చిన్ని పిట్ట కథ - Sreerekha Bakaraju

Chinni pitta katha

ఒక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు పైన ఒక చిట్టి బుర్ర పిట్ట ఉండేది. అది చాలా చక్కగా ఉండేది. ఆ పిట్ట ప్రతిరోజు తన కావలసిన ఆహారాన్ని గింజలని ధాన్యాన్ని తన చిన్న ముక్కుతో ఏరుకొని తీసుకొని వచ్చి ఆ చెట్టు పైన ఉన్న తన గూటిలో ఉంచుకునేది. ప్రతిరోజు తన ఆహారాన్ని సేకరించి తనకి తిండి కొరత ఉండకుండా ఉండడాలని ఆ పిట్ట తలిచేది. ఆ పిట్టకి అదే ఊర్లో ఒక కోతి తో స్నేహం కలిగింది. ఆ కోతి చాలా తెలివైన కోతి. అది పిట్టతో తీయగా మాట్లాడుతూ కబుర్లాడుతూ ఉండేది. ఈ పిట్ట ప్రతిరోజూ నాతో కబుర్లాడిన తరువాత ఊరిలోకి వెళ్లి ఏమి చేస్తుంది. ధాన్యాన్ని ఏరుకొని రావడము తన గూటిలో నిలువ ఉంచుకోవడం గమనించిందిఅది గమనించగాదానికి అప్పుడు తెలిసింది పిట్ట తన ఆహారాన్ని సేకరించి తన గూటిలో పెట్టుకుంటుంన్నదని. దానికి దుర్బుద్ధి పుట్టింది. ఆ పిట్ట ధాన్యాన్ని సేకరించడానికి బయట వెళ్లేసరికి మెల్లిగా చెట్టు పైకి ఎక్కి తన చేతిని పిట్టగూటిలో పెట్టి మొత్తం ధాన్యాన్ని గింజలని అన్నిటిని తినివేయసాగింది. మళ్లీ ఆ పిట్ట వచ్చే సమయానికి తుర్రుమని చెట్టు క్రిందకు వచ్చేసేది.

అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పిట్టకి అనుమానం వచ్చింది. “ ప్రతిరోజు నేను ధాన్యాన్ని తీసుకుని వస్తున్నాను. నేనేమో అంత ధాన్యాన్ని తినడం లేదు, మరి ఆ ధాన్యమంతా ఎలా మాయమవుతోంది” అంటూ ఆలోచించ సాగింది. కానీ యథాప్రకారం తన తిండి గురించి అది వెళ్లి బియ్యాన్ని, గింజల్ని, పప్పు దినుసులని అన్నిటినీ ఏరుకొని రాసాగింది. కానీ ఒకరోజు తనకనిపించింది ఈ కోతేమైనా తన బియ్యపు గింజలను తింటుందేమో అని. ఆరా తీయడానికి ఒక రోజు తను యథా ప్రకారం బియ్యపు గింజలని ఊర్లో ఏరుకోవడానికి బయటకు వెళ్లినట్టుగా వెళ్ళిపోయింది. అది అటు వెళ్ళగానే కోతి బావ వెంటనే వచ్చి మెల్లిగా చెట్టుపైకి ఎక్కి తన గూటిలో చేతికి పెట్టి తినటం దూరం నుండి చూసింది. అప్పుడా పిట్ట కనిపించింది దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని. ఇలాంటి అలసత్వము దుర్బుద్ధి ఉన్న కోతికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఒకరోజు ఎప్పటిలాగే తియ్యగా కోతితో మాట్లాడుతూ.. “కోతి బావ కోతి బావ…ఎలా ఉన్నావు.నేను ఇప్పుడే ఊర్లోకి వెళ్లి వస్తాను సరేనా” అంటూ కొంతసేపు అయిన తర్వాత “నేను ఇప్పుడే వెళ్లి వస్తాను ఊర్లోకి” అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంతలో కోతి ముందటి రోజు పిట్ట తెచ్చుకున్న ధాన్యాన్ని తీసుకుందామని పిట్ట గూటిలో చేయి పెట్టింది. కానీ పిట్ట తెలివిగా అంతకు ముందు రోజే ముళ్ళతో ఉన్న పళ్ళని దెబ్బ తగిలించే రాళ్ళని అన్నిటినీ ఏరి తన గూటిలో పెట్టింది. అది ధాన్యం అనుకొని తీసుకోవాలనుకున్న కోతి చేయి పెట్టగానే. ముళ్ళు బాగా గుచ్చుకొని బాగా దెబ్బ తాకింది. కోతికి చాలా నొప్పి కలిగింది. వెంటనే పిట్ట వచ్చి బాధపడుతూ ఉన్న కోతిని చూసి “కోతి బావ.. కోతి బావ..చూసావా.. నీ దుర్బుద్ధి ఎంతవరకు దారితీసిందో.. నీకు ఎంత బాధ కలిగిందో.. చూసావా నేను నా చిన్న ముక్కుతో అన్ని బియ్యపు గింజల్ని పప్పు గింజల్ని ఏరుకొని వస్తుంటే నువ్వు ఏ పని చేయకుండా చక్కగా వాటిని మింగేసి నాకు ఏమీ లేకుండా చేస్తున్నావు. ఇది నీకు న్యాయమేనా.. ఇలా ఎవరైనా చేస్తారా .. తగిన శాస్తి చేయాలని నేను ఇలా చేసాను. ఇప్పుడైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ ఆహారం నువ్వు సంపాదించుకో. వేరొకళ్ళు తెచ్చిన ఆహారాన్ని నువ్వు ఎప్పుడూ మింగేయాలని అనుకోకు. అప్పుడే నీకు పని విలువ ఆహారం సంపాదించడం విలువ గురించి తెలుసుకుంటావు.” అని చెప్పింది. దాంతో కోతి బావకి బుద్ధి వచ్చి పిట్టతో “సరే పిట్టా.. నేను నాకు బుద్ధి వచ్చింది. నేను ఇప్పటినుంచి నా ఆహారాన్ని నేనే సంపాదించుకుంటాను.” అని చెప్పి అంది పిట్టతో. అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు.

మరిన్ని కథలు

Inkenta sepu
ఇంకెంత సేపు
- గరిమెళ్ళ సురేష్
Ankela rahasyam
అంకెల రహస్యం
- కర్లపాలెం హనుమంతరావు
Nee kannanaa
నీ కన్నానా!?
- భాగ్యలక్ష్మి అప్పికొండ
Manam maaraali
మనం మారాలి !.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kshantavyam
క్షంతవ్యం
- భాస్కర చంద్ర
Dil pasand
దిల్ పసంద్
- కొడవంటి ఉషా కుమారి
Shashankalu
శశాంకలు
- మద్దూరి నరసింహమూర్తి
Chadastam
చాదస్తం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు