తనదాకా వస్తే..! - - బోగా పురుషోత్తం

Tana daakaa vaste


పూర్వం కిరణ్మాయారణ్యంలో ఓ తాగునీటి కొలను వుండేది. ఆ కొలనులో అటవీ జంతవులన్నీ నీటి దాహం తీర్చుకునేవి.
ఓ రోజు అడవికి పెద్ద సింహం వచ్చింది. బాగా ఆకలిగా వున్న అది జంతువుల కోసం ఎదురు చూడసాగింది.
ఉన్నట్లుండి దానికి పెద్ద శబ్దం విన్పించింది. వెనుదిరిగి చూసే సరికి వెనుక ఏనుగు మడుగులో గిలగిలా కొట్టుకు ఫీుంకరిస్తోంది. దాన్ని చూసిన సింహం గుండె ఆగినంత పనైంది. ఇంకా నయం.. కొలను మధ్యలో ఓ రాయిపై పడుకున్న జింకను పట్టుకోవాలనుకుంది. మనసు అంగీకరించక కొలనులో దిగలేదు. దిగి వుంటే పెద్ద ప్రమాదానికి గురయ్యేది.


అంతలో వెనుతిరిగి చూసింది. ధబ్‌ మన్న పెద్ద బండ రాయి మీద పడినంతపనైంది. అది తప్పించుకుని దూరంగా వెళ్లింది.
కొలనులో మొసలి నోట్లో చిక్కుకున్న ఏనుగు అరుస్తున్న అరుపుతో అడవంతా దద్దరిల్లింది. క్షణాల్లో అడవి జంతువులన్నీ కొలను వద్దకు చేరుకున్నాయి. ఆపదలో చిక్కుకున్న ఏనుగును చూసి అది రక్షించేందుకు ఉపాయం వెతికాయి.


కొండ మీదికి వెళ్లి పెద్ద బండరాయిని నీళ్లలోకి తోశాయి. దబ్‌ మంటూ పడిన శబ్దానికి మొసలి పట్టు వీడిరది. దీంతో ఏనుగు స్వేచ్ఛగా ముందుకు కదిలింది. బాగా గాయం కావడంతో ముందుకు నడవలేకపోయింది.
అక్కడే వున్న కుందేలు వద్దకు తీసుకెళ్లాయి.


ఏనుగు గాయాన్ని పరీక్షించిన కుందేలు ఏదో పసురు పూసింది. బాగా కోలుకుని ముందుకు నడిచింది ఏనుగు. తనకు చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలుపుకుని వాటికి రక్షణగా నిలిచింది.


ఏనుగు పరిరక్షణలో ముందుకు సాగుతున్న అడవి జంతువులను తినాలన్న సింహానికి వీలు కాలేదు. జిహ్వ చాలప్యం చావలేదు. ఎదురుచూడసాగింది.
ఓ రోజు కుందేలు ఒంటరిగా వుండటం చూసి దాని పిల్లలతో సహా నోట కరచుకుంది.


ఏనుగు పరిరక్షణలో వున్న జంతువుల్లో ఓ రోజు ఏనుగు పిల్లకి జ్వరం వచ్చి డాక్టరు కుందేలు వద్దకు వెళ్లింది. అయితే అక్కడ కుందేలు కనిపించలేదు. ఏనుగు పిల్లకు జ్వరం ఎక్కువై చనిపోయింది. మరి కొన్ని రోజులకు జింక , నక్క వింత జబ్బులతో మృత్యు వాత పడ్డాయి. దీంతో డాక్టర్ కుందేలు ఉంటే మన పిల్లల ప్రాణాలు దక్కేవి అని బాధ పడసాగాయి.

ఇది చూసి తన నోటికి చిక్కకుండా ఇన్నాళ్లు కుందేలును కాపాడి తనకు ఆహారం లేకుండా అన్యాయం చేసి వాటికి రక్షణ కల్పిస్తున్న ఏనుగుకు తగిన శాస్తి జరిగిందిలే అని సంబర పడింది. సింహం.
ఓ రోజు సింహం పిల్లకి తీవ్ర జ్వరం వచ్చింది. . కుందేలు గుర్తుకు వచ్చి వైద్యం కోసం తన పిల్లను వెంటబెట్టుకుని వెళ్లింది. అయితే కుందేలు అప్పటికే తన జిహ్వ చాపల్యానికి బలైందని గ్రహించి తనలో తానే నిందించుకుంది. చూస్తున్నంతలో తన పిల్ల జ్వరం ఎక్కువై ప్రాణం విడిచింది. తను చేసిన తప్పుకు కుందేలు వైద్యం అందక తన బిడ్డను కళ్ల ముందే పోగొట్టుకుని కడుపు కోతను మిగిల్చుకుంది. తను చేసిన తప్పు ఏమిటో తెలిసి వచ్చింది. ఇక అప్పటి నుంచి పరులకు హాని కలిగించే పనిని చేయడం మానుకుంది సింహం.

మరిన్ని కథలు

Ide naa Ugadhi
ఇదే నాఉగాది.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Amma nerpina sadgunam
అమ్మ నేర్పిన సద్గుణం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kaay kaay
కాయ్.. కాయ్ ( కథ )
- హరి వెంకట రమణ
Kotta konam
Kotta konam
- Prabhavathi pusapati
Sagatu manishi andolana & aswasana
సగటు మనిషి ఆందోళన & ఆశ్వాసన
- మద్దూరి నరసింహమూర్తి
Evarini Chesukovali
ఎవరిని చేసుకోవాలి?
- తాత మోహనకృష్ణ