
“ నీ నిర్ణయం ఇదేనా ఇందిరా?” నెమ్మదిగా ఆడిగనా కానీ నాన్నగారి గొంతు గంభీరత వల్ల పక్క గదిలో పడుకొన్న నాకు స్పస్టంగా వినపడింది.”పిల్లలు ఒప్పుకోరు ఇందిర.వాళ్ళ మనసు కష్ట పెట్టిన వాళ్ళ మవుతామో ఏమో... ఇంకో సారి ఆలోచించి నీ నిర్ణయం రేపు పొద్దున్న వాళ్ళకి చెప్పు” కొంచెం లాలనగా వినపడింది.
ఇది తొందరపడి తీసుకొన్న నిర్ణయం కాదని మీకు కూడా తెలుసు కదా....మీరు చూస్తూ ఉండండి రేపు వాళ్ళు ఎలా ఒప్పుకొంటారో అమ్మ గొంతు చాలా ప్రశాంతంగా స్తిరంగా వినపడింది.
నాన్నగారి రెటైర్మెంట్ సందర్భంగా మా అన్న , అక్క ,చెల్లెలు అందరం వచ్చాము.నాన్నగారు ఉన్నత స్థాయిలో పని చేసేవారు.దాదాపు మా జీవితమంతా ఆఫీసు క్వార్టర్ లోనే గడిచింది.నిన్న మొదట సారిగా ఈ ఇల్లు ఇక మాది కాదని రెండు ,మూడు రోజుల్లో వదిలి వేరే ఇంటికి వెళ్ళాలి అన్న భావం తోఅందరి మనసు భారమైంది.ఇప్పుడు అమ్మ నాన్నగారు ఎక్కడ వుంటారు అన్న విషయం అందరి మనసులో మెదులుతున్నా ఫంక్షన్ హడావిడి వల్ల ఇంట్లో అందరు అలసి పోయి పడుకున్నారు.
మాది అన్యోన్యమైన కుటుంబం అనే చెప్పాలి.అమ్మ నాన్న తమ పెళ్లి అయినప్పటినుంచి తమ కర్తవ్యం నిర్వహిస్తు మా నలుగురి చదువులు,పెళ్లిళ్ల భాద్యత సక్రమంగానే నిర్వహించారు.ఇప్పుడే అమ్మ నాన్నలకు తమకంటూ ఒక ప్రశాంతమైన జీవన విధానం గడిపే సమయం వచ్చింది.నిన్న ఫంక్షన్ లో అందరూ అమ్మా నాన్నలని అబినందిస్తూ మాట్లాడుతూ వుంటే గర్వంతో ఆత్మ సంతృప్తి తో మా అందరి మనసులు పులకరించి పోయాయి.
“ఇంకా పడుకోలేదా అక్కా” అంటూ నీరజ నా పక్కలోకి వచ్చి కూర్చుంది.నీరజ నా కన్నా రెండేళ్ళు చిన్నది.గత నాలుగేళ్లగా అమెరికాలో వుంటోంది.”ఇంకా లేదు ఏవో ఆలోచిస్తున్నానులే ,అన్నట్టు యెల్లుండి ప్రయాణానికి ఆన్నీ సర్దుకొన్నావా?జరిగి పక్కలో చోటిస్తూ అడిగాను. “లేదక్క నిద్దర రావటం లేదు, నాకైతే అమ్మా నాన్నలని నాతో అమెరికా తీసుకెళ్ళాలని వుంది అక్క...... కొన్నాళ్లు మాతో ఉండి అక్కడ కొన్ని ప్రదేశాలు చూసి వస్తారు అని, కానీ అమ్మేమో ఫంక్షన్ అయ్యాక చెపుతాను అంది... దాని గొంతు కొంచెం నిరాశగా వినపడింది.
“ భలే దానివి నీరజ నేను మీ అన్నయ్య అత్తయ్యగారిని మావయ్యగారిని వస్తే మాతో ఢీల్లీ తీసుకువెళదామని అనుకొంటున్నాము”ఎప్పుడు వచ్చి నిలబడి మా మాటలు విన్నదో చొరవగా మమ్మలని జరిపి మంచం మీద కూర్చుంది.ఇక్కడికి వచ్చే ముందే అత్తయ్యగారితో ఫోన్ లోనే చెప్పాము ఇక్కడికి వచ్చాక చెపుతానులే అన్నారు అత్తయ్యగారు.రేపు వచ్చే సెలవులకి మీ అందరూ కూడా వద్దురుగానీ,ఎంచక్కా ఓ నెల రోజులు అందరం కలిసి ఎంజాయ్ చేద్దాము..పనిలో పనిగా మమ్మలని కూడా పిలిచేసింది.
