పరిష్కారం - తాత మోహనకృష్ణ

Parishkaram

"నన్ను ఇప్పుడు ఏం చెయ్యమంటావు చెప్పు నవ్యా..?" అడిగాడు రాహుల్ "ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు" అడిగింది నవ్య

"ఈ విషయం చెప్పి నిన్ను ఎందుకు డిస్టర్బ్ చెయ్యడమని చెప్పలేదు" "ఇంతకీ ఏం జరిగింది..ఆ అమ్మాయి ఎవరు..?" "నేను ఒక్కడినే రూమ్ లో ఉంటాను కదా. సొంతంగా వంట వండుకుంటున్న నాకు, ఒకరోజు మా పక్కింటి అమ్మాయి వచ్చి..నీకు ఇంకా పెళ్ళి అవలేదా..? అంటూ నా మీదకు వచ్చింది.

నాకు చాలా భయం వేసింది.." "నువ్వూ అందరి మగాడిలాగే అనమాటా. ఇంకెందుకు..వెళ్లి ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకో?" "నన్ను అపార్ధం చేసుకోకు నవ్యా. నేను అలాంటివాడిని కాదు. మాది చాలా గౌరవ మర్యాదల గల ఫ్యామిలీ. నా కథ నీకు తెలియదు..తెలిస్తే, ఇలా నన్ను తప్పు పట్టవు. నా గురించి నీకు పూర్తిగా చెప్పాలి.. చిన్నప్పటినుంచి నన్ను మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్ గా పెంచారు. బాయ్స్ స్కూల్ లోనే చదువుకున్నాను. అమ్మాయిలతో కూడా పెద్దగ మాట్లాడేవాడిని కాదు.

పుట్టి పెరిగింది అంతా పల్లెటూరులోనే, అందుకే నాకు పెద్దగా ఏమీ తెలియదు. అమ్మాయిల వంక చూసినా, మాట్లాడినా మా నాన్న నాకు వాత పెట్టేవారు. అప్పటినుంచి అమ్మాయిల వంక అసలు చూసేవాడిని కాదు. ఎప్పుడూ చదువుకోవడం, ఆడుకోవడం అంతే...అలా నేను ఎప్పుడూ అన్నింట్లో ఫస్ట్ వచ్చేవాడిని. ఎంతోమంది అమ్మాయిలు నా వెంట పడినా..నేను ఎప్పుడూ వారి వంక చూడనే లేదు. తర్వాత పెద్ద చదువులకోసం, ఉద్యోగం కోసం నేను వేరే చోటకి వెళ్ళాను. ఇప్పుడు నీతో నా ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది. ఇందులో నా తప్పు ఎక్కడుంది చెప్పు..? నన్ను నమ్ము నవ్యా.." "నీ కథ విన్నాక..నీ మీద నమ్మకం పెరిగింది.. ప్రేమ ఇంకా ఎక్కువైంది.

అందంగా, మంచి ఉద్యోగం చేసే నీ లాంటి మగవారిని సొంతం చేసుకోవడానికి లోకంలో చాలా పోటీ ఉంది. నన్ను తొందరగా పెళ్ళిచేసుకో రాహుల్..ఇలాంటి సమస్యలకు అదే పరిష్కారం" అంది నవ్య *******

మరిన్ని కథలు

Apaatradanam
అపాత్రదానం
- Prabhavathi pusapati
Simhadri express
సింహాద్రి ఎక్స్ ప్రెస్
- అనంతపట్నాయకుని కిశోర్
Guudivada
గుడివాడ
- బొమ్మిరెడ్డి పల్లి ప్రమీల రవి
Pareeksha
పరీక్ష
- తాత మోహనకృష్ణ
M B Company
M B కంపెనీ
- మద్దూరి నరసింహమూర్తి