మితం - ఆదిత్య ప్రణవ్

Mitam

స్టీల్ ప్లేట్ లాగ ఉన్న ఆకాశం. ఆ స్టీల్ ప్లేట్లో అక్కడ అక్కడ పెరుగన్నము ముద్దలుగ అమర్చినట్టు తెల్లని మేఘాలు.

"వాతావరణం ఇలా ఉంటే ఎంత బాగుంది కద" అన్నాడు వంశీ.

తన ఫోను తో ఆకాశాన్నీ ఫోటో తీస్తున్న సురభీ అవునంటు తలూపింది.

తను చెప్పిందానికి సమాదానము రాలేదేన్టి అని తన కుతురి వైపు చూసాడు వంశీ.

"అబ్బా! ఎప్పుడు చేతిలో ఫోన్ పట్టుకోడం అవసరమా?" అని మందలిచ్చాడు.

తలూపుతు తన ఫోన్నీ తన జేబులో పెట్టేసుకుంది సురభీ.

మల్లీ తన చూపు నీ ఆ మేఘాల వైపు అమర్చాడు వంశీ. ఓక్క సారి ఆ మేఘాల వైపు ఎగిరి ఈ సిటీనంతా పైన్నుంచి చూస్తే ఎంత బాగుంటుందో అని అలోచించాడు.

“"సురీ, మన సిటి పైనుంచి ఎల కనిపిస్తదంటావూ?”

మేఘాలవైపే చూస్తున్న సురభీ నాన్న వైపు చూసీ

"ఓ! దానికే! ఇప్పుడే గూగల్ మ్యాప్స్ లో తెలుసుకోవచ్చు నాన్నా!”

"అబ్బా! మల్లీ ఫోను తియ్యకు ఇప్పుడు ప్లీస్" అని చిరాకు తో ప్రత్యుత్తరించాడు వంశీ.

సరే అంటు నవ్వింది సురభీ.

"అయినా మీ జెనరేషన్ నీ పాడు చేసె వ్యసనం ఈ మోబైల్ ఫోన్స్" అన్నాడు వంశీ

"వ్యసనము గా మారుతే ఏదైన పాడు పదార్థమే అవుతుంది నాన్నా" అన్నది సురభీ నవ్వుతు.

"కానీ ఈ మొబైల్ ఫోన్స్ వ్యసనంగా మరాడము చాలా తేలిక. ఈ ఆధునిక వస్తువులతో వచ్చిన బాధే అది. ఇంకా దానిపైన మీ తరం పిల్లల పొగరు మరియు భయము లేక పోవడము”

"అమ్మో! పెద్ద నిందలే ఇవి! ఏమ్పర్లేదు! మా తరము తరుపున నేను కేస్ ఫైట్ చేస్తా!" అంటు నవ్వి వంశీ ముందు నుంచుందీ సురభీ.

"నాన్నా, మీ తరం చిన్నతనము లో ఆధునిక యంత్రాలు వచ్చాయా?” అని అడిగింది సురభీ.

"ఎందుకు రాలేదు? రెడియో, టీవీ అప్పుడు అప్పుడే అందరీ ఇళ్లల్లో వ్యాపించాయి”

"అయతే మీ పెద్దలెవ్వరు వాటికి అభ్యంతరము చెయ్యలేదా?" అని అడిగింది సురభీ.

కుతురు ఏ తర్కం వాడి గెలవాలి అనుకుంటుందో గ్రహించిన తండ్రీ నవ్వేసి

"అవును! మా పెద్దలు కుడా అభ్యంతరము చేసారు, కాని వాళ్ళు మా మంచికే చేసారు. అవి విన్నందుకే మేము ఈ స్థాయి లో ఉన్నాము" అన్నాడు.

" సరే! ఒక వేల మీరు మా స్థానంలో ఉండుంటే ఎం చేసేవారు?" అని అడిగింది తండ్రి ని.

"పెద్దలు మంచే చెప్తారు అని నమ్మీ, వాలు చెప్పినట్టు ప్రవర్తిస్తాము" అన్నాడు.

అప్పుడే వంశీ భార్య సునందా మేడ మీదకి ఒచ్చింది.

"తండ్రీ కుతురు మాట్లాడింది చాలు, కిందకోచ్కేయండి!" అని చెప్పింది సునందా.

"అమ్మా, ఇవాల వర్శం పడుతది అని ఫోర్కాస్ట ఉంది, దండేము మీదున్న బట్టలు తీసుకెల్లిపో!" అనింది సురభీ.

“అవునా!" అని ఆశ్చర్యముతో చూసింది సునందా.

