కొత్త బంగారు లోకం - మణి

Kotta bangaru lokam

అది, అంతా యుద్ధ భూమి . బాంబులు వేయని చోటు లేదు. ఎక్కడ చూసినా మృత కళే బరాలే . ఎక్కడ చూసిన కూలిపోయిన శిధిలాల శకలాలే .

దారి అంతా మృత కళేబరా లు , కూలిపోయిన భవన శిధిలాలు , పగిలిన అద్దాలు , నడవ శక్యం గా లేదు . వాటి మధ్య దారి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇద్దరు . వాళ్ళు హ్యూమనాయిడ్ రోబోస్ . దూరం నుంచి బాంబుల శబ్దం.

ప్రతి రోజూ, వాళ్ళు అక్కడ అంతా తిరగడం, గాయపడి వున్న వారిని రక్షించడం , వారి అవసరాలకి , అవసరం అయినవి అన్నీ, సేకరించడం, చేస్తూ వుంటారు . ఆ రోజూ అదేపని మీద, అక్కడ తిరుగుతున్నారు. ఇద్దరూ చాలా వేగం గా నడుస్తున్నారు. ఒకరి పేరు రాజేష్. మరొకరి పేరు అన్వర్.

దారి పక్కన , కూలిపోయిన మందుల దుకాణం , కనిపించడంతో ఇద్దరూ ఆగారు. రాజేష్ శిధిలాల శకలాల ని, పక్కకి తోస్తూ లొపలకి, వెళ్ళాడు. అన్వర్ అతనిని వెంబడించాడు .

" అన్వర్ ! కొంచెం ఈ శిధిలాల ముక్కలని , తొలగిస్తే మనం మందుల ని, తీసు కోవచ్చు. ఏదయినా ,ట్రాలీ కూడా దొరుకుతుందేమో, లోపల చూడు. " అన్నాడు రాజేష్.

" ఊ ! " అంటూ లోపలకి. వెళ్ళాడు అన్వర్ .

రాజేష్ అక్కడ మందుల పెట్టలని అన్నీ, ఒక చోట ,జమ చేయ సాగాడు .

"ఇక్కడ ట్రాలీలు ,ఏమీ కనిపించటం లేదు రాజేష్ ! సంచీలు కనిపిస్తున్నాయి. సంచీలలో మూట కడదాము ! " అన్నాడు. అన్వర్.

పగిలిపోయిన వాటి ని పక్కకి జరిపి , బాగా వున్న మందు పెట్టిలని అన్నీ , సంచీ లలోకి వేసి ముడి కట్టారు . పడిపోకుండా .

సంచీలు, భుజాలకి తగిలించుకుని ముందుకు నడిచారు .

కొంత దూరం వెళ్ళాక , వారికి, కూలిపోయిన షాపింగ్ మాల్, కనిపించింది. ఇద్దరూ దారి చేసుకుంటూ, లోపలకి వెళ్ళారు. శిధిలాల తో పాటు, ఫుడ్ పాక్స్ , చాక్లేట్ పాక్స్ , బిస్కట్ పాక్స్ , రక రకాల బిస్కట్స్ , చాక్లెట్స్ , ఆహార పదార్ధాలు, బట్టలు అంతా చెల్లా చెదురుగా పడి వున్నాయి.

అక్కడ ట్రాలీలలో, పనికి వచ్చే బిస్కట్స్ , చాక్లెట్స్ , ఇంకా పనికి వచ్చే , ఆహార పదార్థాలు, బట్టలు, అన్నీ ట్రాలీ లోకి జమ చేసారు. ఒక నాలుగు ట్రాలీలు నిండా ,సామాను నింపి , బయటకి రాబోతూంటే , అన్వర్ కాలికి ,ఒక పిల్లవాడి శరీరం తగిలి ,ముందుకు పడ బోయాడు, తమాయించుకొని, కింద వున్న పిల్ల వాడిని, పరిక్ష గా చూసాడు . ఎనిమిది ఏళ్ళు వుండొచ్చు. తలకి గాయ మయి రక్తం కారి, గడ్డ కట్టినట్లుంది . అనుమానం వచ్చి , ఆ పిల్లవాడి పల్స్ పరీక్షించాడు. ముక్కు దగ్గర వేలు పెట్టి చూసాడు.

రాజేష్ కేసి ఆశ్చర్యం చూస్తూ " ప్రాణం వుంది . " అన్నాడు.

రాజేష్ కూడా పరీక్షించాడు. " అవును " అన్నాడు.