“ నేనొక దాన్ని ఉన్నానని మరిచిపోయారా ఏమి?, ఎప్పుడు మీ ఇళ్లకేనా వీల్లేదు,ఈ సారి అమ్మా నాన్న మాతో వచ్చి అక్కడే వుంటారు.అసలే మాది లంకత కొంప కదా...మీ బావగారు కూడా ఇదే మాట చెప్పమన్నారు...నేనే రేపు తీరికగా మీ అందరికీ చెపుదామనుకొంటున్నాను” మంచం పక్కనే పడుకొన్న పెద్దక్క గిరీజ లేచి మంచి నీళ్ళు తాగి తన మాటే శాసనం అన్న స్టయిల్ లో చెప్పింది.
“సరే లే అక్కాఅలాగే లే “అమ్మా నాన్నగారు రేపు పొద్దున్న మాట్లాడతా మన్నారుగా బాగా అలసి పోయి ఉన్నాం కదా పడుకోండి” ఇంక నా మనసులోని మాట చెప్పనవసరం లేదని పక్కకి తిరిగి కళ్ళు మూసుకొన్నాను.
ఉద్యోగరీత్యా నాన్నగారు బిజీగా ఉండేవారు,మా అమ్మ మా పనులతో ఎంత సతమవుతు ఉన్నాకొంత సమయం తీసుకొని మా తాతగారి ఊరు వెళ్లివస్తుండేది.తాతగారి ఇల్లు పది వాటాలు వున్న పెద్ద మండువా లోగిలి ఇల్లు.ఎప్పుడూ సందడి తో పది వాటా ఇళ్లవాళ్లు ఒకే కుటుంబం లాగ కలిసిమెలసి వుంటారు.ఇప్పటికీ అమ్మకి ఆ ఊళ్ళో చాలామంది తో అనుబంధం వుంది,నిన్న మా ఊరి నుంచి నాన్నగారిని అభినందిచటానికి వచ్చిన వారిని చూస్తే నే తెలుస్తుంది వాళ్ళ మనసుల్లో అమ్మ నాన్నగారికి ఎంత ఉన్నత స్టానం వుందో.... ఈ ఆలోచనల్లో ఎప్పుడు నిద్ర పట్టిందో....
స్తానపానలు అయ్యాక అందరూ అమ్మ నాన్నగారి నిర్ణయం వినటం కోసం వరండా లో ఆశీనలు అయ్యాము. అమ్మ చెపు దాము అని అనుకొనే లోపులే “ అమ్మ మనం రేపు ఢీల్లీ వెళ్లిపోతున్నాము, ఈ వయసులో నువ్వు నాన్నగారు నా వద్దకి వచ్చేయాలి. పెద్ద కోడుకు గా మిమ్మలిని కంటికి రెప్పలా చూసుకోవలసిన భాద్యత నాది.”ఇంక ఎవరి మాటలు వినే పని లేదు అన్నట్టు కొంచెం కటువుగానే అన్నాడు.
“అదేమిటరా అలా అంటావు తమ్ముడూ.... ఇన్నాళ్ళు ఉద్యోగ భాద్యతలని నాన్న...,పిల్లలు,పెళ్లిళ్లు మనవలు అని అమ్మా… ఇప్పటివరకు ఎప్పుడూ నాతో ఉండనేలేదు..ఇప్పుడు కదా కొంత తీరిక దొరికింది వాళ్ళకి..కొన్నాళ్ళైన నా దగ్గర ఉండి వస్తారులే నీ దగ్గరికి “కొంచెం అందరికన్నా పెద్ద దాన్నికదా అన్న ధీమాతో అన్నది.
“నాది అదే మాట అక్కా.. నాన్న అమ్మా ఎప్పుడూ పిల్లల బాగోగులు చూడటం లోనే జీవితమంతా గడిపేశారు...ఇప్పుడే కదా ఇద్దరికి కొంత తిరిగే వయసు అందుకని కొన్నాళ్లు నాతో అమెరికా లో వుండి ఆన్నీ ప్రదేశాలు చూసి వస్తారు”.. తను చేప్పిందే సబబు అన్నట్టు వెళ్ళి నాన్నగారి ఒళ్ళో కూర్చుంది.