"అవును, ఇటు చూడు" అని ఫోన్లో వర్శసంకేతాన్నీ చూపించింది తల్లికీ.

"సునందా! ఆ ఫోన్లో ఒచ్చే వాటిని అంత సులభంగ నమ్మకు. టెక్నాలజీ కన్న మనిషి బుద్ధి ముఖ్యము. ఫెబ్రవరీ నెలలో వర్శం అంత సహజం కాదు. నువ్వు కిందకెల్లి ఉండు. మేము కొంసేపయ్యాక వస్తాము”.

ఆకాశం వైపు సందేహంతో చూస్తు సునందా కిందకి దిగింది.

కొంచం సేపు ఏమి మట్లాదుకొలే ఇద్దరు. నిశ్శబ్దంగా ఆకాశంవైపు చూస్తు ఉండి పోయారు.

"అది అనమాట విషయం. మీ తరం వాల్లు వైసుకి గౌరవం ఇవ్వకపోయిన అనుభవానికి గౌరవమియ్యాలి!" అన్నాడు వంశీ సునంద ఆపిన చర్చని మళ్ళి ప్రారంభించి.

చిన్నగా నవ్వింది సురభీ

"నాన్నా! పెద్దవాల్లని గౌరవియడం కరెక్టే. మా తరం వాల్లకి గౌరవంకూడా ఉంది. అది మీకు ఎందుకు కనపడదో నాకు తెలియదు. నా అంచనా ప్రకారము మా తరం వాళ్ళకి బుభుత్సుత ఎక్కువా. ఈ బుభుత్సుత వల్ల చాల ప్రశ్నలు వేస్తాము మీ వైపు. అదేదో మేము విప్లవం చెస్తునట్టు మీరు అనుకుంటారు కాని మాకు ఆ ప్రశ్నలకి సమాధానమిస్తే చాలు" అనింది సురభీ.

ఎమనకుండ కుతురి వైపు చూస్తున్నాడు వంశీ. సురభీ కల్లు మూసుకోని ఏదో అలొచించడం మొదలుపెట్టింది. రెండు నిమిషాల పాటు మౌనమే వ్యాపించింది మేడ పైనా.

" అంతెందుకు నీతి శతకంలో భర్తృహరి అన్నాడు గా :

సింహః శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ।

ప్రకృతిరియం సత్త్వవతాం న ఖలు వయస్తేజసాం హేతుః ॥ “

తన కుతురు సంస్కృతములో ఈ పద్యం చెప్పగానే పిడుగు పడినట్టు ఆశ్చర్యపడ్డాడు వంశీ. తండ్రీ ఆశ్చర్యాన్నీ పట్టించుకోకుండ సురభీ మాట్లాడ సాగింది.

" ఈ పద్యం అర్థం ఏమైన ఉండొచ్చు కాని నాకు మాత్రం ఇది ఎమి చెబుతుంది అంటే: వయసులో చిన్నగున్న సింహం పిల్లా ఎలాగైతే మదించిన ఎనుగుకి ఎదురు వెల్తుందో అల వయసు చిన్నగ ఉన్నా ధైర్యంగా పెద్ద వాళ్ళని ప్రశ్నించే సత్తా ఉండాలి ఎవరికయినా!" అని అనిందు సురభీ ఉత్సుకతతో.

వంశీ ఆశర్యంగా చూస్తున్నాడు కుతుర్నీ.

"ఏమైంది నాన్న?" అని అడిగింది సురభీ

"నీకు ఈ పద్యమెల తెలుసు. భర్తృహరి పుస్తకము కొన్నావా?" అని అడిగాడు

"ఈ కాలంలో పుస్తకముంటేనే చదవాలి అని లేదు నాన్న. నా ఫోన్లో సుభాషితాల ఆప్ ఒకటి దౌన్లోడ్ చేసుకున్నా!" అని తన ఫోన్ చూపించింది తండ్రికి.

"నువ్వన్నది కుడ నిజమే నాన్న. ఈ ఫోన్ ఎప్పుడైన వ్యసనముగా మారొచ్చు. కాని మన జాగ్రత్తలో మనం ఉంటే ఇది ఎంతో ఉపయోగ పడే ఆయుధంగా కూడా మారుతుంది" అని అనింది సురభీ.

“అంతేందుకు, మొన్న మా స్నెహితుడి నాన్నమ్మకి జ్వరముగా ఉంటే ఆసుపత్రి కి తీసుకెల్లకుండ డాక్టర్ తో “online consultation” చేసారు”

"అలా కూడా చెయొచ్చా? మరి మందులు అవి ఎలా?" అని అడిగాడు వంశీ సంకోచిస్తు.