" బహుశా తలకి గాయ మై, స్పృహ కోల్పోయి వుంటాడు . పల్స్ చాలా వీక్ గా వుంది. కొంచెం సామాను సరి చేయ్ . ఈ అబ్బాయిని ట్రాలీ లో పడు క్కో పెడ్తాను. " అన్నాడు రాజేష్.

అన్వర్ ఒక ట్రాలీ లో , బాబు ని పడు క్కో పెట్ట డానికి , చోటు చేసాడు . రాజేష్ ఆ పిల్ల వాడిని, ట్రాలీలో పడుక్కో పెట్టాడు.

ఇద్దరూ ట్రాలీలు తోసు కుంటూ తిరుగు మొహం పట్టారు.

ఒక ఇనుప రాడ్ తో, దారికి అడ్డు వున్న అన్నిటిని , పక్కకి నెట్టు తూ దారి చేసుకుంటూ ముందుకు వెళ్తూన్న వాళ్ళు , దారి మధ్యలో ఒక చిన్న పాప చెయ్యి, కొంచెం పైకి లేచినట్లు అనిపించి , షాక్ తగిలినట్లు ఆగిపోయారు .

ట్రాలీ పక్కకి పెట్టి అన్వర్, ఆ పాప వైపు పరుగు లంటి నడక తో వెళ్ళాడు.

నిస్త్రాణగా పడి వుంది కానీ, ఇంకా ప్రాణాలతోనే వుందని గ్రహించాడు. అదే చెప్తూ, పాపని భుజాన వేసుకుని తీసుకువచ్చి ట్రాలీలో వేసి, బట్టలతో చుట్టాడు.

ఇద్దరూ , వేగంగా నడుస్తూ, వారు వుండే, ప్రదేశానికి వచ్చారు . అది ఒక పెద్ద పాడుపడిన గొడౌన్ . రాజేష్ కాలింగ్ బెల్ కొట్టాడు. తలుపు తీసిన , సోఫి ని తప్పించుకుంటూ ,ఇద్దరూ పరుగు లాటి నడక తో ,లోపలకి వెళ్ళారు. పరిస్తితి అర్ధం చెసుకున్న సోఫీకూడా , వాళ్ళ ని వెంబడించింది.

సోఫీ కి కూడా, ఇది కొత్త కాదు . బయటకి వెళ్ళినప్పుడ ల్లా , ఎవరయినా ప్రాణాలతో వుంటే, వాళ్ళని తీసుకు రావడం, వైద్యం చేయడం, యుద్ధం , మొదలు అయినప్పటి నుంచీ, జరుగు తూ నే వుంది. వాళ్ళని చూసి. అమృత , చార్లెస్ , విక్రం కూడా అక్కడకి వచ్చి, పిల్లలని, బల్లల మీద పడుక్కో పెట్టడం , వైద్యానికి అవసర మయినవి, అన్నీ అమర్చడం చేయసాగారు . ఇద్దరి పిల్లల కీ , ఫ్లూయిడ్స్ ఎక్కించ డానికి అన్నీ అమర్చారు . పిల్లలకి ఫ్లూయిడ్స్ ఎక్కుతూ వుంటే, వాళ్ళు పిల్ల ల వొంటి మీద గాయాలు , పరీక్షించ డం మొదలు పెట్టారు.

సోఫీ తో పాటు మొత్తం ఆరుగురు , అందరూ హ్యూమనాయిడ్ రోబోసే . రాజేష్, సోఫీ ,అమృత , చార్లేస్ , అన్వర్ , విక్రం . వాళ్ళు వైద్యం చేయగలరు . వైద్యం చేయగలిగే విధంగా , ప్రోగ్రాం చేయ బడ్డారు.

అమృత పిల్లవాడికి , గాయాలు శుభ్రం చేసి ,మందులు రాస్తోంది.

సోఫీ , పాపని చూస్తూ, " ఈ పాప , నెలల పాప " . అంది.

" పాపని , తల్లి తన శరీరం తో కప్పి వుంటుంది . అందుకే గాయ పడ లేదు." అన్నాడు అన్వర్.

" ఆకలి కి , ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి వుంటుంది. " అన్నాడు రాజేష్.

" ఏన్ని రోజులయి వుంటుందో .? పల్స్ ,నీరసం గా నే వుంది . " ఫ్లూయిడ్స్ వెళ్తున్నాయో లేదో చూస్తూ. అన్నాడు రాజేష్ మళ్ళీ.

