ఏ1 ఫార్ములా - వై.కె.సంధ్యా శర్మ

A1 farmula

ఫోన్ పదే పదే రింగవుతుంటే బద్ధకంగా కళ్ళు మూసుకునే " హలో...!"అనగానే అవతలి వైపు నుండి "హాయ్..జో..గుడ్మార్నింగ్" అన్నాడు జే. నిద్ర మత్తులోనే "హలో హా... య్..జే..గుడ్ మార్నింగ్ ..ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు..?" అంది నిద్ర సరిపోకపోతే వచ్చే ఆవలింతతో. "జో...ఇది పొద్దున్న కాదు..ఇంకో అరగంట పోతే మధ్యాహ్నం పన్నెండవుతుంది."అన్నాడు నింపాదిగా. "హో...మధ్యాహ్నమవుతోందా..?"అంటూ కళ్ళు పెద్దవి చేసుకుని ఫోన్లో సమయం చూసుకుంది. "హా..మేడం గా రు రాత్రంతా ఏం చేస్తున్నట్లు నిద్ర పోకుండా..?"అంటూ దీర్ఘం తీశాడు జే. "నైట్ షిఫ్ట్ జె ,ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయడానికే ఫైవయింది,ఎలాగూ ఈరోజు వీకెండ్ కాబట్టి లేట్ గా లేచినా ఫర్వాలేదని పడుకున్నా..ఇంతలో నీ ఫోన్..నా నిద్ర డిస్టర్బ్ చేస్తూ"అంది బుంగమూతి పెట్టి మరొక ఆవలింత రాగానే ..చూశావా..నాకింకా నిద్రొస్తోంది..బై.తర్వాత మాట్లాడుకుందాం.."అని కాల్ కట్ చేస్తోంటే. "జో..ప్లీజ్..ఒక్క మాట.."అన్నాడు. "హా..చెప్పు "అంది "నేను అడిగినదానికి ఏం ఆలోచించావు? "అన్నాడు. తన నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందోనని ఆలోచిస్తూ. "ఐ యామ్..నాట్ ఓకే..జె, బట్ స్టిల్ ఐ థింక్ అబౌట్ ఇట్..గివ్ సమ్ స్పేస్" అంది కాస్త సీరియస్ గా మొహం పెట్టి. "జో..ఇంకోసారి ఆలోచించు.. ముందు సరే అన్నావ్..ఇప్పుడేమో..వద్దు అంటున్నావ్ ..వాట్స్ యువర్..ప్రాబ్లం ప్లీజ్ షేర్ యువర్ ఫీలింగ్స్ విత్ మి...."అన్నాడు కాస్త ఆర్థ్రతగా జే. "నాకు ఇంకొంచెం టైం కావాలి.. "అంటూ కాల్ కట్ చేసింది జో. *** ముంబై మహా నగరంలో ఫాస్ట్ ట్రెండ్ కు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్న ప్రపంచంలో కలుసుకున్న జోహ్నిక ,జెశ్వంత్. ఇద్దరూ ఒకే కంపెనీలో రెండేళ్లుగా హెచ్ ఆర్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు. ఒకే ప్రాంతం కావడంతో తొందరగానే ఫ్రెండ్సయ్యారు. వీకెండ్ పార్టీలతోనూ పిక్ నిక్ లతోనూ కాలక్షేపానికి తగినంత మందిని వెంటేసుకుని తిరిగి రావడం ఎవరి ఫ్లాట్స్ కు వారు వెళ్ళడం జరుగుతోంది. ఇలా తిరిగి వెళ్ళడంలోనే ఒకరిని వదిలి ఒకరు వుండలేనంత పరిచయం స్నేహం ప్రేమలో వున్నప్పుడే ఒకరిపై ఒకరికి కలిగిన ఇంట్రాక్షన్ తో జీవితాంతం కలిసి ఇలాగే వుండగలమా లేదా అనే సందేహం ఇద్దరికీ కలిగింది. అలా వుండాలంటే పెళ్ళి చేసుకోవాలి. కానీ ..