కనుమరుగై - ఐసున్ ఫిన్

Kanumarugai

చాలా రోజులైంది, అసలు నెంబర్ కూడా డిలీట్ చేశా. ఇప్పుడు మెసేజ్ పెట్టాడేంటి వీడు?

(ఆ నెంబర్ నుండి కాల్ వస్తుంది)

హలో విరాజ్, ఎలా ఉన్నావ్?

నేను బాగున్నాను షణ్ముఖ్. నువ్ ఎలా ఉన్నావ్?

నేను బాగున్నాను. మెసేజ్ చూసావా?

హా చూస్తున్నాను.

మా అన్న పెళ్ళి. నెక్స్ట్ సాటర్డే. కచ్చితంగా రావాలి. మన క్లాస్మేట్స్ అందరూ వస్తున్నారు.

వస్తాను.

ఎప్పటి లాగ నేను రాను అని హ్యాండ్ ఇవ్వకు. కచ్చితంగా రా.

వస్తాను రా. ఆప్లేస్, గూగుల్ లొకేషన్ సెండ్ చేయి.

ఆల్రెడీ సెండ్ చేశా చూడరా.

సరే రా.

(కాల్ కట్ చేసాక)

వీడి నెంబర్ ఏ డిలీట్ చేసేసా. ఇప్పుడు మల్లి సేవ్ చేదాం. వీడి వళ్ళ ఇన్ని రోజులకి ఒక మంచి పని జరుగుతుందేమో. అందరూ వస్తారంటే సమీరా కూడా వస్తుంది. ఈసారి కచ్చితంగా సమీరాకి నా ప్రేమ గురించి చెప్పాలి. తను ఎస్ అంటదో నో అంటదో తన ఇష్టం కానీ తన మీద నాకున్న ఈ ఫీలింగ్స్ చెప్పకపోతే నేను ఇంకా ఇలాగే మిగిలిపోతే. ఒకవేళ ఎస్ అంటే హ్యాపీ ఏ, అదే నో అంటే ఏమవుతుందో అర్ధమే కావట్లేదు.

ఏంట్రా అన్నయ్య, తెగ ఆలోచిస్తున్నావు?

ఎం లేదు పల్లవి. నెక్స్ట్ సాటర్డే షణ్ముఖ్ వాళ్ళ అన్న పెళ్ళంటా, కాల్ చేసి రమ్మన్నాడు. అందరూ వస్తున్నారంటే, నేను కచ్చితంగా రావాలన్నాడు.

షణ్ముఖ్ అన్న అందరితో అదే చెప్తాడు, నువ్వేదో స్పెషల్ అని ఫీల్ అవ్వకు లే అన్నయ్య.

లేదు వాడికి నేను బెస్ట్ ఫ్రెండ్ అని అన్నాడు అప్పుడు కాలేజీ లో.

అది అప్పుడెప్పుడో. ఇప్పుడు చాలా తేడా వచ్చింది. అసలు ఆ అన్న పెట్టె ఫొటోస్ చూసావా.

సర్లే వదిలేయ్ పల్లవి, నేను వెళ్తాను. నువ్వు వస్తావా?

లేదు అన్నయ్య, నేను రాను. నువ్వే వెళ్ళు.

(విరాజ్ తన మనసులో)

నాకు అదే కావాలి, వచ్చిన దెగ్గర నుంచి నా వెనకే ఉంటె నేను సమీరాతో నా ప్రేమ గురించి ఎలా చెప్పగలను. మల్లి అడగకపోతే నాన్న చెల్లిని ఎందుకు తీసుకెళ్లలేదు అని అడుగుతాడు.

( సాటర్డే వచ్చేసింది)

ఏంట్రా మనోళ్లు వచ్చేసారా షణ్ముఖ్?

ఎక్కడరా, ఇంకా ఎవరు రాలేదు. నువ్ అసలు బయల్దేరావ?

ఆ ఇప్పుడే స్టార్ట్ అవుతున్న, ఎవరికైనా లిఫ్ట్ కావాలంటే చెప్పమను తీసుకొచ్చేస్తా.

అవును రా, నందు గాడు అడిగాడు.

అయితే చెప్పు రా, నేనున్నాని.

నేనెక్కడ ఖాళి రా. నువ్వే వాడికి ఫోన్ చేసి మాట్లాడుకో.

(విరాజ్, నందు కి కాల్ చేస్తాడు)

ఏంట్రా? నేనుండగా షణ్ముఖ్ గాడిని లిఫ్ట్ అడిగావు అంట.

నువ్వు వస్తున్నావో లేదో తెలీదు విరాజ్. సరే, నువ్ ఎప్పుడు వస్తావ్.

ఒక ఐదు నిమిషాల్లో నీ ముందుంటా.

(విరాజ్, నందు వాళ్ళ ఇంటికి వెళ్తాడు)

హలో ఆంటీ, హలో అంకుల్. ఎలా ఉన్నారు?

బాగున్నాం విరాజ్. ఇప్పుడు ఎం చేస్తున్నావ్ విరాజ్?

అంటే ఇంకా ఏమనుకోలేదు ఆంటీ. గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేదాం అనుకుంటున్నాను.

అదేంటి ప్లేసెమెంట్స్ లో జాబ్ వచ్చింది కదా నీకు?

లేదు ఆంటీ. నాకు అవి పెద్దగా ఇంటరెస్ట్ లేదు, అంటే రావనుకోండి.

సరే మరి గవర్నమెంట్ జాబ్స్ అంటే కోచింగ్ తీసుకుంటున్నావా?

ఓన్ ప్రేపరషన్ చేదాం అనుకుంటున్నాను ఆంటీ.

కోచింగ్ వాళ్ళు అంటే ఆ టైం లో ఎలా ప్రాబ్లెమ్ త్వరగా సాల్వ్ చేయాలని ట్రిక్స్ చెప్తారు కదా.

నువ్వు ఉండు సీత, ఎందుకు అలా ఒక దాని మీద ఒకటి ప్రశ్నలేసి వేధిస్తున్నావు.

లేదండి గవర్నమెంట్ జాబ్ కష్టమేగా. కోచింగ్ తీసుకుంటే బెటర్.

ఆంటీ యూట్యూబ్ వీడియోస్ లో కూడా చెప్తున్నారుగా, మల్లి స్పెషల్ గా డబ్బులెందుకు వేస్ట్ చేయటమని.

ఇన్ పర్సన్ గా నేర్చుకోవటం, ఆన్లైన్ లో నేర్చుకోవటం ఒకటి అవ్వదు కదా విరాజ్.

అమ్మ, మేమెల్లాలి మీరు తర్వాత ముచ్చట్లు పెట్టుకోండి.

(నందు, విరాజ్ బండి మీద వెళ్తూ ఉంటారు)

ఏంట్రా, ఇంత సేపు చేసావ్ నందు.

సారీ విరాజ్. ప్రియా కాల్ చేసింది, తను వయొలెట్ చీర కట్టుకుందంట, తన చీరకి మ్యాచ్ అవ్వాలని షర్ట్ మార్చుకుని, దాని తగ్గ ప్యాంటు వెతుక్కుని ఇస్త్రీ చేసి వేసుకుని, లావెండర్ పెర్ఫ్యూమ్ కొట్టుకుని వచ్చేసరికి ఇంత టైం పట్టింది.

నీ పని బాగుందిరా, ప్రియా ఎప్పుడో నిన్ను వదిలేస్తుంది అనుకున్న.

నీకు కుళ్ళు రా.

ప్రియా ఫ్రెండ్స్ వస్తున్నారా?

వస్తున్నారుగా, ఎందుకు రా నీకు?

మీకెలాగో సెట్ అయ్యింది మాకు ఏదైనా సెట్ చేయొచ్చుగా.

ఎవరో చెప్పురా సెట్ చేస్తా, అప్పుడు మా మీద పడి ఏడవకుండా ఉంటావు.

ఎం అవసరం లేదులే, ఊరికే అన్నాను.

(పెళ్ళికి వెళ్తారు)

హలో విరాజ్, ఎలా ఉన్నావు?

నేను బాగున్నాను ప్రియా, మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారా?

హ వచ్చారు, ఒకరు తప్ప. సమీరా రాదు.

(విరాజ్ మొహం లో చిన్న నిరాశ, మనసులో)

దీనెమ్మ జీవితం ఎప్పుడు ఇలానే ఆడుకుంటుంది, ఆరోజు కూడా లాస్ట్ డే తను కాలేజీకి వస్తుందనుకుంటే రాలేదు. మల్లి ఇన్ని రోజులకి పెళ్ళిలో కలిసైనా చెపుదామంటే ఈరోజు రాలేదు. అసలు ఈ దేవుడు ఎందుకు ఇలా ఆడుకుంటాడో తెలీదు. అయినా తనకి నా మీద ప్రేమ ఉందని అనుకోవడమే నా మూర్కత్వం ఏమో.

ఏంట్రా విరాజ్ ఏమైంది, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావ్?

అదేరా వీడు మనల్ని రమ్మని ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇంత సేపైంది వచ్చి చూసి కూడా ఇంకా రావట్లేదు.

వాడే కదరా పెళ్లి పనులన్నీ చూసుకుంటాడు. వస్తాడు లే.

(ఆరోజు విరాజ్ ఇంటికి వెళ్ళాక)

ఏంటన్న బాగా ఎంజాయ్ చేశారనుకుంటాగా?

అవును చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. నువ్వు వచ్చుంటే బాగుండేది పల్లవి కానీ నువ్వే రాను అని అన్నావు.

అది కాదు అన్న, ప్రియా అక్క పెట్టిన స్టేటస్ ఫోటోస్లో నువెక్కడ కనపడలేదేంటి?

ఆ లవర్స్ మధ్యలో మనమెందుకు అని.

మరి నీ లవర్ రాలేదా?

ఏంటి, ఎం మాట్లాడుతున్నావ్ పల్లవి? నాకు అందరూ సిస్టర్స్ ఏ.

సర్లే మాకు తెలీదు అన్నట్టే ఉంటాము. నీకు ఇంటరెస్ట్ లేకపోవచ్చేమో కానీ సమీరా అక్కకి నీ మీద ఇంటరెస్ట్ ఉందని తెలుసు.

(మనసులో)

అలా చెప్పే ఇక్కడిదాకా తీసుకొచ్చారు, ఎలాగైనా సమీరని మర్చిపోవాలి. ఇన్ని రోజులకి తన జీవితంలోకి వేరే వ్యక్తి రాకుండా ఉంటాడా? మర్చిపోర విరాజ్, మర్చిపో.

(జులై 4 , ఫేస్బుక్ లో ఒక పోస్ట్ కనపడింది. జాబ్ ఒప్పుర్చునిటీస్ ఎట్ ఎంబసీ అఫ్ ఇండియా, ˌబెయ్రుట్. పోస్ట్లు వచ్చేసరికి సోషల్ సెక్రటరీ 1519 డాలర్స్, కాన్సులర్ క్లర్క్ 913 డాలర్స్. స్కిల్స్ ఏమో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, 21 నుంచి 35 లోపల ఏజ్ ఉండాలి, అరబిక్ అండ్ ఇంగ్లీష్ ట్రాన్సలేషన్ వచుండాలి. ఫార్మ్ ఫిల్ చేయమని ఉంది)

ఎలాగైనా ఈ దేశం నుంచి వెళ్లిపోవాలబ్బా, ఇక్కడుంటే మనకి ఏమి రావు. ఏ విలువ ఉండదు. అదే వేరే కంట్రీకి వెళ్తే చాలు మా వాడు ఫారినర్ అని గొప్పలు చెప్పుకుంటారు. లెబనాన్, అరబిక్ అంటే నాకు ఆల్రెడీ అరబిక్ వచ్చు కాబట్టి కచ్చితంగా మనకి సూట్ అయ్యేదే అయుంటుంది. వస్తే వచ్చింది లేకపోతే లేదు, ఏదోకటి ఫార్మ్ ఎగ ఫిల్ చేస్తే పోయే.

