
సదిశ రాజ్యాన్ని శదిసుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి రాజ్యంలో గొప్పగొప్ప రాజనీతిజ్ఞలు వున్నారు. వారికి రాజు అంటే ఎంతో అభిమానం. రాజు వద్ద జీతభత్యాలు తీసుకుంటున్నా ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు. అందువల్లే వారికి రాజోద్యోగులు అంటే ఎంతో అభిమానం.
ఇటు ప్రజలకు సైతం రాజు అన్నా, రాజోద్యోగులు అన్నా ఎంతో మక్కువ వుండేది.
ఓ సారి శదిసుడికి ఊహించని ముప్పు ఎదురైంది. పక్క దేశాధిరాజు పరశురాముడు తన బలగంతో టంకశాలపై దాడిచేసి వున్న నగదు, నగలు అన్నీ దోచుకుపోయాడు. అప్పటికి రాజు ఇంకా నిద్రిస్తూనే వున్నాడు. ఏదో ఉలిక్కిపడి లేచి చుట్టూ చూసిన రాజుకు ఏదో యుద్ధం చేస్తున్నట్లు శబ్దం వచ్చింది. పైకి లేచి చూశాడు. పక్క రాజ్యాధిపతి పరశురాముడు కత్తి పట్టుకుని తనపైకి దూసుకు వస్తున్నాడు. ఇది చూసిన రాజు నిశ్చేష్టుడయ్యి రక్షణ కోసం సైనికులను అర్థించాడు.
అప్పటికే ఖజానాలో వున్న నగదు, నగలు పొరుగు రాజు దోచుకున్నాడు. ఇది చూసి నిర్ఘాంత పోయాడు. ఏమి చేయాలో దిక్కుతోచక చూస్తుండి పోయాడు. ఇది గమనించి రాజ భటుడు ఒకడు వెంటనే సైనికులను తీసుకుని రాజ్య సరిహద్దుల వద్దకు వెళ్లాడు. చుట్టూ బాగా లోతుగా గుంతలు తవ్వాడు. పైన చెట్లు కొమ్మలు కప్పి వుంచి తన ఇంటికి చేరుకున్నాడు.
పరశురాముడు విజయ గర్వంతో కన్నుమిన్నూ కానకుండా వేగంగా పరుగులు తీశాడు. సరిహద్దులు దాటే సమయంలో రాజనీతి శాస్త్రజ్ఞడు తవ్విన గోతిలో పడ్డాడు.
బాగా లోతైన గుంత కావడంతో నడుం విరిగి పైకి లేవలేకపోయాడు. దోచుకున్న ధన, కనక, వస్తువులన్నీ గుంతలో పడ్డాయి. ఇది సదిశ రాజ్యాధిపతి సదిశుడి చెవిన పడిరది. వెంటనే అక్కడికి చేరుకుని పైకి లేవలేని రాజును తనే లేపి నడిపించాడు. మానవత్వంతో తన వద్ద వున్న ఎముకల వైద్యుడి వద్ద వైద్యం చేయించాడు.
నడుం బాగైన తర్వాత ఇంటికి బయలుదేరాడు. మానవత్వం మరిచి అక్రమ మార్గంలో పరుల సంపద దోచుకున్నందుకు తగిన శాస్తి జరిగి బుద్ధి వచ్చింది. ద్రోహం తలపెట్టినా అన్ని మరిచి మానవత్వంతో వైద్యం అందించినందుకు కృతజ్ఞతలు పలికి దోచుకున్న సంపదను సదిశుడికి అప్పగించి సొంత రాజ్యానికి పయనమయ్యాడు మానవత్వం విలువ తెలుసుకున్న పరశురాముడు.