ప్రస్తుతం తమచుట్టూ వున్న ప్రపంచంలో పెళ్ళి కి ఎవరూ సిద్ధంగా లేరు. అలా ముందుకు వెళ్లిన ఒకటి రెండు సంవత్సరాల్లో విడాకులు తీసుకుని.. మరొకరు అంటూ తలోదారిలో వెళుతున్నారు. అందుకే ప్రస్తుత ట్రెండ్ "లివింగ్ టుగెదర్" దారిలో నడవాలనుకుంటున్నారు.ఒకరికొకరు ఇష్టం వున్నంతకాలం కలిసి వుండి తర్వాత బ్రేక్ అప్ చెప్పుకుని విడిపోయి ఎవరికివారు బతకడమేనని, చాలా ఈజ్ గా వుంది కదూ అంటూ అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఇదే విషయంపై వారం ముందు వరకు జోహ్నిక ,జెశ్వంత్ కూడా ఫ్రెండ్స్ తో ఏఖీభవించారు. లాస్ట్ వీకెండ్ ట్రిప్ లో జోతో తన మనసులోని మాటను జెశ్వంత్ చెప్పగానే ఒక్కసారిగా కలవరపాటు పడి.. 'ప్రేమ వరకు ఓకే గాని లివింగ్ టుగెదర్ లో ఒకే ఇంట్లో ఒకటిగా వుండి ఇష్టం లేకపోతే విడిపోదాం..'అన్న మాట తలచుకోగానే గుండెల్లో ఎందుకో భయం తొణికసలాడింది జో కు. "గివ్ సమ్ టైం జే"అంటూ సమయం తీసుకుంది. *** ఈరోజు వీకెండ్ కాబట్టి తను ఫ్రీగా వుంటుందని మనసులోని మాటను తెలుసుకోవాలనే ఆత్రుతతో స్వతహాగా.. అడిగేశాడు జే. తను ఓకే చెప్తే ఇప్పుడే వెంటనే తనని కలిసి ఇద్దరి టేస్ట్ కి నచ్చే వాటిని షాపింగ్ చేయాలని , మరో ఫ్రెండ్ పిలిస్తే కూడా రానని చెప్పేశాడు . ఇప్పుడు 'జో..'ఇంకా టైం కావాలని అడుగుతోంది. 'ఇంతకు తను నచ్చినట్లా...లేదా..? పరిచయం ఐనప్పటి నుండి ఇంత వరకూ కూడా బాగానే వున్నాం.. హద్దు మీరి ప్రవర్తించింది లేదు. ఒకరికి ఒకరంటే అమితమైన గౌరవం. ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా వుంటాయి. అంతకంటే తనంటే ఎంతో ప్రేమ.. తొలి పరిచయం లోనే తన మాట తీరుకు తన ఆత్మాభిమానానికి తన మెచ్యూరిటీకి బానిసనైపోయాను. ఇక రూపం అంటే వంశీ చిత్రాల్లో చూపిన గోదారి హొయలన్నీ తనలోనే వున్నాయి. తన నవ్వుకైతే అయస్కాంతం అవసరం లేనంత ఆకర్షణ. ఆ కళ్ళు వర్ణించ వీలు కాదు.. ఇంద్ర ధనుస్సులా ఇన్ని సుగుణాల రాశిని ఇష్టపడని వాడుంటాడా.. కానీ .. స్నేహం వేరు ప్రేమ వేరు, లివింగ్ టుగెదర్ లో కలిసి జీవించడం వేరు. ప్రేమకు అడ్డు చెప్పని జో.. దీనికి ఎందుకు ఇంత ఆలోచిస్తోందో.. అర్థం కాలేదు. ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చిన ముంబైలో ఫ్రెండ్స్ తో పాష్ గా వున్న అమ్మాయిలనే చూశా..కానీ.. తనెందుకు టైం తీసుకుంటోంది.. ఒక వేళ తన సమాధానం నో..