(కొన్ని వారాల తర్వాత)

అన్నయ్య, నీ జి మెయిల్ అకౌంట్ లో ఎంటి ఏదో జాబ్ సెలక్షన్ మెయిల్ ఉంది. మాకు చెప్పను కూడా చెప్పలేదు.

జాబ్ ఆ? నాకు జాబ్ ఇచ్చే తలకమాసినోడు ఎవడే? అది ఫేక్ ఇమెయిల్ అయుంటది, సరిగ్గా చూడు.

ఇక్కడ ఇండియన్ ఎంబసీ, బెయ్రుట్ లో కాన్సులర్ క్లర్క్ నెలకి 913 డాలర్స్ అని ఏంటి.

నిజమా పల్లవి?

చూడు అన్నయ్య.

ఇది నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేనేదో ఊరికే అప్లై చేసాను. వస్తుందనే అనుకోలేదు.

కంగ్రాట్స్ అన్నయ్య. అమ్మ, నాన్నకి కూడా చెప్తా ఉండు.

(పల్లవి ఆందరికి చెప్తూవుంటుంది)

విరాజ్, నువ్ లెబనాన్ వెళ్లాలనుకుంటున్నావా?

నాన్న, నేను అరబిక్ నేర్చుకుంటున్నప్పుడు ఎందుకు ఏ ఉపయోగం లేని పని చేస్తున్నానన్నారు. కానీ ఇప్పుడు దాని వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని నేను వదులుకోవాలనుకోవడం లేదు. కచ్చితంగా వెళ్తాను.

ఏంటండీ మీరు వాడికి జాబ్ వస్తే కంగ్రాట్స్ చెప్పకుండా, వెళ్లాలనుకుంటున్నావా అని అంటారు. మీరు ఇన్ని రోజులు వాడికి ఏ జాబ్ రాదన్నారు, వస్తే ఇలా అంటున్నారు.

మల్లి ఎక్కడ తిరిగి వచ్ఛేస్తాడో అని, అలా అన్నాను. అల్ ది బెస్ట్ రా.

థాంక్యూ నాన్న.

(విరాజ్, ఇండియన్ ఎంబసీ కి చేరుకుంటాడు)

ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇజ్ విరాజ్. ఐ ఆమ్ న్యూ జాయినీ.

ఓహ్, ఎస్ విరాజ్. యు అర్ కాన్సులర్ క్లర్క్. హి ఇజ్ రాబిన్, విల్ గైడ్ యు త్రు ది ప్రాసెస్.

థాంక్యూ. హలో సర్, నైస్ మీటింగ్యు.

మీ టూ విరాజ్. మీరు తెలుగు వారే కదా.

అవును, మీకు తెలుగు వచ్చా?

నాకు ఐదు భాషలు వచ్చు. పదండి, మీకు ముందు మీరు ఉండే ప్లేస్ చూపిస్తాను.

(ఆ ప్లేస్ కి వస్తారు)

విరాజ్, మీరు ఉండటానికి ఇల్లు అండ్ ట్రావెల్ కి కార్ ఎంబసీనే ప్రొవైడ్ చేస్తుంది. ఫుడ్, యుటిలిటీస్ అంటే గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్నెట్ బిల్స్ మీరే కట్టుకోవాలి.

ఈ ఇల్లు చాలా బాగుంది. ఆ కార్ అమేజింగ్. థాంక్యూ సర్. మరి నా జాయినింగ్ ఎప్పుడు?

మీరు ఇప్పుడు ఫ్రెష్ అయ్యి రావొచ్చు లేకపోతే రేపు మార్నింగ్ వచ్చి జాయిన్ అవ్వచ్చు.

సరే సర్, నేను ఇప్పుడే వచ్చేస్తాను.

మీరు డైరెక్ట్ గా కౌన్సిల్ హాల్ కి వచ్చేయండి, నేను బయల్దేరతాను విరాజ్.

(విరాజ్ కి కాల్ వస్తుంది)

అన్నయ్య, వెళ్ళావా? ఎలా ఉంది ప్లేస్, జాబ్?

వచ్చాను పల్లవి. చల్లగా, అద్భుతంగా ఉంది. నాకు ఇక్కడ ఇల్లు, కార్ కూడా ఇచ్చారు. కార్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి జాయిన్ అవ్వడానికి వెళ్ళాలి. మల్లి కాల్ చేస్తా నైట్.

బాగా ఎంజాయ్ చేస్తున్నావుగా, అన్నయ్య. మల్లి కాల్ చేయి మర్చిపోకు. అక్కడికి, ఇక్కడికి, టైం మూడున్నర గంటలు తేడా కదా. నీకు రాత్రంటే మాకు అర్ధరాత్రి అవుతుంది.

(విరాజ్ ఎంబసీకి వెళ్లే దారిలో, ఒక అమ్మాయి కార్ కి అడ్డం వచ్చింది. సడన్ గా బ్రేక్ వేసాడు)

(వాళ్ళు మాట్లాడేది అరబిక్ లో నే కానీ మనకి అర్ధం అవ్వడం కోసం తెలుగులో ఉంటుంది)

హలో! రెడ్ సిగ్నల్ వేశారు కనపడలేదా? చూసి నడపండి.

క్షమించండి, మీకేమి కాలేదుగా? నాదే తప్పు, క్షమించండి.

(తను వెళ్ళిపోతుంది. విరాజ్ మనసులో)

జాబ్ లో జాయిన్ అయ్యేముందు ఒక అందమైన అమ్మాయి ఎదురు వచ్చింది, మంచి జరుగుతుంది అని అనుకోవాలా? లేకపోతే తనని బాధ పెట్టినందుకు, చెడు జరుగుతుంది అని అనుకోవాలా?

(వెనకాల నుంచి హార్న్ వినిపిస్తుంది. విరాజ్ ఎంబసీ కి వెళ్తాడు, అక్కడి నుంచి కౌన్సిల్ హాల్ కి)

విరాజ్ త్వరగా వచ్చేసారు. ఇది మీ క్యాబిన్, అండ్ మీరు చేయాల్సిన వర్క్, ఫైల్స్ అన్ని డెస్క్ మీద ఉన్నాయ్ చూడండి. అల్ ది బెస్ట్.

థాంక్యూ సర్.

(విరాజ్ తన ఫస్ట్ డే కంప్లీట్ చేసుకుని ఈవెనింగ్ ఒక రెస్టారంట్ కి వెళ్తుంటాడు. పల్లవికి కాల్ చేస్తాడు)

హే పల్లవి, నిద్రపోయావా?

లేదు అన్నయ్య నువ్వు ఎప్పుడు కాల్ చేస్తావని వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉంది ఫస్ట్ డే?

ఫస్ట్ డే ఆఫీస్ లో చాలా బాగుంది పల్లవి. కొత్తగా ఉంది.

(అలా మాట్లాడుతూ, తినేసి బిల్ కట్టేటప్పుడు, మల్లి అదే అమ్మాయి కనిపిస్తుంది)

తనేనా అది?

ఏమైంది అన్నయ్య? ఎవరు తను?

ఎం లేదు లే, మార్నింగ్ కార్ కి ఒక అమ్మాయి అడ్డం వచ్చింది. అదే అమ్మాయి ఇప్పుడు రెస్టారంట్ లో కూడా కనిపించింది. తనేనా అని డౌట్ గా ఉంది? సరే నేను మల్లి రేపు పొద్దున్న కాల్ చేస్తా.

(విరాజ్, ఆ అమ్మాయి దెగ్గరకు వెళ్తాడు)

హలో, గుర్తుపట్టారా?

మార్నింగ్ కార్ నడిపింది మీరేగా, చెప్పండి.

అవును, నన్ను క్షమించారో లేదో తెలుసుకుందామని.

క్షమించాను, మీరు తప్పుకుంటే నేను వెళ్తాను.

(తను వెళ్ళిపోతుంది.విరాజ్ మనసులో)

ఈమెకు కోపం ముక్కు మీద ఉంటుంది అనుకుంట, ఒక్కసారి కూడా నవ్వుతు మాట్లాడదే.

(ఒక వారం తర్వాత. విరాజ్ దెగ్గరికి ఒక అప్లికేషన్ వస్తుంది. పాస్పోర్ట్ పోయిందని)

సర్, నా పాస్పోర్ట్ కనిపించడంలేదు. ఇప్పుడు ఎం చేయాలి?

సర్, మీ పాస్పోర్ట్ నెంబర్, డేట్ అఫ్ ఇష్యూ, డేట్ అఫ్ ఎక్సపైరీ చెప్పండి.

సర్, నా దెగ్గర ఫోటోకాపీ ఒకటి ఉంది. ఇదిగోండి.

(అది వెరిఫై చేసాక)

మీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఆధార్ కార్డు ఇవ్వగలరా, సర్?

రెండు ఉన్నాయ్, సర్. తీసుకోండి.

(ఆ డీటెయిల్స్ పాస్పోర్ట్ డేటాబేస్ లో వెరిఫై చేసి కంఫర్మ్ చేసాక)

సర్, మీరు మీ పాస్పోర్ట్ పోయిందని పోలీస్ రిపోర్ట్ తీసుకురావాలి.

కానీ సర్, నేను అర్జెంటుగా ఇండియా వెళ్ళాలి. మా నాన్న గారు చనిపోయారు. బయల్దేరుదామని అనుకునేసరికి పాస్పోర్ట్ కనిపించలేదు.

మీరు కంగారుపడకండి సర్. ఎమర్జెన్సీ సర్టిఫికెట్ ఇష్యూ చేయొచ్చు, అది టెంపరరీ ట్రావెల్ డాక్యుమెంట్. మీరు ముందు వెళ్లి పోలీస్ రిపోర్ట్ తీసుకురండి, దాంతో పాటు మీ స్కూల్ సర్టిఫికెట్ కూడా.

(ఇవన్నీ తీసుకొచ్చాక, ఆ డాకుమెంట్స్ ని వెరిఫై చేసి. అప్లికేషన్ ఆమోదిస్తాడు విరాజ్. లెబనీస్ అథారిటీస్ వాలిడేట్ చేసి అతన్ని ట్రావెల్ చేయటానికి ఒప్పుకుంటారు)

(ఒక నెల తరువాత. అక్కడ వర్షం పడుతుంది. వర్క్ అయిపోయాక విరాజ్ ఆఫీస్ నుంచి కొన్ని మైల్స్ దూరం లో ఉన్న ఒక కాఫీ షాప్ కి వెళ్తాడు)

ఈ వర్షం లో ఆ చెట్లు ఇంకా అందంగా కనిపిస్తున్నాయి. చాలా ఫ్రెష్ గా ఉన్నటుంది. చల్లగా ఉంది. దాంతో పాటు ఈ వేడి కాఫీ తాగుతుంటే అద్భుతంగా ఉంది. అదే ఇంట్లో అమ్మ వేడివేడిగా బజ్జిలు, పకోడీలు చేసేది. ఇంట్లో వాళ్ళని చాలా మిస్ అవుతున్న.

