
సాధారణముగా స్కూళ్లలో తెలుగు ఉపాధ్యాయులు పిల్లలను భాషాపరమైన దోషాలు ఉచ్చరించి నప్పుడు లేదా వ్రాసినప్పుడు తప్పనిసరిగా ఎదో ఒక రకమైన శిక్ష వేస్తారు ఒక తెలుగు ఉపాధ్యాయుడు ఆ రకంగా విద్యార్థిని శిక్షించి తానూ ఇబ్బందుల పాలైన కధ ఇది .ప్రస్తుతం స్కూళ్లలో పిల్లలను దండించటం అనేది పూర్తిగా నిషిద్ధం అనుకోండి పొరపాటున కొడితే వెంటనే తల్లిదండ్రులు వచ్చి ఆ సదరు ఉపాధ్యాయుడితో గొడవ పడతారు కొన్ని సందర్భాలలో పోలీస్ కంప్లైంట్ దాకా వెళతాయి ప్రస్తుత పరిస్థితి ఇది పాతరోజుల్లో అయితే టీచర్ కొడితే తల్లిదండ్రులు ఎవరు స్కూల్ కి వచ్చి కంప్లైంట్ చేసేవారు కాదు పిల్లవాడికి చదువు రావడానికి కొట్టారు అని సర్దుకు పోయేవారు ప్రస్తుతం రోజులు మారిపోయాయి కదా పిల్లలను తప్పు ఇంక కథ లోకి వద్దాము.
ఒక చిన్న ఊరిలో స్కూల్లో తెలుగు క్లాసులో ఉపాధ్యాయుడు 5వ తరగతి పిల్లలకు డిక్టేషన్ చెప్పాడు రాసిన పిల్లలు వాళ్ళ నోట్ పుస్తకాలతో కరెక్షన్ కు వచ్చారు తప్పులుంటే ఒక దెబ్బ వేసి కరెక్షన్ చేస్తున్నాడు పిల్లలు దెబ్బలు తిని వాళ్ళ నోట్సులు తీసుకొని వెళుతున్నారు ఆ వరుసలో ఆ ఊళ్లోని పంచాయతీ ప్రెసిడెంట్ గారి కొడుకు కూడా ఉన్నాడు వాడు ఇంటికి వెళ్లి తెలుగు మేష్టారు కొట్టారు అని చెప్పాడు
మర్నాడు ఆ పంచాయతీ ప్రెసిడెంట్ మా పిల్లడ్ని ఎందుకు కొట్టావు అని తెలుగు ఉపాధ్యాయుడిని అడిగాడు అయన తెలుగు డిక్టేషన్ తప్పు రాస్తే కొట్టాను అని జవాబు ఇచ్చాడు వెంటనే ఏమి తప్పు రాసాడు అని ఆ ఉపాధ్యాయుడిని అడిగాడు దానికి జవాబుగా ఏమిటా తప్పు అని ఆ తండ్రి అడిగాడు "విద్యార్థి" కి ఒత్తు పెట్టాడు అది తప్పు కాబట్టి నేను కొట్టాను అని ఉపాధ్యాయుడు చెపుతాడు ఆ తండ్రి "ఉపాధ్యాయుడికి" వత్తు ఉన్నప్పుడు విద్యార్థికి పెడితే తప్పేంటి అని లాజిక్ లేవదీసి అనవసరంగా మా అబ్బాయిని కొట్టారు అని అల్లరి చేయడం మొదలు పెట్టాడు.
ఈ గొడవ చేసేది సాక్షాత్తు ఆ ఊరి ప్రెసిడెంట్ ఏదో విధముగా ఆ గొడవను సర్దుబాటు చేయాలనే ఉద్దేశ్యంతో హెడ్ మాష్టారు గారు ఒక నిజ నిర్ధారణ కమిటీని వేసి విచారణ చేద్దాం అని అన్నాడు ఆ ప్రెసిడెంట్ ఒప్పుకున్నాక ఓ కమిటీ ఏర్పాటు అయింది ఆ కమిటీ లో ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ ,ఒక లాయర్ ,ఒక తెలుగు పండితుడు సభ్యులు ఒక నెల తరువాత ఆ కమిటీ వారు వారి తీర్పులను ప్రకటించారు ఇంజనీర్ ఇచ్చిన తీర్పు ఏమిటి అంటే బిల్డింగ్ కు పునాదులు ఎలాంటివో అలాగే పదాలకు ఒత్తులు అలాంటివే కాబట్టి రెంటికి ఒత్తులు ఉండాల్సిందే అన్నాడు లాయర్ చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి ఉపాధ్యాయుడికి ఒత్తు ఉన్నప్పుడు విద్యార్థికి ఉంటే తప్పేంటి అని తీర్పు ఇచ్చాడు లేదా రెండు పదాలకు ఒత్తులు తీసెయ్యాలి అన్నాడు. డాక్టర్ ఒత్తులు పలికేటప్పుడు ఊపిరి తిత్తులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒత్తులు నిషిద్దము కాబట్టి ఒత్తులు లేకపోయినా ఫర్వాలేదు అని తీర్పు ఇచ్చాడు తెలుగు పండితుడు భాష శాస్త్ర శాస్త్ర ప్రకారం విద్యార్థికి ఒత్తు ఉండరాదు ఉపాధ్యాయుడికి ఒత్తు ఉండాలి అని తీర్పు ఇచ్చాడు నలుగురిలో ఇద్దరు వత్తులు తీసేయమని అన్నారు మూడో వ్యక్తి వత్తులు ఉంటె రెంటికి ఉండాలి లేదా రెంటికి లేకుండా ఉండాలి అన్నాడు కాబట్టి ఒక్క తెలుగు ఉపాధ్యాయుడు మాత్రం విద్యార్థికి ఒత్తు ఉండకూడదు అని గ్రామర్ ప్రకారము చెప్పాడు కానీ మెజారిటీ సభ్యులు అది తప్పు కాదని అభిప్రాయం పడ్డారు కాబట్టి తెలుగు ఉపాధ్యాయుడికి ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు తప్పును తప్పు అని చెప్పడం కూడా ఈ రోజుల్లో నేరమే ప్రస్తుతం మనము వింటూనే ఉన్నాము టీవీలలో సినిమాలలో ఉపయోగించే తెలుగులో ఒత్తులు పలకడం మానేశారు సినిమాల్లో కామెడీ కోసం మాత్రమే వాడుతున్నారు ఇదండీ ప్రస్తుత తెలుగు భాషా పరిస్థితి