ఐతే తన ప్రేమకు కూడా బ్రేకప్ చెప్పేస్తుందా. కానీ జోకు తనంటే చాలా ఇష్టమని తన మాటల్లోనూ చేతల్లోనూ ఎప్పటికప్పుడు చూపిస్తూనే వుంటుంది. జో సమాధానం ఏదైనా.. ముందు ఎలా వున్నానో అలాగే వుండాలని మనసుకు నచ్చజెప్పుకున్నాడు. తన స్నేహం తనతో లైఫ్.. లైఫ్ లాంగ్ కావాలనే తను ఆరాటపడుతున్నాడు. అలాంటిది జో నో చెప్పినా.. తనకు దూరంగా వుండలేడు. అంతగా ప్రేమించాడు జోహ్నికను. *** జే కాల్ కట్ చేసిన జోహ్నిక బెడ్ పైనే అలాగే కళ్ళు మూసుకుని జే రూపాన్ని తలచుకుంటూ 'సారి ...జే, టైం అడిగింది నిన్ను కాదనడానికి కాదు. మనం లైఫ్ లాంగ్ కలసి వుండటానికి. ఇది నీకు అర్థమయ్యేంత వరకు ఇలాగే చెప్తుంటాను'అని దిండుని గట్టిగా పట్టుకుని నవ్వుతూ పక్కకు తిరిగి పడుకుంది. *** చిన్నప్పటి నుంచి తల్లి జలజ తో అన్నీ షేర్ చేసుకునే అలవాటు వుండటంతో జే ను ప్రేమిస్తున్న విషయం కూడా చెప్పింది. ఇప్పుడు జే అడిగిన లివింగ్ టుగెదర్ కు తను "ఏం చెప్పాలో ఆలోచిస్తున్నాను అమ్మా.. ! ఏం చేయమంటావు?" అని అడగటంతో. ఏ తల్లైనా..నాలుగు చీవాట్లు పెట్టి ఉద్యోగం మాన్పించి మరొకడితో సంబంధం చూసి ఇష్టం వున్నా లేకపోయినా పెళ్ళి జరిపించాలనుకుంటుంది. కానీ తన తల్లి అలా ఆలోచించదని తెలిసే తన ఆలోచనను తల్లి తో పంచుకుంది. " ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే అమ్మా..అందరూ ఇటు వైపే మొగ్గు చూపుతున్నారు. నన్ను జే అడగకముందు వరకు కూడా నేను దీనిని సపోర్ట్ చేశాను ఫ్రెండ్స్ తో. కానీ, ఇప్పుడు తనతో లివింగ్ టుగెదర్ కు ఒప్పుకోవాలా వద్దా అనే మిమాంసలో వున్నా ,నువ్వు చెప్పమ్మా..?" అంటూ తన సమస్య ను తల్లి ముందుంచింది. "నువ్వు జేను మనఃస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా...?"అనడిగింది జలజ కూతురిని. "అవును.." "తనకు..? " "నేనంటే ఇష్టమే అమ్మా.."అంది "అంటే కొద్ది రోజులు మాత్రమే వుండే ఇష్టమా.. లేక తనతో ఎప్పుడూ కలిసే వుండాలనేంత ఇష్టమా...?" అనడిగింది జలజ. "అమ్మా... తను నా పక్కనుంటే బాగుంటుంది , నువ్వు నాతో వున్నప్పుడు నేనెలా సెక్యూర్ గా ఫీలవుతానో..తనతో వున్నప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది..,అందుకే మేమిద్దరం మాటల్లోనే ఒకరికొనొకరం ఇష్ట పడుతున్నట్లు కనిపెట్టాం..ఎవరూ ముందుగా ప్రేమిస్తున్నాను అని కూడా చెప్పుకోలేదు..తను మెచ్యూర్ గా ఆలోచిస్తాడు.. ప్రతిదీ ప్రొటెక్ట్ చేసే విధానం ఆఫీస్ వర్క్ ఐనా..పర్సనల్ విషయమైనా..ఒకేలా తీసుకుంటాడు.. అతిగా ఎవరి నుండీ ఏమీ ఆశించడు.. అందుకే నేను త్వరగా తనకు అట్రాక్ట్ అయ్యానేమో అనిపించింది.. ఆజ్..లైక్ యు..మామ్ "అంది.. జో "మరైతే..తన ఆలోచన , తను కూడా నిన్ను ఇలాంటి ఆలోచనతోనే చూస్తున్నాడా... లేక యూజ్..అండ్...త్రో.." అంటూ ఆపింది జలజ.. "అమ్మా..!" అంది జో గట్టిగా "జో ...ఐ మీన్..