(ఆ వర్షంలో ఒక పాప తడుస్తుంటుంది. తన దెగ్గరికి వెళ్తాడు)

పాప, మీ అమ్మ, నాన్న ఎక్కడున్నారు? ఇక్కడ ఒంటరిగా ఎం చేస్తున్నావు.

మా అమ్మ, నాన్న తప్పి పోయారు. నేను ఇక్కడ ఎందుకున్నానో నాకు తెలీదు.

వర్షం పెద్దదవుతుంది. ఎక్కువ సేపు వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది. నాతో రా.

(తనతో పాటు తీసుకుని వెళ్తాడు)

నీ పేరేంటి? ఎం చదువుతున్నావు?

నా పేరు సన. నేను 3వ తరగతి చదువుతున్నాను.

మీ ఇంటి అడ్రస్ తెలుసా?

లేదు. నాకేమి తెలీదు. నాకు ఆకలేస్తుంది.

(వెంటనే విరాజ్, తనకి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. తను చాలా ఆకలి తో ఉంటుంది. తిన్న తరువాత)

సన, పోలీస్ స్టేషన్ కి వెళ్దామా? మీ అమ్మ,నాన్న తప్పి పోయారని కంప్లైంట్ ఇద్దాము.

సరే అంకుల్.

(పోలీస్ స్టేషన్ కి వెళ్తారు)

సర్, ఈ పాప తప్పిపోయింది. తన పేరు సన. 3వ తరగతి చదువుతుందంట.

అవును, వచ్చారు. వాళ్ళ అమ్మ, నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు, వెళ్ళమన్న కూడా వెళ్ళలేదు. ఏమి తినలేదు కూడా.

ఎక్కడున్నారు సర్ ఆవిడ?

అదిగో ఆ బెంచ్ మీద పడుకున్నారు.

(తను ఎవరో కాదు, ఆరోజు కార్ కి అడ్డం వచ్చిన అమ్మాయి)

మేడం, ఇదిగోండి మీ కూతురు సన.

(తన కళ్ళు ఆనందంతో నిండిపోయాయి)

సన, ఎక్కడికి వెళ్ళిపోయావు. నీ కోసం ఎంత వెతికానో తెలుసా? ఇప్పుడు నువ్వు వచేసావు. ఇక ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళకు సన.

(విరాజ్ సంతోషిస్తాడు, మనసులో)

అమ్మ ప్రేమ వెలకట్టలేనిది. రోజు అమ్మ కాల్ చేసి నాతో మాట్లాడుతున్నప్పుడు, నాకన్నా తనే నన్ను చాలా మిస్ అవుతున్నట్టనిపిస్తుంది.

థాంక్యూ, నా సనని నా దెగ్గరకు తీసుకొచ్చినందుకు. ఆరోజు నేను మీ మీద కోప్పడ్డాను. క్షమించండి.

పర్లేదు మేడం.

మేడం ఎం వద్దు. నా పేరు నసీమ. సిటీ సెంటర్ మాల్ లోని లెస్ అమిస్ బొటిక్ మాదే. నేనే చూసుకుంటుంటాను. మరి నువ్వు?

నా పేరు విరాజ్. నేను ఇండియన్ ఎంబసీ లో కాన్సులర్ క్లర్క్ గా పనిచేస్తున్నాను.

ఒన్స్ అగైన్, థాంక్యూ విరాజ్.

ఈ థాంక్యూలు వద్దు నసీమ. నా పని నేను చేసాను అంతే.

మల్లి కలుద్దాం. ఈ విసిటింగ్ కార్డు లో ఉన్నదే నా నెంబర్ విరాజ్.

(కొన్ని వారల తరువాత, పల్లవి కాల్ చేస్తుంది)

అన్నయ్య, ఇంటికెప్పుడు వస్తావు?

వచ్చే వారం వస్తాను పల్లవి. నీ బర్త్డే కదా. నేను కచ్చితంగా ఉంటాను.

నిజంగానా, నువ్వు నా బర్త్డే కి ఉండవనుకున్నాను అన్నయ్య.

ఎప్పుడైనా నేను లేకుండా నీ బర్త్డే సెలెబ్రేట్ చేసుకున్నావా? నిజంగానే వస్తాను పల్లవి.

(తర్వాత రోజు, విరాజ్ ఒక ఫైల్ కోసం వెతుకుతుంటే ఒక విసిటింగ్ కార్డు కనిపిస్తుంది. అది నసీమ ఇచ్చినది)

పల్లవి బర్త్డే కి డ్రెస్ కొనాలి. నసీమ కి కాల్ చేద్దాము.

(విరాజ్ కాల్ చేస్తాడు, నసీమ లిఫ్ట్ చేస్తుంది)

హలో నసీమ, నేను విరాజ్ ని.

హలో విరాజ్, ఎలా ఉన్నావ్?

బాగున్నాను నసీమ. నువ్ ఎలా ఉన్నావ్, సన ఎలా ఉంది?

మేము బాగున్నాము విరాజ్.

నసీమ, మా చెల్లి కి డ్రెస్ కొనాలనుకుంటున్నాను. నేను ఈవెనింగ్ వస్తాను, నాకు సెలక్షన్ లో హెల్ప్ చేస్తావా?

కచ్చితంగా విరాజ్.

(ఆరోజు సాయంత్రం, విరాజ్ సెంటర్ మాల్ కి వెళ్తాడు)

క్షమించు నసీమ. నిన్ను వెయిట్ చేపించాను. లేట్ అయిపోయింది.

పర్లేదు విరాజ్.

(పల్లవి కోసం డ్రెస్ సెలెక్ట్ చేస్తారు)

సన ఎలా ఉంది?

చాలా బాగుంది. అప్పుడప్పుడు నిన్ను అడుగుతుంది.

మీ హస్బెండ్ ఎం చేస్తారు నసీమ?

నాకు ఇంకా పెళ్లి కాలేదు, విరాజ్. సన, నా అక్క కూతురు. అక్క, బావ ఇద్దరు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటినుంచి సన ని నేనే చూసుకుంటున్నాను. అమ్మని అయ్యాను. కానీ, సన ఇంకా, అక్క, బావనే గుర్తుతెచ్చుకుంటుంది. నన్ను, అమ్మ అని పిలవదు. ఆ ఆక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్తుంది. అక్కడే వెయిట్ చేస్తూవుంటుంది. ఆక్సిడెంట్ అయినా రోజు ఏ కారులో అయితే వెళ్లారో, ఆ కార్ కనిపిస్తే దాని వెనక పరిగెడుతుంది.

అందుకనేనా, ఆరోజు సన అక్కడుంది.

అవును, సన ని కంటికి రెప్పలా చూసుకోవాలి.

(విరాజ్ ఇంటికి వెళ్ళిపోతాడు. పల్లవి బర్త్డే రోజు విరాజ్ ఇండియా కి వెళ్తాడు. అక్కడినుంచి ఇంటికి వెళ్తాడు)

పల్లవి, హ్యాపీ బర్త్డే. ఇదిగో నీకోసం డ్రెస్.

థాంక్యూ సో మచ్ అన్నయ్య. ఈ డ్రెస్ చాలా బాగుంది. నువ్వే సెలెక్ట్ చేశావా?

అవును, నసీమ కూడా హెల్ప్ చేసింది.

ఎలా ఉన్నావ్ విరాజ్? బాగా సన్నగా అయిపోయావ్. ఒక పెద్ద ఆఫీసర్ లా ఉన్నావు.

బాగున్నాను అమ్మ. అలానే కదమ్మా ఉండాలి.

అవును, ఇప్పుడే బాగున్నాడు. ఒక ఉద్యోగం వస్తే మారతారు. బాధ్యతలు తెలుసుకుంటారు. రౌడీ వెదవలా ఉండేవాడు అంతకముందు.

మీరు ఊరుకోండి. వాడు ఎం తిన్నాడో ఏమో. రా విరాజ్, నీకు నచ్చినవణ్ణి చేసాను.

(విరాజ్ తిన్న తర్వాత, వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చేస్తాడు)

నేను ఇండియా కి వచ్చానురా.

ఏంట్రా నువ్వు చెప్పకుండా లెబనాన్ కి వెళ్ళిపోయావు. పార్టీ కూడా ఇవ్వలేదు. ఈసారి మాత్రం తప్పించుకోకు.

ఇస్తానురా, రేప్ ఈవెనింగ్ మన కాలేజీ వాళ్ళందరిని బ్లాక్ డాగ్ రెస్టారంట్ కి రమ్మను. అందరూ రావాలి. ఎవ్వరు మిస్ కాకూడదని చెప్పు. గెట్ టూగెథెర్ అని చెప్పు.

(విరాజ్ మనసులో)

ఈసారైనా సమీరా కచ్చితంగా రావాలి. నా మనసులో మాట తనకి చెప్పాలి.

(ఆరోజు ఈవెనింగ్)

బాగా సంపాదిస్తున్నావుగా, అందుకే అందరిని పిలిచి మరి పార్టీ ఇప్పిస్తున్నావ్.

అదేం లేదు రా. అందరిని కలిసినట్టుంటుందని. సమీరా ఎప్పుడొస్తుంది?

తనకి పెళ్ళి చూపులు. ఇప్పటి దాకా చాలా ప్రొపొసల్స్ వచ్చాయి కానీ తను అందరికి నో అనే చెప్పింది. తనకసలు ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ ఏ ఇష్టం లేదని చెప్పింది. ఈరోజు మరి ఏమైందో తెలీదు, పెళ్ళి చూపులకి ఒప్పుకుంది.

(విరాజ్ మనసులో)

నన్ను ప్రేమిస్తుంది కాబట్టి అందరికి నో చెప్తుంది అని సంతోషపడాలా లేక నా ప్రేమను చెప్పిన నో చెప్తుంది అని బాధపడాలా? రెండోదే కరెక్టనిపిస్తుంది. తనకి నా మీద కచ్చితంగా ప్రేమ లేదు. ఇక మర్చిపోవాలి. కచ్చితంగా మర్చిపోతాను.

ఎలా ఉంది విరాజ్ జాబ్, బెయ్రుట్?

చాలా బాగుంది ప్రియా. తక్కువ వర్క్, ఎక్కువ ఒత్తిడి ఉండదు, అందమైన ఇల్లు, అద్భుతమైన కార్, సువిశాలమైన బెయ్రుట్. ఒకటే ప్రాబ్లెమ్ వచ్చిన డబ్బులు వెంటనే ఖర్చైపోతున్నాయ్. సేవింగ్స్ లాంటివి చేద్దామంటే ఏమి ఉండట్లేదు.

అలా సేవ్ చేసుకునేవి తేనతీగలు తేనెను సమకూరిస్తే, ఆ తేన మనుషులకి దక్కినట్టు అవుతాయి. ఇప్పటి క్షణాల కోసం ఉపయోగపడితే చాలుగా.

నువ్ చెప్పింది ఒక ఇరవై ఐదు శాతం కరెక్ట్ ప్రియా. ఏ క్షణంలో ఎవరికీ ఎం జరుగుతుందో తెలీదు. మనల్ని పెంచిన అమ్మ, నాన్నలకు మనం ఎంతిచ్చినా తక్కువే కానీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. చెల్లిని గొప్పగా చూడాలి. అలాంటప్పుడు దాచిపెట్టుకున్నదే మనకి ఉపయోగపడుతుంది.

