
నీలగిరి ప్రాంతంలో రాజు అనే పెద్ద వ్యాపారి ఉండేవాడు క్రమశిక్షణ సమయపాలనకు పెద్దపీట వేస్తూ వ్యాపారం చేసేవాడు అతని క్రమశిక్షణ తన వ్యాపారంలో ఎన్నో లాభాలను తెచ్చిపెట్టింది అలాగే వ్యాపార విస్తరణ కు కూడా తోడ్పడింది మరింత క్రమశిక్షణతో ధర్మబద్ధంగా వ్యాపారం చేయసాగాడు వ్యాపారి .ఈ వ్యాపారికి కుమారుడు ఉన్నాడు అతడి పేరు వెంకటేశ్వరరావు. వృద్ధాప్యం అలాగే ఇతర అనారోగ్యాల సమస్యల రీత్యా తన వ్యాపార బాధ్యతలను పూర్తిగా తన కుమారునికి వ్యాపారి అప్పగించాడు. వెంకటేశ్వరరావు తన తండ్రి ప్రవర్తనకు పూర్తిగా భిన్నంగా ఉండేవాడు. సమయానికి విలువనిచ్చే వాడే కాదు తన ప్రవర్తన వలన వ్యాపారం మందగించింది సమయానికి పనులు చేయకపోవడం వలన నష్టాలు రాసాగాయి. సమయం విలువ తెలియని వెంకటేశ్వరరావుకు రాజు ఎలాగైనా గుణపాఠం నేర్పించాలని ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఆ ఉపాయం అమలు చేయడానికి తన స్నేహితుల సహాయం తీసుకున్నాడు. ఒకరోజు వెంకటేశ్వరరావుకు అతిపెద్ద కాంట్రాక్టు లభించాల్సి ఉంది కానీ తన యొక్క బాధ్యత రాహిత్యం వలన ఆ కాంట్రాక్టు వేరే వ్యాపారికి దక్కింది తనకు దక్కాల్సిన కాంట్రాక్టు వేరే వ్యాపారికి ఎలా దక్కింది అని ఆలోచించాడు పూర్తిగా తన బాధ్యత రాహిత్యం సమయపాలన క్రమశిక్షణ లేకపోవడం వల్లనే ఈ తప్పు జరిగిందని తెలుసుకుని .తన తప్పును క్షమించమని తండ్రిని వేడుకున్నాడు వెంకటేశ్వరను క్షమించిన రాజు సమయం విలువ నీకు తెలిసి వచ్చినందుకు సంతోషం అన్నాడు . ఈ కాంట్రాక్ట్ వ్యవహారమంతా రాజు ఉపాయమే తన ఉపాయం వలన తన కుమారుని మార్పు వచ్చిందని ఆనందించాడు .సమయం విలువ తెలుసుకున్న వెంకటేశ్వర రావు తన వ్యాపారాన్ని క్రమశిక్షణతో బాధ్యతగా ముందుకు నడిపించాడు.