నువ్వు అర్థం చేసుకుంటావనే చెప్తున్నాను..,ఇప్పటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ వుంటాయి..ఈ క్షణం కావాలనుకున్నది మరో క్షణం అవసరం లేనిదిగా అనిపించవచ్చు.. అది నీ విషయమైనా మరొకటైనా.."అంటూ జలజ జోను సందేహంలోకి నెట్టేసింది. అటువైపు నుండి నిశ్శబ్దం. జో, తల్లి తో ఏం చెప్పాలో ఆలోచిస్తుంటే "జో...,తనతో నీ లైఫ్ ఎప్పుడూ బాగుంటుందనుకుంటే హ్యాపీగా పెళ్ళి చేసుకో..తనకు కూడా నిన్ను పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం వుందో లేదో తెలుసుకో.. ముందు" అంది కూతురిని అనునయిస్తూ .తన మనసును ఎక్కువ సేపు కష్టపెట్టడం తల్లిగా తనకే ఇష్టం వుండదు. "అమ్మా పెళ్ళికి తను ఒప్పుకుంటాడంటావా..?"అంది అనుమానంగా జో , జెశ్వంత్ ను విడిచి వుండలేని భావనతో. "జో.. మన దేశంలో వివాహానికి వున్నంత గొప్పతనం మరే దేశంలోనూ లేదు. ఆది దంపతులుగా పార్వతీ పరమేశ్వరులను ఆదర్శ దంపతులుగా సీతారాములను కొలిచే దేశం మనది., కలిసి వుండడమో.. విడిపోయి బ్రతకడమూ మన చేతిలోనే వుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని అర్థవంతమైన జీవితాన్ని గడపడంలోనే సాఫల్యత పొందాలి కానీ, చీటికిమాటికి డబ్బు కోసమో..అనుమానంతోనో మరేదానికోసమో.. గొడవపడుతూ దినదినం నూరేళ్ళ గండంగా కాదు. ఈరోజు నేను అమ్మగా నీకు నేర్పిన పాఠాన్నే రేపు నీ తరాన్ని నడిపించే మాతృక కావాలి నువ్వు. అంతే కానీ ఈరోజు ఇప్పుడు నీకు నచ్చిన వాడితో లైఫ్ షేర్ చేసుకుని మధ్యలో మరొకడితో నీ లైఫ్ మొదలు పెట్టావంటే అది నీ పిల్లలకు ఎలాంటి సంకేతాలను ఇస్తుందో నువ్వే తెలుసుకో. అలాగని నిన్ను సర్దుకుపోయి బతకమని అనడం లేదు. ఒకరికోసం మరొకరు వున్నామనే ప్రేమను పంచుకోవాలి. అప్పుడే ఏ క్షణం ఎవరు తప్పు చేసినా అది పెద్దగా కనిపించదు.. అలాంటి బంధాన్ని కోరుకోండి ఇద్దరూ.సహజీవనం చేస్తాం.. సరదాగా వుంటాం అంటే వయసులో వున్నంత వరకు హ్యాపీనే.. ఆ తర్వాత అనుభవించే ఒంటరితనంలోకి బలవంతంగా వెళ్ళకు.. అని ఖచ్చితంగా జలజ చెప్పడంతో.. ఆలోచనల్లో పడింది జోహ్నిక. *** "జే...! ప్లీజ్ వదులు...టైం అవుతోంది, ఆఫీస్ కి వెళ్ళాలి ఇద్దరూ.. ప్లీజ్" అంటూనే, తన నడుంచుట్టూ వేసిన చేతులను తన చేతులతో బిగించి.. వెల్లకిలా పడుకొని పైకి లాక్కున్నట్లే లాగి దూరంగా నెట్టింది జోహ్నిక. "జో.. ఒక్క క్షణం .. జో.. "అంటూ నిద్ర మత్తు వదలని జే , తన ఎర్రని పెదాలను తన పెదాలతో హత్తుకుపోయి తన కళ్ళలోకి ఆరాధనగా చూశాడు జెస్వంత్ . "లవ్ యు జే "అంటూ తన కౌగిట్లోకి ఒదిగిపోయింది. ఇంతలో జెస్వంత్ ఫోన్ రింగవడంతో పేరు చూసి .." ఓహ్.. డాడ్.. "అంటూ బెడ్ పైన నుండి గబగబా లేచి..