మరి నీకోసం, వచ్చే పార్టనర్, పిల్లలు కోసం ఆలోచించవా విరాజ్?

లేదు ప్రియా. నా కోసం అన్నది నేను ఎప్పుడు ఆలోచించను. నేను అనే భావన నాకెప్పుడు ఉండదు. ఒక పువ్వు ఎలాగైతే ఉన్న రెండు మూడు రోజులు పురుగులకు ఆహారమవుతుందో లేక దేవుడి పాదాల దెగ్గరకు చేరుతుందో లేక అమ్మాయి జడలో నిలుస్తుందో లేక ఇంటికి అలంకారమవుతుందో అనే దాని మీదే దానికి విలువ ఉంటుంది. అది రాలిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు.

(తర్వాత రోజు, విరాజ్ కి ఎంబసీ నుండి కాల్ వస్తుంది)

విరాజ్, మీరు త్వరగా ఇక్కడకి రావాలి.

అదేంటి నేను ఒక వారం వరకు లీవ్ తీసుకున్నాను కదా.

కానీ ఇది చాలా ముఖ్యమైనది. మీరు కచ్చితంగా రావాలి.

(విరాజ్ లెబనాన్ కి వెళ్తాడు. రాబిన్, వెంటనే విరాజ్ ని ఒక రూమ్ కి తీసుకెళ్తాడు. అక్కడ పోలీసులు, పై అధికారులు ఉంటారు. అందులో ఒక పోలీస్ అధికారి విరాజ్ ని ప్రశ్నిస్తారు)

ఇది నీ ఆఫీస్ మెయిల్ ఎగా?

అవును సర్ నాదే. ఏమైంది?

"రీ: మీటింగ్ షెడ్యూల్ అప్డేట్" అనే సబ్జెక్ట్ లైన్తో విరాజ్ ఇన్బాక్స్కు ఇమెయిల్ వచ్చింది.

వచ్చిందేమో సర్, నేను లీవ్ లో ఉన్నానని చూడలేదు. ఏమైంది సర్?

రేపు ఎర్లీ మార్నింగ్ ఫాల్కన్లు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. గ్రీన్ కార్పెట్లను మళ్లీ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. 12 ఎక్స్ట్రా రగ్స్ ఆర్డర్ చేయండి. ఎక్స్ట్రా కాపీస్, బ్లూ కలర్ సీల్ ఉన్నవి తీసుకురావాలని గుర్తుంచుకోండి. కాంటాక్ట్, ఓల్డ్ సుక్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. 09:00 గంటలకు ఈ మీటింగ్ జరగనుంది. ఇమెయిల్ లో స్ప్రెడ్ షీట్ అటాచ్ మెంట్ ఉంది.

నాకు అర్ధం కాలేదు సర్.

మనీ ట్రాన్స్ఫర్, మనీ లాండరింగ్, పాస్స్పోర్ట్స్, వీసాలను చట్టవిరుద్ధంగా ప్రాసెస్ చేయడం, ఫోర్జరీ. స్ప్రెడ్ షీట్ అటాచ్ మెంట్ను క్లోజ్ గా ఇన్స్పెక్ట చేసిన తర్వాత, వీసా అప్లికేషన్ నంబర్స్ అని తెలిసింది.

దీనికి నాకు ఏ సంబంధం లేదు, సర్.

నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. ఆ మనీ ఎక్కడుందో నువ్వే చెప్పాలి. ఇప్పుడు చెప్తేనైనా ఇండియా కి పంపిస్తారు, లేకపోతే ఇలాగే ఇక్కడ జైల్లో జీవితాన్ని గడుపుతావు.

నిజంగా నాకు ఏది తెలీదు సర్. నేను చెప్పేది మీరు అసలు వినిపించుకోవాట్లేదని అర్థమైంది. దయచేసి నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి. కచ్చితంగా నేను నిర్దోషినని ప్రూవ్ చేసుకుంటాను.

టైం ఇస్తే ప్రూవ్ చేసుకుంటావా? ఇంత డ్రామా ఆడిన నీకు అది ఎంత. నువ్ ఎందుకు చేసావో ఎలా చేసావో మాకు అవసరం లేదు. ఇప్పుడు మనీ ఎక్కడుందో అదొక్కటి చెప్పు.

ప్లీజ్ సర్, ప్లీజ్. నాకు ఛాన్స్ ఇవ్వండి నన్ను ఇరికించినవాళ్ళని బయటపెట్టి ఆ డబ్బు ఎక్కడుందో వాళ్ళతోనే చెప్పిస్తాను.

(రాబిన్ పక్కకి రమ్మని సైగ చేస్తాడు)

సర్, విరాజ్ నిజమే చెప్తున్నాడేమో. కొంచెం టైం ఇచ్చి చూద్దాము. తను రీసెంట్ గానే జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇంత పెద్ద స్కాం తనొక్కడే చేసి ఉంటాడని నేనైతే అనుకోవడంలేదు. తన వెనక ఎవరైనా ఉన్నారేమో. మేకని ఎరా వేస్తేనేగా పులి చిక్కేది.

నువ్ చెప్పింది కరెక్ట్ అనే అనిపిస్తుంది, రాబిన్.

(విరాజ్ దెగ్గరికి వస్తారు)

సరే నీకు ఒక వారం టైం ఇస్తున్నాం. ఈ వారంలో నువ్వు చెప్పింది చేయకపోతే ముందు చెప్పినట్టుగా జైల్లోనే నువ్వు.

థాంక్యూ సర్.

(విరాజ్ ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఇంట్లో ఉండొచ్చు కానీ కార్ అల్లౌ లేదు. బస్సు లో ఇంటికి వెళ్తుంటే ఇద్దరు ఆఫీసర్స్ విరాజ్ ని ఫాలో అవుతుంటారు. విరాజ్ ఇంటికి చేరుకుంటాడు. నసీమ కాల్ చేస్తుంది)

హలో విరాజ్, పల్లవికి డ్రెస్ నచ్చిందా? వెళ్ళాక కాల్ చేస్తావనుకున్నాను కానీ చేయలేదేంటి?

చాలా నచ్చింది నసీమ. నేను ఇప్పుడు లెబనాన్ లోనే ఉన్నాను.

ఏంటి విరాజ్ వాయిస్ అలా ఉంది? అయినా లెబనాన్ ఏంటి, నువ్వు ఇండియాకి వెళ్ళావు కదా.

(జరిగినదంతా విరాజ్, నసీమకి చెప్తాడు)

ఎలా వాళ్ళని పట్టుకుంటావ్ విరాజ్?

నాకు తెలీదు నసీమ, కానీ ఏదోకటి చేయాలి. ముందు నేను ఆలోచించాలి. నేను జాయిన్ అయ్యిన దెగ్గరనుంచి ఇప్పటి వరకు నా చుట్టూ ఏమేమి జరిగాయో వాటన్నిటిని ఒక చోట రాసుకుని చూడాలి. అప్పుడు ఏదోక హింట్ దొరకొచ్చేమో.

నీకేం హెల్ప్ కావాలన్న నన్ను అడుగు విరాజ్. నేను ఉన్నాను.

థాంక్యూ నసీమ.

(విరాజ్ ఫోన్ ని టాప్ చేస్తూవుంటారు. విరాజ్ జరిగినవన్నీ ఒక పేపర్లో వేసుకుని అనలైజ్ చేస్తాడు. దాంట్లో ముందుగా పాస్పోర్ట్ పోయింది అని వచ్చిన అప్లికేన్ట్ను చూస్తాడు)

ఇతని పేరు ముహమ్మద్ అలీ. ఆరోజు అతను, ఆయన వైఫ్ ఇండియా వెళ్లారు. ఈయన టెంపరరీ పాస్పోర్ట్ మీద వెళ్లారు, వాలిడిటీ పది రోజులు మాత్రమే కానీ అది దాటిపోయినా ఇంకా లెబనాన్ రాలేదేంటి?

(విరాజ్ అతనికి కాల్ చేస్తాడు, కాల్ లిఫ్ట్ చేయలేదు. మల్లి ట్రై చేస్తాడు, స్విచెడ్ ఆఫ్ అని వస్తుంది. అతని వైఫ్ నెంబర్ కి కాల్ చేసిన పని చేయదు)

ఏంటి ఎవరు కాల్ లిఫ్ట్ చేయట్లేదు.

(షణ్ముఖ్ కి కాల్ చేస్తాడు)

ఏమైంది విరాజ్, అంత ఓకేనా?

కాదురా మొత్తం నాశనమైపోయింది. ముందు నాకు హెల్ప్ చేయవా. నేను నీకు రెండు నంబర్స్ పంపిస్తాను, వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుని చెప్పవ.

సరే విరాజ్. నాకు రెండు గంటలు టైం ఇవ్వు.

(రెండు గంటల తర్వాత షణ్ముఖ్ కాల్ చేస్తాడు)

విరాజ్, నువ్ ఇచ్చిన నంబర్స్ ముహమ్మద్ అలీ, అతని వైఫ్ ఎమిబాయివి. వాళ్ళు దుబాయ్ లో ఉన్నారు. వారు లెబనాన్ నుంచి ఇండియా వచ్చిన ఒక వారం ముందు, కేమన్ ఐలాండ్స్ ఆఫ్ షోర్ అకౌంట్ లో కి పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు.

(పాస్పోర్ట్ పోయిందని వచ్చిన రోజు, అలీ సబ్మిట్ చేసిన డాకుమెంట్స్ చూస్తాడు. అలీ చదువుకుంది అనాథ శిశు నివాస్, బెంగళూరులో, తండ్రి జార్జ్, తల్లి మేరీ. ఆధార్ కార్డు లో అడ్రస్, ఇందిరానగర్, బెంగళూరు అని ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రస్ ఆశ్రఫీహ్, బెయ్రుట్)

షణ్ముఖ్, ఈ అలీ అనాథా?

అవును విరాజ్. జార్జ్, మేరీ, అలీకి పదిహేనేళ్ల వయసున్నప్పుడు అడాప్ట్ చేసుకున్నారు. ఎమిబాయి వాళ్ళ కుటుంబం చాలా పెద్దది.

మరి అలీ వాళ్ళ నాన్న జార్జ్ బ్రతికే ఉన్నారా?

రీసెంట్ గానే అతను హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. వాళ్ళ అమ్మ మేరీ బ్రతికే ఉన్నారు.

మేరీ ఫోన్ నెంబర్ ఉందా?

ఉంది విరాజ్.

(ఆ ఫోన్ నెంబర్ నోట్ చేసుకుని, మేరీ కి ఫోన్ చేద్దాము అనుకుంటాడు. కానీ ఎలా మాట్లాడాలో తెలియలేదు. నసీమకి చెప్పి తనని ఫోన్ చేయమని, జార్జ్ చనిపోయిన రోజు, అలీ అక్కడికి వచ్చాడో రాలేదో కనుక్కోమంటాడు. నసీమ కనుక్కుని విరాజ్ కి చెప్తుంది)

ఎం జరిగింది నసీమ?

ఆరోజు, అలీ అక్కడకి రాలేదంట విరాజ్. ఆవిడ చాలా బాధపడుతున్నారు. అలీకి ఏమైందో అని కంగారుపడుతున్నారు.