“ ఏమే నువ్వేమీ మాట్లాడవు ? నీ మనసులో ఏముందో నువ్వు కూడా చెప్పు” తన పక్కనే కూర్చున్న నా తల నిమురుతూ అడిగారు నాన్న.
“ ఉన్న ఊరిలో వుండటం ఇష్టపడతారు కదా అని మీ అంగీకారం లేకుండానే “రేటైరేడ్ హోమేస్” అని ఆధునికంగా అన్ని వసుతులతో కట్టిన విల్ల తీసుకొన్నాను నాన్న…..నువ్వు అమ్మ ప్రశాంతంగా వుంటారని” ముందు చెప్పక పోవటం తప్పే అన్నట్టు నెమ్మదిగా చెప్పాను.
నలుగురి ఆలోచనలు సవిస్తారంగా విన్నారు....అందరం నాన్న ఏమి చెపుతారో అన్నట్టు ఆత్రుతతో చూస్తున్నాము....
“ ఇన్నాళ్ళ మా వైవాహిక జీవితంలో ప్రతి విషయం లో తగిన సలహా ఇచ్చిందే గాని అదే పాటించాలని నన్ను ఎన్నడూ అడగలేదు... ఎప్పుడు నాదే తుది నిర్ణయం, కానీ ఈ సారి నేను మీ అమ్మ తీసుకొనే ఏ నిర్ణయం అయినా మనస్పూర్తిగా సమర్దించాలని అనుకొంటున్నాను...ఇది బహుశా నేను మీ అమ్మకి ఇస్తున్నచిరు కానుక అని ఏమోయే....నేను తప్పు కొన్నాను సుమా ఇక నీ దే భారం అన్నట్టు దూరంగా నించు ని అన్ని వింటున్న అమ్మని భుజం మీద చెయ్యివేసి తీసుకొని వచ్చి సోఫా లో తన పక్కన కూర్చోపెట్టు కొన్నారు.
మీ నాలుగురిని ఇలా ఇంత సమర్ధవంతం గా పెంచి నందుకు నా పెంపకం మీద నాకే సంతోషంగాను గర్వంగా కూడా ఉంది.మీ నలుగురిలో ఎవ్వరితో వున్నా సుఖంగా సంతోషం గా కాలం గడపగలం.కానీ.....
“మరి దేనికి ఆలోచిస్తున్నావు అమ్మా”అన్నయ్య వచ్చి అమ్మ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు.నాతో ఏదైనా పొరపాటు జరిగిందా అత్తయ్య? వదిన బేలగా అడిగింది.
“ లేదు నాన్న అలాంటిది ఏమి లేదు,చాలా మంది మా లాంటి తల్లితండ్రులు ఈ రోజుల్లో పిల్లల భాద్యతలు తీరాక ఎవరి వద్దకి చేరినా ఏమి చెయ్యాలో తెలియక,రోజులు లెక్కపెట్టుకొంటు కాలం వెళ్ళదీస్తున్నారు....ఆ భావం కొన్నాళ్ళకి మనిషి లో నిరాశ, నిస్పృహ కలిగిస్తుంది. చాలావరకు మా లాంటివాళ్లు ఇంతకన్నా ఇంకేమీ చేయగలం అన్న భావం తో బ్రతుకుని సాగదీస్తున్నారు.
మా ముందు తరాల్లో ఈ భావం అంతగా లేదు కారణం అప్పటివాళ్లు సంఘజీవుల్లా బ్రతికేవారు.ఊరిలోవున్న అందరూ కాకపోయిన కొన్ని కుటుంబాలు కలిసి మెలిసి ఉండేవారు,ఒకరికి ఒకరు అన్న భావం వలన నేను ఒంటరి అనే దిగులు ఎప్పుడు ఎవరిలోనూ కనిపించేది కాదు....అంతెందుకు
మా అమ్మమ చాలా చిన్నతనం లో వైధవ్యం అనుభవించింది, మా అమ్మ ఒక్కత్తే కూతురు,తన పెళ్లి అయ్యి అల్లుడి తో పట్నం వెళ్ళిపోయినా,అమ్మమ్మ ఊరిని ఉరివాళ్లని తన వాళ్ళు గా భావించి దాదాపు 90 ఏళ్ళు అక్కడే బ్రతికింది,ఇంట్లో కూరలు పండించి అందరికీ పంచింది,ప్రతివారి కష్టం లో, సుఖం లో నేనువున్నానని ముందుండేది.నేను నా కూతురు పిల్లలు అని గిరిగీసుకొని వుంటే ఒంటరితనం అనేకోరల్లో చిక్కుకొని విలవిలాడేది...సంఘజీవిగా ప్రశాంతంగా బ్రతికి తన జీవితం పది మందికి ఆదర్శంగా వుండేలా జీవించింది.