కూర్చుని "హలో.. డాడ్ ,చెప్పండి "అనగానే.. "జే..ఆఫీసుకు బయల్దేర లేదా.. ?"ఇంకా అనడిగాడు జెస్వంత్ తండ్రి జగదీష్. "హా..లేదు.. ,వెళతాను.. వెళ్ళలేదు.. "అంటూ జోతో డాడ్ అని సైగ చేస్తూ కంగారుగా అనడంతో. "సరే..సరే.. అమ్మాయి ,ఆఫీసుకు వెళిపోయిందా.. "అనడిగాడు "లేదు డాడ్ ఇద్దరం కలిసే వెళతాము" అన్నాడు జే. ఫోన్లో కొడుకు కంగారు చూసి.. తను ఏ పొజిషన్లో వుంటాడో అర్థమై.. "ఫార్ములా సరిగ్గా ఉపయోగిస్తున్నావా.. ?"అనడిగాడు నవ్వుతూ కొడుకుని. "డాడ్.. !"అని గట్టిగా "ఫార్ములా .. ష్" అనడంతో జె. "ఓకే బై.. బీ హ్యాపీ జె "అంటూ కాల్ కట్ చేశాడు జగదీష్. ఫార్ములా మాట విని జో అర్థం కానట్లు "జే..ఇందాక అంకుల్ ఏదో ఫార్ములా అంటున్నారు.. ఏంటది.. ?"అనడిగింది అనుమానంగా. "అది..అది.."అంటూ జోని వెనక వైపు నుంచి శంఖం లాంటి చెవిలో "అది సీక్రెట్ "అన్నాడు.. ఏదో చెప్తున్నాడని ఆశగా ఎదురు చూసిన జో కు నిరాశ కలగడంతో.. "యూ.. "అంటూ తనను దూరంగా నెట్టి తలగడను విసిరింది జె తన దగ్గరగా వెళ్ళబోతే.. "రావద్దు.. నా దగ్గరకు అసలు రావద్దు ..!"అంటూ అటుతిరిగి బుంగమూతి పెట్టుకుంది.. జోహ్నిక. "హే..ఓకే ఓకే చెప్తాను.. ఈ హ్యాపీ డేని అప్ సెట్ చేయకు "అంటూ కన్ను గీటి తనకు దగ్గరగా వెళ్లి చేతులను పట్టుకున్నాడు.. ఐతే చెప్పమన్నట్టుగా బెట్టుగా చూసింది జె ని. ఇక తప్పదన్నట్లుగా.. "ఏ ప్లస్ బి హోల్ స్కొయర్ ఫార్ములా " అన్నాడు తాటి తొనల లాంటి తన బుగ్గలను అరచేతితో తడుముతూ.. జో .. అర్థం కానట్లు.. "ఏ ప్లస్ బి హోల్ స్కొయర్ "అంది "హా.. !"అన్నాడు నిజమేనని.. "దేనికి ఎందుకు .. ?"అంది ప్రశ్నార్థకంగా.. "మన లైఫ్ ని మనం అనుకున్నట్లుగా గడపడానికి.."అన్నాడు.. "ప్లీజ్ జె ,కాస్త అర్థం అయ్యేలా చెప్పు" అంది..జో. జో కళ్ళలోకి చూస్తూ "నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో.. నేను నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమించాను.. నీతో కలిసి జీవించాలనుకున్నా.. ఏదో ఒకరోజో రెండు రోజులో కలిసి చేసే డేటింగ్ లా కాదు.. ఆర్నెల్లు సంవత్సరంలోనో విడిపోయే లివింగ్ టుగెదర్ లా కూడా కాదు.. లైఫ్ లాంగ్.. నువ్వు నాకు కావాలనుకున్నా.. ఓ వైపు లివింగ్ టుగెదర్ కు నువ్వు ఎక్కడ నో చెప్తావో.. అనే భయం.. మరోవైపు నీ స్నేహం కూడా దూరమవుతుందేమోననే బాధ.. రెండు నన్ను నిలువనీయ్యలేదు.. నీ నుంచి జవాబు కోసం ఎదురు చూస్తుంటే అప్పుడే డాడీ ముంబై వచ్చారు.. నీగురించి చెప్పాను.. లివింగ్ టుగెదర్ గురించి ఆలోచిస్తుందంటే.. ఆ అమ్మాయి నిన్ను సంపూర్ణంగా కావాలని కోరుకుంటుందేమో.. అని చెప్పారు"అన్నాడు జె "అదీ నిజమే కదా.. !"