(మల్లి షణ్ముఖ్ కి కాల్ చేస్తాడు)

షణ్ముఖ్, అలీ ఏ రోజు లెబనాన్ నుండి ఇండియా కి వచ్చాడు? ఏ రోజు ఇండియా నుంచి దుబాయ్ కి వెళ్ళాడు? ఏ రోజు జార్జ్ చనిపోయాడు?

అలీ ఇండియా వచ్చింది జనవరి 4 . దుబాయ్ కి వెళ్ళింది జనవరి 18 . జార్జ్ చనిపోయింది జనవరి 11 .

అదేంటి, నా దెగ్గరికి పాస్పోర్ట్ కోసం అలీ వచ్చింది జనవరి 21 . ఒకసారి, అలీ ఫోటో పంపించు షణ్ముఖ్.

(షణ్ముఖ్ పంపించిన ఫోటో, విరాజ్ దెగ్గరకు వచ్చిన అలీ ఒకరు కాదు. డాకుమెంట్స్ లో డీటెయిల్స్ కరెక్ట్ గానే ఉన్నాయ్ కానీ మనుషులు వేరు)

షణ్ముఖ్, ఎవరు నిజమైన అలీ? జనవరి 11న అలీ ఎక్కడున్నాడు?

నేను ఫోటో బట్టి ట్రాక్ చేయలేను విరాజ్, నెంబర్ కి టాగ్ అయినా వాటినే చెప్పగలను. నేను పెట్టిన ఫోటోనే నువ్ ఇచ్చిన నెంబర్ కి మ్యాచ్ అవుతుంది. జనవరి 11 ,సెల్ ఫోన్ లొకేషన్ బట్టి ఇందిరా నగర్ బెంగళూరు అంటే వాళ్ళ ఇంటి దెగ్గరే ఉన్నట్టు చూపిస్తుంది.

మరి మేరీ, నసీమ తో అలీ అక్కడకి రాలేదని ఎందుకు చెప్పింది? షణ్ముఖ్, ఒకసారి నువ్వు ఫోటో చూపించు అడుగు మేరీని అలీ గురించి.

(తర్వాత రోజు షణ్ముఖ్ కాల్ చేస్తాడు)

మేరీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, తను ఇంట్లో కూడా లేదు విరాజ్. తన లాస్ట్ కాల్ నసీమతోనే ఉంది.

(విరాజ్, నసీమ కి కాల్ చేస్తాడు. నసీమ మాట్లాడదు, ఎవరో ఒక ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేసి)

ఈవిడకి ఆక్సిడెంట్ అయ్యింది. సెయింట్ జార్జ్ హాస్పిటల్ లో ఉన్నారు.

(వెంటనే విరాజ్ హాస్పిటల్ కి వెళ్తాడు)

నసీమ కి ఎలా ఉంది?

చాలా బ్లడ్ లాస్ అయ్యింది. కుడి చేతికి పెద్ద గాయం అయ్యింది, దాన్ని తీసేయాల్సి రావొచ్చు. ప్రాణానికి ప్రమాదమయ్యే అవకాశం ఎక్కువ ఉంది. తన కోసం ఎవరు రాలేదు. మీరు ఏమవుతారు?

లెబనాన్ లో నాకు తెలిసిన వ్యక్తి నసీమ మాత్రమే. ఒకసారి తనతో మాట్లాడొచ్చా?

మాట్లాడండి. కానీ ఎక్కువ స్ట్రెస్ చేయకండి.

(విరాజ్, నసీమ దెగ్గరకు వెళ్తాడు)

ఏమైంది నసీమ? నువ్వు ధైర్యంగా ఉండు.

నేను బ్రతకనేమో విరాజ్. సనకి ఏమవుతుందో అనే నాకు భయమేస్తుంది.

ఎందుకు అలా అంటున్నావు నసీమ? మీ ఫామిలీ మెంబెర్స్ గురించి చెప్పు, నేను పిలిపిస్తాను.

నాకు ఎవరు లేరు విరాజ్. మా అమ్మ, నాన్న యుద్ధంలో చనిపోయారు. మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మా మావయ్య రెహమాన్. మమ్మల్ని పెంచింది కూడా ఆయనే. ఆయన కొడుకే మా బావ, అక్క ముంతాజ్ని పెళ్లి చేసుకుంది. మావయ్య ఆరోగ్యం క్షీణించడంతో, పోయిన సంవత్సరమే చనిపోయారు.

నేనున్నాను నసీమ. నువ్వు బాధపడకు. సన ఎక్కడుంది ఇప్పుడు?

సన, ఇంట్లోనే ఉంది. నాకేమైనా అయితే సనని ఎవరు చూసుకుంటారు?

నీకేమి అవ్వదు నసీమ. నేను వెళ్లి సనని తీసుకొస్తాను.

(విరాజ్ బయటికొచ్చి, సనకి ఇమ్మీడియేట్ గ ట్రీట్మెంట్ మొదలు పెట్టమని చెప్తాడు. తన దెగ్గరున్న డబ్బంతా మెడిసిన్స్ కి ఖర్చుపెడతాడు. ఆపరేషన్ కి ఇంకా డబ్బు కావాల్సి వస్తుంది. ఇంటికి కాల్ చేస్తాడు)

నాన్న, నసీమకి ఆక్సిడెంట్ అయ్యింది. ప్రాణాపాయ స్థితి లో ఉంది. తనకి ఎవరు లేరు. అర్జెంటుగా నాకు ఒక ఐదు లక్షలు పంపించండి.

తనకోసం నువ్వు ఎందుకు ఇంత చేస్తున్నావు విరాజ్?

సాటి మనిషి ప్రాణంపోతుంటే, ఎందుకు అని ప్రశ్నిస్తారేంటి నాన్న?

సరే విరాజ్ పంపిస్తున్నాను.

(మొత్తం డబ్బు కట్టేస్తాడు. సనని హాస్పిటల్ కి తీసుకొస్తాడు. వచ్చి చూసేసరికి అక్కడ నసీమ ఉండదు. అంతక ముందున్న డాక్టర్స్ అక్కడ ఉండరు. డబ్బులు పే చేయించుకున్న, డాకుమెంట్స్ మీద సైన్ చేయించుకున్న ఒకతను ఉంటాడు)

సర్, నసీమ ఎక్కడుంది?

ఎవరు ఆవిడ?

అదేంటి సర్, ట్రీట్మెంట్ కోసం మనీ కట్టించుకున్నారు కదా. డాకుమెంట్స్ మీద కూడా సైన్ చేసాను.

అవును, మీరు సైన్ చేశారు. అది మీరు సనని అడాప్ట్ చేసుకుంటున్నట్టు డాకుమెంట్స్ సైన్ చేశారు. ఇప్పటి వరకు సనని చూసుకున్నందుకు మీరు ఈ హాస్పిటల్ కి పే చేయాల్సిన బిల్ అది.

సన, హాస్పిటల్ లో ఉందా? అసలు సన కి ఏమైంది?

అదే కార్ ఆక్సిడెంట్ లో సన వాళ్ళ అమ్మ,నాన్న చనిపోయారు. కానీ సన బ్రతికింది. తన బ్రెయిన్లో ఆ సంఘటన చాలా లోతుగా దాగుంది. డిప్రెషన్ లో కి వెళ్ళింది. ఎవ్వరితో మాట్లాడేది కాదు. మెదడు సమస్య కారణంగా స్పెషల్ కేసు గా తీసుకుని మా హాస్పిటల్ వాళ్ళే వైద్యం చేస్తున్నారు. తన గురించి చెప్పి ఎవరైనా వచ్చి తనని తీసుకెళ్తారేమో అని మా హాస్పిటల్ వాళ్ళు చాలా మందిని అడిగారు. ఆఖరికి ఈరోజు మీరు వచ్చారు. అయినా ఇవన్నీ తెలుసుకోకుండానే మీరు డబ్బులు కట్టి, డాకుమెంట్స్ మీద సైన్ చేశారా?

(ఇదంతా విన్నాక అసలు విరాజ్ కి ఎం చెప్పాలో అర్ధం కాలేదు. నసీమ ఫోన్ కి కాల్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది. షణ్ముఖ్ కి కాల్ చేసి నసీమ ఫోన్ ట్రాక్ చేయమని చెప్తాడు. సనని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు)

సన, నసీమ ఎవరు? తనకు నీకు ఏంటి సంబంధం?

ఎవరో నాకు తెలీదు. ఆరోజు నువ్వేగా నన్ను తనతో పంపించావు. అదే నేను మొదటి సారి తనని చూడటం.

మరి ఆరోజే ఎందుకు నాకు చెప్పలేదు?

నాకు తెలీదుగా. అమ్మ, నాన్నలు తప్పిపోయారని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. తనతో వెళ్తే దొరుకుతారేమో అనుకున్నాను.

ఇన్ని రోజులు తనతో పాటే ఉన్నావా?

లేదు. ఆరోజే నన్ను హాస్పిటల్లో దింపేసింది. మల్లి ఈరోజు తన ఇంటికి తీసుకెళ్లి, అమ్మ, నాన్న వస్తున్నారు ఇక్కడే ఉండు అని అనింది. కానీ ఎవరు రాలేదు. నువ్వే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళావు.

(షణ్ముఖ్ కాల్ చేస్తాడు)

నువ్వు ఇచ్చిన నెంబర్, లాస్ట్ ఆ హాస్పిటల్ లో నే ఆన్ అయ్యి ఉంది. తర్వాత స్విచెడ్ ఆఫ్. నేను ట్రాక్ చేయలేను విరాజ్.

(అక్కడ డాకుమెంట్స్ చూసి సన)

నాన్న ఫోటో ఇక్కడ ఉందేంటి? నాన్న ఇక్కడున్నారా?

సన, మొహమ్మద్ అలీ మీ నాన్న?

ఈ ఫోటో లో ఉన్నదీ నాన్నే.

నాన్న ఫోన్ నెంబర్ తెలుసా?

హా తెలుసు. నేను ఎప్పుడైనా తప్పిపోతే ఆ నెంబర్ కి కాల్ చేయమని చెప్పాడు. నేను ఎవ్వరికి చెప్పిన పట్టించుకోలేదు. నాన్న తిరిగి రారు అని అన్నారు.

(అని సన ఫోన్ నెంబర్ చెప్తుంది. ఆ నెంబర్ ని ట్రాక్ చేయమని షణ్ముఖ్ కి చెప్తాడు)

అసలు ఎం జరిగింది సన, ఏమైనా గుర్తుందా?

నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. కానీ ఒకరోజు కొంతమంది ఇంటికి వచ్చారు. నాన్నని ఏదో అడిగారు, దానికి నాన్న ఒప్పుకోలేదు. నాన్నని కొట్టారు. అమ్మ ఏడిచింది. ఆరోజు రాత్రి ఇప్పుడే వస్తామని చెప్పి అమ్మ,నాన్న వెళ్లారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఎవరో నన్ను కారులో తీసుకెళ్తున్నప్పుడు ఆక్సిడెంట్ అయ్యింది. ఆ తర్వాత నుంచి నన్ను ఒక హాస్పిటల్ లో ఉంచారు.

అయితే ఆ కార్ లో ఉంది మీ అమ్మ, నాన్న కాదా?

కాదు. అస్సలు కాదు.