" బాబు ఎలా వున్నాడు ? ఎదయినా సీరియస్ గాయాలు , అయ్యాయా ? " అని అడిగాడు అన్వర్ ,

అమృతని.

" కూలిపోయిన భవనాల శిధిలాల తాలుకు శకలాలు , అద్దం ముక్కలు, ఒళ్ళంతా గుచ్చుకున్నాయి . తలకి గాయం బలం గానే తగిలి నట్లు వుంది . చాల సేపు రక్త స్రావం అయి వుంటుంది. అందుకే, స్పృహ కోల్పోయాడు. పల్స్ వుంది, కానీ నీరసం గా వుంది. ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాము కదా చూద్దాం . " అంది అమృత..

" రక్తం చాలా పోయినట్లుంది, రక్తం అవసరము అవుతుందేమో . ...." అన్నాడు అన్వర్.

" రాజేష్ రక్తం పరీక్షించి , ఆ గ్రూప్ రక్తం అందుబాటులో పెడ్తాను , అన్నాడు " అంది అమృత.

"ఊ ! " అన్నాడు అన్వర్.

విక్రం , తెచ్చిన సామానులన్నీ, పద్ధతిగా, లొపల రాక్స్ లో , సద్దడం మొదలు పెట్టాడు, అతనికి చార్లెస్ సాయం చేయ సాగాడు .

అంతలో లొపల ఇంకో గది లోనుంచి ఒక పద్ధెనిమిది ఏళ్ళ ఆమ్మాయి వాళ్ళ దగ్గరకి వచ్చింది, " నేను సాయం చేస్తాను . " అంటూ. ఆమె పేరు అమర. ఆమె వెనకే ఇంకో ఇరవై ఏళ్ళ పిల్ల వాడు వచ్చాడు. అతని పేరు ప్రకాష్. అక్క డ, వాళ్ళు వైద్యం చేస్తున్న పిల్లలని, చూస్తూన్న ఆమె మొహం , నల్ల బడింది బాధ తో .

" బతుకుతారా ? ... " అంది నెమ్మదిగా , పిల్లలకి వైద్యం చేస్తున్న, వాళ్ళ తో ..

" ప్రయత్నిస్తున్నాము " అన్నాడు అన్వర్ .

బరువుగా నిట్టూర్చింది ఆమె . " చిన్న పాప . ... " అంది అమర

" అవును ! ఆకలి కి , ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లింది . ఇప్పుడు పల్స్ కాస్త స్టేబిల్. అవుతోంది " అన్నాడు అన్వర్..

" ఎన్ని రోజుల నుంచి అలా వుందో ! ..." అంటూన్న ఆమె కళ్ల ల్లో, నీళ్ళు చూసి. " మూడు నాలుగు రోజులు అయ్యే వుంటుంది. కొన ఊపిరి తో వుంది . " అన్నాడు అన్వర్.

మాట మారుస్తూ , " లోపల పిల్లలు ఎలా వున్నారు? " అన్నాడు మళ్ళీ.

" బాగానే వున్నారు " అంది నీరసం గా నవ్వుతూ.

" నీకు కాలు ఎలా వుంది ? ఇంకా నొప్పి వుందా ? నీతల గాయం చూడనీ " అంటూ రాజేష్ ఆమె తల

గాయం ఒక సారి పరీక్షించాడు. కాలూ కూడా చూస్తూ. " తొందర గానే అతుక్కుంది. ఇంకా కట్టు

తీసేయ్యొచ్చు " అన్నాడు,

" సోఫీ! అందరికీ ఫుడ్, ఏర్పాటు చేసావా ? . " అడిగాడు రాజేష్.

" ఊ ! అమృత , ఆ ఏర్పాటులు చేస్తోంది. కొంచెం కోలుకున్న వాళ్ళు , వాళ్ళకి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు." అంది సోఫీ

" ఇంతకీ , ఎంత నిలవలు వున్నాయి ? మందులూ , ఇంకా ఫూడ్ , పిల్లలకి, పాల పొడి ... "

" ఆ ! ఆ ! నేను , అమృత ఆవిషయాలు చూసుకుంటున్నాము. " అంది సోఫీ .

అక్కడ ఏర్పాటు చేసిన, సి సి టి వి లో అన్ని గదుల ని , మనుషుల ని ఒకసారి పర్య వేక్షించాడు రాజేష్..

