
“ఈ కొర్స్ లో మా ఇంస్టిట్యూట్ చాలా రాంకులు సాధించింది సార్!” అనింది ఒకానొక ఐఐటి కోచింగు సంస్థ ప్రతినిధి వైభవ్ తో ఫోన్ లో. “పూర్తి సంస్థ లో ఎన్ని బ్యాచులు ఉంటాయి?” అని అడిగాడు వైభవ్. “మొత్తము 6 ఉంటాయి సార్, పిల్లలు అడ్మిశన్ అయ్యాక పరీక్షలో ఎన్ని మార్కులు తెచ్చుకుంటారో దాని బట్టి బ్యాచుల్లో విభజించ పడుతారు” అనింది ప్రతినిధి. “సరె” అంటు వైభవ్ కాల్ కట్ చేసాడు. అప్పుడే వైభవ్ భార్య కౌసల్య రూమ్ లోకి వచింది. వైభవ్ ఒక వ్యాకులత గమనించిన కౌసల్య “ఏమైంది” అని అడిగింది. “ మన సుమిత్రా పదో తరగతి పూర్తిచ్చెయ్యబోతుంది కాని నాకు ఇంక దానిని ఏ ఎంపీసీ సంస్థ లో వెయ్యాలో అర్ధం కావట్లేదు” అన్నాడు వైభవ్ నిట్టూర్పుతో. వైభవ్ వైజాగ్లో సొంత వ్యాపరము నడుపుతున్నాడు. కూతురు చదువు గురించి అంచుకయించుక పట్టించుకునే వైభవ్ కి కొద్ది రోజులుగా కూతురు చదువు పైన అత్యంత చింత మొదలైంది. వైభవ్ హైదరాబాద్ లో ఉంటున్న తన చిన్ననాటి స్నేహితుడు సురేశ్ తో ఫోన్ లో మాట్లాడేటప్పుడు సురేశ్ తన కొడుకు ఇప్పుడూ దేశం లోని పెద్ద ఐఐటి కాలేజ్ లో ఉన్నాడని, త్వరలో అతనికి ఉద్యొగం రావొచ్చని, ఆ ఉద్యోగంలో జీతం బాగా ఉండవచ్చునని చెప్పడు. ఇది వినగానే తన సుమిత్రా ని కూడా ఎలాగైనా మంచి కాలేజ్ లొ చదివించాలని పట్టుపట్టాడు. “అన్ని అవ్వాల్సిన సమయము లో అవుతాయి, దానికోసము నిద్ర మానుకోవక్కర్లేదు, 12 అయ్యింది ఇంక పడుకుందాము” అనింది కౌసల్య. మరుసటి పొద్దున స్కూల్ కి అయ్యారు అయ్యి బస్సు కోసం ఎదురు చుస్తున్న సుమిత్రా తో “ఇవాళ నిన్ను స్కూల్ కి నేను తీసుకువెల్తాను” అన్నాడు వైభవ్. సుమిత్రా ఏమనలేదు. సుమిత్రా చదువుల్లో క్లాస్ లో ఉన్నతస్థానం లో లేక పోయిన తనకి సాహిత్యాము లో చాల పట్టుంది. ఈ సాహిత్యం మీద ఇంపు తనకి తన తాతగారి వల్ల వచ్చింది. ఆయనా వైజాగ్ వచ్చినపుడల్ల సుమిత్రా కోసము పుస్తకాల మూట పట్టుకొస్తాడు. ఆ పుస్తకాలన్నీ చదవడానికి సుమిత్రా కి ఒక వారమే పట్టేది. ఈ సాహిత్యము మీద ఉన్న పిచ్చి ని వైభవ్ ఎప్పుడును ఒక వృత్తీగా పనిచేస్తుందని నమ్మలేదు. అతనికి సుమిత్రా కీ ఈ విషయము పైన చాలా చర్చలే జరిగాయి కాని ఎప్పుడు “నువ్వు చిన్నపిల్ల వి, నీకు వీటి గురించేమి తెలుసు?” అని సుమిత్రా నోరు మూసేస్తాడు వైభవ్. తనలో తానే ఆలోచిస్తే ఏ ఫలితము