(షణ్ముఖ్ కాల్ చేస్తాడు)

విరాజ్, నువ్ చెప్పావ్ కదా 21 జనవరి అలీ వచ్చాడని నీ దెగ్గరికి. అదే నెంబర్ ఇది. ఆరోజు ఎంబసీ దెగ్గర ఉంది ఈ ఆలీనే. ఇతని పేరు మొహమ్మద్ అలీ. లాస్ట్ గా లొకేషన్ ఎయిర్పోర్ట్ దెగ్గరే చూపించింది. ఇప్పుడు ఆ ఫోన్ ఆన్ లో లేదు.

అతని కాంటాక్ట్స్ చూడు. తన వైఫ్ నెంబర్ ఏమైనా ఉందా?

ఉంది. అది ట్రాక్ చేసాను. అది కూడా ఆరోజు ఎయిర్పోర్ట్ దెగ్గర ఆఫ్ అయిపోయింది.

కాల్ లిస్ట్ లో అన్ఉజ్వల్ గా ఏమైనా ఉందా ఎక్కువ కాల్స్ ఒకే నెంబర్ నుంచి రావడంలా?

లేదు విరాజ్.

లాస్ట్ కాల్ ఏంటి?

విరాజ్ అది ఎవరిదో కాదు. నువ్వు ఇచ్చిన నసీమ ఫోన్ నెంబర్.

నసీమ నా? నేను మల్లి కాల్ చేస్తాను షణ్ముఖ్.

(సన ఏడుస్తూ ఉంటుంది)

ఏమైంది సన?

అమ్మ, నాన్న తిరిగి రారా?

వస్తారు సన. వాళ్ళ దెగ్గరికి నిన్ను చేర్చే బాధ్యత నాది.

కచ్చితంగానా?

నేను మాట ఇస్తున్నాను. కచ్చితంగా, మీ అమ్మ, నాన్న దెగ్గరకు తీసుకెళ్తాను.

(విరాజ్ మనసులో)

నేను ఏమి చేయాలి ఇప్పుడు. నాకేమి అర్ధం కావడంలేదు. నేను నమ్మిన నసీమ నన్ను మోసం చేసిందా? అసలు ఆ డబ్బు మొహమ్మద్ అలీ అనే పేరుతో ఉన్న అకౌంట్ లో పడింది. ఆ మొహమ్మద్ అలీ, సన వాళ్ళ డాడీ కాదు. అసలు ఈ మొహమ్మద్ అలీ ఎవరు? ఇతనికి వాళ్లకి ఉన్న సంబంధం ఏంటి? సనని ఎందుకు నా దెగ్గరకు పంపించారు? నన్నెందుకు దీంట్లో ఇరికించారు? ఎలా నేను సనని తన పేరెంట్స్ దెగ్గరకు చేర్చగలను?

(ఇదంతా ఫాలో చేస్తున్న పోలీసులకి విరాజ్ ఏ ఇదంతా సృష్టిస్తున్నట్టనిపిస్తుంది. ఇంకా ఐదు రోజులు మాత్రమే మిగులున్నాయి. రోజు రోజుకి విరాజ్ మీద అనుమానం దృఢం అవుతూ వస్తుంది. షణ్ముఖ్ కి కాల్ చేసి అలీ చదువుకున్న అనాధ శిశు నివాస్ కి వెళ్లి అలీ గురించి అడగమని చెప్తాడు. తర్వాత రోజు షణ్ముఖ్ అక్కడకి వెళ్తాడు. మేరీ అనే ఆవిడని కలుస్తాడు)

మీకు అలీ అనే అబ్బాయి గుర్తున్నాడా?

చాలా ఏళ్ళు అయిపోయింది నాకు సరిగ్గా గుర్తులేదు.

పాత రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా?

కొన్నేళ్ల క్రితం ఒక ఫైర్ ఆక్సిడెంట్ జరిగింది, అప్పుడు పాత రికార్డ్స్ అన్ని కాలిపోయాయి. ఒక్క ఫోటో ఉండాలి. ఓ పాప పుట్టినరోజు ఇక్కడ జరుపుకున్నపుడు తీసింది. ఇదిగో ఆ ఫోటో.

(ఇదంతా షణ్ముఖ్, విరాజ్ కి చెప్తాడు. ఆ ఫోటోని కూడా పంపిస్తాడు. నసీమ ఆక్సిడెంట్ గురించి తెలుసుకుందాం అని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అక్కడ కరీంకు జరిగినదంతా చెప్తాడు)

అసలు ఆక్సిడెంట్ జరిగిందో లేదో అని సిసి కెమెరాస్ లో చూద్దాము.

(నసీమని ఒక కార్ గుద్దేసి వెళ్ళిపోవటం కనిపిస్తుంది. ఆ కార్ లైసెన్స్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని ట్రేస్ చేయమని చెప్తాడు)

సర్ ఈ కార్ మిస్సింగ్ అని ఒకతను కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ కార్ మన స్టేషన్ లోనే ఉంది.

అది ఎవరు తీసుకెళ్లారో మనం చెప్పలేం విరాజ్. కానీ ఆక్సిడెంట్ అయితే కావాలనే చేసినట్టనిపిస్తుంది.

(ఇంతలో పోలీస్ స్టేషన్ కి ఒక జర్నలిస్ట్ వస్తుంది)

సర్ నా పేరు రజియా. నేనొక జర్నలిస్ట్ ని. సిరీస్ అఫ్ హై ప్రొఫైల్ మిస్సింగ్ కేసెస్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. వీళ్ళు ఎక్కువ శాతం బిజినెస్ చేసే వాళ్ళే ఉన్నారు. ఏ ఆధారం లేకుండా వాళ్ళు కనిపించకుండా పోయారు.

సర్ ఇది అలీ మిస్సింగ్ కి రిలేటెడ్ గా ఉంది.

అవును విరాజ్. రజియా ఇతను విరాజ్. అలీ అనే ఒక బిజినెస్ మాన్ కోసం వెతుకుతున్నాడు.

(రజియా,విరాజ్ తమకి తెలిసిన వాటి గురించి షేర్ చేసుకుంటుంటారు. తర్వాత రోజు కరీం ఇద్దరినీ స్టేషన్ కి రమ్మని చెప్తాడు.నసీమ ఆక్సిడెంట్ వెనకాల ఒక లోకల్ పర్సన్ హస్తం ఉందని తెలుస్తుంది. అతని పేరు ఒమర్ ఖాన్. అతని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అతని దెగ్గర ఇంతకముందు పని చేసిన వ్యక్తి ఒక సీక్రెట్ వేర్హౌస్ గురించి చెప్తాడు. అక్కడికి వెళ్తారు. లెడ్జెర్ బుక్స్, బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్స్, ఫేక్ పాస్స్పోర్ట్స్ ఉంటాయి. అక్కడ ట్రావెలింగ్ లిస్ట్ లో ఒక పేరు కనపడుతుంది. ముంతాజ్)

విరాజ్, నసీమ అక్క పేరు ముంతాజ్ అని చెప్పావు కదా.

అవును. ఈరోజు ఫ్లైట్ ఏ, బెయ్రుట్ టూ జురిచ్.

(విరాజ్, ఇంటికి వెళ్తాడు)

నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అమ్మ, నాన్న దెగ్గరికి?

నేను వేరే ఊరికి వెళ్తున్నాను, అక్కడ కచ్చితంగా నీ పేరెంట్స్ గురించి తెలుస్తుందని నాకు గట్టిగ అనిపిస్తుంది. సన, నువ్వు బ్రేవ్ గర్ల్ వి కదా. నువ్వు జాగ్రత్తగా ఉండు.

సన ఇస్ ఏ బ్రేవ్ గర్ల్.

(కరీం, విరాజ్, రజియా కలిసి జురిచ్ కి వెళ్తారు. ముంతాజ్ గురించి కనుక్కోమని కరీం తన ఫ్రెండ్ కి చెప్తాడు. అతను ఆర్ట్ గేలరీ కి రమ్మంటాడు. అక్కడకి వెళ్తారు)

కరీం, నువ్ చెప్పిన ముంతాజ్ అసలు ఆ ఫ్లైట్ లో రాలేదు. అసలు ముంతాజ్ ఎవరో తెలుసా? మోహముద్దలాహ్ కూతురు. అతను చాలా పెద్ద బిజినెస్ మాన్. ఎన్నో వేల కోట్లకు తను వారసురాలు. అయినా మీరు చెప్పిన ఫేక్ పాస్పోర్ట్ తో తనకి ఇక్కడికి రావాల్సిన పనేముంటుంది? అక్కడున్న ఫోటో అండ్ డీటెయిల్స్ అన్ని మిమ్మల్ని తప్పు దారి పట్టించేందుకు పెట్టారనిపిస్తుంది.

(విరాజ్ కి అక్కడ ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. దాంట్లో ఒక అమ్మాయి వుడెన్ బర్డ్ ని పట్టుకుని ఉంటుంది)

ఇది నాకు చూసినట్టనిపిస్తుంది.

(అని విరాజ్, షణ్ముఖ్ పెట్టిన ఫోటోని తీసి చూస్తాడు. అలీ పక్కన ఒక అమ్మాయి అదే డ్రెస్ కలర్ తో, అలాగే ఒక వుడెన్ బర్డ్ ని పట్టుకుని ఉంటుంది)

ఈ ఆర్టిస్టు కి, అలీ తెలిసిన వారై ఉంటాడా?

(అప్పుడే షణ్ముఖ్ కాల్ చేస్తాడు)

విరాజ్, ఎమిబాయి నెంబర్ ఇప్పుడు ఆన్ లో కి వచ్చింది. కానీ తన లొకేషన్ ట్రాక్ చేయాలంటే ఒక ఐదు నిమిషాలు తనతో మాట్లాడుతూ ఉండు.

సరే షణ్ముఖ్, నేను ఇప్పుడే కాల్ చేస్తాను.

(విరాజ్ ఆ నెంబర్ కి కాల్ చేస్తాడు. రింగ్ అవుతూనే ఉంది లాస్ట్ రింగ్ కి కాల్ లిఫ్ట్ అవుతుంది)

హలో?

హలో ఎమిబాయి గారు. నేను విరాజ్, సన నా దెగ్గరే ఉంది.

సన ని జాగ్రత్తగా చూసుకోండి. తన ప్రాణానికి ప్రమాదం ఉంది.

మీరు ఎక్కడున్నారు? అలీ గారు ఎక్కడున్నారు?

నేను ఒక చీకటి గదిలో ఉన్నాను. అలీ లేడు. అతన్ని తీసుకెళ్లిపోయారు.

నాకు అర్ధమవుతుంది ఎమిబాయి గారు. మీరు బయపడకండి. ఆరోజు అసలు ఎం జరిగింది?

వాళ్ళు.. వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అలీతో ఏదో బిజినెస్ ఉందన్నారు. ఆయన్ని కొట్టారు. తర్వాత ఆయన నాతో ఎక్కడికో వెళ్లాలన్నారు. అప్పుడు మధ్యలో వాళ్ళు వచ్చి అలీని తీసుకెళ్లిపోయారు. నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు.

వాళ్ళు ఎలా ఉన్నారు? ఏమైనా మాట్లాడారా?

వాళ్ళు వేరే ఏదో భాషలో మాట్లాడారు. నాకు ఏమి అర్ధం కాలేదు. కానీ ఏదో అప్పు, చాలా పెద్ద మొత్తంలో డబ్బు అని వినిపించింది.