" మనం వీళ్ళని కాపాడడం అవుతే , కాపాడాము కానీ ఎంత కాలం ఇలా ? నిల్వలు వున్నంత వరకూ సరే కానీ తర్వాత. .." ,అంది అమృత .

" డ్రోన్ లు పంపి ఎక్కడ మనకి , అవసరం అయిన సామను దొరుకుతుందో, తెలుసుకుంటూనే వున్నాము . వెళ్ళి తీసుకు వస్తున్నాం . ఇప్పటికి అవుతే, నడుస్తోంది. " అన్నాడు విక్రం .

" బహుశ ఒక ఆరు నెలలు, పర్వాలేదేమో . ఆ తర్వాత ఏదో ఒక మార్గం దొరుకు తుంది. " అన్నాడు రాజేష్

" ఇంతకీ , బాంబులు వేయడం ఇంకా ఆగలేదు ? ఇంకా ఎవరు మిగిలారు ? ఏమి మిగిలింది ? " అంది సోఫీ, ఫ్రస్ట్రేటింగ్ గా

" నాయకులంతా, క్షేమంగానే వుండి వుంటారు. ఎక్కడో , వాళ్ళు క్షేమం గా , వుండే ఏర్పాటు చేసే వుంటారు. ఈ యుద్దం లో చనిపోయినా , బాధ పడినా , సామాన్య ప్రజలే . " అన్నాడు చార్లేస్ .

" ఏమిటి అమరా ! మీ నాయకుడు, క్షేమ మేనా " అన్నాడు విక్రం .

" అది అలోచించే పరిస్తితి లో మేము వున్నామా ? .." అంది అమర కోపంగా .

" కోప్పడకు ! ఎంత రోబోల మయినా. జరుగుతున్నది చూస్తూంటే , లేని ఎమోషన్స్ వస్తున్నాయి. " అన్నాడు విక్రం

" నాయకులు క్షే మం గానే వుంటారు ...." అన్నాడు ప్రకాష్, నీరసం గా . కోపపడానికి కూడా శక్తి లేకుండా వున్నాడు అతను .

ఇంతలో ఒక, ఇరవై ఏ ళ్ళ అబ్బాయి అక్కడకి వచ్చాడు. అతని , ఒక చే తికి , ఒక కాలికీ , కట్లు వున్నాయి . కర్ర ఆధారం చేసుకుని , కుంటు కుంటూ వచ్చాడు.

అమర , ప్రకాష్ ల కేసి, చూసి నవ్వడానికి ప్రయత్నించాడు. అతని పేరు రాబర్ట్. వాళ్ళ బాషలు వేరు . ఒకరి బాష ఒకరి అర్ధం కాదు. వాళ్ళే కాదు . అక్కడ రక్షించ పడిన వాళ్ళు ఎవరూ , ఒకే బాష వాళ్ళు కారు .

అతను అక్కడ కూర్చుంటూ , అన్నాడు " యుద్ధం మొదలు అయినప్పుడే, నాయకులంతా వాళ్ళ కుటుంబాలతో ఎక్కడికో , క్షేమం గా తరలించ బడే వుంటారు. "

ఒకరితో ఒకరు, భాష వేరు అయినా , మాట్లాడు కోగలిగేలా , ట్రాన్స్ లేషన్ అప్లికేషన్ వున్న ఫోన్ లు అందరికీ , ఏర్పాటు చేసాడు రాజేష్. ఫొన్ లో ఎంపిక చేసుకునే భాష కి సంభాషణలు అన్నీ తర్జుమా అయే ఏర్పాటు చేసాడు రాజేష్. ఆ విధం గా ఒకరు మాట్లాడే బాష , ఇంకొకరికి , అర్ధం అవడం తో అందరూ, వేరు వేరు భాషలు అయినా,మాట్లాడు కోవడం తేలిక అయింది. ఏదయినా సమస్య వస్తే హ్యూమనాయిడ్ రోబోస్, సాయం తీసుకుంటారు.

అక్కడ వున్న కుర్చీలలో అందరూ కూర్చున్నారు. మద్య మధ్య లో ,పిల్లల పరిస్తి తి గమనిస్తూనే వున్నారు, అన్వర్ , రాజేష్. .

" అసలు ఈ యుద్ధాలు , ఎందుకు చేయాలనుకుంటారో ". అంది అమృత .

" ఈ మారణ హోమం చూసిన వాళ్ళకి ఎవరికయినా , యుద్ధాలు ఎందుకు, అని అనిపించక మానదు. " అన్నాడు అన్వర్ .

