులు సాధిస్తే దేవునికి మంచి విలువైన కానుకలను సమర్పిస్తామనీ తల్లిదండ్రులు మొక్కుకున్నారు. తన చదువు గురించి తల్లిదండ్రుల శ్రద్ధ చూసి మరింత పట్టుదలతో చదువుకున్నాడు శేషు. పరీక్షా ఫలితాలు వచ్చాయి. శేషు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. శేషు తల్లిదండ్రులు పుణ్య క్షేత్రానికి వెళ్ళి, దేవుని హుండీలో మొక్కకున్న డబ్బులు వేద్దామని అంటారు. అప్పుడు శేషు "మన అన్నదాతలు మన దేవుళ్ళు కదా! మా తరగతిలో రాజేశ్ బాగా చదువుతాడు. అతని తల్లిదండ్రులు ఎప్పుడూ వ్యవసాయం చేస్తుంటారు. పాపం పేద రైతులు. అయినా ఎప్పుడూ వ్యవసాయాన్ని వదలి పెట్టకుండా శాయశక్తులా కష్టపడి పంటలు పండిస్తుంటారు. రాజేశ్ ఉన్నత చదువులకు సహాయం చేద్దాం ప్లీజ్. అతని తల్లిదండ్రులకు కూడా సహాయం చేద్దాం." అని అంటాడు శేషు. తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. శేషు సంతోషానికి అవధులు లేవు.