అప్పా? మీకేమైనా తెలుసా ఆ అప్పు గురించి? అలీ గారు ఏమైనా అప్పు చేశారా?

లేదు లేదు. అతను ఏ అప్పు చేయలేదు. అతను నిజాయితీ పరుడు.

(ఇది కరీం కి చెప్తాడు. అలీ బ్యాంకు స్టేట్మెంట్స్ అన్ని చెక్ చేస్తారు. అంతా బాగానే ఉంటుంది)

మీకు జురిచ్, ఒక అమ్మాయి వుడెన్ బర్డ్ని పట్టుకుని ఉన్న పెయింటింగ్ గురించి తెలుసా?

హా తెలుసు. అలీ తన చిన్ననాటి విషయాలు చెప్పేవాడు. ఒక అమ్మాయి గురించి చెప్పాడు. అతని చిన్నప్పటి ఫ్రెండ్. తన పేరు..ముంతాజ్.

(సడన్ గా ఫోన్ కట్ అయిపోయింది. మల్లి కాల్ చేస్తుంటే స్విచెడ్ ఆఫ్ అని వస్తుంది. ఆవిడ ఎక్కడుందో కనుక్కోలేకపోతారు)

ఫ్లైట్ లిస్ట్ లో, పెయింటింగ్ లో అమ్మాయి, అలీ చిన్నప్పటి ఫ్రెండ్..ముంతాజ్. ఈ పెయింటింగ్... ఇక్కడి ఆర్టిస్ట్ ఎవరో కనుక్కుందాం కరీం.

(వాళ్ళు ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకుడిని కలుసుకున్నారు)

ఈ పెయింటింగ్ ఎవరు వేశారు? వాళ్ళ గురించి డీటైల్స్ ఇవ్వగలరా?

ఫాతిమా గారు వేశారు. కానీ ఆమె చాలా రోజులుగా ఇక్కడికి రావట్లేదు. కొన్ని నెలలుగా ఆర్ట్ వర్క్ పంపడం ఆపేశారు. గోవాలో ఒక ఫార్మ్ హౌస్ ఉంది అని చెప్పారు. అక్కడే ఉంటున్నారేమో.

(ఇది షణ్ముఖ్ కి చెప్పి కనుక్కోమంటాడు.తర్వాత రోజు షణ్ముఖ్ అక్కడకి వెళ్తాడు)

ఫాతిమా గారు, మీ పెయింటింగ్ గురించి నాకు కొన్ని ప్రశ్నలున్నాయి. మీరు వుడెన్ బర్డ్ పట్టుకున్న ఒక అమ్మాయి చిత్రం వేశారు. ఆ అమ్మాయి ఎవరు?

తన పేరు ముంతాజ్. నాకు చాలా ఇష్టమైన బెస్ట్ ఫ్రెండ్.

మరి ఆమె ఇప్పుడు ఎక్కడుంది? మీకేమైనా తెలుసా?

మీరు ఎందుకు అడుగుతున్నారు? అయినా ఇప్పుడు తను నాతో మాట్లాడట్లేదు.

నేనేదో ఊరికే అడిగానండి. మీరు మాట్లాడుకోపోవడానికి ఏదైనా కారణం ఉందా?

ముంతాజ్ ఎప్పుడూ తనకు నచ్చిందే చేస్తుంది. కానీ కొంతకాలంగా ముం..

(ఫాతిమా ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. అది చూసిన తర్వాత)

క్షమించండి, నేను ఎక్కువగా మాట్లాడలేను. దీని గురించి వదిలేయండి.

సరే ఫాతిమా గారు, మిమ్మల్ని కలవడం చాలా గొప్పగా ఉంది.

(జరిగినదంతా షణ్ముఖ్, విరాజ్ కి చెప్తాడు)

ఆమె చెప్పడం ఆపే ముందు ఏదో చెప్పబోయినట్టు ఉంది, విరాజ్.

(రజియా, విరాజ్, కరీం లెబనాన్ కి తిరిగి వస్తారు. ఆ రాత్రి విరాజ్ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది)

ఫాతిమా ఏమైనా చెప్పిందా? వెంటనే అల్ హలాబి రెస్టారంట్ కి రా. మీరు ప్రమాదంలో ఉన్నారు.

(అది నసీమ నెంబర్ నుండి వచ్చిన మెసేజ్)

నసీమ నన్ను కాంటాక్ట్ చేస్తుందేంటి? నన్ను మోసం చేసిందనుకున్నాను. ఇప్పుడు నాకు హెల్ప్ చేస్తుందా?

(ఎవ్వరికి చెప్పకుండా విరాజ్ అక్కడికి వెళ్తాడు)

నసీమ, నువ్వు నిజంగా నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నావా? లేక ఇది కూడా ఒక మోసమేనా?

విరాజ్, నన్ను ఒకసారి నమ్ము. నా మీద అసలు నమ్మకం లేకపోతే ఈ మెసేజ్ చూసి ఇంత దూరం వచ్చేవాడివి కాదు.

నిన్ను నేను చాలా నమ్మాను నసీమ. ఇక్కడి దాకా వచ్చింది ఆ నమ్మకంతో కాదు. నాకు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. నువ్వు నన్ను ప్రమాదంలో పడేయాలనుకుంటున్నావో బయట పడేయాలనుకుంటున్నావో నాకు తెలీదు. నాకు ఏదైనా తెలియజేయాలనుకుంటే, నేరుగా చెప్పు. ఇలా చుట్టూ మలుపులు తిరగడం ఇక వద్దు.

సరే విరాజ్ నీకు మొత్తం చెప్తాను. ముంతాజ్ నా అక్క. మా నాన్న మోహముద్దలాహ్ . మీ అందరికి తెలిసినట్టు అతను ఒక బిజినెస్ మాన్ కానీ మనీ లాండరింగ్, పాస్స్పోర్ట్స్, వీసాలను చట్టవిరుద్ధంగా ప్రాసెస్ చేయడం, ఫోర్జరీ ఇవి అసలైన వ్యాపారాలు.

అయితే నన్ను దీంట్లో ఇరికించింది మీ నాన్నేగా?

అవును.

నీకు అది తెలిసి కూడా, నీకేం హెల్ప్ కావాలన్న నన్ను అడుగు విరాజ్. నేను ఉన్నాను అని అంటావా.

నేను చెప్పేది విను విరాజ్. అసలు జరిగిందేంటంటే, అక్క కి అలీ అంటే ఇష్టం. ఎప్పుడు అలీని చూడాలని అంటూ ఉండేది. ఎప్పుడైతే అలీని అడాప్ట్ చేసుకున్నారో, అక్కకి అలీ దూరం అయ్యాడు. అప్పటి నుంచి అక్క ఇష్టం పిచ్చిలా మారింది. ఆ పిచ్చి ప్రేమనింది. కానీ తన ప్రేమను అలీకి చెప్పలేదు. అలీ, ఎమిబాయిని పెళ్లి చేసుకున్నాడు. అక్క మాత్రం తన మనసులో అలీని తుదపలేకపోయింది. వాళ్ళిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది, తనే సన.

అయితే ఇప్పుడేంటి నసీమ? అదంతా అయిపోయింది కదా. ముంతాజ్ కి ఏమైనా అయ్యిందా?

ఇప్పుడే అంత మొదలైంది. అక్క ఎప్పుడు, అలీకి నేనంటే ఇష్టం, తనే నాకు ముందు చెప్తాడు అని చెప్తూవుండేది. పెళ్లి అయిపోయాక కూడా ఇష్టం లేకుండా చేసుకున్నాడేమో అని అనింది. ఇప్పుడు పాప పుట్టాక, తను అనుకున్నది అంత అబద్దం అని, నేను చచ్చిపోతాను అని ఎన్నో పిచ్చి ప్రయత్నాలు చేసింది. ఇది నాన్నకి తెలిసింది. ఎలాగైనా ముంతాజ్ ను సంతోషపెట్టాలని నాన్నే అలీని కలిశారు.

(మోహముద్దలాహ్, అలీకి ఇదంతా చెప్పాక)

సర్, నాకు ముంతాజ్ అంటే ఇష్టం అది ఫ్రెండ్ లాగ మాత్రమే. ఇప్పుడు నాకు పెళైపోయింది, ఒక పాప కూడా ఉంది. వీళ్ళే నా ప్రపంచం. ముంతాజ్ కి ఇలా జరగడం చాలా బాధగానే ఉంది కానీ దీనికి నేను ఏ మాత్రం సహాయపడలేను. నన్ను క్షమించండి.

నేను ఎవరో తెలుసా? దిగొచ్చి మాట్లాడుతుంటే నువ్వేదో గొప్పోడివి అని అనుకుంటున్నావా? నువ్వొక ఆఫ్ట్రాల్ మాత్రమే. ముంతాజ్ నీకోసం చచ్చిపోతానంటుంది. తనకన్నా నీకు ఈ ప్రపంచం అసలు ఎంత. వదిలేయ్, నాతో రా.

ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. పిచ్చి ఎక్కువైతే హాస్పిటల్ లో చూపించండి. ఈ ఆఫ్ట్రాల్ గాడితో ఎందుకు. మీరు వెళ్తారా లేక?

( మోహముద్దలాహ్ కోపంతో బయటికి వచ్చేస్తాడు)

అప్పుడు, నాన్న చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఎమిబాయిని, సనని చంపేయాలనుకున్నారు. కానీ అక్కకి మాత్రం నాన్న, అలీకి నువ్వంటే చచ్చేంత లేక చంపేంత ఇష్టం, నీకోసం అందరిని వదిలేసుకొని వచ్చేస్తాడు అని చెప్పారు. అలీ, అక్క దెగ్గరికి వస్తాడని అక్క సంతోషంతో నిండిపోయింది.

నువ్వు చెప్పాల్సింది కదా నసీమ.

ఎక్కడ, నేను వాళ్ళని చంపొద్దని నాన్నని అడిగాను దానికి నాన్న నేను వాళ్ళని చంపను కానీ ముంతాజ్ కి ఈ నిజం తెలియకూడదన్నారు. అందుకే సనని నాతో ఉంచుకుందామనుకున్నాను.

మరి ఎమిబాయి?

తనని నాన్నే ఒక సేఫ్ హౌస్ లో దాచిపెట్టానని చెప్పారు.

మరి దీంట్లో నన్నెందుకు ఇరికించారు?

అసలు ప్లాన్, నిన్ను ఇరికించాలని కాదు. అలీ పాస్పోర్ట్ పోయేలా చేసింది, వాళ్ళ నాన్నని చంపేసింది మా వాళ్ళే. కానీ వాళ్ళ నాన్న చనిపోయిన రోజు అలీ అనే పేరుతో అక్కడ ఒక మనిషిని సెట్ చేసి, వాళ్ళ వైఫ్ తో అతను అక్కడున్నాడు తిరిగి దుబాయ్ వెళ్ళాడు. స్కాం చేసినదంతా ఆ ఫేక్ ఆలీనే అని ఫ్రేమ్ చేసి అతన్ని జైలు లో వేపిద్దాం అనుకున్నారు. అంటే అలీ ఐడెంటిటీని ఎండ్ చేయాలనుకున్నారు. కానీ నువ్వేమో ఆ అలీని వదిలేసి ఈ అలీ మీద ఫోకస్ చేస్తున్నావ్. వాళ్ళ అమ్మకి కాల్ చేపించి అలీ అక్కడికి రాలేదని నాతోనే చెప్పించావ్. నాకు ఇదంతా తెలిసింది ఆరోజే, అది చెపుదాము అని నీ దెగ్గరికి వస్తుంటేనే నాకు ఈ ఆక్సిడెంట్ జరిగింది. ఇది చేపించింది మా నాన్నే, సనని చంపడం కోసం. నా నోరు మూయించాలనుకున్నారు. అందుకే ఆరోజు నేను, నిన్ను సనని అడాప్ట్ చేసుకునేలా చేశా.