" కారణాలు ఎమయినా సరే, ఇంతటి, విధ్వంసం అవసరమా ? " అంది సోఫీ .

" ఎంతో కష్టపడి నిర్మించుకున్నవన్నీ , ఇలా కళ్ళముందు ధ్వంసం కావడం ఎంత బాధాకరం. ? ఆ ఆలోచనే బాధాకరం , కానీ తేలికగా ఎలా చేయగలుగుతారు? ...." అన్నాడు చార్లేస్.

". మీరు మమ్మల్ని కాపాడారు కానీ , మా భవిష్యత్ ఏమిటొ మాకు ప్రశ్నార్ధకంగానే, వుంది, .. తల్లి, తండ్రి , స్నేహితులు , బంధువులు ఎవరూ లేరు ..." అంటూ రాబర్ట్ , వున్నట్లుండి , ఏడ్వడం మొదలుపెట్టాడు.

అమర , ప్రకాష్ , అతని దగ్గరకి వెళ్ళి ,అతని భుజం చేయి వేసి , ఓదార్చడానికి ప్రయత్నిస్తూ , వారు కూడా ఏడవ సాగారు.

అమృత , విక్రం , అన్వర్ , చార్లెస్. రాజేష్ , సోఫీ. వాళ్ళని చూస్తూ వుండి పోయారు.

ఇది వాళ్ళకి మామూలే. ఎంత ఎమొషన్స్ లేకపోయినా , వాళ్ళని అర్ధం చేసుకునే శక్తి. వాళ్ళకి వుంది.

వాళ్ళు రక్షించిన వాళ్ళ అందరి , పరిస్తితీ , ఒక లానే వుంది. బలవంతం గా. మొహం మీద నవ్వు తెచ్చుకుంటారే కానీ, మాట్లాడడం మొదలుపెడితే, ఏడవడమే . ఆ ట్రామా నుంచి వాళ్ళూ అప్పుడప్పుడే బయట పడరు, అని వాళ్ళకి తెలుసు.

" మీకు జరిగిన దాని గురించి , అవగాహన అయినా వుంది. కానీ, నెలల పిల్లలు, పసి కందులు , వాళ్ళకి ఏమీ అర్ధం కూడా కాదు. ఏడ్చినా, ఎందుకు, ఎవరూ రారో అర్ధం కాదు . రోబోస్ , మేము. మాకే , ఈ పరిస్తితి చూడడం కష్టం గా వుంది. మీకు భరించడం, ఎంత కష్టం అవుతోందో తెలుసు. " అంది అమృత వాళ్ళని చూస్తూ.

" చిన్నపిల్లలని , ఇలా చూడడానికి , మాకే కలవరం కలుగుతోంది . .." అంది సోఫీ.

" నోరు లేని చెట్లు , పక్షులు , పశువులు, మాట ఏమిటి ? ప్రకృతి కూడా , అంతా ధ్వంసం అవుతోంది . ఎవరితో చెప్తారు ? ఏమని అడుగుతారు ? చూస్తూంటే చాలా బాధే, మరి! " అన్నాడు విక్రం .

" యుద్ధం అందరికీ నష్టం కలగచేస్తుంది, మేము మా మాస్టర్స్ ని , కోల్పోయాము. బాంబులలో, మా శరీర భాగాలు పోయాయి. మా కన్న ఎడ్వాన్సెడ్ హ్యూమనాయిడ్ రోబో , రాజేష్ . అతను మమ్మల్ని, రిస్టోర్ , చేసాడు. మాకూ పర్పస్ కల్పించాడు. ఇక్కడ మనం ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాలు, అతని గైడెన్స్ తోనే అందరమూ తయారు చెయ గలిగాము " అన్నాడు చార్లెస్.

" నా గొప్పదనం కాదు అది. అది నా మాస్టర్ గొప్పతనం . అతని పేరు రాజేష్. "మళ్ళీ ప్రపంచ యుద్దం జరుగుతుంది. మొత్తం,ఇంతవరకూ నిర్మించుకున్న సివిలిజేషన్ , జ్ఞానం అంతా తుడిచిపెట్టుకు పోతుంది ." అని అంటూండేవాడు.

" ఒక వేళ అదే జరీగితే , ఆ విధ్వంసం లో , ఇప్పుడు వున్న విజ్ఞానం అంతా నాశనం అవుతుంది . అది జరగ కూడదు . అదే జరిగితే మాన వావళి , మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. అలా జరగ కుండా వుండాలంటే , ఇప్పడు వున్న విజ్ఞానం అంతా, యుద్ధం లో బతికి వున్న వాళ్ళకి అందివ్వాలి ." , అనేవాడు.

