
అరణ్యగిరిని అరణ్యానందుడు పాలించే వాడు. అరణ్యగిరికి విద్యుత్ సౌకర్యం లేని కారణంగా రాత్రి వేళల్లో చిక్క చీకటి ఆవరించేది.
దీంతో దొంగతనాలు జరిగేవి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం పడిపేవారు.
ఇది చూసిన అరణ్యానందుడు వీటిని అరికట్టడం ఎలాగా? అని తీవ్రంగా ఆలోచించ సాగాడు. దీర్ఘంగా ఆలోచించి రాత్రి వేళల్లో పెద్ద ప్రమిదల్లో నూనెపోసి అరణ్యగరి మొత్తం వెలుగు వచ్చేలా దీపం ఏర్పాటు చేశారు.
ఇది గమనించిన దొంగలు తమకు ఆటంకంగా వున్న చీకటిని తెప్పించటం ఎలా? అని దీర్గంగా ఆలోచించి దీపంలోని నూనెను తస్కరించ సాగారు. కొంత సమయం వెలిగిన దీపం ఆరిపోగానే తమ పని చక్కబెట్టుకుని వెళ్లసాగారు దొంగలు.
దొంగల సమస్య మళ్లీ మొదలవడంతో దీపాలు ఆరిపోకుండా నల్గురు రాజ భటులను కాపలా వుంచారు.
ఆ సారి దొంగలు రాజ భటులకు దొరక్కుండా కొండ మీదికి వెళ్లి దీపం మీదికి నీటి జల్లులు చల్లసాగారు. వర్షపు జల్లుల్లా పడే నీటి జల్లులు పడి దీపాన్ని ఆర్సేసేది. దీంతో మళ్లీ చీకటి ఆవరించేది. దొంగలు హాయిగా ఇళ్లలోకి వెళ్లి తమకు కావాలసిన వస్తువులు దోచుకువెళ్లేవారు.
దొంగల బెడద రాజుకు కొరకరాని కొయ్యలా తయారైంది. ప్రజల భద్రతకు ఎలా రక్షణ కల్పించాలా?’ అని దీర్ఘంగా ఆలోచించసాగాడు రాజు. భద్రతకు ఎలాంటి వ్యూహం అమలు చేసినా గాలిలో దీపంలా మారి ప్రజలకు రక్షణ కరువైంది.
ఓ రోజు రాజు దీర్ఘంగా ఆలోచించి ఓ వ్యూహ రచన చేశాడు. తక్షణం అమలు చేశాడు. తన పథకంలో భాగంగా అరణ్యగిరి సరిహద్దుల్లో పెద్ద గోతులు తవ్వి కుండల్లో విలువైన బంగారు ఆభరణాలు వుంచారు.
మరుసటి రోజు దోపిడీకి వచ్చిన దొంగల కన్ను తవ్విన గుంతలపై పడిరది. చీకట్లో తవ్వి చూశారు. గంటకు పైగాతవ్వి ఫలితంగా ఓ కుండ కన్పించింది. దాన్ని బయటకు తీసి గుడ్డతో మూసి వుంచిన పైభాగాన్ని చూసి ఆనందంతో చేయి పట్టి చూశాడు. బంగారు నగలు తగలడంతో ఆనందంతో కుండ లోపల వెతికారు. చీకట్లో కుండ చివర్లో వదిలిన తేళ్లు కాటేశాయి. వెంటనే దొంగలు నిశ్చేష్టులయ్యారు. నొప్పికి తాళలేక పెడబొబ్బలు పెట్టారు. తమను తేలు కుట్టిందని మందు వేయాలని ఎవరినైనా అడిగితే విషయం బయట పడుతుందన్న భయంతో నొప్పిని అలాగే భరించారు దొంగలు. మరుసటి రోజు నుంచి అరణ్య గిరిని దొంగల బెడద కనుమరుగైంది. తన పాచిక పారినందుకు రాజు ఎంతో ఆనందించాడు. ప్రజలు రాజుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.