అనుకుంది జో.. తన మనుసులోనే.. "మరి ఫార్ములా ఏంటి .. ?" అంది తన అనుమానం తీరడానికి.. డాడ్ చెప్పిందే.. "నువ్వు ఆ అమ్మాయి నుంచి స్నేహం ప్రేమ శృంగారం ఏది కోరుకుంటున్నావని అడిగారు.. " ఆ ప్రశ్నకు నాకు ఏం చెప్పాలో.. తెలియక.. స్నేహం.. అన్నా.. ,కానీ డాడ్ అందుకు అంగీకరించలేదు.. ఈ వయసులో కోరుకునేది శృంగారం.. దానికే స్నేహం ప్రేమ మరొకటని పేరు పెట్టి కలిసుందాం.. కలుసుకుందామని లివింగ్ టుగెదర్ గా డేటింగ్ గా సహజీవనంగా మార్చేసుకున్నారు.. నీకు ఆ అమ్మాయిపై నిజమైన ప్రేమే వుంటే ఏ ప్లస్ బి హోల్ స్కొయర్ ఫార్ములాని ఫాలో అయిపో.. అన్నారు.. అంటే( ఏ ప్లస్ బి హోల్ స్కొయర్ = ఏ ప్లస్ బి ప్లస్ టుఏబి . శృంగారం ప్లస్ ప్రేమ/స్నేహం = శృంగారం ప్లస్ ప్రేమ/స్నేహం ప్లస్ ప్రేమతో కలిగిన శృంగారం.. హోల్ స్కొయర్ లో జీవితం మొత్తం అనుభవించమని..మధురమైన అందమైన జీవితాన్ని గడపడానికి ఈ ఫార్ములా కు ఏకైక మార్గం పెళ్ళి.. అందరి అమ్మాయిల్లా ఆ అమ్మాయి లేదు అంటే ,తను సమ్ థింగ్ .. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థకు కట్టుబడి వుండే అమ్మాయే అయి వుంటుంది.. పెళ్ళి చేసుకుందామని అడుగు .. తప్పకుండా ఒప్పుకుంటుందన్నారు.. అలాగే నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి పెళ్ళి కి ప్రపోజ్ చేశాను.. నువ్వు ఒప్పుకున్నావు.. నా ఏ1 ఫార్ములా ఆర్నెల్లు గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.. మరో అరవై యేళ్ళకు నీ హామీ కావాలి డియర్ అంటూ ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం కలిసి ప్రేమగా స్నేహంతో వుండాలని కోరుకున్నాను..నువ్వు వుంటావుగా జో "అన్నాడు ఆరాధనగా..పాల మీగడ లాంటి తన ముఖంలోకే చూస్తూ.. "జె... నేను కోరుకున్నది.. ఇదే.. థ్యాంక్యూ ఫార్ యువర్ ఫార్ములా"అంటూఎర్రబడిన బుగ్గలతో నవ్వుతూ జెస్వంత్ ని అల్లుకుపోయింది జోహ్నిక. -సమాప్తం.

మరిన్ని కథలు

Oke okkadu
ఒకే ఒక్కడు
- కందర్ప మూర్తి
Mitam
మితం
- ఆదిత్య ప్రణవ్
Bamma ki ichina mata
Bamma ki ichina mata
- Prabhavathi pusapati
Peddakodalu
పెద్దకోడలు
- మద్దూరి నరసింహమూర్తి
Parina pachika
పారిన పాచిక!
- - బోగా పురుషోత్తం
Tatayya salahalu
తాతయ్య సలహాలు
- గాయత్రి కులకర్ణి
Seshajeevitam
శేష జీవితం
- మద్దూరి నరసింహమూర్తి
Veda samskruthi
వేదసంస్కృతి
- టి. వి. యెల్. గాయత్రి.