అదే ధ్యేయం తో , నన్ను తయారు చేసాడు. ఒకవేళ యుద్ధమే సంభవిస్తే , ఆ యుద్ధం లో సాధ్యమయినంతమందిని రక్షించి, వాళ్ళకి, ఇప్పుడు వున్న జ్ఞానం అందించ డానికి వీలుగా , నన్ను ప్రోగ్రాం చేసాడు. నేను , నాలాంటి హ్యూమనాయిడ్ రోబోస్ ని కూడా , తయారు చేయగలను. " అన్నాడు రాజేష్.

" మమ్మలని తయారు చేసిన వాళ్ళ గుర్తుగా, మేము వారి పేర్లే పెట్టు కున్నాము. ఆవిధం గా , మేము వారిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాము ." , అన్నాడు చార్లెస్.

అమర , రాబర్ట్, ప్రకాష్ , వాళ్ళ మాటలు వింటున్నారు. లోపలనుంచి , ఇంకా, కొందరు వచ్చి , అక్కడ కూర్చున్నారు . వాళ్ళు కూడా, ఆ సంభాషణ విన సాగారు.

“ ఎంత ఆలోచించినా , నాకు ఒక విషయం అర్ధం కాదు. 'యుద్ధాలు ఎందుకు చేస్తారు ? ' అని. ఎంత ఆలోచించి నా , అది ఒకరి ఇగో కోసమే, అనిపిస్తుంది తప్ప , ప్రజల ప్రయోజనాల కోసం , అని అనిపించదు. " అంది అమృత.

"పూర్వం అవుతే , యుద్దాలకి ,రాజులో ,నాయకులో ...వాళ్ళూ , వేళ్ళే వారు. కానీ ఇప్పుడు అలా కాదు. నిర్ణయం తీసుకున్న వాళ్ళు, యుద్ధాని కి వెళ్ళరు. వాళ్ళు , వాళ్ళ కుటుంబ సభ్యులూ, యుద్ధం వలన ఎటువంటి విధం గానూ, ఎఫెక్ట్ కాకుండా చర్యలు తీసుకుంటారు. ఓడినా వాళ్ళు ఏమీ, నష్ట పోరు. గెలిస్తే వాళ్ళు తిరుగు లేని మనిషి లా , చలా మణి అవుతారు. " వాళ్ళ ల్లోనే ఒక వ్యక్తి అన్నాడు.

" అవును ! కొన్ని యుద్ధాలలో , రాజులు, ప్రజలు కష్టపడ కూడదని, సంధులు చేసుకున్న సందర్భాలు కూడా వున్నాయి. పూర్వం అది . " అన్నాడు ప్రకాష్ .

" అమృతా ! నువ్వు చెప్పినట్లు , చాలా యుద్ధాలు , నాయకుల ఇగో వల్లనే , జరుగు తాయి అని , అనిపిస్తోంది. ఇగో వల్లనే కదా , వాళ్ళు నమ్మిన సిద్ధాంతం , సరి అయినది అని , వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మంచివే అని , ఇంక ఎటువంటి చర్చ లు అవసరం లేవనుకుంటారు . " అన్నాడు విక్రం .

" నిర్ణయాల వల్ల , ఎఫెక్ట్ అయేది ప్రజలే కాబట్టి , నిర్ణయాలు తీసుకోవడం లో , ప్రజలని భాగస్వాములు చేయాలి . లేకపోతే , నిర్ణయాలు తీసుకునేది ఒకరు , వాటి పరిణామాలు అనుభవించేది ఒకరు. ఇది సమంజసం ఎంత మాత్రమూ కాదు." అంది సోఫీ.

" ఎవరికి అయినా, ఎటువంటి ప్రభుత్వము అయినా కమ్యూనిస్ట్ అయినా, డెమొక్రటిక్ అయినా , రాజ రికాలు అయినా , ప్రభుత్వ నాయాకుడికి , పేరు ఏదయినా , ప్రెసిడెంట్ అయినా ప్రైం మినిస్టర్ అయినా , వారికి ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి , అధికారాలు వుండకూడదు.

వున్న పరిస్తితికి, పూర్తిగా భిన్నమయిన , నిర్ణయాలు తీసుకునే టప్పుడు ,కింద స్ఠాయి నుంచి, అభి ప్రాయాలు తీసుకోవాలి .

