
ఉదయం తొమ్మిది గంటలకే ఇంటర్ వ్యుకి వెళ్ళడానికి సిధ్ధమైనాడు బాబురావు. కాఫీ కప్పు అందిస్తున్న సుబ్బరావమ్మ "అదేమిట్రా శుభమా అంటు వెళుతూ ఇప్పుడే బయలుదేరావు ఇప్పుడు రాహుకాలం యమగండమూన్ను ఉంది పది గంటలకు బయలుదేరు అమృత ఘడియలు అమోఘం వెళ్ళిన పని విజయవంతం ఔతుంది "అన్నది బామ్మ .అక్కడే ఉన్న కుర్చిలో చతికిలబడుతూ "నీ చాదస్తంతో చంపుతున్నావే అక్కడ సరిగ్గా పదిగంటలకు ఉండాలి "అన్నాడు బాబురావు. "ఏంకొంపలు మునిగిపోవులే ఆపని దొరకకపోయినా మరో రెండు తరలకు సరీపడా మీతాతగారు సంపాదించి ఇచ్చివెళ్ళారు "అన్నది బామ్మ .మారుమాట్లాడకుండా తలపట్టుకు కూర్చున్నాడు బాబురావు.
తాతగారి గోడగడియారం పదిమార్లు మోగడంతో బండి తాళాం తీసుకుని "వెళ్ళేస్తానే బామ్మా తలుపు వేసుకో "అన్నాడు. "క్షేమంగావెళ్ళి లాభంగా రాతండ్రి " అంటూ తలుపులు వేసి గడిపెట్టుకుంది సుబ్బరావమ్మ.
తన బండిని వేగంగా నడుపుతూ ఎదరుగా వస్తున్న లారిని చూసి తన వాహనాన్ని ఆపేలోపే లారిని గుద్దుకున్నాడు ,బాబురావుని వైద్యశాలకి, బండిని పోలీస్టేషన్ కు తరలించారు .
వారం తరువాత ఇల్లు చేరిన బాబురావుకు కోర్టు జరిమాన ,బండి రిపేరు మొత్తం ముఫైవేలు అయింది. " దీనంతటికి నీచాదస్తమే కారణం " అన్నాడు బామ్మను బాబురావు. "బాగుంది నువ్వు ఒన్ వేలో వెళ్ళి ప్రమాదం కొనితెచ్చుకుని నన్ను అంటున్నావా ?" అన్నది బామ్మ. " అలా వెళితే సమయం కలసివస్తుందని వెళ్ళాను అదినాతప్పే ,అయినా ఈదుర్మహుర్తం, యమగండాల సమయంలో ప్రపంచం అంతటా లక్షలాది వాహనాలు బయలుదేరి వెళుతున్నాయి కదా , అదేసమయంలో ఏదైనా అపద సంభవిస్తే వెంటనే వైద్యశాలకు పరుగులు తీస్తాం కాని అమృత ఘడియలకోసం ఎదురుచూడం కదా? "అన్నాడు బాబురావు. అతని మాటల్లో నిజం గ్రహించి మౌనందాల్చింది బామ్మ.