“ అప్పటి కాలం లో అలా బ్రతకటం సాధ్యం అమ్మా! ఇప్పటి పరిస్తితులు వేరు ....నీరజ అమ్మ మాటలకి అడ్డు వస్తూ “మీరైనా చెప్పండి నాన్నగారూ” అంది
“ఇప్పుడు ఎక్కడ కి వెళ్ళి వుండాలని “కొంచెం విసురుగానే వినపడింది అన్న గొంతు.
ఇన్నాళ్ళు నా ఇల్లు ,పిల్లలు,ఉద్యోగాలు భాద్యతలు అని వున్నాము కాబట్టి ఇప్పుడు కొంత సమయం సమాజనికి ఉపయోగపడేలా జీవించాలని మళ్ళీ చెపుతున్నాను “జీవించాలని” అంతే కానీ కాలం గడపటానికి కాదు జీవితం అంటే...మీ వద్ద వుంటే అది కుదరదు అని కాదు కానీ మనం అందుబాటులో వుంటే కదా ఎవరికైనా సహాయం చేయటానికి వీలు వుంటుంది అని ఆలోచించి..... మీ నాన్న అనుమతి తో తాతగారి ఊరిలోని పది వాటాల ఇంట్లో ఒక వాటా లోకి మారడానికి తగిన వసతులు చెయ్యమని చెప్పాను.రేపు సాయంత్రమే మా ప్రయాణం “అమ్మ గొంతు జీర పోయింది. నీకు నేనున్నాను అనేల నాన్న అమ్మని దగ్గరికి తీసుకొన్నారు.
అమ్మానాన్నల మాటని గౌరవించి మేము అన్య మనస్కంగానే ఒప్పుకొన్నాము
అమ్మ చెప్పింది అక్షరాలా నిజం అయ్యింది.....తాతగారి ఆ పది వాటాల వాళ్ళు అమ్మానాన్నని తమ వాళ్ళల్లాగా మనస్ఫూర్తిగా అంగీకరించారు...మేము సెలవలకి వెళ్ళినప్పుడు చూస్తే అమ్మ నాన్న వయసు తగ్గిందా అన్నంత హుషారుగా వుండే వారు.ఇల్లు ఎప్పుడూ పిల్లలతో,పెద్దవాళ్లతో కళకళ లాడుతూ వుండేది.అమ్మ నాన్నగారు తమ కుటుంబానికి చాలా పెద్ద దిక్కు అన్నట్టు ప్రతి వాటా వారు వాళ్ళతో కలిసి మెలసి ఉన్నారు.
దాదాపు 20 ఏళ్ళు ఎలాగడిచాయో తెలియలేదు....నాన్నగారి మరణ వార్త ఉరుము లేని పిడుగుల పడింది..నాన్నగారి అంతిమ సంస్కారాలకి మొత్తం ఊరు కదిలి వచ్చింది,ఏనోట విన్న అమ్మ నాన్నల కబుర్లే....షామియానావేస్తే కానీ ఆ ఇంట్లో ఏమి జరుగుతోందో తెలియటం లేని ఈ రోజుల్లో నాన్నగార్ని చూడటానికి వచ్చిన వాళ్ళని చూస్తే అమ్మ తీసుకొన్న నిర్ణయం ఎంత ఉదాత్తం గా వుందో అనిపించింది. అమ్మానాన్నఇద్దరు కేవలం నేను నా పిల్లలు అన్న స్వార్ధ భావం కొంతైనా పక్కకు పెట్టి సంఘజీవిగా బ్రతికితే ఎంత ఆత్మ సంతృప్తి కలుగుతుందో జీవించి చూపించారు
ఆ ఊరి వాళ్ళు అమ్మని ఊరి నుంచి పంపటానికి ససేమిరా ఒప్పుకోలేదు.కానీ అన్నయ్య పట్టుబట్టి తను రెటైరే అయ్యాక అమ్మతో కలిసి మళ్ళీ తను కూడా సంఘజీవిగా వాళ్ళ తో కలిసి జీవిస్తానని మాట ఇచ్చి భారమైన మనసు తో అమ్మని తీసుకొనికారు వైపుకి కదిలాడు