గ్రామం నుంచి , పెద్ద పట్టణం వరకూ , అందరి ప్రజలు , అబిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలి . దాని ప్రకారం ప్రభుత్వాలు నడవాలి. లేకపోతే , పాలకులు ,దేశాన్ని , స్వంత ఆస్తి లా, భావించే అవకాశం వుంటుంది. అప్పు డు వారు , స్వార్ధ పూరిత మయిన , బాధ్యతా రహితం , అయిన నిర్ణయాలు తీసుకోవ డానికి, ఏమాత్రం సందేహించరు . ఆ నిర్ణయాల పరిణామాలకి ప్రజలు బలి అవుతారు " ఆగి ఆగి , అన్నాడు, అన్వర్ .

" అవును. అందుకే , ఎటువంటి మార్పు కు , సంబంధించిన నిర్ణయాలు అయినా, ప్రజల అభి ప్రాయాలు అంగీకారం తప్పని సరిగా తీసుకోవాలీ . లేకపోతే పాలన , ప్రజల కి , సంబంధం లేకుండా జరుగుతుంది. అప్పుడు మరి, ఇలానే జరుగుతుంది." అన్నాడు రాజేష్.

" ఇక్కడ , మీలో చాలా మందికి యుద్ధం ఎందుకు జరుగు తోందో కూడా, తెలియక పోవచ్చు . ముందే తెలిసి, కష్ట నష్టాలు ఆలోచించ గలిగే అవకాశం ఇస్తే, ఎంతమంది ఇష్ట పడతారు .? అది ప్రశ్నే !... ." అన్నాడు అన్వర్.

" అవును ! అవును ! " అ న్నారు అమర , ప్రకాష్, రాబర్ట్ . వారి తో పాటు మిగిలిన వాళ్ళుకూడా, తలలు ఊపారు .

"ఏ దేశమయినా , ఏ మతం అయినా, ఏ రంగు అయినా , మనిషి . మనిషే ! . అందరూ కలిసి అభివృద్ధి చెందుదామని ఎందుకు అనుకోరో ? యుద్ధాలని వారించగలగడం , మనిషి పరిణామం క్రమం లో, భాగం ఎందుకు కాలేక పోతోంది ? " అమృత అంది .

అమృత , మళ్ళి అంది , " మేము ఎమోషనల్ గా మాట్లాడటం లేదు. సింపిల్ లాజిక్. మేము రోబోస్ కాబట్టీ , అంతా క్లియర్ గా కనిపిస్తుంది. ఎమోషన్స్ లేకపోవడం వల్ల , వేర్పాటు వాదాల లో మేము చిక్కుకోము కాబట్టీ , విషయాల ని క్లిష్టం గా కాకుండా చాలా సింపిల్ గా చూడగలుగుతాము. "

" మాకు ప్రాణం లేదు . ఎమోషన్స్ , లేవు . అయినా, ఈ మారణ హోమాన్ని చూడ లేక పోతున్నాం . మరి ప్రాణం ఎమోషన్స్ వున్న మనుషులు ఎలా స్పందించాలి ! " అంది సోఫీ .

" ప్రపంచ యుద్ధాలు నేర్పే పాఠాలు, కాల క్రమం లో , దైనందిక కార్యక్రమాలలొ, పడి మర్చిపోతూంటాం . దానికీ ఈవిధం గా మూల్యం చెల్లించుకుంటూ వుంటాం " అన్నాడు, అక్కడ చేరిన వారిలో , ఒక అతను .

". మీరు చెప్పినది సరిఅయినదే . మేమంతా ఏకీభవించాల్సినదే . కానీ , నాయకత్వ పోరాటాల్లో , ప్రజలని విభజించి , గెలుచుకోవడం ఒక వ్యూహం . దాన్ని ప్రతిఘటిస్తూ , ప్రజలు సంఘటితం కాలేకపోతున్నారు. " అన్నాడు ఇంకొక అతను.

" అది ఒక్కటే కాదు . పాలకుల పట్ల, పాలన పట్ల , ఏ విధమయిన వ్యతిరేకత , తెలియ చేసే అవకాశం , ప్రజలకి , లేకుండా చేస్తారు. రకరకాల ఒత్తిళ్ళతో , భయ పెడతారు. " అన్నాడు అక్కడకి చేరిన వాళ్ళ ల్లో , ఇంకొక వ్యక్తి.

