
"బాబాయ్..! ఒక విషయమై ఎటూ తేల్చుకోలేకపోతున్నాను.." అన్నాడు ఆనంద్
"నా దగ్గర ఎందుకు రా సంశయం..? అడుగు. మీ నాన్న పోయిన తర్వాత.. నిన్ను నా చేతులతో పెంచాను. ఇప్పుడు నువ్వు బాగా చదువుకుని, మంచి ఉద్యోగం చేస్తున్నావు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఆనంద్"
"నిజమే..! మా నాన్న లేని లోటు నేను ఎప్పుడూ ఫీల్ అవలేదు. మా ఆఫీస్ లో ఇద్దరు అమ్మాయిలు నన్ను ఇష్టపడుతున్నారు. మొన్న విడి విడి గా నాకు ప్రపోజ్ చేసారు..వారిలో ఎవరిని పెళ్ళిచేసుకోవాలో తెలియట్లేదు"
"ప్రేమలో పడ్డావనమాట..! ఈ రోజుల్లో ప్రేమించడం, కొలిగ్స్ ని పెళ్ళి చేసుకోవడం కామన్..తప్పు కాదు "
"నిజమే..!"
"మరి నీకు ఎవరంటే ఇష్టం..?"
"ఇద్దరూ ఇష్టమే..ఎవరిని పెళ్ళి చేసుకోవాలో.. నిన్ను ఆడుగుదామని.."
"నీ పెళ్ళి.. నీ ఇష్ట ప్రకారం చేసుకో..కాకపోతే ఒక్కటే చెబుతాను విను. సరైన లైఫ్ పార్టనర్ దొరికితే..లైఫ్ చాలా హ్యాపీ గా ఉంటుంది..లేకపోతే కష్టపడుతూ, సర్దుకుపోతూ బతకాలి.."
"డబ్బున్న అమ్మాయిని చేసుకుంటే బాగుంటుందా..?" అడిగాడు ఆనంద్
"బాబాయ్ చిన్నగా నవ్వాడు.."
"మరి అందం..?"
"మళ్ళీ నవ్వాడు.."
"నీ నవ్వు నాకు అర్ధం ఆవట్లేదు బాబాయ్.."
"అందం ముఖ్యం..డబ్బు అవసరమే..కానీ వీటికి మించి ఉండాల్సిన ముఖ్యమైనవి ఓర్పు, మంచి మనసు. ఇవి ఉంటే, జీవితంలో ఆనందం మీ సొంతం అవుతుంది. అదే నువ్వు వారిద్దరిలో తేల్చుకోవలసిన విషయం..ఆల్ ది బెస్ట్"
"అర్ధమైంది బాబాయ్.." అని నవ్వుతూ అన్నాడు ఆనంద్
*********