ఇదే నాఉగాది. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Ide naa Ugadhi

వేపచెట్టు కింద చేరిన కుందేలు,కోతి తమ ముందు ఉన్న పుచ్చకాయను తింటూ కనిపించాయి పిల్లరామచిలుకకు .

" గారు రాజు సింహ రమ్మన్నారు ఇప్పుడే " అన్నది పిల్లరామచిలుక.

" ఈతిక్కచిలుక ఏంచెపుతుంది "అన్నాడు కోతి.

" రాజుగారు రమ్మన్నారట పదఅల్లుడు "అని కుందేలు,కోతి ,సింహరాజు గుహకు బయలుదేరాయి.

తన గుహముందు సమావేశమైన జంతువులను చూసిన సింహరాజు

" నిన్నరాత్రి మన అటవి శాఖాధికారి వాళ్ళపిల్లలకుఈసంవత్సరం విశ్వావసు నామ ఉగాది గురించి ఇలా చెప్పారు... శిశిర ఋతువు ఆకురాలు కాలం. శిశిరం తరువాత వసంతం వస్తుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుంటుంది. కోయిలలు కుహూకుహూ అని పాడుతాయి. ఉగాది రోజు నుండే తెలగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు."ఉగాది పచ్చడి" ఈ పండుగకు ప్రత్యేకమైంది. షడ్రుచుల సమ్మేళనం - తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు.

ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేసారు. అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరుపొందింది.

హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పిలుచుకుంటే,తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్‌లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు. అయితే పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును. ఆంధ్రప్రదేశ్ లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట, కవి పండిత,కళాకారులను సత్కరించడం ఆనవాయితీగా వస్తుంది.ఆ సంవత్సరంలోని మంచి చెడులను, కందాయ ఫలాలను, ఆదాయ ఫలాయాలను, స్ధూలంగా తమ భావిజీవిత క్రమం తెలుసుకొని దాని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు.ఇట్లు ఉగాది పండుగను జరుపుకుంటారు.

ఉగాది సంప్రదాయాను సారంగా రైతులను గౌరవించే వేడుకగా చెప్పడం జరిగింది.రైతులతో పాటుగా తెలుగు వారు ప్రతిఒక్కరు కూడా తమదిగా భావించే పండుగ ఉగాది-పర్వదినం.కనుక మీరంతా ఈ ఉగాది పండుగ ఉత్సాహంగా జరుపుకొండి'' అన్నాడు సింహరాజు .

మరుదినం ఉదయాన్నే సింహారాజు గుహకు చేరిన పిల్లరామచిలుక,నక్కా '' మహారాజా తమరు త్వరపడాలి అవతల కొంపలు అంటుకుంటున్నాయి '' అన్నడు నక్క.

'' ఎవవరి కొంపలు అయినా అడవిలో కొంపలు ఎలావచ్చాయి?" అన్నాడు నింపాదిగా సింహరాజు.

"మహాప్రభో అక్కడ కోతి బావ ఏదో మందు బండపైన నూరుతున్నాడు మరలా ఈఅడవిలో ఎవరికి మూడిందో '' అన్నడు నక్క.

'' సరే పద '' అని నక్కను అనుసరించాడు సింహారాజు.

తనముందు ఉన్న ఎండుగుమ్మడికాయను అడ్డంగా పగులకొట్టి కంచంలా తయారుచేసి దాని నిండుగా తను అప్పటివరకు నూరిన పచ్చిమిరప కాయల పచ్చడి నింపాడు. అప్పుడే అక్కడకు వెళ్ళిన నక్క,సింహారాజు ను చూస్తూనే '' ప్రభువులు ఇలా దయచేసారు కాకితో కబురు పంపితే నేనే వచ్చేవాడిని '' అన్నాడు వినయంగా చేతులు కట్టుట్టుకుని.

'' ఈ దొంగ వినయాలకు ఏమీ కొదవలేదు మీవలన అడవి జంతువులకు ఎప్పుడూ ఏదో ఒక ఉపద్రవం వస్తుంది. ఈసారి ఏదో తమరు మందు తయారు చేస్తున్నారు అని విన్నాను ఏమిటది? 'అన్నాడు సింహారాజు. ఓహో ఇది తమరిపనా అని పిల్లరామచిలుకను,నక్కను చూసింది కోతి.

'' ప్రభూ తమరు చెప్పినట్లు ఉగాది పచ్చడి షడ్ రుచులతో తయారు చేస్తున్నాను " అన్నాడు కోతి.

''మేము నిన్ను నమ్మను ఏది చూపించు '' అన్నాడు సింహారాజు. సగంపగిలిన గుమ్మడికాయనిండుగా ఉన్న పచ్చిమిరప కాయల పచ్చడి అరచేతిలో ఉంచుకుని సింహారాజు చేరుగా వెళ్ళిన కోతి కాలుకి రాయి అడ్డం తగలడంతో నిలబడలేనికోతి చేతిలోని పచ్చిమిరప కాయల పచ్చడిని సింహారాజు ముఖానవేసీంది. అది చెదిరి చిన్న చిదప పిల్లరామచిలుక ముఖంనిండిపడింది. కళ్ళమంటతో సింహారాజు బాధతో ఘర్జించాడు. '' బావ ముంచాడు కొతి కొంప 'అని అరుస్తు ఎటువెళ్ళాలో తెలియక కళ్ళుకనపడక పిల్లరామచిలుక లబలబలాడింది.

సింహరాజు చేతికి దొరికితే తోలు వలుస్తాడని ఊహించినకోతి ''ఇదే నాఉగాది పండుగ '' అని అడవిదాటి దూరంగా పరిగెత్తాడు కోతి.

మరిన్ని కథలు

Eeroju pandaga
ఈ రోజు పండగ
- Sreerekha Bakaraju
Amma nerpina sadgunam
అమ్మ నేర్పిన సద్గుణం
- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
Kaay kaay
కాయ్.. కాయ్ ( కథ )
- హరి వెంకట రమణ
Tana daakaa vaste
తనదాకా వస్తే..!
- - బోగా పురుషోత్తం
Kotta konam
Kotta konam
- Prabhavathi pusapati
Sagatu manishi andolana & aswasana
సగటు మనిషి ఆందోళన & ఆశ్వాసన
- మద్దూరి నరసింహమూర్తి