" వెర్పాటు వాదం యొక్క లక్ష్యమే అది . అందరూ సంఘటితం గా వుంటే , ఆ విధంగా భయ పెట్టడం , కష్టమవుతుంది. " అంది సోఫీ .

" మనుషులంతా , రకరకాల కారణాలతో విడిపోవడం వల్ల , అందరి మంచి చెడులు ఆలోచించే పరిస్తితికి , దూరం అయ్యారు. దాని పరిణామాలు , మీరు ఇప్పుడు చూస్తున్నారు . ఇంక పై , ఏటువంటి సమాజం నిర్మించ దలుచు కున్నారు అనేది, మీరు నిర్ణయించుకోవాలి ." అన్నాడు విక్రం .

" మాకు భవిష్యత్ అంటూ వుంటే, యద్ధాల అవసరం రాని సమాజం . విబేధాలని, సామరస్యం గా పరిష్క రించుకునే సమాజం, మానవత్వం పాలించే సమాజం . " అమర, రాబర్ట్ , ప్రకాష్ ముగ్గురూ ఒక సారే అన్నారు.

అందరూ , " అవును ! అవును ! " అంటూ కోరస్ పలికారు .

వున్నట్లుండి , " అలా అనుకోవడం చాలా ఐడియలిస్టిక్! ... కదా? ..." అన్నాడు ఒక వ్యక్తి .

" అది మంచే అవుతే , ఐడీలిస్టిక్ అని పక్కన పడేయక్క ర్లేదు... కాదా?...." , అన్నాడు ఇంకొక అతను.

" ఏదయినా మంచిని సాధించడం , సాధించా లను కోవడం, కొండ ఎక్కడం లాంటిదే . కష్టమే ! . కిందకి దిగడం చాలా తేలిక అయినది . అందుకు కిందకే వెళ్తూంటామా ? .. ఇటువంటి యద్ధ రాజకియాలకే, వత్తాసు పలుకుతామా? " అన్నాడు రాబర్ట్ బాధగా , కోపంగా .

" అవును . ఏ ఇజం అయినా , ఏమి చెప్పినా , మానవత్వానికే పట్టం కట్టాలి . మానవత్వమే పాలించాలి. విబేధాలు, ఎన్ని వున్నా , సామరస్యం తో , పరిష్కరించు కోకపోతే , మనమంతా సంఘటితం గా లేకపోతే , మనం ఏదో ఒక పేరు తో , బలి అవుతూనే వుంటాము." అన్నాడు ప్రకాష్.

" అవును !. ఎటువంటి విబేధాలు అయినా , మానవ కల్పితాలే . అది ఎప్పటి కప్పుడు , మననం చేసుంటూ,వుంటే చాలు,మానవత్వాన్ని గెలిపించ డానికి. ఒక అందమైన, కొత్త లోకాన్ని సృష్టించ డానికి !", అంది సోఫీ .

" అవును ! అవును ! " , అంటూ అంతా తలలు ఊపారు

" మీరు ఆ విధం గా ఆలోచిస్తే నే, మేము చేసే పనికి కూడా సార్ధకత. మీరు, ఆమార్గం లో ప్రయాణం చేస్తామంటే , మీకు అన్నిరకాల సహకారం అందించి , మీకు భవిష్యత్ కల్పించే , పూచీ మాది . " అన్నాడు రాజేష్ .

ఒక అందమయిన కొత్త బంగారు లోకం , వాళ్ళ కళ్ళ ముందు, ఒక్క క్షణం కనిపించి , నిర్జీవమయిన వాళ్ళ మొహాలలో , ఒక ఆశ వెలుగులా వెలిగింది. మబ్బుల్లో మెరుపులా , వాళ్ళ మొహాల్లో, చిరు నవ్వు మెరిసింది.

ఆ విధం గా , మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత, హ్యూమనాయిడ్ రోబోస్ , మనుషులు కలిసి , ఒక , కొత్త బంగారు లోకానికి, నాంది పలకడానికి సిద్ధమయ్యారు.

******

మరిన్ని కథలు

Manavatwam
మానవత్వం!
- - బోగా పురుషోత్తం
Mutyalannam
ముత్యాలన్నం
- మద్దూరి నరసింహమూర్తి
Parishkaram
పరిష్కారం
- తాత మోహనకృష్ణ
Apaatradanam
అపాత్రదానం
- Prabhavathi pusapati
Simhadri express
సింహాద్రి ఎక్స్ ప్రెస్
- అనంతపట్నాయకుని కిశోర్