ఉండదని, సుమిత్రా వాళ్ళ ఉపాధ్యాయురాలు తో ఈ విషయం గురించి చర్చిద్దాము అని స్కూల్ కి వెళ్తున్నాడు. సుమిత్రా చదువుతున్న స్కూల్ అంత పెద్దది కాకపోయినా ఆ స్కూల్ కి వైజాగ్లో చాలా మంచి పేరుంది. ఈ స్కూల్ లో మాములుగా చెప్పే చదువు తో పాటు సంగీతము, చిత్రకళ లాంటివి కూడా నేర్పిస్తారు. సుమిత్ర ని తన క్లాసుకి పంపించేసి వైభావ్ ఒంటరిగా ఉపాధ్యాయురాలు ని కలవడానికి వెళ్ళాడు. స్కూల్ స్టాఫ్ రూమ్ లో సుమిత్రా క్లాస్స్ ఉపాధ్యాయురాలు లక్ష్మి కూర్చుంది. “వైభవ్ గారు ఇలా వచ్చారు ఏంటి స్కూల్ కి?” అని అడిగింది లక్ష్మి వైభవ్ ని చూసి. వైభవ్ ఎదో చెప్పబోతు ఆపేసాడు. వైభవ్ యొక్క సంశయాన్ని గుర్తించి “మీరేమి కంగారు పడకండి, సుమిత్రా ఫైనల్ పరీక్షల్లో బాగా రాస్తుంది” అనింది లక్ష్మి. “నా బాధ ఈ పదో తరగతి పైనల్ గురించి కాదు మాడం, దాని తర్వాత వచ్చే దాని గురించి” అన్నాడు వైభవ్. “మన సుమిత్రా కి ఎలాగో సాహిత్యం, డ్రామా మీద ఇష్టముంది కదండీ, ఆ రంగంలోనే తన్నీ ప్రోత్సహిద్దము” అనింది లక్ష్మి ఉత్సాహంతో. కాని ఈ మాటలు వినగానే “ఆడపిల్ల తండ్రి గా చెప్తున్నా ఏమి అనుకోకండి కాని ఈ సాహిత్యము డ్రామాలు కడుపు నింపవు. నాకు నా కూతురు మంచి చదువు చదవాలని కోరిక ఉంది” అని చిరాకు పడ్డాడు వైభవ్. “కాని సుమిత్రా కి కోరిక ఉందా?” అని మెల్లగా అడిగింది లక్ష్మి. వైభావేమి సమాధానము ఇవ్వలేదు. “మీ నిర్ణయాన్ని కొంచం సేపు పక్కకి పెట్టండి, ఎల్లుండి స్కూల్ లో ఒక కార్యక్రమము జరుగబోతుంది. దానికి ముఖ్య అతిథి గా ఇస్రో శాస్త్రవేత్త వస్తున్నాడు. ఆయన పిల్లల చదువు కి సంబంధించిన విషయాల గురించే మాట్లాడుతాడు. ఆ రోజు తర్వాత మీ నిర్ణయాన్ని మల్లి పరిశీలించండి.” అని వైభావ్ కి సర్దిచేప్పింది లక్ష్మి. అ దినం రానేవచ్చింది. ఆ కార్యక్రమము రోజు వైభవ్, సుమిత్రా, కౌసల్య చివరి కుర్చిలలో కూర్చొన్నారు. ఆ కార్యక్రమము స్కూల్ మైదానం లో జరుగుతుంది . సుమారు ౪౦౦ మంది ఆ మైదానం లో ఉన్నారు. ఏర్పాట్లు ఘనంగా జరిగాయి. వైభవ్ ఇంకా సుమిత్రా స్నేహితురాలు సుష్మ తండ్రి వివేక్ మాట్లాడుకుంటున్నారు. “మీ సుష్మ ని ఏ కోర్స్లో చేర్చాలో నిర్ణయించార” అని అడిగాడు వైభవ్. “తనకి చిన్నప్పటినుండి డాక్టర్ అవ్వాలి అని కోరిక ఉండేది. అందుకే ఆమెని ఒక బైపీసీ కోచింగ్ లో చేర్చాను. సుమిత్రా ఏమి