ఇప్పుడేమంటావ్ నసీమ? నన్ను ఆ దుబాయ్ లో ఉన్న అలీని, ఎమిబాయిని పట్టించేసి, ఈ స్కాం నుంచి బయటపడమనా?

అంతే విరాజ్. అప్పుడు అందరూ సేఫ్ గా ఉంటారు.

ఎలా ఇలా మాట్లాడుతున్నావ్ నసీమా? సన తన అమ్మ,నాన్నలు ఇంక తిరిగి రారని అర్ధం చేసుకోగలదా? ఎమిబాయి తన భర్త ఎక్కడున్నాడో తెలియక ఆ చీకటి గదిలో ఉండిపోవాలా? నాన్న, భార్య, కూతురు అందరూ చనిపోయారని అలీ ఇష్టం లేకుండా ముంతాజ్ తో ఉంటాడనుకుంటున్నావా? సేఫ్ గా ఉన్నారంటే, బ్రతికున్న సేవాళ్ళ లాగానా?

లేదు విరాజ్. ఇదంతా మనం ఇంక ఎలా ఆపగలం? ఇదంతా నీకు చెప్పింది నువ్వు దీన్ని ముగిస్తావని. తిరిగి ఇండియా వెళ్ళిపో. సనని జాగ్రత్తగా చూసుకో. ఏదైనా కొంత కాలమే. జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు వస్తూ ఉంటాయి వాటిని దాటేయడమే మంచిది. అంతా మర్చిపోతారు. మాములవుతారు. అలీని అక్క బాగా చూసుకుంటుంది. ఎమిబాయికి కొత్త జీవితాన్ని ఇచ్చే బాధ్యత నాది.

పిచ్చి మీ అక్కకి కాదు నీకు పట్టినట్టుంది నసీమ. నేను ఇక్కడికి వచ్చింది తిరిగి వెళ్లిపోవడానికి కాదు. మీ అక్క వల్ల ఇంత మంది సఫర్ అవ్వాలా? పద ఇదంతా నేనే చెప్తా ముంతాజ్ కి. ఎక్కడుందో చెప్పు.

విరాజ్, వద్ధు. అక్క తట్టుకోలేదు.

నువ్వు చెప్తావా లేదా నసీమ? ఒకటే మాట. నువ్వు చెప్పకపోయినా, కరీం ఎలాగోలా ముంతాజ్ ని కనిపెడతాడు, అప్పుడైనా నేనే వెళ్లి ఇదంతా తనకి చెప్తాను. కానీ నువ్వు ఇప్పుడు నాకు చెప్పకపోతే నువ్వు నాకు ఇచ్చిన ఈ పెయిన్ ఎప్పటికి గుర్తుండిపోతుంది.

చెప్తాను విరాజ్.

(తర్వాత రోజు. ఆఖరి రోజు. విరాజ్, ముంతాజ్ ని కలుస్తాడు)

విరాజ్?నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నిన్ను కలుస్తానని అనుకోలేదు... ముఖ్యంగా ఇక్కడ కాదు.

నిజం చెప్పాలి కాబట్టే ఇక్కడికి వచ్చాను ముంతాజ్. అలీ గురించి, మీ నాన్న గురించి, నిన్ను ఈ భ్రమలో ఉంచడానికి నీకు చెప్పిన అబద్ధాలు అన్నిటి గురించి.

నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? భ్రమ? నేను ఏమి అనుభవించానో నీకు తెలియదు. అలీ నన్ను ప్రేమించాడు. అతను ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు.

(జరిగినదంతా చెప్తాడు)

ముంతాజ్, అలీ తన భార్య ఎమిబాయిని, కూతురు సనాను ప్రేమిస్తున్నాడు. అది తన కుటుంబం. తన గురించి నువ్వనుకుంటుంది నిజం కాదు.

చాలు. నీకు అర్ధం కాదు. తను ఫస్ట్ నావాడు. ఎమిబాయి కంటే ముందు, సనా కంటే ముందు. తను నావాడు. తను నన్ను ప్రేమించాడు, నాకు తెలుసు.

బహుశా అతను నిన్ను ప్రేమించి ఉండవచ్చు, ముంతాజ్. కానీ ప్రేమ మారుతుంది. మనుషులు మారతారు. నువ్వు దానిని ఒప్పుకోవాలి. ఇలా ఉండటం వల్ల నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ బాధపెడుతుంది.

(ముంతాజ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి)

ఇది అంత ఈజీ అనుకుంటున్నావా? ప్రతిరోజూ యుద్ధంలా అనిపిస్తుంది విరాజ్. ఒకరిని అంతగా ప్రేమించడం ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళని వేరొకరితో కలిసి చూడటం, లోపల చనిపోతున్నట్లు అనిపించడం.

ఆ బాధ నాకు తెలుసు ముంతాజ్. నేను సమీరా అనే ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ చెప్పేంత బంధం మా ఇద్దరి మధ్య లేదు. అది ఇరువురి ఇష్టం మీదే ఆధారి పడి ఉంటుంది. ఒకవేళ నేను చెప్పి తను నో అనే దానికన్నా చెప్పకుండా వదిలేసి ఎప్పుడైనా కలిసినప్పుడు తను సంతోషంగా ఉంది అని అనుకుంటే చాలు. కానీ నీ ప్రేమ వల్ల ఇతరులు పడుతున్న బాధ నీకు సంతోషాన్ని ఇస్తుందా? అలీ హ్యాపీగా ఉంటాడనుకుంటున్నావా?

(ముంతాజ్ కంట్లో నుంచి నీళ్లు తన హృదయ అలల్లా పొంగి బయటకి వస్తున్నాయ్)

ఇవేవీ నేనెప్పుడూ కోరుకోలేదు. అలీ నాతో ఉండాలని కోరుకున్నాను. నేను అనుకున్నాను. ఎమిబాయి, సన, అలీ కలిసిపోతే పరిస్థితులు మళ్లీ యథాతథ స్థితికి వస్తాయి.

పరిస్థితులను బాగు చేయాలంటే ముందున్న మార్గం ఒక్కటే. దీన్ని అంతం చేసే శక్తి నీకే ఉంది ముంతాజ్. ఇదంతా ఆపమని మీ నాన్నకు చెప్పు. అలీ, ఎమిబాయి, సనను కలపమను. వారి జీవితాలను ప్రశాంతంగా జీవించనివ్వమను.

(ముంతాజ్ కుప్పకూలిపోయింది. అలీపై తనకున్న ప్రేమకు, తన ప్రేమ కలిగించిన అపరాధభావానికి మధ్య నలిగిపోతుంది. విరాజ్ తన చేతిని పట్టుకుని)

ముంతాజ్, ఈ బాధ వర్ణనాతీతం అని నాకు తెలుసు. ఇది కేవలం నీ గురించే కాదు. ఇది ప్రాణాలను పణంగా పెట్టడం గురించి. దీని వల్ల నష్టపోయిన వాళ్ళ గురించి. నీ గతాన్ని తిరిగి తీసుకురాలేవు, కానీ నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలో అన్నది నీ చేతుల్లోనే ఉంది.

కానీ నేను అన్నీ కోల్పోతే? నాకున్న చివరి ఆశను కోల్పోతే ఎలా?

కొన్నిసార్లు, వదిలిస్తేనే బాగుంటుంది. అయిపోయినదాన్ని పట్టుకుని ఉంటే నిన్ను నువ్వే ముక్కలు చేసుకున్నట్లవుతుంది. నన్ను నమ్ము ముంతాజ్. నువ్వు అనుకున్నదానికంటే చాలా స్ట్రాంగ్.

నేను మా నాన్నతో మాట్లాడతాను. దీన్ని ఆపేయమని చెప్తాను.

(అప్పుడే మోహముద్దలాహ్ అక్కడకి వస్తాడు)

ముంతాజ్, వీడెంటి ఇక్కడున్నాడు?

నాన్న, అంతా అయిపోయింది. మీ మనుషుల్ని పిలవండి. అలీ, ఎమిబాయి, సనను వదిలేయండి.

వీడు నీ మనసును బాధపెడుతున్నాడు. నీ కోసం నేను చేసినవన్నీ అయిపోయాయా?

(విరాజ్ గట్టిగ)

మీరు ఏదీ త్యాగం చేయలేదు. జీవితాలను నాశనం చేశారు. ఇది ఇప్పుడు ముగుస్తుంది. మీ నేరాలు అన్నిటినీ బయటపెడతాను. నా దెగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఒక్క మొహమ్మద్ అలీనే కాదు, ఇలా చాలా మంది బిజినెస్ మెన్ ని మీరు ఐడెంటిటీ లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు తప్పించుకుంటున్నారు.

నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నేనెవరో తెలుసా? ఒక్క మాటతో నిన్ను చంపించేస్తాను.

అప్పుడు నన్ను కూడా చంపేయండి నాన్న. ఎందుకంటే మీరు ఇలా జీవితాలను నాశనం చేయడాన్ని నేను చూస్తూ ఉండలేను.

ముంతాజ్!

మీరు నన్ను ప్రేమిస్తున్నటైతే, దీన్ని ఆపేయండి. వాళ్ళని వదిలేయండి, లేకపోతే శాశ్వతంగా నన్ను కోల్పోతారు.

ఎవరికోసమైతే ఇదంతా చేసానో తనే ఇప్పుడు ఇలా అంటుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. మొత్తం వదిలేస్తాను ముంతాజ్. నువ్వు అడగాలే కానీ నీ కోసం నా ప్రాణాన్నైనా ఇచ్చేస్తాను.

(మోహముద్దలాహ్ చేసినవన్నీ ఒప్పుకుని జీవితఖైదుకి సిద్ధమవుతాడు. అలీ, ఎమిబాయిను సనతో కలిపి విరాజ తన మాట నిలబెట్టుకుంటాడు. ముంతాజ్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అక్కడే ఉద్యోగం చేస్తూ విరాజ్ సంతోషంగా ఉంటాడు)

మరిన్ని కథలు

Vaaradhulu
వారధులు
- Bhagya lakshmi Appikonda
Vaarthallo headloinega
వార్తల్లో హెడ్లైన్సా
- ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి (నాగిని)
Goppa manasu
గొప్ప మనసు
- సరికొండ శ్రీనివాసరాజు
O magaadi katha
ఓ మగాడి కథ
- జి.ఆర్.భాస్కర బాబు
Kotta oravadi
Kotta oravadi
- Prabhavathi pusapati
Kallu nettikekkayi
కళ్ళు నెత్తి కెక్కాయి
- కాశీవిశ్వనాధం పట్రాయుడు
Devuniki Kanukalu
దేవునికి కానుకలు
- సరికొండ శ్రీనివాసరాజు
Kya huvaa
క్యా హువా
- కె. తేజస్వని