" ఎందుకు చెయలేము, మనమనం వీడియో కాల్ చెసుకున్నట్టు డాక్టర్ తో వీడియో కాల్ అది. మందుల విషయానికి వస్తే అవి ప్రిస్క్రిప్త్షన్ బట్టి ఇంటికి వస్తాయి" అనింది సురభీ

ఇవన్నీ వింటున్న వంశీ నెవ్వెరపడ్డాడు.

"అమ్మో! ఇంత సులభంగా ఉందేన్టి" అని అన్నాడు

"ఇదంతా ఈ ఫోన్ వల్ల నే!" అనింది సురభీ గర్వంగా.

తన కుతురుకి ఇంత తెలుసు అని గర్వమున్నా ఎక్కడ ఈ వాదంలో సురభీ గెలుస్తదని

"ఏమైన అను! ఈ ఫోన్స్ యొక్క లాభాల కన్న లోపాలే ఎక్కువ" అన్నడు మల్లి గట్టిగా.

కొంసేపు అలొచించి సురభీ.

"దేనికి ఉండవు నాన్న లోపాలు? అన్నిటికి ఉంటాయి. నిప్పు ని ఒక లాగ వాడితే జీవిని కాల్చే బడబాగ్ని అవుతుంది, ఇంకో లాగ వాడితే అన్నంపెట్టే పాచనమవుతుంది. కత్తిని ఒక లాగ వాడితే ఇంకో జీవిని చంపే ఖడ్గమౌతుంది, ఇంకో లాగ వాడితే కురగాయిలు తరిమే చాకౌతుంది.” అని చెప్పింది సురభీ

మెల్లగా వంశీ ముఖజాడ అంగీకారము వైపు మారుతుంది. ఇది చూసిన సురభీ ఇంక ఉత్సాహంగ మాట్లాడుతుంది.

"ఓక యంత్రాన్ని మనం ఎలా వాడుతామో అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఈ నిర్జీవ యంత్రాల్లో మంచి ఇంక చెడ్డ ఏమి సహజంగా ఉండవూ. అది వాటి వాడుక తో వచ్చే తత్వాలు. నేను ముందు చెప్పిన అగ్నీ లో క్రూరత్వము మరియు ఉపయోగము ని భేదించే రేఖ ఏమిటి?" అని అడిగింది సురభీ.

ఇప్పుడు ఆకాశం వైపు చూస్తున్న వంశీ మౌనం వహించాడు. ఒక్క నిమిషం తర్వాత సురభీ ని చూసి

“మితం" అని జవాబు ఇచ్చాడు.

"కరేక్ట్ నాన్న!" అని ఉత్సాహంగా వంశీ ని వాటేసుకుంది సురభీ

"మితం లేక పోవడము తప్పు. ఆ తప్పు మనదౌతుంది కాని యంత్రానిది ఎందుకు అవుతుంది. ఆ యంత్రం ప్రదోషమని ప్రకటించే ముందు మనలో ఉన్న తప్పులని సరి చేసుకుంటే ఆ యంత్రాన్నీ మనందరికి మంచి చేసే పెన్నిధి లాగా మార్చవచ్చు!" అనింది సురభీ తన ప్రసంగాన్ని ముగిస్తు.

ప్రేమతో తన కుతురుకి ముద్దుపెట్టి "భలే చెప్పవు! నువ్వు నాకు అసలైన పెన్నిధి!" అని అన్నడు వంశీ ప్రేమతో.

ఇది అన్నాడో లేదో వాన చినుకులు తండ్రీ కుతుర్ల నొసళ్లని తాకాయి. వంశీ సురభీ ని చూసి తప్పుచేసిన పిల్లాడివలే నవ్వాడు.

"నాన్న! తొందర్గ ఈ బట్టల్నీ దండేమ్నుంచి తీసేద్దాము లెకపోతే అమ్మ మనల్నీ వదలదు!" అనింది సురభీ నవ్వుతు.

ఇద్దరు జింక పిల్లల్లా పరిగెత్తారు దండేము వైపు నవ్వుతు!

మరిన్ని కథలు

Bamma ki ichina mata
Bamma ki ichina mata
- Prabhavathi pusapati
Peddakodalu
పెద్దకోడలు
- మద్దూరి నరసింహమూర్తి
Parina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం
Tatayya salahalu
తాతయ్య సలహాలు
- గాయత్రి కులకర్ణి
Seshajeevitam
శేష జీవితం
- మద్దూరి నరసింహమూర్తి
Veda samskruthi
వేదసంస్కృతి
- టి. వి. యెల్. గాయత్రి.
Nijamaina bhakthi
నిజమైన భక్తి
- బోగా పురుషోత్తం, తుంబూరు.