చెయ్యబోతుంది?” అని అడిగాడు వివేక్. “నేను తనని ఎంపీసీ లో చేర్చి ఐఐటీకి పంపియాలి అనుకుంటున్నాను కాని ఏ కోచింగ్కు మంచిదో తెలియట్లేదు” అన్నాడు వైభవ్. “మీరు అనుకోవడము ఏంటి? సుమిత్రా కి ఇష్టమేనా?” అని ప్రశ్నించాడు వివేక్. వైభవ్ సమాధానము ఆలోచించే లోపే వాళ్ళ సంభాషణను చప్పట్లు కప్పేసాయి. వైభవ్ ఈ చపట్ల హేతువు ఏమిటో అనుకుంటూ స్టేజి వైపు చూసాడు. ముఖ్యాథిది గా వచ్చిన ఇస్రో శాస్త్రవేత్త మైక్ నూ పట్టుకొని మాట్లాడుతున్నాడు. “మన పిల్లలకి మనం గొప్ప చదువు ని ప్రసాదించాలి అనుకోవడము తప్పు కాదు. కాని ఈ కాంక్ష ని పట్టుకొని మన పిల్లలయొక్క ఇష్టాలు పట్టించుకోకపోవడం తప్పు. ఒకరికి సైన్సులో ఉన్న శ్రద్ద ఇంకొకరికి నాట్యంలో ఉంటుంది. దాన్ని మనం మనసులో పెట్టుకొని వాళ్లని ప్రోత్సహించాలి. ‘ఒక చేపకి చెట్టు ఎక్కామని చెప్పి దాని ఆధారంగా ఆ చేప సామర్థ్యాన్ని నిర్ణయిస్తే, ఆ చేప దాని జీవితం అంత అది దేనికి పనికిరాదని అనుకుంటుంది’. ఈ మాట ఏ గొప్ప మనిషి చెప్పాడో ఎవరైనా లేచి చెప్పగలుగుతారా?” అని అడిగాడు శాస్త్రవేత్త శ్రోతలని. ఒక ఐదు సెకండ్లు మైదానంలో నిశబ్దము వ్యాపించింది. అకస్మాత్తుగా సుమిత్రా లేచి “ఆల్బర్ట్ ఐన్స్టీన్” అని అరిచింది. “వెరీగుడ్ అమ్మాయి, నీ పేరేమిటి?” అని అడిగాడు సుమిత్రానీ. “సుమిత్రా, సర్!” అని జవాబిచ్చింది. ఒకేసారి మైదానంలో మల్లి చప్పట్లు మారుమోగాయి. ఈ సంఘటనని ని చూసిన వైభవ్ అబ్బురపడ్డాడు. అతను గర్వంతో పొంగిపోయాడు. మిగిలిన కార్యక్రమము అంతా అతని మనసులో సుమిత్రా జవాబు చెప్పినప్పుడు వచ్చిన చప్పట్లే మారుమోగాయి. కార్యక్రమము అయిపొయిన తరవాతా సుమిత్రా క్లాస్ టీచరు సుమిత్రని పిలిచింది. ఇది వైభవ్ గమనించాడు. టీచర్ సుమిత్రాని ముఖ్యాథిది దెగ్గరకి తేసుకువెల్లింది. కన్ను కొట్టకుండా వైభవ్ ఈ వింత ప్రదర్శాన్నీ చూస్తు ఉండిపోయాడు. ఇస్రో శాస్త్రవేత్త సుమిత్రా కి షేక్ హ్యాండ్ ఇవ్వడము చూసీ గర్వ పడ్డాడు వైభవ్. సుమిత్ర ఆనందంతో పొంగిపోతు వచ్చి “సార్ నన్ను ఇస్రో హెడ్ అపిస్ కీ అహ్వానిచ్చాడు నాన్నా. నేను సాహిత్యం బాగా రాస్తాను అని తెలిసి నాతో ఒక ఎస్సె రాయిస్తాడట ఇస్రో చరిత్ర మీద.” అని అనింది సుమిత్రా కళ్లలో నీలు తిరిగి వైభవ్ ని గట్టిగా కౌగిలించుకుంది. ఇదంతా గమనించిన కౌసల్య చిరునవ్వూ నవ్వింది.